శివయ్య 1998 లో ఆర్. సురేష్ వర్మ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రాజశేఖర్, మోనికా బేడి ముఖ్యపాత్రల్లో నటించారు.[1] ఎం. ఎం. శ్రీలేఖ ఈ చిత్రానికి స్వరరచన చేసింది.[2] సురేష్ ప్రొడక్షన్స్ లో రాజశేఖర్ నటించిన తొలి చిత్రం ఇది.[3] రాజశేఖర్ నటించిన తొలి డి. టి. ఎస్ చిత్రం కూడా ఇదే. రవిబాబు ఈ చిత్రంతో ప్రతినాయకుడిగా పరిచయం అయ్యాడు.

శివయ్య
దర్శకత్వంఆర్. సురేష్ వర్మ
రచనపోసాని కృష్ణమురళి (కథ/మాటలు/స్క్రీన్ ప్లే)
నిర్మాతదగ్గుబాటి రామానాయుడు
తారాగణండా. రాజశేఖర్ ,
మోనికా బేడి
ఛాయాగ్రహణంసురేశ్ పెమ్మసాని
సంగీతంఎం. ఎం. శ్రీలేఖ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1998
భాషతెలుగు

శివయ్య తన చెల్లెలి చదువు కోసం పల్లెటూరి నుండి పట్నం వస్తాడు. పక్కనే ఉన్న మిఠాయి అంగడి యజమాని కూతురైన శిరీష శివయ్యను ప్రేమిస్తుంటుంది. స్థానిక మార్కెట్ అక్కడ ఉన్న లోకల్ గూండాలైన జ్యోతి, అతని తమ్ముడు పూర్ణ చెప్పు చేతల్లో నడుస్తుంటుంది. అక్కడి వారి బాగు కోసం శివయ్య వారితో తలపడి ఎదిరిస్తాడు. కానీ తనను నమ్మిన వాళ్ళే మోసం చేయడంతో శివయ్య ప్రత్యర్థుల చేతిలో దారుణంగా దెబ్బతింటాడు. అతని చెల్లెల్ని గూండాలు అందరూ చూస్తుండగా మానభంగం చేస్తాడు.

ఇంతలో అక్కడికి రోజా అనే పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి శివయ్య గతాన్ని గురించి చెబుతుంది. తన కుటుంబ గౌరవం కాపాడ్డం కోసం తన ప్రేమించిన అమ్మాయిని ఎలా వదులుకున్నదీ చెబుతుంది. చివరికి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి కోర్టులో గూండాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి వారికి శిక్ష పడేలా చూడ్డంతో కథ ముగుస్తుంది.

నిర్మాణం

మార్చు

1997 నవంబరు 7 న తూర్పుగోదావరి జిల్లా, కోడూరుపాడు గ్రామంలో ఈ చిత్రం ప్రారంభమైంది. పల్లెటూరు నేపథ్యంలో ఉన్న దృశ్యాలను ఇక్కడే చిత్రీకరించారు. మిగతా భాగాలు హైదరాబాదు, దాని పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. రవిబాబు ఈ చిత్రంతో ప్రతినాయకుడిగా పరిచయం అయ్యాడు.[3]

తారాగణం

మార్చు

ఫలితం

మార్చు

ఈ చిత్ర శతదినోత్సవం 1998 జులై 12న రామానాయుడు స్టూడియో లో జరిగింది.[3]

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలకు ఎం. ఎం. శ్రీలేఖ ఈ చిత్రానికి స్వరరచన చేసింది. సి. నారాయణ రెడ్డి, జొన్నవిత్తుల, చంద్రబోస్ పాటలు రాశారు.

  • మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • నడిచే దేవుడు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,చిత్ర
  • ఓ రంగనాథా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,చిత్ర
  • ప్రేమనగరు వాణిశ్రీలా ఉంటే , గానం. ఎం ఎం. శ్రీలేఖ
  • ఎక్కడుందిరా ఆ చట్టం , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

మూలాలు

మార్చు
  1. "శివయ్య సినిమా సమీక్ష". movies.fullhyderabad.com. Retrieved 15 November 2017.
  2. "శివయ్య పాటలు". naasongs.com. Archived from the original on 25 డిసెంబర్ 2016. Retrieved 15 November 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  3. 3.0 3.1 3.2 యు, వినాయక రావు (2014). మూవీ మొఘల్. హైదరాబాదు: జయా పబ్లికేషన్స్. p. 235.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=శివయ్య&oldid=4210140" నుండి వెలికితీశారు