సిరిసిల్ల రాజేశ్వరి
సిరిసిల్ల రాజేశ్వరి తెలుగు రచయిత్రి. ఆమె అసలు పేరు బూర రాజేశ్వరి. ఆమె కాళ్లనే చేతులుగా మలచుకుని అక్షర సేద్యం చేస్తున్న వికలాంగ కవయిత్రి.
సిరిసిల్ల రాజేశ్వరి | |
---|---|
జననం | బూర రాజేశ్వరి |
మరణం | 2022 డిసెంబరు 28 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత్రి |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం |
జీవిత విశేషాలు
మార్చుఆమె కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన ఒక నిరుపేద చేనేత కార్మిక కుటుంబానికి చెందిన బూర అనసూయ, సాంబయ్య దంపతులకు 1980లో జన్మించారు. ఆమె పుట్టుకతోనే వికలాంగురాలు. చేతులు వంకర్లుపోయి పని చేయవు. మాటలు రావు. తల నిలబడదు. ఎప్పుడూ వణికిపోతుంటుంది. చేతులు సరిగా పని చేయకపోవడంతో పట్టుదలతో కాళ్లతోనే రాయడం నేర్చుకొని స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది. తన వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ సాహిత్య లోకంలో తనకో స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజేశ్వరి తన కాళ్లను చేతులుగా చేసుకొని కవిత్వం రాస్తోంది. ఆమెలోని ఆ ఆత్మవిశ్వాసాన్ని సుద్దాల అశోక్ తేజ గుర్తించారు. ఆమె రాసిన కవితల్ని సుద్దాల ఫౌండేషన్ ద్వారా 'సిరిసిల్ల రాజేశ్వరి కవితలు' పేరుతో పుస్తక రూపంలోకి తెచ్చారు. ఈ పుస్తకాన్ని రవీంధ్రభారతిలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించారు.[1]
అమ్మ మీద, తెలంగాణ ఉద్యమం మీద, నేత కార్మికుల మీద, వరకట్న వేధింపుల మీద, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలపై కవిత్వం రాసింది రాజేశ్వరి. 1999లో కలం పట్టిన రాజేశ్వరి ఇప్పటి వరకు 350కిపైగా కవితలు రాసింది. పత్రికలకు ఎలా పంపాలో తెలియక తన వద్దనే దాచుకుంది. వై ఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతో పాటు మూడు జీవిత చరిత్రలను కూడా రాసింది.[2]
కాళ్లతో కవిత్వం రాసి సిరిసిల్ల రాజేశ్వరి సాహితీవేత్తల మెప్పు పొందింది. అంగవైకల్యంపై ఆత్మవిశ్వాసంతో ఆమె విజయం సాధించింది.
పురస్కారాలు
మార్చుజనవరి 6 2015 న రవీంద్ర భారతిలో సుద్దాల ఫౌండేషన్ సుద్దాల హనుమంతు జానకమ్మ జానపద కళాపీఠం ఆధ్వరంలో సిరిసిల్ల రాజేశ్వరికి సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారాన్ని 2014 సంవత్సరానికిగానూ డా. సి .నారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేసారు. ఆమె కవితల పుస్తకాన్ని ఆవిష్కరించారు.[3] కాగా, ఈ పురస్కార ప్రదాన కార్యక్రమంలో రాజేశ్వరిని ఆర్థికంగా ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ప్రభుత్వ సహాయం
మార్చురాజేశ్వరికి ప్రతినెలా రూ.10 వేలు పెన్షన్ అందేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వైకల్యాన్ని లెక్కచేయకుండా రచనలు చేస్తున్న రాజేశ్వరిని గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రూ.10 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా వచ్చిన వడ్డీ సొమ్మును రాజేశ్వరికి పెన్షన్‌గా అందజేయాలని అధికారులను ఆదేశించారు.[4] సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో జనవరి 11 2015 న రూ.10లక్షల ఫిక్స్‌డ్ టర్మ్ డిపాజిట్ పత్రాన్ని రాజేశ్వరికి అందజేశారు. ఈ డబ్బుపై ప్రతీ నెలా వచ్చే వడ్డీని ఆమెకు భృతిగా అందజేయనున్నారు. జీవితకాలం పాటు ఈ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నామని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.[5]
మరణం
మార్చుగత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 42 ఏళ్ల బూర రాజేశ్వరి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి 2022 డిసెంబరు 28న తుదిశ్వాస విడించింది.[6]
మూలాలు
మార్చు- ↑ "Sircilla poet sircilla Rajeshwari Passed Away - Sakshi". web.archive.org. 2022-12-28. Archived from the original on 2022-12-28. Retrieved 2022-12-28.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ దైవమొకటి రాస్తే... ధైర్యమొకటి రాస్తోంది!
- ↑ సిరిసిల్ల రాజేశ్వరి కి సుద్దాల పురస్కారం ![permanent dead link]
- ↑ కవయిత్రి రాజేశ్వరికి 10 వేల పెన్షన్ Sakshi February 28, 2015
- ↑ కాళ్లతో కవితలు రాసిన సిరిసిల్ల రాజేశ్వరికి 10లక్షల ఎఫ్‌డి 12-06-2015[permanent dead link]
- ↑ "sircilla rajeshwari, కాళ్లతో కవితలు రాసిన సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేదు.. - sircilla rajeshwari no more who wrote poems with her legs - Samayam Telugu". web.archive.org. 2022-12-28. Archived from the original on 2022-12-28. Retrieved 2022-12-28.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)