వికీపీడియా చర్చ:సముదాయేతర సంస్థలు
ప్రతిపాదనలా లేక నిర్ణయాలా
మార్చుఇక్కడ చేర్చబడిన విషయాలు ప్రతిపాదనలా? ఎవరు ప్రతిపాదించారు?
లేక సముదాయ నిర్ణయాలా? సదరు చర్చ ఎక్కడ జరిగింది?
రవి తెలుపగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 15:10, 1 జూన్ 2015 (UTC)
- @రహ్మానుద్దీన్, ప్రస్తుతానికి ఇవి నేను చేసిన ప్రతిపాదనలే --వైజాసత్య (చర్చ) 00:59, 2 జూన్ 2015 (UTC)
ఈ ప్రతిపాదనలను నేను సమర్దిస్తుంన్నాను , ఈతెలుగు ద్వారా తెవికీని కొంచెం తొర్పడినా మా ప్రాధమిక లక్ష్యాలు వేరు అవటం వలన సముదాయంను కలుపుకు పొవలసిన అవసరం కలగలేదు, కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలకు సముదాయేతర సంస్థలు, తెలుగువికి సముదాయా అభిప్రాయాన్ని తీసుకోంటె మరింత మెరుగుగా వుంటుంది అని నా అభిప్రాయం. --కశ్యప్ (చర్చ) 10:35, 5 జూన్ 2015 (UTC)
సముదాయేతర సభ్యుల మార్పులకు ప్రత్యేక సభ్యనామము
మార్చుసముదాయేతర సభ్యుల మార్పులకు ప్రత్యేక సభ్యనామము (సంస్థ అనుబంధాన్ని తెలిపే) పేరు వాడడం మంచిది. గత అనుభవంలో అలా చేయకపోయేసరికి ఎవి సంస్థ పరంగా చేశారో , స్వేచ్ఛా వికీపీడియన్ గా చేశారో సందిగ్ధంగా వుంది. (ఉదా:s:వికీసోర్స్_చర్చ:తెవికీసోర్స్-సీఐఎస్_వార్షిక_ప్రణాళిక_జులై_2015_-_జూన్_2016#గత కృషిలో లోటుపాట్లు )--అర్జున (చర్చ) 04:39, 2 జూన్ 2015 (UTC)
- చిత్తుప్రతిలో ఆరవ అంశం దీనికి సంబంధించినదే. పొరబాటున గమనించలేదు. --అర్జున (చర్చ) 04:59, 2 జూన్ 2015 (UTC)
సముదాయేతర సభ్యుల కి నిర్వాహక, అధికార హోదాలు
మార్చునిర్వాకు(డు/రాలు), అధికార హోదాలు వుండి వుంటే వాటిని కొనసాగించవచ్చు కాని, Conflict of Interest అంశాలలో ఆ హోదా వాడుకోకుండా వుంటే సరిపోతుంది. --అర్జున (చర్చ) 05:02, 2 జూన్ 2015 (UTC)
- నిర్వాకు(డు/రాలు), అధికార హోదాలు వుండి వుంటే వాటిని కొనసాగించడము అంత శ్రేయస్కరము కాదు. మరో ఉద్దేశ్యముతోనే వారు వికీ నుండి వెళ్ళారు, ఇంక వికీ హోదాలు కొనసాగించడము సబబుగా లేదు. JVRKPRASAD (చర్చ) 11:19, 2 జూన్ 2015 (UTC)
- ఈ విషయంలో WMF వాడుతున్న Best practice ఒకటి ఉంది. సముదాయంలోని సభ్యులు సంస్థలో ఉద్యోగానికి ఎన్నికైనప్పుడు అతని స్వచ్ఛంద కృషిని విడదీసేందుకు గాను వారు వేరే కొత్త సభ్యనామాన్ని తయారుచేసుకుంటూంటారు. అసందిగ్ధతలకు తావులేకుండా ఆ కొత్త వాడుకరి పేరు చివరన (WMF) అని చేరుస్తూంటారు. ఇది ఎలావుంటుందో పరిశీలిస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 16:23, 2 జూన్ 2015 (UTC)
- అర్జున, మీరన్నట్టు Conflict of Interest ను గుర్తించి, దాన్ని గౌరవించినప్పుడు నిర్వాహక, అధికార హోదాలు అట్టేపెట్టుకున్నా, అవి వాడకపోతే సరిపోతుంది. కానీ చాల సందర్భాల్లో సదరు వ్యక్తులు Conflict of Interest అనే విషయాన్నే పసిగట్టినట్టులేదు. తట్టినా దాన్ని గౌరవించినట్టులేదు. రహమానుద్దీన్ గారి దిద్దుబాట్లను, గత సి.ఐ.ఎస్ డైరెక్టరు విష్ణుగారు అవి ఆయా ఉద్యోగి సామాన్య సభ్యుడిగా చేసినవని, ఎంత సులభంగా తప్పించుకున్నారో చూశాం. కాబట్టి సముదాయేతర సంస్థల సభ్యులకు, ఉద్యోగులకు, నిర్వాహక, అధికార హోదాలు ఉండకూడదని నేను గట్టిగా భావిస్తున్నాను. పవన్ సంతోష్ గారూ, మీ సూచన బాగున్నది. తప్పకుండా అమలుచేద్దాం --వైజాసత్య (చర్చ) 05:01, 3 జూన్ 2015 (UTC)
- ప్రసాద్ గారూ, నా ప్రతిపాదనకు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 05:19, 3 జూన్ 2015 (UTC)
- పవన్ సంతోష్ చెప్పినట్టు సముదాయేతర సంస్థలకు చెందిన సభ్యులు వారి సభ్య నామం చివర సంస్థ పేరును చేర్చడం బావుంటుంది. కొత్త వాడుకరి పేరుతో హోదాలు వంటివి అప్లై అవ్వవు కనుక సమస్యే లేదు.--విశ్వనాధ్ (చర్చ) 06:32, 3 జూన్ 2015 (UTC)
- ఈ విషయంలో WMF వాడుతున్న Best practice ఒకటి ఉంది. సముదాయంలోని సభ్యులు సంస్థలో ఉద్యోగానికి ఎన్నికైనప్పుడు అతని స్వచ్ఛంద కృషిని విడదీసేందుకు గాను వారు వేరే కొత్త సభ్యనామాన్ని తయారుచేసుకుంటూంటారు. అసందిగ్ధతలకు తావులేకుండా ఆ కొత్త వాడుకరి పేరు చివరన (WMF) అని చేరుస్తూంటారు. ఇది ఎలావుంటుందో పరిశీలిస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 16:23, 2 జూన్ 2015 (UTC)
- నిర్వాకు(డు/రాలు), అధికార హోదాలు వుండి వుంటే వాటిని కొనసాగించడము అంత శ్రేయస్కరము కాదు. మరో ఉద్దేశ్యముతోనే వారు వికీ నుండి వెళ్ళారు, ఇంక వికీ హోదాలు కొనసాగించడము సబబుగా లేదు. JVRKPRASAD (చర్చ) 11:19, 2 జూన్ 2015 (UTC)
సముదాయేతర సంస్థ
మార్చువైజాసత్య గారు, సముదాయేతర సంస్థ లంటే నాకు పూర్తి అవగాహన కలుగలేదు. నా స్పందన తెలుపుటకు మరింత విపులంగా చెప్పగలరా?.Palagiri (చర్చ) 08:10, 3 జూన్ 2015 (UTC)
- వైజాసత్య గారు, నాకు కూడా సముదాయేతర సంస్థలపై సరైన అవగాహన లేదు. దయచేసి వాటి గురించి తెలుపగలరు. ఉదాహరణకు CIS లాంటివి సముదాయేతర సంస్థల క్రిందికి వస్తాయా?--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:52, 5 జూన్ 2015 (UTC)
- @పాలగిరి గారూ, సుల్తాన్ ఖాదర్ గారూ. మనకు ఇప్పటిదాకా పరిచయమున్న సముదాయేతర సంస్థలలో గూగుల్ ఒకటి, సి.ఐ.ఎస్ మరోటి. ఇవే కాక భవిష్యత్తులో మరే ఇతర సంస్థ అయినా తెలుగు వికీలో పనిచెయ్యటానికి లేదా చెయ్యించటానికి వచ్చినా ఈ నియమాలు వాటిని కూడా నియంత్రించేలా రూపొందిస్తున్నాం. ఈ సంస్థలకు వివిధ ఉద్దేశ్యాలు ఉంటాయి. అవన్నీ తెవికీకి సరిపడకపోవచ్చు. ఉదాహరణకు గూగుల్ వాళ్ళు మనకు చెప్పకుండానే కొంత మందికి డబ్బిచ్చి తెలుగు వికీపీడియాలోకి ఆంగ్ల వ్యాసాలను అనువదింపజేశారు. పలు విమర్శల తర్వాత కానీ ఈ కార్యక్రమం చేపట్టినట్టుకూడా సముదాయాలకు చెప్పలేదు. వాళ్ళ అటోమేటిక్ అనువాదపరికరాన్ని మెరుగుపరచేందుకు ఇవి చేయించారు పనిలో పని తెవికీకూడా మేలుజరుగుతుందనుకున్నారు. కానీ ఏ విధంగా ఈ కార్యక్రమం జరిగిందో ఇక్కడ చదవండి వికీపీడియా:గూగుల్ అనువాద వ్యాసాలు, అలాగే సి.ఐ.ఎస్ తో అనుభవాలు మీరు చూసే ఉంటారు. సముదాయమంటే స్వఛ్ఛందంగా ఏ లాభాపేక్షలేకుండా వికీపీడియాలో పనిచేసేవాళ్ళనమాట. సముదాయేతర సంస్థలకు సంబంధించిన వారంటే, స్వఛ్ఛంద సేవకులు కాకుండా ఇంకా ఎవరైనా వికీపీడియాలో పనిచేసేవాళ్ళు (ఉదాహరణ: వికీమీడియా ఫౌండేషన్ ఉద్యోగులు, సి.ఐ.ఎస్ ఉద్యోగులు లేదా మరేదైనా సంస్థ తరఫున ఇక్కడ పనిచేయటానికి వచ్చే ఉద్యోగులనమాట) --వైజాసత్య (చర్చ) 03:26, 7 జూన్ 2015 (UTC)
- ధన్యవాదాలు వైజాసత్య గారు. సముదాయేతర సంస్థలు సముదాయ ముందస్తు అనుమతి పొంది తమ కృషిని కొనసాగదలిస్తే సమంజసంగా ఉంటుంది. అలాగే వికీ సముదాయం కూడా సముదాయేతర సంస్థల తో పట్టువిడుపుల ధోరణిలో వ్యవహరించడం వికీ అభివృద్ధికి దోహదపడుతుంది. సముదాయేతర సంస్థలలో సభ్యులైన వికీ సభ్యులను ప్రత్యేక గుర్తింపు ఇస్తే (ఉదాహరణకు వారి సభ్యపేజీలలో సూచికలు) వారు చేసిన కృషిని ఇతర సముదాయ సభ్యులు మూల్యాంకనం చేయడానికి వీలవుతుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:21, 2 జూలై 2015 (UTC)
- సముదాయేతర సంస్థలతో పట్టు విడుపు ధోరిణి అవసరం అన్నదే నా అభిప్రాయం. వికీపీడియా సభ్యుల మద్య అవసరం అని భావిస్తున్న సయమనం సముదాయేతర సంస్థల పట్ల చూపి కలిసి పనిచేయడం తెవికీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. మద్యలో తలెత్తుతున్న సమస్యలను పరస్పర చర్చలతో తొలగించుకోవాలి కాని సముదాయేతర సంస్థలతో కలిసి పనిచేయడానికి సహకరించకపోవడం తెవికీకి శ్రేయస్కరం కాదు. --t.sujatha (చర్చ) 17:44, 2 జూలై 2015 (UTC)
- సుజాత గారూ సముదాయేతర సంస్థలతో పనిచేయకపోవడం కోసం ఈ పేజీని సృష్టించలేదు.నిజానికి తెవికీపీడియా అభివృద్ధిలో సముదాయం, సముదాయేతర సంస్థలూ వ్యవహరించాల్సిన పద్ధతులను, చేసే పనులను నియత్రించడానికి చేస్తున్నాం. నియత్రించడానికే తప్ప అడ్డుకోవడానికి కాదు. బహుశా మీరు ఒకే సంస్థను దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నట్టున్నారు. కానీ గతంలో గూగుల్ అనువాద ప్రాజెక్టు నిర్వహించిన సంస్థల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మరింత స్పష్టమవుతుంది. కేవలం గూగుల్ ట్రాన్సలేట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసుకోవడానికి కోట్లాది రూపాయలు వినియోగించి, చివరకు తెవికీలో వేలాది సమస్యాత్మక వ్యాసాలు సృష్టించేశారు. ఇప్పుడున్న సంస్థలూ, వాటి నిర్వాహకులు సదుద్దేశంతో మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవచ్చు, కోకపోవచ్చు. కాకుంటే భవిష్యత్తులో రానున్న సంస్థలు సముదాయంతో కలిసి పనిచేస్తాయన్న నమ్మకం ఏమీ లేదు, పైగా ఇంతకుముందే అందుకు విరుద్ధంగా గూగుల్ లాంటి సంస్థలు పూర్తిగా తెవికీకి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేపట్టడం కూడా కారణం. ఇక చెదురుమదురుగా ఇతర సంస్థలు కూడా తెవికీ సముదాయాన్ని పరిగణనలోకి తీసుకోకండా పనిచేయడమూ మనం చూసినదే. అందుకని దీన్నేదో వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య ఘర్షణగా చూడవద్దు. ఇదొక ప్రయత్నం, సముదాయేతర సంస్థల కార్యకలాపాలను నియంత్రించే ప్రయత్నం, అంతేతప్ప అడ్డుకునే ప్రయత్నం కాదని మళ్ళీ వివరిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:57, 3 జూలై 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ ! ఒక సంస్థను గురించి కాదు. సముదాయేతర సంస్థలతో కలిసి పనిచేస్తూ తెవికీని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే నా అభిప్రాయం. గూగుల్ విషయం నాకు తెలుసు. గూగుల్ విషయంలో సరిచేయడానికి వీలు కాని వ్యాసాలు వచ్చి చేరాయి. అలాంటివి నాకు ఆమోదయోగ్యం కాదు. సముదాయేతర సంస్థలు మనతో దీర్ఘకాలం పని చేయకపోయినా వారిని పనిచేయనివ్వడం వలన తెవికీలో జరిగే అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవాలి? ఇది మనతో కలిసి పనిచేలనుకుంటున్న సముదాయేతర సంస్థలకు వ్యతిరేక సందేశం ఇచ్చినట్లు కాదా ! ఇతర సంస్థలు భవిష్యత్తులో తెవికీతో కలిసి పనిచేయడానికి ఆలోచిస్తాయి కదా! తెవికీకి సముదాయేతర సంస్థలకు మద్య ఉన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన విధివిధానాలను తయారు చేసుకుంటూ ముందుకు సాగాలన్నది నా అభిప్రాయం. ఈ విషయమై అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పినట్లు నా అభిప్రాయం నేను చెప్పాను. ఇది అందరూ అంగీకరించాలని కాని దీనికి మద్దతు ఇవ్వాలన్నది కాని నా అభిమతం కాదు. --t.sujatha (చర్చ) 13:50, 3 జూలై 2015 (UTC)
- @పాలగిరి గారూ, సుల్తాన్ ఖాదర్ గారూ. మనకు ఇప్పటిదాకా పరిచయమున్న సముదాయేతర సంస్థలలో గూగుల్ ఒకటి, సి.ఐ.ఎస్ మరోటి. ఇవే కాక భవిష్యత్తులో మరే ఇతర సంస్థ అయినా తెలుగు వికీలో పనిచెయ్యటానికి లేదా చెయ్యించటానికి వచ్చినా ఈ నియమాలు వాటిని కూడా నియంత్రించేలా రూపొందిస్తున్నాం. ఈ సంస్థలకు వివిధ ఉద్దేశ్యాలు ఉంటాయి. అవన్నీ తెవికీకి సరిపడకపోవచ్చు. ఉదాహరణకు గూగుల్ వాళ్ళు మనకు చెప్పకుండానే కొంత మందికి డబ్బిచ్చి తెలుగు వికీపీడియాలోకి ఆంగ్ల వ్యాసాలను అనువదింపజేశారు. పలు విమర్శల తర్వాత కానీ ఈ కార్యక్రమం చేపట్టినట్టుకూడా సముదాయాలకు చెప్పలేదు. వాళ్ళ అటోమేటిక్ అనువాదపరికరాన్ని మెరుగుపరచేందుకు ఇవి చేయించారు పనిలో పని తెవికీకూడా మేలుజరుగుతుందనుకున్నారు. కానీ ఏ విధంగా ఈ కార్యక్రమం జరిగిందో ఇక్కడ చదవండి వికీపీడియా:గూగుల్ అనువాద వ్యాసాలు, అలాగే సి.ఐ.ఎస్ తో అనుభవాలు మీరు చూసే ఉంటారు. సముదాయమంటే స్వఛ్ఛందంగా ఏ లాభాపేక్షలేకుండా వికీపీడియాలో పనిచేసేవాళ్ళనమాట. సముదాయేతర సంస్థలకు సంబంధించిన వారంటే, స్వఛ్ఛంద సేవకులు కాకుండా ఇంకా ఎవరైనా వికీపీడియాలో పనిచేసేవాళ్ళు (ఉదాహరణ: వికీమీడియా ఫౌండేషన్ ఉద్యోగులు, సి.ఐ.ఎస్ ఉద్యోగులు లేదా మరేదైనా సంస్థ తరఫున ఇక్కడ పనిచేయటానికి వచ్చే ఉద్యోగులనమాట) --వైజాసత్య (చర్చ) 03:26, 7 జూన్ 2015 (UTC)
- సుజాత గారూ అభిప్రాయం చెప్పడంలో మీకున్న స్వేచ్ఛ నేను అర్థం చేసుకోగలను. అయితే మీ వ్యాఖ్య మీద నాకు అనిపించిందేదో రాశాను. పై సూచనల్లో సముదాయేతర సంస్థలను పనిచేయనివ్వకుండా అడ్డుపడుతున్నట్టు మీకు అనిపించిన సూచన ఏదో చెప్తే సభ్యులకు చర్చించేందుకు, సరిదిద్దుకునేందుకు వీలుచిక్కుతుంది. పోతే గూగుల్ అనువాద ప్రాజెక్టు మీకు తెలియదని కాదు, కాకుంటే మనం ఇలాంటి పాలసీ పెట్టుకోక పోవడం వల్లనే వారు ఆమోదయోగ్యం కాని, సరిజేయలేని వ్యాసాలు చేర్చేసి పోయారని గుర్తుచేస్తున్నాను అంతే. మీకు నేను రాసినది రుచించకపోతే ఏమీ అనుకోకండి. కానీ ఆరోగ్యకరమైన చర్చ కోసమే నేను ముందుకువచ్చానని గుర్తిస్తే చాలు. --పవన్ సంతోష్ (చర్చ) 14:09, 3 జూలై 2015 (UTC)
- సుజాత గారూ, మీ స్పందనకి ధన్యవాదాలు. సముదాయేతర సంస్థలను పనిచెయ్యనివ్వకపోవటం ఈ పేజీ ఉద్దేశం కానే కాదు. కానీ గత అనుభవాల దృష్ట్యా సముదాయం స్థాయిలో వీరి చర్యలను నియంత్రించటమే దీని ఉద్దేశం. సముదాయంలో ఇతర సంస్థలు పనిచెయ్యకూడదని ఈ నిబంధనలలో ఎక్కడా లేదు. --వైజాసత్య (చర్చ) 16:07, 3 జూలై 2015 (UTC)
- వైజాసత్య గారూ ! నియంత్రించవలసిన అవసరం ఉంది. సరిదిద్దుకుంటూ కలిసి పనిచేయాలన్నది నా అభిప్రాయం.
- గూగుల్ విషయంలో అనవసర వ్యాసాలు వచ్చిచేరాయి అన్నది వాస్తవం. కాని గూగుల్ వెలుపల నుండి పని చేసారు. తెవికీకి గుగూల్‌కు మద్య ఏటువంటి సంప్రదింపులు జరగ లేదు. గూగుల్ తెవీకి సూచన ఇవ్వడం కాని అనుమతి తీసుకోవడంగాని జరగ లేదు. వ్యాసపరంపర గురించి నిదానంగా మాత్రమే సభ్యులకు అర్ధం అయింది. ఆ వ్యాసాల చొరబాటును తెవికీ సభ్యులు స్వాగతించలేదు. ఇలాంటివి అనుమతించడానికి వీలుకాదు.
- సముదాయేతర సంస్థలు నిర్వహించే అకాడమీల ద్వారా తెవికీ ఒకటి ఉందని విద్యాసంస్థలకు తెలియజేసే అవకాశం ఉంది. అకాడమీల ద్వారా క్రియాశీలక సభ్యులు అధికం కాదన్నది ఇప్పటివరకు నిర్వహించిన అకాడమీల ద్వారా విదితం అయింది. ఈ విషయం అకాడమీలు నిర్వహించిన వారందరికి అనుభపూర్వకంగా తెలిసిన విషయం. అయినప్పటికీ అకాడమీల ద్వారా పలువురికి వికీపీడియా ఉనికి తెలియడం ప్రధాన లక్ష్యంగా భావించవచ్చు. భవిష్యత్తులో పలువురికి తెవికీ ఉపయోగించడానికి అవకాశం లభిస్తుంది. అకాడమీల ద్వారా సభ్యుల సంఖ్య పెరగలేదని కాని ప్రయోజనం ఏమిటని సభ్యులు ఒకరిని ఒకరు ప్రశ్నించుకొనడం వలన ప్రయోజనం ఉండదు. సముదాయేతర సంస్థలు నిర్వహించే అకాడమీల వలన తెవికీకి ఇలాంటి ప్రయోజనం చేకూరుతుంది.
- సభలు సమావేశాల వలన సభ్యులకు నూతన ఉత్సాహం కలుగుతుంది. నా వరకు నాకు ఈ సమావేశాలు మరింతగా పనిచేయడానికి అవసరమైన ప్రేరణ ఇచ్చాయి. అంతే కాక సభ్యుల ముఖాముఖి పరిచయం వలన సభ్యుల మద్య సుహృద్భావ వాతావరణం ఏర్పడి ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకోవడం తగ్గడానికి అవకాశం లభిస్తుంది. ఇది తెవికీలో సుహృద్భావ వాతావరణం అధికం కావడానికి సహకరిస్తుంది. ఇలాంటి సమావేశాలు సముదాయేతర సంస్థలు తెవికీ సభ్యులకు ఏర్పాటు చేసాయి. ఇది సత్ఫలితం ఇస్తుందని భావిస్తున్నాను.
- నా వరకు నేను నిస్సార్ గారు, విశ్వనాథ్ గారు, రాజశేఖర్ గారూ, రవిచంద్ర, వీరశశిధర్, సుల్తాన్ ఖాదిర్, వై.వి.ఎస్ రెడ్డి గారు, రహమతుల్లా గారు, సి.బి రావుగారు మొదలైన తెవికీ సభ్యులను నేరుగా కలుసుకునే సువర్ణావకాశం లభించింది. నిజానికి మరెందరినో కలవడం భారతీయ వికీపీడియన్లను కలవడం అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. తెవికీలో పని చేయడానికి ఇది నాకు మరింత ఉత్సాహం ఇచ్చింది. ఇలాంటి అవకాశం సముదాయేతర సంస్థలు ఇచ్చినా అది ఆహ్వానించతగినదే అని నా అభిప్రాయం.
- సముదాయేతర సంస్థలను కలుపుకుని వారితో కలిసి పనిచేయాలన్నది నా అభిప్రాయం. ఇది తెవికీ అభివృద్ధికి తోడ్పడుతుందని నేను అనుకుంటున్నాను. సమస్యలు ఉంటే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చు.
- మరొక్క విషయం సభ్యుల కృషి అకౌంటు విషయం నేను చేసిన కృషిని సంస్థల అకౌంటుకు వేసుకున్నా నాకు అభ్యతరం లేదు.
- ఇందుకు ఒక ఉదాహరణ విద్యార్ధి రాష్ట్రీయంగా కాని జాతీయంగా కాని గుర్తింపు వచ్చింది అనుకుందాము. ఆ క్రెడిట్ తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల మరియు ఆ గ్రామమో పట్టణమో తమ క్రెడిట్‌లో వేసుకున్నంత మాత్రాన విద్యార్ధికి వచ్చిన గుర్తింపు విలువ తగ్గదు. ఆఖ్యాతి విద్యార్ధి జీవితమంతా వెన్నంటి ఉంటూనే ఉంటుంది. ఇంతమంది తమ క్రెడిట్‌లో వేసుకునే పని చేయడం విద్యార్ధి ఘనత కాదా! ఇదీ అలాంటిదే. --t.sujatha (చర్చ) 17:06, 3 జూలై 2015 (UTC)
సుజాతగారి విద్యార్థి..... గుర్తింపు చాల చక్కని ఉదాహరణ. జయహో... .... సుజాతగారు......
- సుజాత గారు మీ అభిప్రాయం ప్రకారం అయితే సముదాయేతర సంస్థల ద్వార మాత్రమే అకాడమీలు, సభలు, సమావేశాలు జరుగుతాయి. అయితే అవి జరగటానికి సముదాయేతర సంస్థలు మాత్రమే అవసరం లేదండి. మనంకూడా జరుపుకోవచ్చు. వాటిని నిర్వహించగల సత్తా మన సముదాయానికి ఉంది. సముదాయేతర సంస్థల భాగస్వామయం అవసరమే అనుకొంటే అలాంటి సంస్థలు వికీసముదాయ నియమాలకు లోబడి పనిచేయడానికి ఎప్పుడూ ముందుకు వస్తాయి. అలా రావడానికి సుముఖంగా లేవు అంటే దానర్ధం వారికి నచ్చినట్టుగా వారు చేయాలనుకుంటున్నారనేది గుర్తించాలి. గూగుల్ అనువాద వ్యాసలను ఎవరు మెరుగు పరచగలుగుతున్నారు, వాటిని చూసిన వారు వికీలో వ్యాసాలు ఇంత వరస్ట్‌గా ఉంటాయా అనుకొంటారు. ఒక తప్పు తెవికీ జీవితాన్నే మార్చేస్తుంది. అవి మనకు అవసరమా. తెవికీ అభివృద్దే కావాలనుకొంటే కొన్ని నియమాలను అమలు చేయాలి, వాటికి కట్టూబడి ఉండాలి, లేదూ తెవికీ నాణ్యత పరమ దరిద్రంగా తయారయ్యే అవకాశాన్ని మనచేతులతో మనమే అందింస్తున్నట్టు....--విశ్వనాధ్ (చర్చ) 02:24, 4 జూలై 2015 (UTC)
- విశ్వనాధ్ గారూ ! అకాడమీలు సముదాయేతర సంస్థలు మాత్రమే చేస్తాయన్నది నా అభిప్రాయం కాదు. సముదాయేతర సంస్థలకంటే ముందు అర్జునరావుగారు విజయవంతంగా చేసి చూపారు. మీరు అనేక వికీ అవగాహనా కార్యక్రమాలు ఏసహాయం లేకుండా స్వయంగా చేసి చూపారు. పవన్ సంతోష్ గారూ చేసారు. సముదాయేతర సంస్థలనుండి అదనంగా లభించే అదే తరహా సేవలకు స్వాగతం పలికి కలిసి పనిచేయాలన్నది నా అభిప్రాయం. సహసభ్యులను కలుసే అవకాశం సంప్రదింపులలో పాల్గొనే అవకాశం నాకు మరింతగా పని చేయడానికి తోడ్పడింది. సముదాయేతర సంస్థలైనా వికీ నియమాలకు లోబడి సభ్యుల అభిప్రాయాలను గౌరవిస్తూ చేయాలనడంలో రెండవ అభిప్రాయానికి తావులేదు. మీలాంటి సీనియర్ సభ్యులను కలిసే అవకాశం సభ్యులు కలిసి ఐకమత్యంగా పనిచేయడానికి సహకరిస్తుంది. ఇవి నా అభిప్రాయాలే వీటికి అందరూ మద్దతు ఇవ్వాలను నేను కోరడం లేదన్నది నిజం. --t.sujatha (చర్చ) 05:25, 4 జూలై 2015 (UTC)
- సుజాత గారు మీ అభిప్రాయం ప్రకారం అయితే సముదాయేతర సంస్థల ద్వార మాత్రమే అకాడమీలు, సభలు, సమావేశాలు జరుగుతాయి. అయితే అవి జరగటానికి సముదాయేతర సంస్థలు మాత్రమే అవసరం లేదండి. మనంకూడా జరుపుకోవచ్చు. వాటిని నిర్వహించగల సత్తా మన సముదాయానికి ఉంది. సముదాయేతర సంస్థల భాగస్వామయం అవసరమే అనుకొంటే అలాంటి సంస్థలు వికీసముదాయ నియమాలకు లోబడి పనిచేయడానికి ఎప్పుడూ ముందుకు వస్తాయి. అలా రావడానికి సుముఖంగా లేవు అంటే దానర్ధం వారికి నచ్చినట్టుగా వారు చేయాలనుకుంటున్నారనేది గుర్తించాలి. గూగుల్ అనువాద వ్యాసలను ఎవరు మెరుగు పరచగలుగుతున్నారు, వాటిని చూసిన వారు వికీలో వ్యాసాలు ఇంత వరస్ట్‌గా ఉంటాయా అనుకొంటారు. ఒక తప్పు తెవికీ జీవితాన్నే మార్చేస్తుంది. అవి మనకు అవసరమా. తెవికీ అభివృద్దే కావాలనుకొంటే కొన్ని నియమాలను అమలు చేయాలి, వాటికి కట్టూబడి ఉండాలి, లేదూ తెవికీ నాణ్యత పరమ దరిద్రంగా తయారయ్యే అవకాశాన్ని మనచేతులతో మనమే అందింస్తున్నట్టు....--విశ్వనాధ్ (చర్చ) 02:24, 4 జూలై 2015 (UTC)
సీఐఎస్ సంస్థ గురించిన, ఏ2కే గురించిన స్పష్టత అవసరం
మార్చుగూగుల్ సముదాయేతర సంస్థ లాభాపేక్షతో పని చేస్తుందని తెలిపారు, సరే! మరి సీఐఎస్-ఏ2కే నేపధ్యం తెలుసుకోకుండా గూగుల్ గాటున కట్టివేసారే? సముదాయం మరింత ఫలప్రదంగా పనిచేసే విధంగా సముదాయం కోసం పని చేయమని వికీమీడియా ఫౌండేషన్ ద్వారా డబ్బు పొందే సంస్థలలో సీఐఎస్-ఏ2కే ఒకటి. అలా పని చేసే సంస్థలు భారతదేశంలో ఉన్నాయి - 1. వికీమీడియా భారతదేశ చాప్టర్, 2. సీఐఎస్-ఏ2కే. వికీపీడియాను భారతీయ భాషలలో బలోపేతం చేసేందుకు సీఐఎస్-ఏ2కే పని చేస్తున్నది. ఈ విషయం సీఐఎస్ ముఖపుటలో స్పష్టంగా ఉంది. ఇక సీఐఎస్ ఉద్యోగులు అందరూ వికీపీడియన్లు. వారి వారి ఖాళీ సమయాలలో ఇతర ఔత్సాహికుల లాగానే వికీకి తోడ్పడతారు. మా పని వేళలలో వికీ వ్యాసాలలో(సున్నా పేరుబరిలో) సవరించడం/విషయం సృష్టించడం నిషిద్ధం. ఈ విషయాన్ని ఎన్నో సార్లు విష్ణు, నేను తెలుపడం జరిగింది. సీఐఎస్-ఏ2కే సముదాయం కోసం, అంతకన్నా మించి వికీ అభివృద్ధి కోసం పని చేస్తున్న సంస్థ. వికీమీడియా ఫౌండేషన్ ద్వారా అఫిలియేట్ స్థాయి హోదా కలిగిన సంస్థ. ఏ విధంగానూ సీఐఎస్-ఏ2కే నుండి సంస్థాపరంగా తెవికీకి హాని జరగలేదు. ఇక సీఐఎస్-ఏ2కే ద్వారా వికీ గురించి నేర్చుకుని, తెలుసుకొని వచ్చే విద్యార్థులు అందరూ కూడా తెవికీ సభ్యులే, వారు నాణ్యతా పరంగా వ్రాయలేకపోవటానికి ఉన్న అన్ని కారణాలలో శిక్షణలో లోపం ఒకటయితే, సముదాయంలో కొత్త వాడుకరులను ఆహ్వానించి, వారికి వికీశిక్షణ మరింతగా ఇవ్వకపోవటం మరొక కారణం. ఈ విషయంలో అనుభవమున్న అర్జున చాప్టర్ - అఫిలియేట్ విషయమై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సీఐఎస్-ఏ2కే కు సంబంధించి ఇతర సభ్యులకు ఏమయినా సందేహాలుంటే ఇక్కడ అడగవచ్చు. --రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) (చర్చ) 12:37, 7 జూలై 2015 (UTC)