వేదిక:ఆంధ్రప్రదేశ్/2008 28వ వారం

గోదావరి నది
గోదావరి నది
గోదావరి నది

ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో పొడవైన నది అయిన గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకంలో జన్మించింది. మహారాష్ట్రలో పయనించిన పిదప బాసర వద్ద ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి చివరకు బంగాళాఖాతంలో సంగమిస్తుంది. సుధీర్ఘంగా ఇంత దూరం ప్రవహించే గోదావరి ఈ దశలో అనేక ఉపనదులను తనలో కలుపుకొని అఖండ జలరాశిగా మారుతుంది. వైన్ గంగ, పెన్ గంగ, వార్థా, మంజీరా, ఇంద్రావతి, సీలేరు, కిన్నెరసాని దీని యొక్క ముఖ్య ఉపనదులు. అలాగే త్రయంబకేశ్వర్, నాసిక్, నాందేడ్, బాసర, భద్రాచలం, కాళేశ్వరం, అంతర్వేది, రాజమండ్రి లాంటి అనేక పుణ్యక్షేత్రాలు, ప్రముఖ నగరాలు ఈ నదీ తీరంలో వెలిశాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా ఈ నదిపైనే ఉన్నది.

త్రయంబంలో చిన్న పాయగా ఏర్పడిన గోదావరి రాజమండ్రి వచ్చేవరకు అఖండ జలరాశి రూపంలో మారి ధవళేశ్వరం వద్ద 7 పాయలుగా చీలుతుంది. సప్తర్షుల పేర్లమీదుగా పిలువబడే 7 పాయలలో గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు కాగా మిగితావి అంతర్వాహినులు.

పూర్తి వ్యాసం