బాంబే సిస్టర్స్

(సి.సరోజ నుండి దారిమార్పు చెందింది)

బాంబే సిస్టర్స్‌గా పిలువబడే సి.సరోజ (జ.7డిసెంబరు 1936), సి.లలిత (జ.26 ఆగష్టు 1958) కర్ణాటక సంగీతంలో జంట గాయకులు.[1]

బాంబే సిస్టర్స్
వ్యక్తిగత సమాచారం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిశాస్రీయ జంట గాత్ర విద్వాంసులు

ప్రారంభ జీవితం

మార్చు

ఈ సోదరీమణులు కేరళ రాష్ట్రంలోని త్రిచూర్‌లో ముక్తాంబాళ్, ఎన్.చిదంబరం అయ్యర్ దంపతులకు జన్మించారు. వీరు బొంబాయిలో పెరిగారు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం మాతుంగ సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ హైస్కూలులో జరిగింది. మధ్యప్రదేశ్ భోపాల్ నుండి ప్రైవేటుగా ఇంటర్మీడియట్ చదివారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. వీరి సంగీత శిక్షణ హెచ్.ఎ.ఎస్.మణి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, టి.కె.గోవిందరావుల ఆధ్వర్యంలో నడిచింది.[2][3]

సంగీత ప్రదర్శనలు

మార్చు

1950వ దశకంలో కర్ణాటక సంగీతంలో రాధ జయలక్ష్మి, శూలమంగళం సిస్టర్స్ వంటి జంట గాయకుల పరంపర కొనసాగింది.[4] 1963లో ఈ సోదరీమణులు బాంబే సిస్టర్స్ పేరుతో జంటగా సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. మొదట వీరు లలిత సంగీతంతో ప్రారంభించి క్రమక్రమంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించ సాగారు. వీరు సంస్కృతం, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ భాషలలో కీర్తనలను ఆలపించేవారు.[5]వీరు యువ సంగీత కళాకారులకు ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. [6]

పురస్కారాలు

మార్చు
  • 2020-పద్మశ్రీ పురస్కారం[7][8]
  • 2006- తమిళ ఇసై సంఘం వారిచే ఇసై పేరారిజ్ఞర్ పురస్కారం[9]
  • 2006 - ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై వారిచే సంగీత కళాశిఖామణి
  • "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ వారిచే కళైమామణి[10]
  • కంచి కామకోటి పీఠం వారిచే మొట్టమొదటి మహిళా "ఆస్థాన విదుషీమణులు"గా నియామకం.[11]
  • 2010 - మద్రాసు సంగీత అకాడమీ వారిచే సంగీత కళానిధి పురస్కారం.[12]
  • 1991 - శ్రీకృష్ణ గానసభ వారిచే సంగీత చూడామణి.
  • 2004 - సంగీత నాటక అకాడమీ అవార్డు
  • 2018 - శ్రీరామ సేవామండలి, బెంగళూరు వారిచే ఎస్.వి.నారాయణస్వామి రావు అవార్డు.
  • 2013 - మహారాజపురం విశ్వనాథ అయ్యర్ స్మారక అవార్డు.
  • 1994 - మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ క్లబ్, మద్రాసు వారిచే సంగీత కళానిపుణ అవార్డు.
  • 2019 - తమిళనాడు ప్రభుత్వం చే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అవార్డు.

మూలాలు

మార్చు
  1. Saravanan & Hari Krishnan. "Interview with Bombay Sisters". ChennaiOnline.com. Archived from the original on 28 September 2010. Retrieved 2009-08-03.
  2. "Bombay sisters in concert". The Hindu. 22 September 2007. Archived from the original on 2012-11-07. Retrieved 2009-08-03.
  3. "C Saroja & C Lalita - The Bombay Sisters". Carnatica.com. Retrieved 2009-08-03.
  4. "Sisters in song". The Hindu. 30 January 2010.
  5. "Concert by Bombay sisters". New Straits Times. 16 February 1994. p. 13. Retrieved 2009-08-03.[permanent dead link]
  6. "Bombay Sisters with their senior students playing Tanpura at Music Academy".
  7. "Padma Awards 2020 Announced". pib.gov.in.
  8. Desk, The Hindu Net (26 January 2020). "Full list of 2020 Padma awardees". The Hindu (in Indian English).
  9. "Bombay Sisters to get Isai Perarignar Award". The Hindu. 11 November 2006. Archived from the original on 2007-12-05. Retrieved 2009-08-03.
  10. "Profile - Bombay Sisters". ChennaiOnline.com. Archived from the original on 15 ఆగస్టు 2009. Retrieved 3 ఆగస్టు 2009.
  11. "Sheer hard work has brought us this far". The Hindu. 28 September 2007. Archived from the original on 2007-11-05. Retrieved 2009-08-03.
  12. "Sangita Kalanidhi award for Bombay Sisters". The Hindu. 20 July 2010. Retrieved 2010-07-20.

బయటిలింకులు

మార్చు