సాక్ష్యం
సాక్ష్యం 2018 జూలై 27 న విడుదలైన తెలుగు సినిమా.
సాక్ష్యం | |
---|---|
దర్శకత్వం | శ్రీవాస్ |
రచన | శ్రీవాస్ బుర్రా సాయి మాధవ్ (సంభాషణలు) |
తారాగణం | బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే |
ఛాయాగ్రహణం | ఆర్థర్ ఎ. విల్సన్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | అభిషేక్ పిక్సర్స్ |
విడుదల తేదీ | జూలై 27, 2018 [1] |
సినిమా నిడివి | 166 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 40 కోట్లు |
కథ
మార్చుస్వస్తిక్ పురం గ్రామ నివాసి రాజుగారు(శరత్‌కుమార్) పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి. అదే ప్రాంతంలో ఉండే మునస్వామి అతని తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడుతుంటారు. వారికి ఎదురు తిరిగిన రాజుగారిని, అతని కుటుంబాన్ని దారుణంగా చంపేస్తారు. రాజుగారికి పుట్టిన కొడుకుని ఎద్దు కాపాడటంతో ఆ పిల్లవాడు తప్పించుకుంటాడు. కాశీ చేరిన ఆ శిశువుని శివ ప్రకాశ్(జయప్రకాశ్) చెంతకు చేరుతాడు. పిల్లలు లేని శివ ప్రకాశ్ ఆ పిల్లాడికి విశ్వజ్ఞ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తాడు.
పెరిగి పెద్దయిన విశ్వ వీడియో ఆటలను రూపొందిస్తుంటాడు.సౌందర్యలహరి(పూజా హెగ్డే)ని చూసి ప్రేమిస్తాడు విశ్వ. ఆమెకు ఓ సందర్భంలో సహాయం చేస్తాడు. కానీ అది అర్థం చేసుకోని సౌందర్య.. విశ్వపై కోపంతో భారతదేశానికి వచ్చేస్తుంది. విశ్వ కూడా సౌందర్య కోసం భారతదేశానికి వచ్చేస్తాడు. అదే సమయంలో హైదరాబాద్‌లోని సౌందర్య తండ్రి మునస్వామి ఆక్రమాలకు అడ్డుపడుతుంటాడు. మునస్వామికి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను సేకరిస్తుంటాడు. మునస్వామి తమ్ముడు వీరాస్వామి(రవికిషన్) సౌందర్యను చంపేయాలనుకుంటాడు. కానీ ప్రకృతి కారణంగా చనిపోతాడు. దానికి పరోక్షంగా విశ్వ కారణమవుతాడు. అలాగే మునస్వామి ఇద్దరు తమ్ముళ్లు కూడా విశ్వ చేతిలోనే చస్తారు. అసలు మునస్వామి సోదరుపలై ప్రకృతి ఎందుకు కోపం తెచ్చుకుంటుంది? చివరకు మునస్వామి పరిస్థితేంటి? అనేది మిగిలిన కథ
తారాగణం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం : శ్రీవాస్
- నిర్మాత: అబిషేక్ నామ
- సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వరన్
- కెమెరామెన్: ఆర్థర్ ఏ విల్సన్
- కళ: ఏఎస్. ప్రకాష్
- ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
- సంభాషణలు : సాయిమాధవ్ బుర్రా
- పోరాటాలు : పీటర్ హెయిన్