అమితాబ్ బచ్చన్

సినీ నటుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత
(అమితాభ్ బచ్చన్ నుండి దారిమార్పు చెందింది)

dead

అమితాబ్ బచ్చన్(amitabh bachchan)
Amitabh Bachchan December 2013.png
2013 TeachAIDS ఇంటర్వ్యూ లో బచ్చన్
జననం
అమితాబ్ హరివంశ్ రాయ్ బచ్చన్

(1942-10-11) 1942 అక్టోబరు 11 (వయస్సు 79)
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థషేర్ వుడ్ కళాశాల, నైనిటేల్ కిరోరిమల్ కళాశాల, ఢిల్లీ యూనివర్శిటీ[1]
వృత్తినటుడు, నిర్మాత, గాయకుడు, వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1969–ప్రస్తుతం
జీవిత భాగస్వామిజయ బచ్చన్(1973)
పిల్లలు
తల్లిదండ్రులుహరివంశ్ రాయ్ బచ్చన్
తేజీ బచ్చన్
బంధువులుఅజితాబ్ బచ్చన్(సోదరుడు)
ఐశ్వర్యా రాయ్ బచ్చన్(కోడలు)
పురస్కారాలుIND Padma Vibhushan BAR.png పద్మ విభూషన్ 2015[2]
IND Padma Bhushan BAR.png పద్మభూషణ్ 2001
IND Padma Shri BAR.png పద్మశ్రీ 1984
సంతకం
Amitabhbachchanji signature.svg

అమితాబ్ హరివంశ్ బచ్చన్ (జ.1942 అక్టోబరు 11) భారత సినీ  నటుడు. 1970లలో రిలీజైన జంజీర్, దీవార్ సినిమాలతో ప్రఖ్యాతి  పొందారు. తన పాత్రలతో భారతదేశపు మొదటి "యాంగ్రీ యంగ్ మాన్"గా ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్ లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే  బిరుదులను  కూడా పొందారు[3][4][5][6]. నాలుగు  దశాబ్దాలలో దాదాపు 180 సినిమాలలో పని చేశారు ఆయన[7][8]. భారతీయ సినిమాలో అమితాబ్ అత్యంత ప్రభావవంతమైన నటునిగా ప్రఖ్యాతి గాంచారు[9][10]. 1970, 80లలో అమితాబ్ ఆధిపత్యం కొనసాగింది[11][12][13]. అప్పట్లో ఫ్రెంచి దర్శకుడు ఫ్రాంన్సిస్ ట్రుఫట్ భారతీయ సినిమాని "ఒన్ మాన్ ఇండస్ట్రీ"గా అభివర్ణించారు[14][15].

ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డ్ వేడుకల్లోనూ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు అమితాబ్. 15 ఫిలింఫేర్ అవార్డులు గెలుపొందారు.  ఉత్తమ నటుడు కేటగిరీకిగాను 40సార్లు నామినేట్ అయి ఫిలింఫేర్ కు అతి ఎక్కువ సార్లు నామినేట్ అయిన నటుడు కూడా బచ్చనే. నటునిగానే కాక, నేపధ్య గాయునిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు ఆయన. 1980లలో రాజకీయాలలో కూడా క్రీయాశీలకంగా పనిచేశారు అమితాబ్.

1984లో భారత ప్రభుత్వం అమితాబ్ ను పద్మశ్రీతోనూ, 2001లో పద్మ భూషన్ తోనూ, 2015లో పద్మవిభూషన్ తోనూ గౌరవించింది[16]. 2007లో ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన "లెగియన్ ఆఫ్ హానర్"తో గౌరవించింది[17]

హాలీవుడ్ లో మొదటిసారి 2013లో "ది గ్రేట్ గేట్స్బే" అనే సినిమాతో అడుగుపెట్టారు బచ్చన్. జ్యియిష్ వ్యక్తి మేయర్ వోల్ఫ్ షిం అనే పాత్రలో నటించారయన. 

తొలినాళ్ళ, వ్యక్తిగత జీవితంసవరించు

ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్లో జన్మించారు బచన్[18]. వీరి పూర్వీకులు ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ జిల్లా, రాణీగంజ్ తాలూకా బబుపట్టి గ్రామానికి చెందినవారు[19][20]. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ శ్రీవాస్తవ (బచ్చన్) హిందీ కవి. ఆయన తల్లి తేజి బచ్చన్ పంజాబీ సిక్కు. ఆమెది పంజాబ్ రాష్ట్రంలోని లయల్ పూర్  పట్టణం[21]. అమితాబ్ అసలు పేరు ఇంక్విలాబ్. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదానికి ఆకర్షితులైన హరివంశ్అమితాబ్ కు ఆ పేరు పెట్టారు.ఈ నినాదానికి తెలుగులో "విప్లవం వర్ధిల్లాలి "అనే అర్ధం. తన స్నేహితుడు, కవి అయిన సుమిత్రానందన్ పంత్  సూచన మేరకు అమితాబ్ అని తిరిగి పేరు మార్చారు హరివంశ్. అమితాబ్ ఇంటిపేరు శ్రీవాస్తవ అయినా, హరివంశ్ కలం పేరు అయిన బచ్చన్ వారి ఇంటి పేరుగా మారింది. అమితాబ్ తండ్రి 2003లో, తల్లి 2007లో చనిపోయారు[22]

నైనిటేల్ లోని షేర్ వుడ్ కళాశాలకు అమితాబ్ పూర్వ విద్యార్థి. తరువాత దిల్లీ విశ్వవిద్యాలయానికీ చెందిన కిరోరిమల్ కళాశాలలో చదువుకున్నారు[23]. ఆయన తమ్ముడు పేరు అజితాబ్. అమితాబ్ తల్లికి నటన అంటే ఇష్టం. ఆమె నాటకాల్లో నటించేవారు. ఆమెకు ఒక సినిమా అవకాశం కూడా వచ్చింది. కానీ ఆమె గృహిణిగా ఉండటానికే ఇష్టపడ్డారు. అమితాబ్ కు సినిమాలపై ఆసక్తి కలగడానికి ఆయన తల్లి తేజీ ప్రోత్సాహం చాలా ఉంది.[23]

అమితాబ్ తన సహ నటి జయ బచ్చన్ ను పెళ్ళి చేసుకున్నారు.  వీరికి ఇద్దరు  పిల్లలు శ్వేత నందా, అభిషేక్ బచ్చన్.

కెరీర్సవరించు

తొలినాళ్ళు: 1969–1972సవరించు

అమితాబ్ 1969లో భువన్ షోం అనే సినిమాలో నేపథ్య కథకునిగా మొదటి సారి పరిచయం అయ్యారు. మృణిల్ సేన్ తీసిన ఈ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది[24]. నటునిగా మాత్రం సాత్ హిందుస్తానీ ఆయన మొదటి సినిమా. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏడుగురు ప్రధానపాత్రల్లో ఒకరిగా చేశారు అమితాబ్[25][26].

రెండో సినిమా ఆనంద్ (1971) లో రాజేష్ ఖన్నాతో కలసి చేసిన అమితాబ్ ఆ సినిమాలో వైద్యునిగా నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకుగానూ ఉత్తమ సహాయనటునిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తరువాత పర్వానా (1971) సినిమాలో మొదటిసారిగా ప్రతినాయకునిగా నటించారు. ఈ సినిమా తరువాత రేష్మా ఔర్ షేరా (1971) లో కూడా విలన్ పాత్రే పోషించారు. ఈ సమయంలోనే గుడ్దీ సినిమాలో అతిథిపాత్రలో నటించారు. బావర్చి సినిమాలో కూడా ఒక ప్రత్యేక పాత్ర చేశారు. 1972లో ఎస్.రామనాధన్ దర్శకత్వం వహించిన బాంబే టు గోవా సినిమాలో నటించారు అమితాబ్[27].

తారాపథంలోకి: 1973–1983సవరించు

దస్త్రం:BigB N JayaB.jpg
2013లో అమితాబ్, భార్య జయ బచ్చన్. 1973లో జంజిర్ సినిమా తరువాత వీరు పెళ్ళి చేసుకున్నారు.

అప్పటిదాకా రొమాంటిక్ హీరోగా కొనసాగుతున్న అమితాబ్ ను డైరక్టర్ ప్రకాశ్ మెహ్రా  జంజిర్ (1973) లో విజయ్ ఖన్నా పాత్రలో యాంగ్రీ యంగ్ మాన్ ఆఫ్ ఇండియాగా కొత్త పర్సోనా నిర్మించారు. ఫిలింఫేర్ అమితాబ్ పెర్ఫార్మెన్సెస్ ను ఐకానిక్ గా అభివర్ణించింది. ఆ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమానే కాదు, అమితాబ్ ను స్టార్ ను చేసిన సినిమా కూడా. ఈ సినిమాలోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ  నటునిగా మొట్టమొదటి అవార్డు అందుకున్నారు. 1973లో విడుదలైన జంజీర్ లోనే కాక వారి వివాహం తరువాత అభిమాన్ వంటి చాలా సినిమాల్లో జయ, అమితాబ్ జంటగా తెరపై కనిపించారు.  అభిమాన్ వారి వివాహం అయిన నెల తరువాత విడుదలై విజయం  సాధించింది. మరొకసారి రాజేష్ ఖన్నాతో నమక్ హరామ్ సినిమాలో  విక్రమ్ పాత్రలో కనిపించిన అమితాబ్ ఉత్తమ సహాయనటునిగా రెండో ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, బీరేశ్ చటర్జీ స్క్రిప్ట్ అందించారు.

1974లో అమితాబ్ కుంవారా బాప్, దోస్త్ వంటి సినిమాలలో అతిథిపాత్రలు పోషించారు. రోటీ కపడా ఔర్ మకాన్ సినిమాలో సహాయ నటుని పాత్ర కూడా వేశారు అమితాబ్. నిజాయితీ, ఆర్థిక అసమానతల అణచివేత ముఖ్యాంశంగా వచ్చిన ఈ సినిమాను మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1974లో అతి ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన సినిమా ఇది. 1974 డిసెంబరు 6న విడుదలైన మజ్బూర్  సినిమాలో అమితాబ్ ప్రధాన పాత్ర పోషించారు. హాలివుడ్ సినిమా జిగ్ జాగ్ కు రీమేక్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్[28]. 1975లో వివిధ రకాలైన జోనర్ లలో సినిమాలు చేశారు బచ్చన్. చుప్కే చుప్కే కామెడీ, ఫరార్ క్రైం డ్రామా, మిలీ రొమాంటిక్ డ్రామా లతో అమితాబ్ అలరించారు. 1975 బాలీవుడ్ చరిత్రలోనూ, అమితాబ్ కెరీర్ లోనూ అత్యంత భారీ హిట్లను అందించిన సంవత్సరం. ఆ సంవత్సరంలో అమితాబ్ నటించిన దీవార్, షోలే సినిమాలు భారతీయ సినిమా చరిత్రలో   చెప్పుకోదగ్గ మలుపు. యశ్ చోప్రా దర్శకత్వం వహించిన దీవార్ సినిమాలో శశికపూర్, నిరూపా రాయ్, నీతూ సింగ్ లతో నటించారు అమితాబ్. ఈ సినిమాలోని నటనకుగానూ ఫిలింఫేర్ ఉత్తమ నటుని అవార్డు అందుకున్నారాయన. బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద హిట్ గా నిలిచిందీ  చిత్రం[29]. ఇండియా టైంస్ ఈ సినిమాను తప్పక చూడాల్సిన బాలీవుడ్ 25 చిత్రాల జాబితాలో ఒకటిగా పేర్కొంది[30]. ఆగస్టు 15న విడుదలైన  షోలే సినిమా 1975 సంవత్సరానికే కాక, మొత్తం భారతదేశంలోనే అతి  ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 2, 364, 500, 000  రూపాయలు (60 మిలియన్ డాలర్లు) వసూలు చేసిందీ సినిమా[31]. ఈ సినిమాలో అమితాబ్ జయ్ దేవ్ పాత్రలో కనిపించారు. 1999లో బిబిసి ఇండియా ఈ సినిమాను "ఫిలిం ఆఫ్ ద మిలీనియం" గానూ, ఇండియా టైంస్ తప్పక చూడాల్సిన 25 బాలీవుడ్ సినిమాల జాబితాలో చేర్చింది[30]. అదే సంవత్సరంలో ఫిలింఫేర్ 50వ వార్షికోత్సవాల సందర్భంగా  షోలే సినిమాకు ఫిలింఫేర్ బెస్ట్ ఫిలిం ఆఫ్ 50 ఇయర్స్  అవార్డు  ఇచ్చింది.

1976లో, యశ్ చోప్రా దర్శకత్వం వహించిన రొమాంటిక్ మూవీ కభీ కభీతో ఎటువంటి పాత్రలైన చేయగలనని నిరూపించుకున్నారు అమితాబ్. ఈ సినిమాలో యువకవి అమిత్ మల్హోత్రా పాత్రలో కనిపించారాయన. అప్పటిదాకా వచ్చిన యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలకు పూర్తి విరుద్ధంగా ఉండి, రొమాంటిక్ హీరోగా నటించిన అమితాబ్ కు ప్రేక్షకుల నుండే కాక, విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ఈ సినిమకు గాను ఆయనను ఫిలింఫేర్ ఉత్తమ నటుని అవార్డుకు నామినేషన్ లభించింది. అదే సంవత్సరంలో అదాలత్ అనే  సినిమాలో తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు అమితాబ్. 1977లో అమర్ అక్బర్ ఆంతోనియా సినిమాలోని ఆంతోనియా పాత్రలో అయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటునిగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో వినోద్ ఖన్నా, రిషికపూర్ లతో కలసి నటించారాయన. ఆ సంవత్సరంలో ఈ సినిమా అత్యధిక వసూళ్ళు గెలిచింది. అదే సంవత్సరంలో పర్వరిష్, ఖూన్ పసీనా వంటి హిట్ సినిమాల్లో కూడా నటించారు[32].1978లో కసమే వాదే, డాన్ సినిమాలలో మళ్ళీ ద్విపాత్రాభినయం చేశారు అమితాబ్. కసమే వాదేలో అమిత్, శంకర్ పాత్రలు, డాన్ సినిమాలో అండర్ వరల్డ్ గ్యాంగ్ లీడర్, విజయ్ పాత్రలు నటించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలందుకున్నారు అమితాబ్. యశ్ చోప్రా దర్శకత్వం వహించిన త్రిశూల్, ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన మక్దూర్ కా సికిందర్ సినిమాలలోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుని నామినేషన్లు లభించాయి.

1979లో అమితాబ్ సుహాగ్ సినిమాలో నటించారు. ఆ సంవత్సరానికి ఆ సినిమా అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించింది. అదే సంవత్సరంలో ఆయన చేసిన మిస్టర్.నట్వర్ లాల్, కాలా పత్తర్, ది గ్రేట్ గేంబ్లర్ సినిమాలు కమర్షియల్ గా హిట్ కావడంతో పాటు, విమర్శకల ప్రశంసలు కూడా పొందారు. నటి రేఖ తో కలసి ఆయన చేసిన మిస్టర్. నట్వర్ లాల్  సినిమాలో మొదటిసారి గాయకుని అవతారం ఎత్తారు అమితాబ్. ఈ సినిమాకి గానూ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు కేటగిరిల్లో నామినేషన్లు లభించాయి. కాలా పత్తర్ కు కూడా ఉత్తమ నటుని నామినేషన్ వచ్చింది. 1980లో రాజ్ కోస్లా దర్శకత్వం  వహించిన దోస్తానా సినిమాలో శతృజ్ఞ సిన్హా, జీనత్ అమన్ లతో కలసి నటించిన అమితాబ్ ఆ చిత్రంలోని నటనకు కూడా ఉత్తమ నటుని నామినేషన్ దక్కించుకున్నారు. ఈ సినిమా 1980లో అతి ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రం[33]. 1981లో యశ్ చోప్రా దర్శకత్వం వహించిన సిల్ సిలా సినిమాలో తన భార్య జయరేఖ లతో కలసి నటించారు. 80లలో షాన్ (1980), శక్తి (1982) సినిమాలు నిరాశ మిగిల్చినా, రాం బలరాం (1980), నసీబ్ (1981), లారిస్ (1981) సినిమాలు హిట్ అయ్యాయి[34].

1982లో ఆయన చేసిన రెండు ద్విపాత్రాభినయ సినిమాలు సత్తే పే సత్తే, దేశ్ ప్రేమ్ విజయం సాధించాయి.[35] 1983లో మహాన్ చిత్రంలో త్రిపాత్రాభినయం కూడా చేశారు అమితాబ్. 1983లో ఆయన నటించిన కూలీ సినిమా ఆ సంవత్సరంలోనే అతి ఎక్కువ వసూళ్ళు సాధించింది.[36]

1982 కూలీ సినిమా సమయంలో గాయంసవరించు

1982 జూలై 26న కూలీ సినిమా కోసం బెంగుళూరు విశ్వవిద్యాలయ  క్యాంపస్ లో సహనటుడు పునీత్ ఇస్సార్ తో కలసి షూటింగ్  చేస్తుండగా పేగుకు ప్రాణాంతకమైన గాయం తగిలింది[37]. మొదట ఒక టేబుల్ పై పడి, ఆక్కడి నుంచి నేలపై పడే స్టంట్ లో అమితాబ్ బల్లపైకి దూకగానే బల్ల చివరి భాగం కడుపులో గుచ్చుకు పోవడంతో లోపలి పేగు చీలిపోవడంతో రక్తస్రావం అయింది. చావుకు దగ్గరగా వెళ్ళి వెనక్కి వచ్చిన అమితాబ్ చాలా నెలలు ఆసుపత్రిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఈ సమయంలో ఆయన అభిమానులు పూజలు, ప్రార్థనలు చేసి, ఆసుపత్రి బయట ఆయనను చూడటం కోసం క్యూలలో వేచి ఉండేవారు.[38] 

కోలుకున్నాకా ఒక సంవత్సరం తరువాత ఆ సినిమా చేయడం ప్రారంభించారు. 1983లో విడుదలైన ఈ సినిమా విపరీతమైన ప్రచారం వల్ల సినిమా అతి పెద్ద హిట్ అయింది. ఆ సంవత్సరంలో అతి ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది.[36]

నిజానికి కూలీ సినిమా చివర్ల్ అమితాబ్ పాత్ర మరణిస్తుంది. కానీ ఈ ఘటన తరువాత దర్శకుడు మన్మోహన్ దేశాయ్ స్క్రిప్ట్ ను మార్చి, అమితాబ్ పాత్రను బతికించేశారు. ఈ విషయమై దేశాయ్ ను అడగగా నిజజీవితంలో అప్పుడే మృత్యు ఒడిలో నుండి బయటకు వచ్చిన ఆయనను సినిమాలో చంపడం తప్పు కాబట్టే స్క్రిప్ట్ మార్చానని వివరించారు. ఈ సినిమా రిలీజైన తరువాత అమితాబ్ కు దెబ్బ తగిలిన సీన్ ను ఫ్రీజ్ చేసి చూపించి, ప్రచారం చేశారు.

ఆ తరువాత ఆయన నరాల బలహీనతతో బాధపడ్డారు. వ్యాధి వల్ల శారీరికంగానే కాక, మానసికంగానూ బలహీనపడ్డ అమితాబ్ సినిమాలు వదలి, రాజకీయాలలోకి రావాలనే నిర్ణయం తీసుకున్నారు. సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని ప్రేక్షకులు అనుకుంటున్నారనే అపోహకు వచ్చారాయన.[39]

రాజకీయాలు: 1984–87సవరించు

1984లో, అమితాబ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తమ ఫ్యామిలీ ఫ్రెండ్ రాజీవ్ గాంధీ కి మద్దతుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్.ఎన్.బహుగుణ కు వ్యతిరేకంగా అలహాబాద్ నుంచి లోక్ సభకు పోటీ నిలబడ్డారు ఆయన. సాధారణ ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా 68.2శాతం ఆధిక్యంతో గెలిచారు అమితాబ్.[40] కానీ ఆయన మూడేళ్ళకే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేశాకా ఒక పత్రిక అమితాబ్ ఆయన తమ్ముడును బోఫోర్స్ స్కాండిల్ లో నేరస్థులుగా ప్రకటించింది. దీనిపై అమితాబ్ కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆయనను, ఆయన తమ్ముణ్ణి నిర్దోషులుగా ప్రకటించింది.[41] 

ఎబిసిఎల్ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు అమితాబ్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు అమర్ సింగ్ ఆయనకు అండ నిలిచారు. ఆ కృతజ్ఞతతో అమర్ స్వంత పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీకి మద్దతిచ్చారు అమితాబ్. జయ కూడా సమాజ్ వాదీ పార్టీలో చేరి, రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.[42] ఆ తరువాత చాలాకాలం అమితాబ్ సమాజ్ వాదీ పార్టీకి సహాయాలు చేస్తూ వచ్చారు. ఆ పార్టీ ప్రకటనల్లో, రాజకీయ ప్రచారంలోనూ విస్తృతంగా పాల్గొనేవారు. కానీ కొన్ని రోజుల తరువాత తన పేరుపైన రైతుగా నకలీ లీగల్ పేపర్లు సృష్టించబడ్డాకా, కారణం ఆ పార్టీనే అని తెలుసుకున్న అమితాబ్ దూరంగా ఉండటం మొదలుపెట్టారు.[43]

ఈ సంఘటన తరువాత స్టార్ డస్ట్ వంటి పత్రికలు అమితాబ్ వార్తలపై 15ఏళ్ల నిషేధం విధించాయి. దీనికి నిరసనగా తన సెట్లలోకి ప్రెస్ ను నిషేధించారు ఆయన.[44]

రిటైర్ మెంట్: 1988–1992సవరించు

1988లో అమితాబ్ షెహెన్ షా సినిమాతో తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.[45] ఈ సినిమా విజయం మిగిలిన సినిమాలపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. 1989లో విడుదలైన జాదూగర్, తూఫాన్, మే ఆజాద్ హూ సినిమాలు అపజయాల పాలయ్యాయి. 1991లో విడుదలైన హమ్ చిత్రం హిట్ అవ్వడమే కాక, కెరీర్ లోనే మూడవ ఫిలింఫేర్ ఉత్తమ నటుని అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయంతో కెరీర్ నిలుస్తుందన్న నమ్మకం పెట్టుకున్న అమితాబ్ ను తరువాత వరుస అపజయాలు నిరాశ పరిచాయి. కానీ 1990లో అగ్నిపథ్ సినిమాలో డాన్ పాత్రలో ఆయన నటనకు మొదటి జాతీయ ఉత్తమ నటుని అవార్డు లభించింది. 1992లో ఖుడా గవా, 1993లో ఇన్ సానియత్ సినిమాల తరువాత అమితాబ్ 5ఏళ్ళ పాటు సినిమాల్లో కనిపించలేదు.[46] 

నిర్మాతగా, తిరిగి నటనలోకి... 1996–99సవరించు

అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎబిసిఎల్) పేరుతో 1996లో నిర్మాణ సంస్థ స్థాపించారు అమితాబ్. 2000 సంవత్సరానికల్లా 10 బిలియన్ రూపాయలు సంపాదించాలన్న ఆశయంతో స్థాపించబడిందా సంస్థ. భారతీయ వినోద పరిశ్రమలో అన్ని రంగాలను అందించాలన్న ఆశయం ఉందీ సంస్థకు. కమర్షియల్ సినిమాలు తీయడం, డిస్ట్రిబ్యూషన్, ఆడియో కేసట్లు, వీడియో డిస్కులు తయారీ, అమ్మకాలు, ఈవెంట్ మేనేజ్ మెంట్, టివి సాఫ్ట్ వేర్ అమ్మకాలు చేయడం ఈ సంస్థ కార్యకలాపాలు. 1996లో ఈ సంస్థ ప్రారంభమైన తరువాత తీసిన మొదటి చిత్రం తేరే మేరే సప్నే పరాజయం పాలైంది. ఈ సినిమాతో అర్షద్ వార్సీ, దక్షిణాది నటి సిమ్రాన్ లను బాలీవుడ్ కు పరిచయం చేశారు. ఈ సంస్థ నిర్మించిన ఇతర సినిమాలు కూడా పెద్దగా హిట్ కాలేదు.

1997లో స్వంత సంస్థ నిర్మాణంలో మృత్యుదూత సినిమాతో తిరిగి నటించారు అమితాబ్. ఈ సినిమా ఆర్థికంగా పరాజయం కావడమే కాక, విమర్శకుల నుంచి వ్యతిరేకతను కూడా మూటకట్టుకున్నారు ఆయన. బెంగుళూరులో నిర్వహించిన 1996 మిస్ వరల్డ్ పోటీలకు ఎబిసిఎల్ ప్రధాన స్పాన్సర్. ఈ పోటీలు సంస్థకు భారీ నష్టాలు మిగిల్చాయి. ఈ పోటిల వల్ల సంస్థ ఎన్నో చట్టపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంది. మేనేజర్లకు ఎక్కువ పారితోషికం ఇవ్వడం వివాదాస్పదమవ్వడమే కాక, ఆర్థికంగా నష్టాల్లోకి జారిపోయింది. భారత పరిశ్రమల బోర్డు ఈ సంస్థను నష్టపోయిన సంస్థగా ప్రకటించింది. 1999లో బాంబే హైకోర్టు ఆయనకు బాంబేలో ఉన్న బంగళా ప్రతీక్ష, రెండు ఫ్లాట్లు అమ్మకుండా నియంత్రణ విధించింది. కానీ కెనెరా బ్యాంక్ కు అప్పులు తీర్చేందుకు తన బంగళా తనఖా రేటును పెంచారని అమితాబ్ పై ఆరోపణలు వచ్చాయి.[47] 

1998లో మియాన్ చోటే మియాన్ సినిమాతో తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టారు అమితాబ్. ఈ సినిమా అవరేజ్ హిట్ గా నిలిచింది.[46] సూర్యవంశం (1999) సినిమా కూడా అనుకూల సమీక్షలు అందుకుంది.[48] కానీ 1999లో విడుదలైన లాల్ బాద్షా, హిందుస్తాన్ కీ కసమ్ సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి.

తిరిగి విజయపథంలోకి: 2000–ప్రస్తుతంసవరించు

 
2006 ఇఫా అవార్డ్ ల్లో అమితాబ్
 
మోహన్ లాల్ తో అమితాబ్

2000లో యశ్ చోప్రా నిర్మించి, ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన మొహొబ్బతే సినిమాలో నటించారు అమితాబ్. ఈ సినిమా మంచి విజయం నమోదు చేసుకుంది. ఈ సినిమాలో దృఢమైన వ్యక్తిత్వం గల పెద్ద వయసు పాత్రలో, షారుఖ్ ఖాన్తో కలసి నటించారు  ఈ సినిమాలోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డ్ అందుకున్నారు. పెద్ద వయసు పాత్రల్లో ఆయన నటించిన ఏక్ రిష్తా:ద బాండ్ ఆఫ్ లవ్ (2001), కభీ ఖుషీ కభీ గమ్ (2001), బగ్బాన్ (2003) సినిమాలు కూడా మంచి హిట్లు. అక్స్ (2001), ఆంఖే (2002), ఖాకే (2004), దేవ్ (2004) సినిమాలలోని ఆయన నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. అక్స్ సినిమా ద్వారా ఫిలింఫేర్ విమర్శకుల ఉత్తమ నటుని అవార్డు అందుకున్నారు అమితాబ్. 2005లో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో నటించిన బ్లాక్ సినిమాలో చెవిటి-గుడ్డి అమ్మాయికి టీచర్ పాత్రలో ప్రేక్షకులనే కాక, విమర్శకులను కూడా మెప్పించారు అమితాబ్. ఈ సినిమా కమర్షియల్ గా కూడా పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన కెరీర్ లో రెండో జాతీయ ఉత్తమ నటుడు, నాల్గవ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, రెండో ఫిలింఫేర్ విమర్శకుల ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. ఆ తరువాత ఎన్నో టెలివిజన్ ప్రకటనల్లో కనిపించారాయన. 2005, 2006ల్లో, తన కుమారుడు అభిషేక్ బచ్చన్ తో కలసి బంటీ అవుర్  బబ్లీ (2005), కభీ అల్విదా నా కెహ్నా (2006) వంటి సినిమాల్లో నటించారు అమితాబ్. ఈ రెండు సినిమాలూ మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి.[49][50] తరువాత ఆయన నటించిన బాబుల్ (2006,[51] ఏకలవ్య (2007), నిశ్శబ్ద్ (2007) సినిమాలు ఆర్థికంగా విజయం సాధించకపోయినా, ఈ సినిమాల్లో ఆయన నటన విమర్శకుల ప్రశంశలు అందుకున్నారు.[52]

మే 2007లో, చీనీకమ్, షూట్ అవుట్ ఎట్ లఖండ్ వాలా సినిమాల్లో నటించారు ఆయన. ఈ రెండు మల్టీ స్టారర్ సినిమాలు. చీనీకమ్ ఏవరేజ్ హిట్ అయినా, షూట్ అవుట్ ఎట్ లఖండ్ వాలా సినిమా మాత్రం మంచి విజయం సాధించింది.[53] గతంలో ఆయన చేసిన షోలే (1975) సినిమాను రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో రాం గోపాల్ వర్మకీ ఆగ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా కమర్షియల్ గా అతిపెద్ద ఫ్లాప్  కావడమే కాక, విమర్శకుల నుండి తీవ్ర విమర్శలు కూడా అందుకుంది.అదే సంవత్సరంలో ఆంగ్ల భాషా చిత్రం ద లాస్ట్ లీర్ చిత్రంలో అర్జున్ రాంపాల్, ప్రీతీజింటాలతో కలసి నటించిన అమితాబ్ ఈ సినిమాలోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.[54] ఈ సినిమాను ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించారు. 2007 టోర్నొటో అంతర్జాతీయ  ఫిలిం ఫెస్టివల్ లో 2007 సెప్టెంబరు 9న ప్రదర్శింపబడింది ఈ చిత్రం. మొట్టమొదటి అంతర్జాతీయ చిత్రం శాంతారాంలో సహాయనటునిగా నటించేందుకు ఒప్పుకున్నారు అమితాబ్. మీరా నాయర్ దర్శకత్వంలో జానీ డేప్ హీరోగా రావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ మొదలు కాలేదు. మొదట ఫిబ్రవరి 2008లో మొదలుకావాల్సిన ఈ సినిమా, సెప్టెంబరు 2008కి వాయిదా పడింది.[55] ఆ తరువాత ఈ సినిమా నిరువధిక  వాయిదా పడింది.[56] వివేక్ శర్మ దర్శకత్వంలో 2008 మే 9న విడుదలైన భూత్ నాధ్ సినిమాలో ఆత్మగా టైటిల్ పాత్రలో అమితాబ్ నటించారు. 2005లో విడుదలైన సర్కార్ సినిమాకు 2008లో సీక్వెల్ గా వచ్చిన సర్కార్ రాజ్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. 2009లో విడుదలైన పా సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో ప్రొగీరియా వ్యాధి సోకిన 13ఏళ్ళ బాలుడిగా అమితాబ్ నటన విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలనందుకుంది. ఈ చిత్రంలో తన స్వంత కొడుకు అభిషేక్ కు కొడుకుగా నటించారు ఆయన. ఈ సినిమాలోని ఆయన నటనకుగానూ మూడవ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, 5వ ఫిలింఫేర్ ఉత్తమ నటుని అవార్డు అందుకున్నారు అమితాబ్. 2010లో మేజర్ రవి దర్శకత్వంలో, మోహన్ లాల్ తో కలసి కందహర్ సినిమా ద్వారా మలయాళంలో మొదటి సారి నటించారు ఆయన.[57] భారతీయ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాకు అమితాబ్ పారితోషికం తీసుకోకుండా నటించారు.[58] 2013లో హాలీవుడ్ లో ది గ్రేట్ గాట్స్బే సినిమాలో ప్రత్యేక పాత్రలో మొదటిసారి కనిపించారు ఆయన. లినార్డో డికాప్రో, టోబే మాగ్రీలతో కలసి ఈ సినిమాలో నటించారు. 2014లో భూత్ నాథ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన భూత్ నాథ్ రిటర్న్స్ లో స్నేహపూర్వక దెయ్యంగా నటించారు. 2015లో విడుదలైన పీకు సినిమాలో దీర్ఘకాలిక మలబద్ధకం వల్ల కోపిష్టి అయిన తండ్రి పాత్రలో నటించారు అమితాబ్. ఈ సినిమా ద్వారా నాల్గవ జాతీయ ఉత్తమ నటుడు, మూడవ విమర్శకుల ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు.

బుల్లితెర కెరీర్సవరించు

 
కెబిసి-5 ప్రెస్ మీట్ లో అమితాబ్

2000లో, అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి (కెబిసి) మొదటి సీజన్ కు యాంకర్ గా వ్యవహరించారు. ఈ షో బ్రిటిష్ బుల్లితెర గేమ్ షో "హూ వాంట్స్ టు బి మిలీనియర్"కు భారతీయ అనుసరణ. ఈ షో చాలా పెద్ద హిట్ అయింది.[59] 2005లో వచ్చిన రెండో సీజన్ ను అమితాబ్ అనారోగ్యం పాలవ్వడంతో 2006లో స్టార్ ప్లస్ అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది.[60]

2009లో, రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించారు అమితాబ్.[61] In 2009, Bachchan hosted the third season of the reality show Bigg Boss.[61]

2010లో కెబిసి నాల్గవ సీజన్ కు హోస్ట్ గా వ్య్వహరించారు. ఈ షో అయిదవ సీజన్ 2011 ఆగస్టు 15లో మొదలై, 2001 నవంబరు 17లో ముగిసింది. ఈ షో అత్యధిక టి.అర్.పి రేటింగ్స్ సాధించి చాలా పెద్ద హిట్ అయింది. సి.ఎన్.ఎన్ ఐ.బి.ఎన్ కెబిసి టీంకు, అమితాబ్ కు ఇండియన్ ఆఫ్ ద ఇయర్-ఎంటర్ టైన్మెంట్ అవార్డు ప్రదానం చేసింది. ఈ షో దాని కేటగిరీలీ చాలా ఇతర అవార్డులను గెలుచుకుంది.

కెబిసి-6ను కూడా అమితాబ్ హోస్ట్ చేశారు. ఈ షో 2012 సెప్టెంబరు 7న సోనీ టివిలో ప్రసారమైంది. ఈ షో అతి ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన షోగా నిలిచింది.[62]

2014లో సోని టివిలో యుధ్ ధారావాహికలో టైటిల్ పాత్రలో నటించారు అమితాబ్. వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య నలిగే వ్యాపారవేత్త పాత్ర పోషించారు ఈ ధారావాహికలో అమితాబ్.[63]

2010 ఫిబ్రవరి 1 నుంచి అమితాబ్ గుజరాత్ పర్యాటానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

గాత్రంసవరించు

 
2013లో ఓ ఫంక్షన్ లో మాట్లాడుతున్న అమితాబ్

లోతైన, బరువైన గాత్రం అమితాబ్ ది. వ్యాఖ్యాతగా, నేపథ్య గాయకునిగా, చాలా షోలకు యాంకర్ గా చేశారు.[64][65][66] 1977లో సత్యజిత్ రే  సినిమా షత్రంజ్ కే ఖిలారీ సినిమాలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు అమితాబ్. సత్యజిత్ రేకు అమితాబ్ గాత్రం అంటే చాలా ఇష్టం.[67] 2001లో లగాన్ సినిమాలో కూడా వ్యాఖ్యాతగా మాట్లాడారు ఆయన. ఈ సినిమా చాలా పెద్ద హిట్.[68] ఆస్కార్ గెలుచుకున్న ఫ్రెంచి డాక్యుమెంటరీ మార్చి ఆఫ్ ది పెంగ్విన్స్ కు తన గాత్రం అందించారు అమితాబ్. ఈ సినిమాను జుక్ జాక్వెట్ దర్శకత్వం వహించారు.[69] 

ఆయన గాత్రం అందించిన పలు సినిమాలు:

 • బాలికా బదు (1975)
 • తేరే మేరే సప్నే (1996)
 • లగాన్ (2001)
 • పరిణీత (2005)
 • జోధా అక్బర్ (2008)
 • స్వామి (2007) [68]
 • జోర్ లగా కే హై (2009)
 • కహానీ (2012)
 • క్రిష్ 3 (2013)
 • మహాభారత్ (2013)
 • విక్రమసింహ (కొచ్చిడయన్ హిందీ వెర్షన్) (2014)

మానవతా కోణంసవరించు

అమితాబ్ చాలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లో అప్పులు తీర్చలేక, నష్టాల్లో మునిగిపోయిన 40మంది రైతుల రూ.11లక్షల అప్పు తీర్చారు ఆయన.[70] విదర్భకు చెందిన 100 రైతుల అప్పులు తీర్చేందుకు రూ.30లక్షలు విరాళం ఇచ్చారు.[71] 2010లో రెసుల్ పూకుట్టి స్థాపించిన ఫౌండేషన్ కు కొచ్చిలో వైద్య సెంటర్ స్థాపించేందుకు రూ.11లక్షలు విరాళం ఇచ్చారు.[72][73][74] 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ తరువాత జరిగిన అల్లర్లలో మరణించిన ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సుభాష్ చంద్ తోమర్ కుటుంబానికి రూ.2.5లక్షలు విరాళం అందించారు అమితాబ్.[75][76] 2013లో తన తండ్రి పేరు మీద హరివంశ్ రాయ్ బచ్చన్ మెమోరియల్ ట్రస్టును స్థాపించారు ఆయన.[75] 2002లో 1, 556 పోలియో కేసులు నమోదు అయినప్పుడు యునిసెఫ్ పోలియో నివారణ ప్రచారంలో భాగంగా అమితాబ్ ను  ప్రచార రాయబారిగా నియమించింది.[77][78][79] 2014 మార్చి 27లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా గుర్తించడం విశేషం.[80][81][82] 2013లో బాలికల అభ్యున్నతి కోసం పనిచేసే ప్లాన్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు అమితాబ్ కుటుంబం రూ.25లక్షలు విరాళం ఇచ్చారు.[83][84][83] 2013లో మహారాష్ట్ర పోలీస్ సంక్షేమ నిధికి రూ.11లక్షలు విరాళమిచ్చారు అమితాబ్.[85] పులుల రక్షణ కోసం సేవ్ అవర్ టైగర్స్ క్యాంపైన్ కు అమితాబ్ ప్రచార రాయబారి ఆయన.[86]

జంతు సంరక్షకుల స్వచ్ఛంద సంస్థ పెటాకు అమితాబ్ సహాయం అందించారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్ అమ్మవారి గుడిలో బందీగా ఉన్న సుందర్ అనే ఏనుగును విడిపించడానికి ఆ సంస్థ తరఫున ఎంతో కృషి చేశారు ఆయన.[87][88] వీరి ఉద్యమానికి ఫలితంగా ఆ ఏనుగును బెంగళూరులోని బన్నెర్గటా జాతీయ పార్క్ కు పంపినపుడు ట్విట్టర్ లో "పెటా ఇండియా ఏనుగు సుందర్ ను ఫ్రీగా సంచారం చేయగలిగే విధంగా అడవి అంతటి పెద్ద పార్క్ కు పంపించింది. ఈ మంచి కారణానికి నేను కూడా పనిచేయగలగడం చాలా ఆనందంగా ఉంది" అంటూ ఆనందం వ్యక్తం చేశారు అమితాబ్.[87]

2014లో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో హెచ్ ఐవి/ఎయిడ్స్ పై విద్యాపరికరం తయారు చేసినప్పుడు టెక్ ఎయిడ్స్ సాఫ్ట్ వేర్ కు హిందీ, ఆంగ్ల భాషల్లో తన వాయిస్ ను రికార్డ్ చేసి, తన ఫోటోను పంపారు అమితాబ్.[89]

వ్యాపారంలో...సవరించు

అమితాబ్ చాలా వ్యాపార వెంచర్లలో పెట్టుబడులు పెట్టారు. 2013లో జస్ట్ డెయిల్ లో 10శాతం స్టేక్ కొని 4600శాతం లాభం పొందారు. ఆర్థిక విపణి ఉపయోగించే క్లౌడ్ కంప్యూటింగ్ ను డవలప్ చేసే స్టాంపేడ్ క్యాపిటల్ లో 3.4శాతం షేర్ కొన్నారు అమితాబ్. మెరీడియన్ టెక్ అనే ఒక అమెరికన్ కన్సల్టింగ్ కంపెనీలో 252, 000 డాలర్ల షేర్లు సొంతం చేసుకున్నారు బచ్చన్ కుటుంబం.[90]

విదేశాల్లో రహస్య పెట్టుబడులు ఉన్నట్టుగా పనామా పేపర్లలో బచ్చన్ కుటుంబం పేరు వచ్చింది.[91]

అవార్డులు, గౌరవాలు, గుర్తింపులుసవరించు

ఆయన చేసిన సినిమాల ద్వారా జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులే కాక భారత సినీ పరిశ్రమలో చేసిన కృషికిగానూ మిగతా పోటీల్లో కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు అమితాబ్. 1991లో రాజ్ కపూర్ పేరు మీదుగా స్థాపించిన ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు ఆయన. 2000 ఫిలింఫేర్ అవార్డుల్లో సూపర్ స్టార్ ఆఫ్ ది మిలీనియం పురస్కారం పొందారు అమితాబ్.

1999లో బిబిసి నిర్వహించిన యువర్ మిలీనియం అనే ఆన్ లైన్ పోల్ నిర్వహించినప్పుడు అమితాబ్ "గ్రేటెస్ట్ స్టార్ ఆఫ్ స్టేజ్ ఆర్ స్క్రీన్"గా ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ స్పందిస్తూ ఆయన పాశ్చాత్య దేశాల్లో ప్రఖ్యాతం కాకపోయినా, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధుడు కావడం వల్లే ఆయన ఎంపికయ్యారని పేర్కొంది.[92] 2001లో ఈజిప్ట్ లో జరిగిన అలగ్జెండ్రియా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో అంతర్జాతీయ సినిమా రంగంలో అమితాబ్ చేసిన కృషికిగానూ శతాబ్దపు నటునిగా గౌరవం అందుకున్నారు.[93] 2010 ఆసియా ఫిలిం అవార్డ్ లలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు అమితాబ్. ఇవేకాక ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ లోనూ, అవార్డు ఫంక్షన్లలో ఎన్నో పురస్కారాలు, గౌరవాలు పొందారు అమితాబ్.

జూన్ 2000లో మేడం టుస్సాడ్స్ మైనపు మ్యూజియంలో బొమ్మ  కలిగిన, ఆసియాకు చెందిన జీవించి ఉన్న వ్యక్తి అమితాబ్ ఒక్కరే.[94] 2009లో న్యూయార్క్ లో కూడా అమితాబ్ మైనపుబొమ్మ తయారు చేశారు.[95] 2011లో హాంగ్ కాంగ్ లో, బ్యాంక్ కాక్ లో, 2012లో వాషింగ్టన్ డిసిలో కూడా ఆయన అమితాబ్ మైనపుబొమ్మ ఏర్పాటు చేశారు.[96]

2003లో ఫ్రెంచి పట్టణం డీవిల్లే హానరీ సిటిజన్ షిప్ కూడా అందుకున్నారు అమితాబ్.[97]పౌర పురస్కారాలు
భారత ప్రభుత్వం 1984లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషన్, 2015లో పద్మవిభూషన్ పురస్కారాలతో గౌరవించింది. అంతర్జాతీయ సినిమా రంగంలో ఆయన చేసిన కృషికిగానూ ఫ్రెంచి ప్రభుత్వం ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారం అయిన లెగియన్ ఆఫ్ హానర్ పురస్కారం అందించింది.[98]

గౌరవ డాక్టరేట్లు

 • 2004లో ఝాన్సీ విశ్వవిద్యాలయం, భారతదేశం[99]
 • 2006లో ఢిల్లీ విశ్వవిద్యాలయం[100]
 • 2006లో లండన్ కు చెందిన డిమాంఫోర్ట్ విశ్వవిద్యాలయం[101]
 • 2007లో యుకెకు చెందిన యోర్క్ షైర్ లీడ్స్ మెట్రోపోలిటన్ విశ్వవిద్యాలయం[100]
 • 2011లో ఆస్ట్రేలియాకు చెందిన బ్రిస్ బేన్ క్వీన్స్ ల్యాండ్ టెక్నాలజీ  విశ్వవిద్యాలయం[102]
 • 2013లో జోధ్ పూర్ జాతీయ విశ్వవిద్యాలయం[103][104]
 • 2015లో ఈజిప్ట్కు చెందిన కైరోలోని ఎకాడమీ అఫ్ ఆర్ట్స్[103][104]
 
లండన్ లో 2012 జూలై 27 ఒలంపిక్స్ సమయంలో ఒలంపిక్ జ్యోతితో అమితాబ్

2012 జూలై 27న లండన్ లో అమితాబ్ ఒలంపిక్ జ్యోతితో ర్యాలీలో పాల్గొన్నారు.[105]

అమితాబ్ పై ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి. 1999లో అమితాబ్ బచ్చన్: ది లెజెండ్,[106] 2004లో టు బి ఆర్ నాట్ టు బి: అమితాబ్ బచ్చన్,[107] 2006లో ఎబి: ది లెజెండ్ (ఎ ఫోటోగ్రాఫర్స్ ట్రిబ్యూట్) [108], 2006లో అమితాబ్ బచ్చన్: ఏక్ జీవిత్ కింవదంతి[109], 2006లో అమితాబ్: ది మేకింగ్ ఆఫ్ సూపర్ స్టార్,[107] 2007లో  లుకింగ్ ఫర్ ది బిగ్ బి: బాలీవుడ్, బచ్చన్ అండ్ మి[108], 2009లో బచ్చనాలియా పుస్తకాలు ఆయన గురించి వచ్చినవే.[110]

2002లో బచ్చన్ స్వంతంగా సోల్ కర్రీ ఫర్ యూ అండ్ మి-ఏన్ ఎంపవరింగ్ ఫిలాసఫీ దట్ కెన్ ఎన్ రిచ్ యువర్ లైఫ్ అనే పుస్తకం రాశారు.[110] 1980లలో సుప్రీమో సిరీస్ లో ది ఎడ్వెంచర్స్ ఆఫ్ అమితాబ్ బచ్చన్ అనే పేరుతో వచ్చిన కామిక్ పుస్తకానికి సహకరించారు అమితాబ్.[111] మే 2014లో ఆస్ట్రేలియాలోని లాట్రోబ్ విశ్వవిద్యాలయం అమితాబ్ పేరు మీద ఒక స్కాలర్ షిప్ కూడా ఇస్తోంది.[112]

2012లో పెటా సంస్థ అమితాబ్ ను "హాటెస్ట్ వెజిటేరియన్"గా పేర్కొంది. పెటా నిర్వహించిన ఒక పోల్ లో అమితాబ్ "ఆసియా ఖండపు సెక్సియెస్ట్ వెజిటేరియన్"గా ఎంపికయ్యారు.[113]

సినిమాల జాబితాసవరించు

మూలాలుసవరించు

 1. "Alumni meet at Kirori Mal College". The Times of India. 26 February 2010.
 2. "Padma Awards 2015". Press Information Bureau, Government of India. 25 January 2015. Retrieved 26 January 2015.
 3. Amitabh Bachchan at 73: An ode to the undisputed ‘Shahenshah’ of Bollywood. indianexpress.com: (11 October 2015). URL accessed on 2015-10-11.
 4. Rajinikanth reveres Amitabh Bachchan as the 'Emperor of Indian Cinema'!. indiaglitz.com: (10 October 2015). URL accessed on 2015-10-10.
 5. Delhi's date with Big B at Adda on Friday. independent.co.uk: (27 September 2012). URL accessed on 2012-09-27.
 6. Amitabh Bachchan's Big B'day bash: Bollywood came calling. hindustantimes.com: (12 October 2012). URL accessed on 2012-10-12.
 7. Amitabh Bachchan: A Life in Pictures. Bafta.org. URL accessed on 23 March 2012.
 8. "Film legend promotes Bollywood". BBC News. 23 April 2002. Retrieved 15 January 2010.
 9. Amitabh Bachchan: Meet the biggest movie star in the world. independent.co.uk: (9 February 2015). URL accessed on 2015-02-09.
 10. Why Amitabh Bachchan is more than a superstar. bbc.com: (11 October 2012). URL accessed on 2012-10-11.
 11. Wajihuddin, Mohammed (2 December 2005). "Egypt's Amitabh Bachchan mania". The Times of India. Archived from the original on 1 మే 2013. Retrieved 22 November 2011. Check date values in: |archive-date= (help)
 12. Jatras, Todd (9 March 2001). "India's Celebrity Film Stars". Article. Forbes. Retrieved 22 November 2011.
 13. Bachchan Receives Lifetime Achievement Award at DIFF. Khaleej Times: (25 November 2009). URL accessed on 24 November 2011.
 14. Truffaut labeled Bachchan a one-man industry. China Daily. URL accessed on 1 February 2008.
 15. "Amitabh Bachchan: Indira Gandhi helped him get into films". timesofindia.com. 10 October 2013. Archived from the original on 13 నవంబర్ 2013. Retrieved 23 October 2013. Check date values in: |archive-date= (help)
 16. Padma Awards. Ministry of Home Affairs, Government of India: (2015). URL accessed on 21 July 2015.
 17. Pandey, Geeta (27 January 2007). "news.bbc.co.uk". Amitabh awarded the Legion of Honour. Retrieved 11 March 2007.
 18. Masih, Archana (9 October 2012). "Take a tour of Amitabh's home in Allahabad". rediff.com. Retrieved 14 February 2014.
 19. Jaya inaugurates library in memory of Harivansh Rai Bachchan. Greynium Information Technologies Pvt. Ltd. URL accessed on 18 November 2015.
 20. Amitabh Bachchan: The Kolkata Days!. India Opines. URL accessed on 18 November 2015.
 21. Mishra, Vijay (2001). Bollywood cinema: temples of desire. Routledge. p. 131. ISBN 978-0-415-93015-4.
 22. [మూలాలు తెలుపవలెను]
 23. 23.0 23.1 "Amitabh Bachchan's journey to the top". India Today. 10 October 2009.
 24. Suresh Kohli (17 May 2012). "Arts / Cinema: Bhuvan Shome (1969)". The Hindu. Chennai, India. Archived from the original on 5 ఫిబ్రవరి 2013. Retrieved 11 December 2012. Check date values in: |archive-date= (help)
 25. Avijit Ghosh, TNN 7 November 2009, 01.14pm IST (7 November 2009). "Big B's debut film hit the screens 40 yrs ago, today". The Times of India. Archived from the original on 15 జూన్ 2013. Retrieved 11 December 2012. Check date values in: |archive-date= (help)CS1 maint: multiple names: authors list (link)
 26. 'I felt I did a good job in Black'. Rediff.com: (9 August 2007). URL accessed on 24 March 2012.
 27. 80 iconic performances 1/10. (1 June 2010). URL accessed on 29 November 2011.
 28. Box Office India.
 29. Box Office 1975. BoxOffice India.com.
 30. 30.0 30.1 Kanwar, Rachna (3 October 2005). "25 Must See Bollywood Movies". Indiatimes movies. Archived from the original on 15 అక్టోబర్ 2007. Retrieved 6 December 2007. Check date values in: |archive-date= (help)
 31. Sholay. International Business Overview Standard. URL accessed on 6 December 2007.
 32. Box Office 1977. Boxofficeindia.com. URL accessed on 11 December 2012.
 33. BoxOffice India.com. BoxOffice India.com. URL accessed on 15 January 2010.
 34. Box Office 1977. Boxofficeindia.com. URL accessed on 11 December 2012.
 35. Boxofficeindia.com. boxofficeindia.com.
 36. 36.0 36.1 Boxofficeindia.com. boxofficeindia.com.
 37. Bachchan injured whilst shooting scene. Rediff.com. URL accessed on 11 March 2007.
 38. Amitabh Bachchan no longer excited about birthdays. Hindustan Times. (10 October 2009). URL accessed on 11 December 2012.
 39. Mohamed, Khalid. Reviews on: To Be or Not To Be Amitabh Bachchan. mouthshut.com. URL accessed on 11 March 2007.
 40. Amitabh Bachchan: Stint in Politics. Hindustan Times. URL accessed on 5 December 2005.
 41. Interview with Amitabh Bachchan. sathnam.com.
 42. ""Bachchan has no plans for election."". Archived from the original on 2007-09-30. Retrieved 2016-06-30.
 43. "Bollywood's Bachchan in trouble over crime claim". Agence France-Presse. 4 October 2007.
 44. The 15-year ban on Bachchan!. Oldbh.bollywoodhungama.com: (27 January 2007). URL accessed on 24 March 2012.
 45. Top Actor. boxofficeindia.com/topactors.htm.
 46. 46.0 46.1 Box Office 1994. Box Office India.
 47. Patil, Vimla (4 March 2001). Muqaddar Ka Sikandar.
 48. Box Office 1994. Box Office India.
 49. Amitabh and Abhishek rule the box office. Box Office India. URL accessed on 11 March 2007.
 50. Box Office 2006. Box Office India. URL accessed on 11 March 2007.
 51. Films fail at the BO. Box Office India.
 52. Adarsh, Taran. Top 5: 'Nishabd', 'N.P.D.' are disasters. Bollywood Hungma. URL accessed on 26 March 2007.
 53. Box Office 2006. Box Office India. URL accessed on 11 March 2007.
 54. This is Amitabh's best performance after Black.
 55. Amitabh Bachchan to star with Johnny Depp. ourbollywood.com. URL accessed on 11 March 2007.
 56. Akbar, Arifa (13 November 2009). "Underworld tale won't see light of day". The Independent. London. Retrieved 23 May 2010.
 57. Major Ravi gets ready to shoot Kandahar: Rediff.com Movies. Rediff.com: (8 June 2010). URL accessed on 2 October 2010.
 58. Amitabh to forego fee for sharing screen with Mohanlal. The Indian Express. (17 April 2010).
 59. Saxena, Poonam (19 November 2011). "Five crore question: What makes KBC work?". Hindustan Times. Archived from the original on 22 నవంబర్ 2011. Retrieved 24 November 2011. Check date values in: |archive-date= (help)
 60. "India scraps millionaire TV show". BBC News. 25 January 2006. Retrieved 7 May 2010.
 61. 61.0 61.1 Amitabh Bachchan back on TV with 'Bigg Boss 3'. URL accessed on 5 September 2009.
 62. KBC 6 & Amitabh's Charisma again breaks all records.
 63. [మూలాలు తెలుపవలెను]
 64. Amitabh Bachchan to get copyright: Celebrities, News. India Today. (8 November 2010). URL accessed on 11 December 2012.
 65. Free Articles (12 March 2012). Amitabh Bachchan lends his voice to animated 'Mahabharat'. The Indian Express. URL accessed on 11 December 2012.
 66. Near 70, Amitabh Bachchan still gets mobbed. The Indian Express. (29 September 2012). URL accessed on 11 December 2012.
 67. "hindustantimes.in "Amitabh voice for Shatranj Ke Khiladi."". Archived from the original on 2013-10-06. Retrieved 2016-06-30.
 68. 68.0 68.1 "Ashutosh had rejected Big B as Lagaan's narrator". The Times of India. 16 June 2011.
 69. Amitabh to get France's highest civilian honour: Bollywood News. ApunKaChoice.Com: (12 October 2006). URL accessed on 14 February 2011.
 70. "Amitabh Bachchan's secret aspect finally revealed".
 71. http://www.thesundayindian.com/en/story/the-amitabh-bachchan-way-or-the-highway/34825/
 72. "Amitabh Bachchan announces 11 lakh contribution for Resul Pookutty's foundation". 
 73. "Amitabh Bachchan supports medical centre at Kochi". dna. 
 74. "Amitabh Bachchan announces 11 lakh contribution for Resul Pookutty's foundation".
 75. 75.0 75.1 "Delhi gangrape: Amitabh Bachchan donates Rs 2.5 lakh to Delhi Police constable Subhash Chand Tomar's family".
 76. "Amitabh Bachchan donates Rs 2.5 lakh to Delhi Police constable" Archived 2015-02-17 at the Wayback Machine. http://www.hindustantimes.com/. 
 77. Amitabh Bachchan donates Rs 2.5 lakh to Delhi Police constable. http://www.hindustantimes.com/.
 78. "Amitabh Bachchan opens memorial trust in father's name".
 79. "Amitabh Bachchan opens memorial trust in father's name".
 80. Amitabh Bachchan launches new Polio Communication Campaign. UNICEF. (16 December 2011).
 81. Proud of India being declared polio-free: Amitabh Bachchan. dna.
 82. "WHO officially declares India 'polio-free'".
 83. 83.0 83.1 "Bachchan's charity side". Archived from the original on 2015-06-11. Retrieved 2016-07-02.
 84. "Big B's bounty for the girl child!
 85. Maharashtra police keep Big B ‘waiting’. The New Indian Express.
 86. "20 reasons why we love Amitabh Bachchan".
 87. 87.0 87.1 Amitabh Bachchan, Madhuri Dixit back 'Free Sunder' campaign. NDTV.com.
 88. Vinaya Deshpande. Elephants escort Sunder to freedom. The Hindu.
 89. Elephant Sunder: Amitabh Bachchan credits PETA for giant baby's free home. Zee News. URL accessed on 13 January 2015.
 90. Amitabh Bachchan Joins S.F. Bay Area Nonprofit TeachAIDS. India West. URL accessed on 24 June 2015.
 91. http://www.msn.com/en-ae/news/india/from-bollywood-stars-to-real-estate-tycoons-the-indians-in-panama-papers/ar-BBrkdRn
 92. "ENTERTAINMENT | Bollywood star tops the poll". BBC News. 1 July 1999. Archived from the original on 10 September 2010. Retrieved 2 October 2010.
 93. The Tribune, Chandigarh, India – World. The Tribune. (4 September 2001). URL accessed on 2 October 2010.
 94. Art of cinema is a small contribution: Amitabh Bachchan. Screenindia.com: (1 April 2009). URL accessed on 2 October 2010.
 95. Amitabh’s Wax Figure in New York. Amitabh Wax figure in New York. Whatslatest.com. URL accessed on 2 October 2010.
 96. Big B, SRK, Aishwarya's wax figures at Washington Tussauds. The Indian Express. (5 December 2012). URL accessed on 5 December 2012.
 97. "'Shahenshah' of Bollywood". The Hindu. Chennai, India. 4 July 2003. Archived from the original on 14 అక్టోబర్ 2010. Retrieved 2 October 2010. Check date values in: |archivedate= (help)
 98. Pandey, Geeta (27 January 2007). "South Asia | French honour for Bollywood star". BBC News. Retrieved 2 October 2010.
 99. Subhash K Jha, TNN (11 July 2006). "Meet Dr Amitabh Bachchan!". The Times of India. Retrieved 2 October 2010.
 100. 100.0 100.1 Leeds University honours Bollywood icons: Bollywood News. ApunKaChoice.Com: (10 June 2007). URL accessed on 2 October 2010.
 101. News. QUT. URL accessed on 29 November 2011.
 102. "Jodhpur university to confer doctorate on Big B". Timesofindia. 29 October 2013. Archived from the original on 2013-10-04. Retrieved 2016-07-02.
 103. 103.0 103.1 Amitabh Bachchan gets Honorary Doctorate from Egypt’s Academy of Arts. indianexpress.com: (2015-04-01). URL accessed on 2015-04-01.
 104. 104.0 104.1 Amitabh Bachchan honoured by Egypt’s Academy of Arts. thehindu.com: (2015-04-02). URL accessed on 2015-04-02.
 105. Bhushan, Nyay (26 July 2012). "Amitabh Bachchan Carries Olympic Torch". The Hollywood Reporter.
 106. Amitabh Bachchan: Ek Jeevit Kimvadanti – ISBN 978-1-4039-3160-3 – Author: Somaaya – Macmillan India. Autsun.Com: (20 October 2009). URL accessed on 2 October 2010.
 107. 107.0 107.1 Amitabh: The Making of a Superstar by Susmita Dasgupta. Indiaclub.com. URL accessed on 2 October 2010.
 108. 108.0 108.1 Looking for the Big B: Bollywood, Bachchan and Me: Amazon.co.uk: Jessica Hines: Books. Amazon.com. URL accessed on 2 October 2010.
 109. Amitabh Bacchan: A book on Amitabh Bachchan launched 'Bachchanalia'. Amitabbacchan.blogspot.com: (5 January 2009). URL accessed on 2 October 2010.
 110. 110.0 110.1 Soul Curry for you and me – An Empowering Philosophy That Can Enrich Your Life by Amitabh Bachchan. Indiaclub.com: (11 October 1942). URL accessed on 2 October 2010.
 111. Remembering Amitabh, the Supremo superhero. Rediff.com: (10 November 2009). URL accessed on 11 December 2012.
 112. La Trobe University of Australia names scholarship after Amitabh Bachchan. IANS. news.biharprabha.com. URL accessed on 2 May 2014.
 113. Faye Wong is Asia's sexiest vegetarian. Times of India: (19 June 2008).