సురేంద్ర కృష్ణ ఒక తెలుగు సినీ పాటల రచయిత.[1] గిల్లి కజ్జాలు అనే సినిమాతో గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈవివి సత్యనారాయణ, రవిరాజా పినిశెట్టి, కరుణాకరన్ లాంటి దర్శకులతో కలిసి పనిచేశాడు. తమ్ముడు, ఆర్య, ఎవడి గోల వాడిదే లాంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు ఆదరణ పొందాయి.

సురేంద్ర కృష్ణ
వృత్తిపాటల రచయిత
మతంహిందూ
తల్లిదండ్రులు
  • కోడూరి శ్రీమన్నారాయణ (తండ్రి)

వ్యక్తిగతంసవరించు

ఆయన తండ్రి కోడూరి శ్రీమన్నారాయణ పౌరోహిత్యం చేసేవాడు. చిన్నప్పుడు ఇతనికి దర్శకుడు కావాలనే ఆశ ఉండేది. కాలేజీ రోజుల్లో పాటలు, కవితలు రాయడం ఆయనకు హాబీగా ఉండేది. సినిమాల్లోకి రాక మునుపు ఓ బి.పి.ఓ సంస్థలో పని చేసేవాడు. సినిమాల్లో అవకాశాలు వచ్చినా తండ్రి కోరిక మేరకు కొద్ది రోజులు రెండు రంగాల్లోనూ కొనసాగాడు.

పాటలుసవరించు

ఆయన రాసిన పాటల్లో ఆదరణ పొందిన పాటలు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన తమ్ముడు సినిమాలో ఏదోలా ఉందీ వేళ నాలో, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాలో తకధిమి తోం తకధిమి తోం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన మా బాపు బొమ్మకు పెళ్ళంట సినిమాలో మాటలే రాని వేళ పాట ఎలా పాడను. ఈ పాట పాడిన తర్వాత గాయని ఉషకు నిజంగానే కళ్ళలో నీళ్ళు వచ్చాయని సురేంద్ర ఆంధ్రజ్యోతికిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.[1] ఈవివి దర్శకత్వంలో వచ్చిన ఎవడి గోల వాడిదే సినిమాలో 12 నిమిషాల పాటు సాగే పేరడీ పాట రాశాడు. ఇందులో 25 హిట్ పాటల పల్లవులకు పేరడీలున్నాయి.[2]

సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "ఆ పాటతో సింగర్ ఉషని ఏడిపించారు". andhrajyothy.com. వేమూరి రాధాకృష్ణ. Retrieved 24 October 2016.
  2. ఆదివారం ఆంధ్రజ్యోతి, నా పాట, తకధిమి తోం. హైదరాబాదు: వేమూరి రాధాకృష్ణ. 23 October 2016. p. 6.