ఆస్తికోసం
ఆస్తికోసం (1975 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గిడుతూరి సూర్యం |
---|---|
తారాగణం | పండరీబాయి |
నిర్మాణ సంస్థ | శ్రీ రాజలక్ష్మి చిత్ర |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రామకృష్ణ
- గిరిబాబు
- అల్లు రామలింగయ్య
- త్యాగరాజు
- రావు గోపాలరావు
- కె.వి.చలం
- రాజనాల
- కొమ్మినేని శేషగిరిరావు
- కాకరాల
- బాలకృష్ణ
- మనోరంజన్
- కోళ్ళ సత్యం
- ఏచూరి
- భీమరాజు
- ప్రమీల
- జయమాలిని
- పండరీబాయి
- గిరిజారాణి
- రాణి
- కల్పన
- సుశీల
- శాంతాదేవి
- బేబి గౌరి
- అత్తిలి పాప
సాంకేతిక వర్గం
మార్చు- కథ: పినిశెట్టి
- మాటలు: దాసం గోపాలకృష్ణ, ఎన్.ఆర్.నంది
- పాటలు: కొసరాజు, విజయరత్నం, ఆరుద్ర, బాబూరావు
- సంగీతం: సాలూరు హనుమంతరావు
- ఛాయాగ్రహణం: మణి
- కూర్పు: కందస్వామి
- కళ: భాస్కరరాజు
- నిర్మాతలు: వేగి వీర్రాజు, జి.పృథ్వీరాజ్
- దర్శకత్వం: గిడుతూరి సూర్యం
కథ
మార్చురాఘవరావు తన కూతురు ఇందిరను మేనల్లుడు రాముకు ఇచ్చిపెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నాడు. రాఘవరావు చెల్లెలూ, రాము తల్లి అయిన పార్వతి ఎంతో సంతోషించింది. తాంబూలాలు పుచ్చుకునే రోజున రామూకు మరో పెళ్ళైందని తెలిసి ఉగ్రుడై పోయిన రాఘవరావు పార్వతమ్మను మళ్ళీ తన గడప తొక్కవద్దని శాసించాడు. పాతికేళ్ళ క్రితం రామూ తండ్రి వ్యాపారనిమిత్తమై హైదరాబాద్ వెడుతుండగా రామూ తమ్ముడు వేణు ఐదేళ్ళవాడు తను కూడా తండ్రితో వెడతానని మారాం చేసి బయలుదేరాడు. దారిలో రామూ తండ్రి హత్య చేయబడ్డాడు. ఆ నేరానికి డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు. చిన్నవాడు ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. రాఘవరావుకు నమ్మిన బంటు ధర్మయ్య. ప్రసవించలేక రాఘవరావు భార్య చనిపోతే ధర్మయ్య అతన్ని అహర్నిశలూ కాపాడాడు. ఆ దుఃఖాన్ని మర్చిపోవడానికి రాఘవరావు తాగుబోతుగా మారిపోయాడు. ధర్మయ్య తన కూతురు శాంతను రాఘవరావు రెండవ భార్యగా చేశాడు. చిన్ననాడే తప్పిపోయిన వేణు ఒక మిలటరీ ఆఫీసర్ ఇంట్లో పెరిగి పెద్దవాడై పోలీస్ ఆఫీసరుగా ట్రైనింగు పొందాడు. రాఘవరావు తమ్ముడు తన ఆస్తంతా తగలేసి పిచ్చివాడైపోయాడు. కానీ అప్పుడప్పుడు అన్నగారింటికి రావడం ఎందుకొచ్చాడో తెలియకుండానే వెళ్ళిపోతుండడం చేస్తూ ఉంటాడు. వేణు పోలీస్ ఆఫీసర్‌గా వచ్చాడు. ఒక గుడి దగ్గర రామూను, పార్వతమ్మను కలుసుకుంటాడు. కానీ వేణూకు పార్వతమ్మ తన తల్లి అనీ, రాము తన అన్న అనీ తెలియదు. రామూ, పార్వతమ్మల పరిస్థితి కూడా అదే. రాఘవరావును ఎవరో హత్య చేస్తారు. ఆ నేరం రామూ మీద పడింది. రామూ పారిపోయాడు. వేణు రామూను అరెస్ట్ చేయడానికి చూస్తాడు. రామూ ఇందిరతో తను నిర్దోషి అని మొరపెట్టుకుంటాడు. ఇందిర నమ్మదు. ధర్మయ్య తన కొడుకుకు ఇందిరనిచ్చి పెళ్ళి చేయాలని నిర్ణయిస్తాడు. అది ఇష్టం లేని ఇందిర ఇల్లు వదిలి పారిపోయి ఒక విపత్కర పరిస్థితులలో చిక్కుకుంటుంది. రాము ఆమెను ఆ విపత్కర పరిస్థితులనుండి రక్షిస్తాడు. రాము నిర్దోషి అని ఇందిర నమ్ముతుంది. ఇందిరకు మతి భ్రమించి వీధులలో తిరుగుతుంటే ధర్మయ్య ఇంటికి తీసుకువచ్చాడు. ఇందిర అందర్నీ చావదన్నడం మొదలెట్టింది. కొన్ని విచిత్ర్తమైన పరిస్థితుల్లో ఎవరూ నమ్మలేని నిజాలు తెలిసాయి. ఆస్తికోసం ఎవరెవరు ఎలా నాటకమాడిందీ ఎన్ని ఘోరాలు చేసిందీ చివరికి ఋజువయ్యింది.[1]
మూలాలు
మార్చు- ↑ సంపాదకుడు (1 August 1975). "ఆస్తికోసం". విజయచిత్ర. 10 (2): 15–17.