సిల్లీ ఫెలోస్ 2018, సెప్టెంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్ల, నందిని రాయ్ ముఖ్యపాత్రల్లో నటించగా, శ్రీ వసంత్ సంగీతం అందించాడు. వెలైను వంధుట్ట వెల్లకారన్‌ అనే తమిళ చిత్రాన్ని రిమేక్ చేసి రూపొందించినదీ చిత్రం.[1]

సిల్లీ ఫెలోస్
సిల్లీ ఫెలోస్ సినిమా పోస్టర్
దర్శకత్వంభీమినేని శ్రీనివాసరావు
రచనభీమినేని శ్రీనివాసరావు (చిత్రానువాదం)
కథఎస్. ఎజిల్
నిర్మాతకిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల
తారాగణంఅల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్ల, నందిని రాయ్
ఛాయాగ్రహణంఅనిష్ తరుణ్ కుమార్
కూర్పుగౌతంరాజు
సంగీతంశ్రీ వసంత్
నిర్మాణ
సంస్థలు
బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్.ఎల్.పి., పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
దేశంభారతదేశం
భాషతెలుగు

జయప్రకాశ్ రెడ్డి ఓ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటాడు. ఆ ఎమ్మెల్యేకు నమ్మినబంటు ఇంకా చెప్పాలంటే రాంబంటుగా ఉంటాడు నరేష్. ఇందులో నరేష్ స్వార్ధం ఉంది. జయప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవిని అలంకరిస్తే తాను ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటాడు. ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి చేత కొన్ని మంచి పనులు చేయించేందుకు సిద్దమవుతాడు. ఇందులో భాగంగా సామూహిక వివాహ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమౌతాడు. ఈ కార్యక్రమం అభాసుపాలవ్వకుండా ఉండేందుకు నరేష్ తన స్నేహితుడైన సునీల్ కి బలవంతంగా ఓ చిత్రతో పెళ్లి చేస్తాడు. ఇక తన ప్రియురాలు పూర్ణను పోలీస్ ను చేయడానికి ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి చేత రూ. లక్షలు లంచం ఇప్పిస్తాడు. ఈ సమయంలో చిత్రకు, సునీల్ కు గొడవలు జరిగి విడిపోవాలని అనుకుంటారు. అందుకు జయప్రకాశ్ రెడ్డి సాక్ష్యం కావాలి. ఇదే సమయంలో జయప్రకాశ్ రెడ్డికి ఓ ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్తాడు. ఇక జయప్రకాశ్ రెడ్డి దగ్గర రూ.500 కోట్లకు సంబంధించిన ఓ రహస్యం ఉందనితెలుస్తుంది, మరి జయప్రకాశ్ రెడ్డి కోమాలోనుంచి బయటకు వచ్చాడా..? ఆ రూ.500 కోట్లు ఎవరివి..? అన్నది మిగతా కథ.[2]

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • చిత్రానువాదం, దర్శకత్వం: భీమినేని శ్రీనివాసరావు
  • నిర్మాత: కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
  • కథ: ఎస్. ఎజిల్
  • సంగీతం: శ్రీ వసంత్
  • ఛాయాగ్రహణం: అనిష్ తరుణ్ కుమార్
  • కూర్పు: గౌతంరాజు
  • నిర్మాణ సంస్థ: బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్.ఎల్.పి., పీపుల్ మీడియా ఫాక్టరీ

పాటలు

మార్చు
  1. సిల్లీ ఫెలోస్ — గానం: గీతా వసంత్, మాస్టర్ శ్రీచరణ్, ప్రణవ్ చాగంటి (2:28)
  2. హెడేక్ రా మామ — రచన: కాకర్ల శ్యామ్, గానం: పెంచల్ దాస్ (3:59)[3]
  3. పిల్లా నీ బుగ్గలు — గానం: రాహుల్ సిప్లిగంజ్ (3:12)

మూలాలు

మార్చు
  1. "Silly Fellows has left the audience rolling with laughter: Producers". Sep 9, 2018.
  2. సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్‌‌' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2018. Retrieved 6 June 2019.
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-సినిమా కబుర్లు (30 August 2018). "'సిల్లీ ఫెలోస్'కి తలనొప్పి ఎక్కువే". Archived from the original on 6 June 2019. Retrieved 6 June 2019.

ఇతర లంకెలు

మార్చు