గోపరాజు రమణ

తెలుగు నాటకరంగ, టివీ, సినిమా నటుడు

గోపరాజు రమణ, (ఆంగ్లం: Goparaju Ramana) తెలుగు నాటకరంగ, టివీ, సినిమా నటుడు.[1] నాటకరంగంలో అనేక నాటకాల్లో నటించి ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నాడు.[2] మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో హీరో తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు.[3]

గోపరాజు రమణ
జననంగోపరాజు యజ్ఞేశ్వర వెంకట రమణామూర్తి
1952, ఏప్రిల్ 5
ప్రసిద్ధిరంగస్థల, టివీ, రేడియో నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు
భార్య / భర్తలీలా అన్నపూర్ణ విశాలాక్షి
పిల్లలుగోపరాజు విజయ్ (నటుడు, దర్శకుడు)
తండ్రిహనుమంతారావు
తల్లిబాలా త్రిపురసుందరమ్మ

రమణ 1952, ఏప్రిల్ 5న హనుమంతారావు - బాలా త్రిపురసుందరమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, తెనాలి మండలంలోని కొలకలూరు గ్రామంలో జన్మించాడు.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

రమణకు లీలా అన్నపూర్ణ విశాలాక్షితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (గోపరాజు విజయ్) ఉన్నాడు. విజయ్ నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నాడు.[5]

కళారంగం

మార్చు

10వ తరగతిలో ఉన్నప్పుడు మానవుడి అడుగుజాడల్లో అనే నాటకంతో నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. 1967లో బాలానందం అనే నాటక సంస్థలో చేరాడు.[4] నాటకరంగంలో నటుడిగా రమణకి మంచి అనుభవం ఉంది. అంతేకాకుండా పలు సీరియళ్ళలోనూ, సినిమాల్లోనూ నటించాడు. 2005లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన గ్రహణం సినిమాలో రమణ తొలిసారిగా నటించాడు. ఈ తరువాత మాయాబజార్, గోల్కొండ హైస్కూల్, అష్టాచెమ్మా వంటి సినిమాలలో వివిధ పాత్రలు పోషించాడు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ గురువుగా నటించాడు.[6] రవీంద్రభారతిలో జరిగిన నాటక ప్రదర్శనలో రమణ నటన చేసిన దర్శకుడు వినోద్ అనంతోజు, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలోని ‘కొండల్రావ్’ పాత్రకి ఎంపిక చేశాడు.

నటించినవి

మార్చు

నాటకాలు/నాటికలు

మార్చు
  • అనుబంధాలు
  • రక్తజ్వాల
  • నోరుముయ్
  • చరిత్రకు చమటలు పడుతున్నాయి
  • నేరస్తుడెవరు
  • నాగమండల
  • చాలు ఇకచాలు
  • తలుపులు తెరిచే ఉన్నాయి
  • కుక్కపిల్ల
  • బైపాస్
  • శ్రీకారం
  • మనసులు కలిస్తే
  • గమ్మస్థానాల వైపు

టివి సీరియళ్ళు

మార్చు

సినిమాలు

మార్చు

అవార్డులు, పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Goparaju Ramana". www.filmibeat.com. Archived from the original on 2020-12-04. Retrieved 2022-04-05.
  2. India, The Hans (2020-11-04). "Actor Sreeramulu suggesting me for role of Prakasam was biggest award, says Ramana". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-05. Retrieved 2022-04-05.
  3. EENADU (10 August 2022). "ఈ 'మిడిల్‌క్లాస్‌' కొండలరావు ఎవరు?". www.eenadu.net. Archived from the original on 2024-05-25. Retrieved 2024-05-25.
  4. 4.0 4.1 "Goparaju Ramana". starsunfolded.com. Archived from the original on 2021-06-14. Retrieved 2022-04-05.
  5. యడవల్లి, శ్రీనివాసరావు (2024-08-20). "నాలుగు దశాబ్దాల నట విజయం - Prajasakti". Archived from the original on 2024-08-20. Retrieved 2024-08-20.
  6. "ఈ 'మిడిల్‌క్లాస్‌' కొండలరావు ఎవరు?". EENADU. 2020-11-24. Archived from the original on 2022-04-05. Retrieved 2022-04-05.
  7. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "కందుకూరి పురస్కారాలు - 2017" (PDF). web.archive.org. Archived from the original on 2018-05-07. Retrieved 2022-04-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
  8. The New Indian Express, Vijayawada (26 July 2019). "Sumadhura comedy drama festival to begin today". www.newindianexpress.com. Archived from the original on 13 August 2020. Retrieved 2022-04-05.
  9. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.

బయటి లింకులు

మార్చు