2 కంట్రీస్
2 కంట్రీస్ (రెండు దేశలు) 2017, డిసెంబరు 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, మనీషా రాజ్ నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు. కన్నడలో హిట్ అయిన 2 కంట్రీస్ సినిమాకు ఇది రిమేక్.
2 కంట్రీస్ | |
---|---|
![]() 2 కంట్రీస్ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ఎన్. శంకర్ |
నిర్మాత | ఎన్. శంకర్ |
తారాగణం | సునీల్ మనీషా రాజ్ |
ఛాయాగ్రహణం | సి. రామ్ ప్రసాద్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | మహాలక్షి ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2017 డిసెంబరు 29 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా నేపథ్యం సవరించు
పల్లెటూరి కుర్రాడైన ఉల్లాస్ (సునీల్) బాధ్యత లేకుండా ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తూ, డబ్బు సంపాదించటం కోసం తన స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుంటాడు. ఒక రౌడీ దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక రెండు కాళ్ళులేని వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. కానీ అదే సమయంలో ఫారిన్ లో సెటిలైన తన చిన్ననాటి స్నేహితురాలు లయ (మనీషా రాజ్)తో పరిచయం అవుతుంది. ఆమెకు చెందిన కోట్ల ఆస్తి కోసం లయను పెళ్ళి చేసుకుంటాడు.
చిన్నతనంలో అమ్మ నాన్నలు విడిపోవటంతో మద్యానికి బానిసయిన లయ, తన అలవాట్లకు అడ్డురాడన్న నమ్మకంతో ఉల్లాస్ ను పెళ్ళి చేసుకుంటుంది. పెళ్ళి తరువాత లయ చెడు అలవాట్ల గురించి నిజం తెలుసుకున్న ఉల్లాస్, లయతో వాటిని మాన్పించి, ఆమెను మామూలు మనిషిని చేయాలనుకుంటాడు. ఉల్లాస్ ప్రేమను లయ అర్థం చేసుకుందా. ఈ ప్రయత్నంలో ఉల్లాస్ ఎలాంటి ఇబ‍్బందులు ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ.[1]
నటవర్గం సవరించు
- సునీల్ (ఉల్లాస్ కుమార్)
- మనీషా రాజ్ (లయ)
- విజయ నరేష్ (మూర్తి)
- పృథ్వీరాజ్ (జిమ్మీ)
- శ్రీనివాస్ రెడ్డి (బోస్)
- రాజా రవీంద్ర (తండ్రి)
- సితార (నటి)
- సంజనా గల్రానీ (తమన్నా-సవతి తల్లి)
- సిజ్జు
- సాయాజీ షిండే
- దేవ్ గిల్
- కృష్ణ భగవాన్
- చంద్రమోహన్
- రాజ్యలక్ష్మీ
- శివారెడ్డి
- ప్రవీణ
- హర్షిత
- శేషు
- చమ్మక్ చంద్ర
- రచ్చ రవి
- ఝాన్సీ
సాంకేతికవర్గం సవరించు
- నిర్మాత, దర్శకత్వం: ఎన్. శంకర్
- సంగీతం: గోపి సుందర్
- ఛాయాగ్రహణం: సి. రామ్ ప్రసాద్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు
- నిర్మాణ సంస్థ: మహాలక్షి ఆర్ట్స్
పాటలు సవరించు
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఉల్లాసంలో (రచన: ఎన్. శంకర్)" | హరిచరణ్, కావ్య | 4:17 | ||||||
2. | "వారెవా డాలర్ బేబి (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | రంజిత్ | 4:42 | ||||||
3. | "చెలియా చెలియా విడిపోకే కలలా (రచన: నందిని సిద్ధారెడ్డి)" | కార్తీక్, అభయ్ | 4:54 | ||||||
4. | "చిరు చిరు నవ్వుల్లో (రచన: శ్రేష్ట)" | సాకేత్ కోమండూరి | 4:46 | ||||||
5. | "హేయ్ పీపుల్ (రచన: నిరంజ్ సురేష్)" | నిరంజ్ సురేష్ | 2:10 | ||||||
18:49 |
మార్కెటింగ్ సవరించు
2017, నవంబరు 24న పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్ విడుదలయింది.[2]
మూలాలు సవరించు
- ↑ ఇండియా గిల్ట్జ్, రివ్యూ (29 December 2017). "2 Countries review". IndiaGlitz.com. Retrieved 26 March 2020.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (24 November 2017). "మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా '2 కంట్రీస్' మూవీ టీజర్ రిలీజ్". Archived from the original on 24 November 2017. Retrieved 26 March 2020.