లహరి గుడివాడ

రంగస్థల, టివీ, సినిమా నటీమణి

లహరి గుడివాడ రంగస్థల, టివీ, సినిమా నటీమణి.[1] 2014లో రంగస్థలంపై అడుగుపెట్టిన లహరి, ఇప్పటివరకు 400 నాటక, నాటికల ప్రదర్శనలలో పాల్గొని, అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా బహుమతులు, సత్కారాలు అందుకుంది. 2022లో వచ్చిన అలిపిరికి అల్లంత దూరంలో అనే సినిమాతో హీరో తల్లి పాత్రతో సినిమారంగంలోకి ప్రవేశించింది.[2]

లహరి గుడివాడ
జననం (1988-04-01) 1988 ఏప్రిల్ 1 (వయసు 36)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి

2023 నంది నాటకోత్సవంలో చీకటిపువ్వు నాటికలోని నటనకుగానూ ఉత్తమ నటిగా నంది బహుమతిని అందుకుంది.

జననం - విద్యాభ్యాసం

మార్చు

లహరి 1988, ఏప్రిల్ 1న గుంటూరులో జన్మించింది. తండ్రి వ్యాపారి, తల్లి జూనియర్ కళాశాల అధ్యాపకురాలు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన లహరి, ప్రస్తుతం పర్యాటకశాస్త్రంలో పి.జి. చదువుతుంది.

నటనపై ఆసక్తి

మార్చు

హోటల్ మేనేజ్ మెంట్ కళాశాలను నడుపుతున్న సమయంలో నటనపై ఈటీవి పరిపూర్ణ మహిళ కార్యక్రమంలో సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. స్మైల్ రాణి స్మైల్, డ్యాన్స్-2001, ఛాలెంజ్-2002 పోటీల్లో విజేతగా నిలిచింది.[1]

రంగస్థల ప్రస్థానం

మార్చు

లహరి 2014లో రంగస్థలంపై అడుగు పెట్టింది. ఇప్పటివరకు 400 నాటక, నాటికల ప్రదర్శనలలో పాల్గొన్నది. అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా బహుమతులు, సత్కారాలు అందుకుంది.

నటించినవి

మార్చు

పెళ్లిచేసి చూడు, వైనాట్, పోవోయి అనుకోని అతిథి, రెండు నిశబ్ధాల మధ్య, బ్రతకనివ్వండి, ఆశ్రిత, అభయ, పల్లవి అనుపల్లవి, ఆఖరి ఉత్తరం, బైపాస్, సరికొత్త మనుషులు, అరసున్న, నిషిద్దాక్షరి, తగునా ఇది భామా, ఇరుసంధ్యలు, గోవు మాలచ్చిమి, బతుకుచిత్రం, గుర్తు తెలియని శవం,[3] నల్లజర్ల రోడ్డు, మొల్ల (పద్యనాటకం), భక్తకన్నప్ప, పాదుకా పట్టాభిషేకం, శ్రీకృష్ణదేవరాయలు, సౌదామిని, జ్యోతీరావ్ పూలే, పల్నాటి యుద్ధం, అక్క అలుగుడు..చెల్లి సణుగుడు, తొక్క తీస్తా, కొత్తనీరు, బతుకుచిత్రం, నా గూడు, సిగ్గు, మా ప్రేమకు న్యాయం కావాలి, కెరటాలు, ఆలీతో సరదాగా, చీకటిపువ్వు,[4] నాన్నా నేనొచ్చేస్తా నేవంటి నాటక, నాటికలలో నటించింది.

దర్శకత్వం

మార్చు
  • నాన్నా నేనొచ్చేస్తా[5]

బహుమతులు

మార్చు
  1. ఉత్తమనటి - రెండు నిశబ్దాల మద్యం (నాటిక), 2015 (చిలకలూరిపేట కళా పరిషత్ 5వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు (మార్చి 29-31, 2015), (చిలకలూరి పేట, గుంటూరు జిల్లా)[6]
  2. ఉత్తమనటి - పోవోయి అనుకోని అతిథి (నాటిక), 2016 (సుమధుర కళానికేతన్ హాస్య నాటిక పరిషత్తు, విజయవాడ)[7]
  3. ఉత్తమనటి - బ్రతకనివ్వండి (నాటకం) (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2017, పల్లెకోన)[8]
  4. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (సి.ఆర్.సి. కాటన్ కళాపరిషత్, లింగారావుపాలెం)
  5.  
    తెలంగాణ యువ నాటకోత్సవంలో "మా ప్రేమకు న్యాయం కావాలి" నాటికలో నటి లహరి గుడివాడ
    ఉత్తమనటి - అంతా మన సంచికే (నాటిక), 2017 (ఎన్టీఆర్ కళాపరిషత్, వినుకొండ), 16వ నాటకోత్సవం[9]
  6. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (కళాసాగర్, బుచ్చిరెడ్డిపాలెం)
  7. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (టి.జి.వి. రస కళాపరిషత్, కర్నూలు)
  8. ఉత్తమనటి - అభయ (నాటిక), 2017 (సుబ్బరాజు నాట్య కళాపరిషత్‌, 47వ వార్షిక జాతీయస్థాయి నాటిక పోటీలు తిరుపతి)
  9. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), మే 30,31, 2017 జూన్ 1 (శ్రీకాకుళం జిల్లా కవిటి, బొరివంక)
  10. ఉత్తమనటి - అభయ (నాటిక), జూన్ 8,9,10, 2017 (హర్ష క్రియేషన్స్, విజయవాడ)
  11. ఉత్తమ ద్వితీయ నటి - ఆశ్రిత (నాటిక), 2016 (కొండవీటి కళాపరిషత్, లింగారావుపాలెం)
  12. ఉత్తమనటి - అక్క అలుగుడు... చెల్లి సణుగుడు (నాటిక), 2017 (సుమధుర కళానికేతన్ హాస్య నాటిక పరిషత్తు, విజయవాడ)
  13. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), నవంబరు 11-13, (నటరత్న నాటక పరిషత్ -2017, విజయనగరం)
  14. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), డిసెంబరు 27-30, 2017, (డా. నందమూరి తారకరామారావు కళాపరిషత్, తెనాలి, కీ.శే. పోలేపెద్ది నరసింహమూర్తి & తుమ్మల వెంకట్రామయ్య స్మారక రాష్ట్రస్థాయి 10వ ఆహ్వాన సాంఘిక నాటిక పోటీలు)
  15. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - అభినయ నాటక పరిషత్, 13వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు (జనవరి 12,13,14 - 2018), (పొనుగుపాడు, గుంటూరు జిల్లా)[10]
  16. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఫిబ్రవరి 12-16, 2018), (చోడవరం, విశాఖపట్టణం జిల్లా)
  17. ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - నరసరావుపేట రంగస్థలి, రాష్ట్ర్లస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఫిబ్రవరి 23-25, 2018), (నరసరావుపేట, గుంటూరు జిల్లా)
  18. ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - గరికిపాటి ఆర్ట్ థియేటర్, 6వ జాతీయస్థాయి నాటిక పోటీలు (మార్చి 23-25, 2018), (ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా)
  19. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - శ్రీ సుమిత్ర కళాసమితి జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (మార్చి 27-30, 2018), (శ్రీకాకుళం)
  20. ఉత్తమనటి - కొత్తనీరు (నాటిక) - వీరవాసరం కళాపరిషత్ నాటక పోటీలు (మార్చి 27-30, 2018), (వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా)[11]
  21. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - చిలకలూరిపేట కళా పరిషత్ 8వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు (ఏప్రిల్ 1-3, 2018), (చిలకలూరి పేట, గుంటూరు జిల్లా)[12]
  22. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - కొండవీటి కళాపరిషత్ 21వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఏప్రిల్ 14-16, 2018), లింగారావుపాలెం)[13][14]
  23. ఉత్తమనటి - కొత్తనీరు (నాటిక) - కళారంజని నాటక అకాడమీ సప్తమ జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీలు (ఏప్రిల్ 16-18, 2018), (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)
  24. ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - లావు వెంకటేశ్వర్లు & కల్లూరి నాగేశ్వరరావు కళాపరిషత్ 4వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు (ఏప్రిల్ 19-21, 2018), (వరగాని, గుంటూరు జిల్లా)[15]
  25. ఉత్తమనటి - కొత్తనీరు (నాటిక) - యూత్ క్లబ్ నాటక పరిషత్ తెలుగు నాటిక పోటీలు (ఏప్రిల్ 22-24, 2018), (కొంతేరు)
  26. ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - శ్రీకారం & రోటరీ కళాపరిషత్ 10వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు (ఏప్రిల్ 24-26, 2018), (మార్టూరు, ప్రకాశం జిల్లా)[16]
  27. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - కళాసాగర్ జాతీయస్థాయి నాటిక పోటీలు (ఏప్రిల్ 27-29, 2018), (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా)[17]
  28. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - కళాంజలి నాటిక పోటీలు (ఏప్రిల్ 29 - 2018 మే 2), (చీరాల, ప్రకాశం జిల్లా)
  29. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక) (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2018, పల్లెకోన, ఖమ్మం)
  30. ఉత్తమనటన - బతుకు చిత్రం (నాటిక) - నాగులపాలెం 20వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు, (నాగులపాలెం, ప్రకాశం జిల్లా)
  31. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - పొన్నూరు కళా పరిషత్ 19వ తెలుగు రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (మే 11 - 13, 2018), (పొన్నూరు, గుంటూరు జిల్లా)
  32. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - దర్శనాపూరి నాటక కళా పరిషత్ 9వ నాటిక పోటీలు (మే 11 - 14, 2018), (దర్శి, ప్రకాశం జిల్లా)
  33. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - చైతన్యభారతి నాటక పరిషత్ అఖిల భారత స్థాయి సాంఘిక నాటిక పోటీలు (మే 14 - 16, 2018), (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)
  34. ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - నల్లమల్లి మూలరెడ్డి కళా పరిషత్ 28వ జాతీయస్థాయి నాటిక పోటీలు, (జూన్ 7-10, 2018), రామవరం, తూర్పు గోదావరి జిల్లా
  35. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), (సుబ్బరాజు నాట్య కళాపరిషత్‌, 47వ వార్షిక జాతీయస్థాయి నాటిక పోటీలు, 2018 జూన్ 17 తిరుపతి)
  36. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - డా.అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి నాటికల పోటీ (సెప్టెంబరు 10 - 12, 2018), (విజయవాడ, కృష్ణా జిల్లా)
  37. ఉత్తమనటి - అస్థికలు (వీణా అవార్డ్స్‌ 2021, పేరిట కళల కాణాచి, వేదగంగోత్రి ఫౌండేషన్‌-తెనాలి)[18]
  38. ఉత్తమ నటి - చీకటిపువ్వు - కొండవీటి కళాపరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఏప్రిల్ 21-23, 2023), లింగారావుపాలెం)[19]
  39. నంది అవార్డు - ఉత్తమ నటి (చీకటిపువ్వు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది నాటక పరిషత్తు - 2022)

సత్కారాలు

మార్చు
  1. ఉషోదయా కళానికేతన్, గుంటూరు వారి సత్కారం[20][21]

సినిమారంగం

మార్చు
  1. అలిపిరికి అల్లంత దూరంలో (2022)[2]

సామాజిక సేవ

మార్చు

కోవిడ్ -19 సమయంలో నాటకరంగ కళాకారులు పడిన కష్టాలను చూసి చలించిన లహరి, సంవత్సరానికి కనీసం ఒకరు లేదా ఇద్దరు కళాకారులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆ సంకల్పంతో తన సోదరి అమృతవర్షిణితో కలిసి అమృతలహరి ఆర్ట్స్ అనే ఒక కళా సంస్థను స్థాపించింది. ఆ సంస్థ ద్వారా నాటకాలను ప్రదర్శించడంతోపాటు కొంతమంది మహిళలతో కలిసి ఊరగాయల తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. అలా తయారుచేసిన వాటిని నాటక పోటీలు నిర్వహించే ప్రదేశాల్లో స్టాల్ పెట్టి, వాటి అమ్మకం ద్వారా వచ్చిన లాభాలతో నిరుపేద కళాకారులకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది.[22]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఈనాడు, తెనాలి (8 March 2017). "విజేతలు". {{cite journal}}: Cite journal requires |journal= (help)
  2. 2.0 2.1 "'అలిపిరికి అల్లంత దూరంలో' మూవీ రివ్యూ". Sakshi. 2022-11-18. Archived from the original on 2022-11-18. Retrieved 2022-11-22.
  3. ఈనాడు, పాలకొల్లు పట్టణం (5 April 2021). "ముగిసిన జాతీయ స్థాయి నాటికోత్సవాలు". Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.
  4. "ఘనంగా ముగిసిన 13 వ జాతీయ స్థాయి నాటిక పోటీలు." Prajasakti (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-18. Retrieved 2023-05-19.
  5. ABN (2023-04-02). "ఆకట్టుకున్న 'నాన్నా...నేనొచ్చేస్తా', 'మనసున మనసై' నాటిక ప్రదర్శనలు". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-04-02. Retrieved 2024-01-20.
  6. చిలకలూరిపేట బ్లాగు, బహుమతులు. "Prize List of 5th State Level Play let Competitions conducted by Kalaparishth Chilakaluripet". www.chilakaluripet1.blogspot.in. Retrieved 5 April 2018.[permanent dead link]
  7. సుమధుర ఫలితాలు, నటకులమ్ మాసపత్రిక, ఆగష్టు 2016, పుట.4
  8. వెబ్ ఆర్కైవ్. "రంగస్థలంకు నవీన కాంతి". web.archive.org. Archived from the original on 21 ఆగస్టు 2017. Retrieved 21 August 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. ఆంధ్రజ్యోతి, గుంటూరు. "నాటికలతో సమాజంలో మార్పు". Retrieved 21 April 2017.[permanent dead link]
  10. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు (12 January 2018). "నేటి నుంచి తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు". Archived from the original on 13 జనవరి 2018. Retrieved 17 May 2018.
  11. వెబ్ ఆర్కైవ్, ఈనాడు, పశ్చిమ గోదావరి జిల్లా (1 April 2018). "ముగిసిన నాటిక పోటీలు". Archived from the original on 1 ఏప్రిల్ 2018. Retrieved 1 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
  12. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు (29 March 2018). "ఏప్రిల్‌ 1 నుంచి తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు". Retrieved 17 May 2018.[permanent dead link]
  13. ముగిసిన నాటక పోటీలు, లింగారావుపాలెం, ఈనాడు గుంటూరు రూరల్, 18.04.2018, పుట 12.
  14. ఉత్తమ ప్రదర్శన 'గుర్తు తెలియని శవం', యడ్లపాడు, ఆంధ్రజ్యోతి గుంటూరు ఎడిషన్, 18.04.2018, పుట 22.
  15. ఉత్తమ నాటికగా గుర్తు తెలియని శవం, ఈనాడు గుంటూరు రూరల్ ఎడిషన్, 23.04.2018, పుట.12.
  16. ఉత్తమ నాటికగా గుర్తు తెలియని శవం, ఈనాడు ప్రకాశం జిల్లా ఎడిషన్, 28.04.2018, పుట.13.
  17. రంగస్థలం నుంచే సినీరంగానికి, సాక్షి నెల్లూరు జిల్లా ఎడిషన్, 30.04.2018, పుట.5.
  18. ఆంధ్రజ్యోతి, గుంటూరు (15 October 2021). "వీధి నాటకాలు పునరుజ్జీవం పొందాలి". andhrajyothy. Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
  19. "ఉత్తమ ప్రదర్శనగా 'నాన్న నేనొచ్చేస్తా'". EENADU. Archived from the original on 2024-01-20. Retrieved 2024-01-20.
  20. ఆంధ్రజ్యోతి. "గుంటూరులో అలరించిన 'ఆఖరి ఉత్తరం' నాటకం". Retrieved 11 June 2017.
  21. "సందేశాత్మకంగా ఆఖరి ఉత్తరం". ఆంధ్రజ్యోతి. 22 July 2016.
  22. PRASAD, VRS (2023-07-21). "Artistes extend helping hand to needy among them". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-22. Retrieved 2023-07-24.

వెలుపలి లంకెలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.