ఆటాడిస్తా

రవికుమార్ చౌదరి దర్శకత్వంలో 2008లో విడుదలైన తెలుగు చలనచిత్రం

ఆటాడిస్తా 2008, మార్చి 20న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] పతాకంపై సి.కళ్యాణ్, ఎస్. విజయానంద్ నిర్మాణ సారథ్యంలో రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, కాజల్ అగర్వాల్, జయసుధ, నాగబాబు నటించగా, చక్రి సంగీతం అందించాడు.[2][3] ఇది నటుడు రఘువరన్ చివరి సినిమా. 2013లో డేరింగ్ గుండారాజ్ పేరుతో హిందీలోకి అనువాదం చేయబడింది.

ఆటాడిస్తా
Aatista Movie Poster.JPG
ఆటాడిస్తా సినిమా పోస్టర్
దర్శకత్వంరవికుమార్ చౌదరి
నిర్మాతసి. కళ్యాణ్, ఎస్. విజయానంద్
రచనరవికుమార్ చౌదరి
నటులునితిన్
కాజల్ అగర్వాల్
జయసుధ
నాగబాబు
జయలలిత
సంగీతంచక్రి
ఛాయాగ్రహణంజవహర్ రెడ్డి
కూర్పుబస్వా పైడిరెడ్డి
నిర్మాణ సంస్థ
రేఖా కంబైన్స్
విడుదల
20 మార్చి 2008 (2008-03-20)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

జగన్ 'చిన్న' (నితిన్) పారిశ్రామికవేత్త లయన్ రాజేంద్ర కుమారుడు. సునంద (కాజల్ అగర్వాల్) తో ప్రేమలో పడతాడు. రాజేంద్ర ప్రత్యర్థి రఘునాథ్ వీరితో భాగస్వామ్యంలోకి రావాలనుకుంటాడు. జగన్ కు తెలియకుండా, అతని వివాహం రఘునాథ్ కుమార్తెతో నిశ్చయమవగా, ఆమె సునంద అని తెలుస్తుంది. కాని వాళ్ళ పెళ్ళి నిశ్చయం అయిన తర్వాత కుటుంబాలు అంతగా బాగాలేవు. అపఖ్యాతి పాలైన ఎమ్మెల్యే బోనాల శంకర్ కు చెందిన పొగాకు వ్యాపారాలను రఘునాథ్ చూసుకుంటుంటాడు. తన ప్రాంతంలో పొగాకు బిజినెస్ పెట్టేందుకే రాజేంద్ర ఇష్టపడకపోవడంతో బోనాల శంకర్ వెళ్ళి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను బెదిరిస్తాడు. దాంతో జగన్ ఆ అవినీతి రాజకీయ నాయకుడిని ఎదుర్కోని, అతడి ఆట కట్టిస్తాడు. జగన్ శంకర్ ను కొట్టాడని పుకారు వస్తుంది.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "స్టైల్ స్టైల్"  సూరజ్ జగన్  
2. "పప్పిదే చుమ్మాదే"  దేవన్, కౌసల్య  
3. "వచ్చిందిరో సిలకా"  ఫరీద్  
4. "మిలమిల"  రవివర్మ, కౌసల్య  
5. "రేగిపోయే ఈ"  సింహ, సుచిత్ర  
6. "సారీ సారీ"  చక్రి, కౌసల్య  


మూలాలుసవరించు

  1. తెలుగు వన్, సినిమాలు. "ఆటాడిస్తా". www.teluguone.com (in english). Retrieved 23 July 2020. CS1 maint: discouraged parameter (link) CS1 maint: unrecognized language (link)
  2. "Aatadista". imdb.com. Retrieved 23 July 2020. CS1 maint: discouraged parameter (link)
  3. తెలుగు ఫిల్మీబీట్, సినిమా. "ఆటాడిస్తా (2008)". www.telugu.filmibeat.com. Retrieved 23 July 2020. CS1 maint: discouraged parameter (link)

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆటాడిస్తా&oldid=3109067" నుండి వెలికితీశారు