హరిత దీపావళి

Merge-arrow.svg
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని దీపావళి వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

దీపావళి' పండుగ తొలినాళ్ళ లో పూజ పునస్కారాలు చేసుకోవడం, దీపాలు వెలిగించుకోవడం, బంధుమిత్రులందరూ కలసి పిండివంటలు ఆరగించడం వరకు మాత్రమే పరిమితమై ఉండేది. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటి రాజైన హర్షుడు తన సంస్కృత నాటకం 'నాగానందం'లో దీపావళి వేడుకలను దీపప్రతిపదోత్సవంగా వర్ణించాడు. విదేశీ యాత్రికుల రచనల్లో పర్షియన్ యాత్రికుడు ఆల్బెరూని పదకొండో శతాబ్దంలో, ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కాంటి పదిహేనో శతాబ్ది పోర్చుగిసు యాత్రికుడైన డొమింగో పాస్ పదహారో శతాబ్దంలో దీపావళి వేడుకలను వర్ణించారు. ఆ వర్ణనలలో దీపాలంకరణలు, విందు వినోదాలు, నృత్య గానాది సాంస్కృతిక కార్యక్రమాల వర్ణనే తప్ప బాణాసంచా వర్ణనే కనిపించదు. క్రీస్తుశకం పదనాలుగు వరకూ ఏ రచనలలోను బాణాసంచా ప్రస్తావన కనిపించదు.[1]

బాణాసంచా చరిత్ర:సవరించు

సూరే కారం గా జన సామాన్యం పిలిచే పొటాషియం నైట్రెటె ను కనుగొన్న తర్వాత దీపావళి జరుపుకొనే తీరు మారింది. క్రీస్తు శకం 960-1279 కాలం లోని సాంగ్ వంశీయుల హయాంలో చైనీయులు సూరేకారం, గంధకం పొడి, బొగ్గు పొడి కలిపి గన్ పౌడర్ ను తయారు చేసారు.మంట అంటుకోగానే భారీ శబ్దమ్ తో పేలే గన్ పౌడర్ ఆవిష్కరణ తో చరిత్ర గతిలో మార్పులు శరవేగాన్ని పుంజుకున్నాయి. క్రీస్తుశకం 14 వ శతాబ్దై నాటికి భారత భూ భాగం లో గన్ పౌడర్ ను యుద్ధాలలో వాడడం మొదలైంది. ఫిరంగుల్లో మందుగుండును దట్టించి పేల్చి శత్రువులను తరిమి కొట్టడం , దుర్భేధ్యమైన కోటలను ఫిరంగి గుళ్ళ దాడితో పడగొట్టడం మొదలైంది. వివిధ ప్రయోగాల ద్వారా రకరకాల బాణాసంచా తయారీ ప్రారంభమైంది, సురేకారం,గంధకం,బొగ్గుపొడి రకరకాల పాళ్ళలో కలిపి తక్కువ పేలుడు కలిగించేవి, రంగులు విరజిమ్మేవి మొదలైన వి ప్రారంభమైనవి.ఇవన్నీ చైనా లో దాదాపు క్రీస్తు శకం 12 వ శతాబ్ది నాటికే ప్రారంభమైనా, భారత్ లో మాత్రం 14 వ శతాబ్ది నుండే ప్రారంభమైనట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తుంది. క్రీస్తు శకం 1443 లో రాయల ఆస్థానాన్ని సందర్శించిన పర్షియన్ రాయబారి అబ్దుల్ రజాక్ విజయ నగర సామ్రాజ్యం లో జరిగిన దీపావళి వేడుకలను వర్ణించాడు. అవి మిరిమిట్లు గొలిపే కాతులతో ఉన్నట్లు వ్రాసాడు. దాదాపు అదే కాలం వాడైన ఇటాలియన్ యాత్రికుడు లుడోవికో డి వార్తెమా కూడా దీపావళి వేడుకల్లో బాణాసంచా ఉపయోగించినట్లు వ్రాసాడు.విజయ నగర సామ్రాజ్యం లొ చాలా మంది బాణాసమ్చా నిపుణులు ఉన్నట్లు వ్రాసాడు.వారి నైపుణ్యమును వర్ణించాడు.

బాణా సంచా తయారీ కేంద్రాలుసవరించు

స్వాతంత్ర్యానికి ముందు భాణా సమ్చా తయారీ కేంద్రం కలకత్తా ఐతే స్వాతమ్త్రం వచ్చిన తర్వాత కొన్నాళ్ళాకు తమిళనాడూ లో శివకాశి ప్రధాన కేంద్రం గా మారింది.ఇప్పటికీ అదే కొనసాగుతుంది. 2018 సంవత్సరమ్ లో భారత సుప్రీం కోర్టు బణా సంచా వినియోగం పై ఆంక్షలు విధించింది.కొందరు పర్యావరణ వేత్తలు బాణాసంచాను పూర్తిగా నిషేధించాలని సుప్రీం కోర్టును కోరినప్పటికీ రెండు గంటలకు మించి కాల్చరదని ఆంక్షలు విధించింది.దానికి బదులుగా పర్యావరణానికి అంతగా హాని చేయని హైత బాణా సం చా కు అనుమతి నిచ్చింది.ఈ విషయంలో ప్రజలు కూడా స్వచ్చంధమ్గా వాడకం తగ్గించడం ఒక శ్భ పరిణామం. ఈ గ్రీన్ క్రాకర్స్ ను ప్రభుత్వ రంగానికి చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అమ్డ్ ఇండస్త్రియల్ రిసెర్చి (సి ఎస్ ఐ అర్) శాస్త్రవేత్తలచే రూపొందించారు.ఇప్పటికే దేశంలో 165 బాణాసంచా తయారీ సంస్థలు ఉత్పత్తి ని ప్రారంభించాయి.మరి కొన్ని సంస్థలు తయారీకీ సిద్ధమవడం పర్యావరణ రీత్యా ముదావహం.సాధారణ బాణాసంచా కమ్టే ఇవి 30-35 శాతం మేరకు తక్కువ పార్టికులేట్ మేటర్ ఉద్గారాలను, సల్ఫ్ర్ డ్యకైడ్ ఉద్గారాలను 35 నుండి 40 శాతం తక్కువ నిస్తాయి

వాయు కాలుష్య ప్రమాదంసవరించు

బాణాసమ్చా కాల్పుల్లో వెలువడే పొగలో సీసం, రాగి, మెగ్నీషియం, జింక్,మాంగనీసు, సోడియం, పోటాషియం, బేరియం, అల్యుమినియం, కాడ్మియం, ఫాస్ఫరస్, వంటి పదార్థాలు ఉంటాయి.ఇవి జ్వరం ,వణుకు,కండరాల బలహీనత, నీరసమ్, దురదలు, ఎముకలు పెలుసు బారడం, దీర్ఘకాలం లో గుండె ,మెదడు, లివర్,కిడ్నీలకు హాని,పక్శ్ఃఅవాతం వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.బాణాసంచా పొగ వలన ఎక్కువగా పిల్లలు, వ్రుద్ధులు ఇబ్బంది పడతారు. భారత్ లో ఆయు కాలుష్యం ఏకంగా ౫౦ శాతం దీపావళి తర్వాత పెరుగుతున్నట్లు శాస్త్ర వేత్తల అంచనా

శబ్ద కాలుష్యంసవరించు

భారీ శబ్దాలు చేసే బాణాసమ్చా పేలుళ్ళ వలన గుండె దడ, నిద్ర లేమి, మానసిక ఆమ్దోళన వమ్టి సమస్యలు తలెత్తుతాయి.పెంపుడు జంతువులు ఆమ్దీళణ చెంది అస్తిమితంగా ఉంటాయి.వీధుల్లో సంచరించే పశు పక్శ్యాదులదీ అదే పరిస్తితి.పక్షులలో శబ్దాలకు మరణించే పరిస్థితి కూడా ఉంది.

నీటి కాలుష్య ప్రమాదంసవరించు

బాణా సంచా తయారీ లో విపరీతంగా ఉపయోగించే పెర్క్లోరేట్ రసాయణాలు నీళ్ళలో కరిగి,నదులను,సరస్సు లను కాలుష్య కాసారాలుగా మారుస్తాయి. తాగునీరు,సాగునీరు రెండూ కలుషిత మౌతున్నాయి.

హరిత దీపావళిసవరించు

బాణాసంచా లో పర్యావరణానికి ఎక్కు వ హాని కలిగించేది బేరియం నైట్రేట్ దానికి బదులు గా పొటాషియం నైట్రెట్ ను జియోలైట్ ను కలిపి వాడడం అనెది ముఖ్హమైన మార్పు. దీని అభివృద్ధి పరచడం లో కీలక పాత్ర వహిమ్చింది నాగపూర్ కేంద్రంగా గల జాతీయ పర్యవరణా శాస్త్ర సంస్థ, ఇది సి ఎస్ ఐఆర్ లో భాగము. బాణాసంచా లో ముఖ్హ్యమైన ది చిచ్చు బుడ్డి దీనిని నీరు సున్నపు రాయి(కల్సియం కార్బోనేట్) తో తయారు చేస్తున్నారు.[2]

అపోహసవరించు

వానా కాలం ముగింపు లో వచ్చే దీపావళి లో బాణాసంచా కాల్చడం వలన క్రిమి కీటకాలు నశిస్తాయని శతాబ్దాలుగా విశ్వసించేవారు. ఐతే వాయు కాలుష్యం గురించి ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతూ ఉంది.

మూలాలుసవరించు

బాహ్య లింకులుసవరించు