ఇస్లామీయ స్వర్ణయుగం

(ఇస్లామీయ పునరుజ్జీవనం నుండి దారిమార్పు చెందింది)

ఇస్లామీయ స్వర్ణయుగం అన్నది ఇస్లాం చరిత్రలో 8వ శతాబ్ది నుంచి 13వ శతాబ్ది వరకూ ఇస్లాం ప్రపంచాన్ని పలువురు ఖలీఫాలు పరిపాలిస్తూండగా, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, ఆర్థిక అభివృద్ధి, సంస్కృతి విలసిల్లిన కాలం.[1][2][3] ఇస్లామీయ స్వర్ణయుగాన్ని కొన్నిసార్లు ఇస్లామీయ పునరుజ్జీవనము అని పిలుస్తారు, [4] ఈకాలంలో ఇస్లామీయ ప్రపంచంలోని ఇంజనీర్లు, పండితులు, వర్తకులూ; కళలకూ, వ్యవసాయానికి, విత్తశాస్త్రానికి, పరిశ్రమలకు, న్యాయశాస్త్రానికి, సాహిత్యానికి, నావికానికి, తత్వానికి, శాస్త్రాలకూ, సాంకేతికరంగానికీ తమ తోడ్పాటునందించారు.[5] ఈ స్వర్ణయుగం అబ్బాసీయ ఖలీఫా హరున్ అల్-రషీద్ (786 నుంచి 809 వరకూ) పరిపాలనా కాలంలో బాగ్దాద్‌లో హౌస్ ఆఫ్ విజ్డమ్ (విజ్ఞాన ఆవాసం) ప్రారంభించడంతో మొదలైందని సంప్రదాయికంగా భావిస్తారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన పండితులను హౌస్ ఆఫ్ విజ్డమ్‌లో ప్రపంచంలోని సమస్త ప్రామాణిక సంప్రదాయ విజ్ఞానం అరబిక్ భాషలోకి అనువదించాల్సిందిగా ఆజ్ఞాపిస్తూ నియమించారు.[6][7] మంగోల్ దండయాత్రల ఫలితంగా సా.శ1258లో జరిగిన బాగ్దాద్ ముట్టడి కారణంగా అబ్బాసీయ ఖలీఫత్ పతనం కావడంతో సంప్రదాయికంగా ఈ స్వర్ణయుగం ముగిసిపోయింది.[8] కొందరు సమకాలీన పరిశోధకులు ఇస్లామీయ స్వర్ణయుగం 15, 16 శతాబ్దాల వరకూ సాగిందని రాశారు.[1][2][3]

అబ్బాసీయ గ్రంథాలయంలోని పండితులు, సా.శ1237లో బాగ్దాద్‌కు చెందిన యాహ్యా ఇబ్న్ మహ్మద్ అల్-వసితి చిత్రం
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

ఖురాన్ ఆజ్ఞలు విజ్ఞానం సంపాదించడానికి విలువనివ్వడం వల్ల ఖలీఫా ప్రభుత్వాలు విజ్ఞానం, అనువాదం, పరిశోధన వంటివాటికి ప్రాధాన్యతను ఇచ్చాయి. ఖలీఫాలు ప్రపంచంలోని వివిధ నాగరికతలలోని విజ్ఞానాన్ని అరబిక్, పర్షియన్ భాషల్లోకి, ఆపైన ఇతర మధ్యప్రాచ్య భాషల్లోకి అనువదించడంపై భారీ ఎత్తున ఖర్చు చేశాయి. గ్రీకు, పర్షియన్, భారతీయ, చైనీస్ తదితర పూర్వ నాగరికతల్లోని పలు శాస్త్రాల గ్రంథాలు, వారి సిద్ధాంతాలు, పరిశోధన ఫలితాలు అనువాదం అయ్యాయి. ఈ అనువాదాలు ప్రపంచవ్యాప్తంగా జరిగిన గొప్ప పరిశోధనలు కొత్త ఇస్లామీయ సంస్కృతి మరిన్ని కొత్త ఆలోచనలు చేయడానికి సాయం చేశాయి. దండయాత్రల్లో పర్షియా ఖలీఫాల పాలనలోకి వచ్చాకా కొత్తగా ఇస్లాంలోకి వచ్చిన పర్షియన్లకు తోడు అసిరియన్ క్రైస్తవ పండితులు తమ తమ పూర్వ నాగరికతలోని విద్య, పరిశోధన పద్ధతులను ఇస్లామీయ సంస్కృతిలోకి తీసుకువచ్చారు, పెద్ద ఎత్తున విద్య, సంస్కృతి, పరిశోధనలలో కృషిచేశారు. అంతకుముందు వ్రాత అన్నది చాలా కష్ట సాధ్యంగా ఉండేది, చైనా నుంచి కొత్తగా తీసుకువచ్చిన కాగితాల వాడకం మరింత వేగంగా, మెరుగైన పద్ధతిలో పుస్తక ప్రతులు రాయడానికి పనికివచ్చింది. ఆలోచనలు భద్రపరచడానికి, ప్రసారం చేయడానికి ఈ కొత్త పద్ధతులు ఉపకరించాయి. ఈ కారణాలన్నీ ఈ కాలంలో సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన అభివృద్ధికి కారణాలయ్యాయి.

భావనల చరిత్ర

మార్చు
 
ఖలీఫత్‌ల నేతృత్వంలో విస్తరణ, 622–750.
  ముహమ్మద్ నేతృత్వంలో విస్తరణ, 622–632
  రషీదున్ ఖలీఫత్ ఆధ్వర్యంలో విస్తరణ, 632–661
  ఉమయ్యద్ ఖలీఫత్ పాలనలో విస్తరణ, 661–750

పాశ్చాత్యుల ప్రాచ్య విజ్ఞాన అధ్యయనం నేపథ్యంలో 19వ శతాబ్దిలో ఇస్లామిక్ చరిత్రపై రాస్తున్న సాహిత్యంలో స్వర్ణయుగం అన్న పోలికను వాడారు. హ్యాండ్‌బుక్ ఆఫ్ ట్రావెలర్స్ ఇన్ సిరియా అండ్ పాలస్తీనా (అనువాదం: సిరియా, పాలస్తీనాల యాత్రికుల చేతిపుస్తకం) రచయిత, 1868లో డెమాస్కస్‌లోని అత్యంత సుందరమైన మసీదులు, "ప్రస్తుతకాలంలో అత్యంత వేగంగా క్షీణిస్తున్న మహమ్మదీయ మతంలాగానే" "ఇస్లాం స్వర్ణయుగానికి అవశేషాలు, జ్ఞాపికలు" అని పేర్కొన్నాడు.[9]

ఈ పదబంధానికి అసందిగ్ధమైన నిర్వచనం అంటూ లేదు, సాంస్కృతిక వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని వాడారా, సైనిక విజయాల పరంగా ఉపయోగించారా అన్నదాన్ని బట్టి విభిన్నమైన కాలావధులను సూచిస్తూంటుంది. దానితో ఒక రచయిత ఖలీఫత్‌ల కాలానికి, "ఆరున్నర శతాబ్దాల పొడవునా" విస్తరిస్తే,[10] మరో రచయిత ఉమర్, మొదటి ఫిత్నాల మరణంతో, రషీదున్ దండయత్ర విజయాల తర్వాత కొద్ది దశాబ్దాలకే ముగిస్తాడు.[11] 20వ శతాబ్ది తొలినాళ్ళలో, ఎప్పుడో ఒకసారి ఈ పదాన్ని వాడేవారు, వాడినప్పుడు కూడా చాలావరకూ రషీదున్ ఖలీఫాల తొలినాళ్ళ సైనిక విజయాలను సూచిస్తూ ప్రయోగించేవారు. 20వ శతాబ్ది రెండవ అర్థభాగంలో మాత్రమే దీని ప్రయోగం పెరిగింది, ప్రస్తుతం చాలావరకూ 9 నుంచి 11 శతాబ్దాల మధ్యలో ఖలీఫాల పాలనలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, గణితశాస్త్రం సాంస్కృతికంగా సుసంపన్నం కావడాన్ని సూచిస్తూన్నారు. (జ్ఞాన ఆవాసం (హౌస్ ఆఫ్ విజ్డమ్) లో వ్యవస్థీకృతమైన పాండిత్యం స్థాపించడానికి, క్రూసేడ్‌ల ఆరంభానికి నడుమ), [12] కానీ తరుచూ 8వ శతాబ్ది చివరి దశకాలను చేర్చడమో, 12 నుంచి 13వ శతాబ్దపు తొలినాళ్ళకు విస్తరించడమో చేస్తారు.[13] ఇప్పటికీ నిర్వచనాలు చెప్పుకోదగ్గ స్థాయిలో మారుతూంటాయి. స్వర్ణయుగం అంతాన్ని, ఖలీఫత్‌ల ముగింపుతో సమం చేయడం ఒక చారిత్రక అవధిని ఆధారం చేసుకున్నట్టు అనువుగా, తెంపుగా అనిపిస్తుంది, కానీ ఇస్లామీయ సంస్కృతి క్రమంగా అంతకు చాన్నాళ్ళ ముందునుంచే క్షీణిస్తుందన్న వాదనలు వినవస్తాయి. దాంతో ఖాన్ (2003) కచ్చితమైన స్వర్ణయుగాన్ని 750-950 రెండు శతాబ్దాల కాలంలోనిదని గుర్తిస్తాడు, హరున్ అల్-రషీద్ కాలంలో భూభాగాలు కోల్పోవడం 833లో అల్-మామున్ మరణానంతరం మరింత దెబ్బతిందనీ, 12వ శతాబ్దిలో జరిగిన క్రూసేడ్లు ఇక తిరిగి కోలుకోలేని విధంగా అబ్బాసీయ సామ్రాజ్యాన్ని బలహీనపరిచాయని వాదిస్తాడు.[14]

కారణాలు

మార్చు

మత ప్రభావాలు

మార్చు

వివిధ ఖురాన్ ఆదేశాలు, హదీత్ విద్యకు విలువనివ్వడం, విజ్ఞాన సముపార్జన ప్రాధాన్యతను నొక్కిచెప్పడం ఈ కాలపు ముస్లిములు విజ్ఞాన అన్వేషణ చేసేలా, శాస్త్రసాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేసేలా ప్రభావితం చేశాయి.[15][16][17]

ప్రభుత్వ పోషణ

మార్చు

అబ్బాసీయ యుగంలో ఖలీఫా అల్-మన్సూర్ బాగ్దాద్, ఇరాక్‌లో నెలకొల్పిన గ్రంథాలయం - హౌస్ ఆఫ్ విజ్డమ్ (జ్ఞాన ఆవాసం) ఈ విజ్ఞానవృద్ధికి ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా ఉండేది.[18] ఇస్లామీయ సామ్రాజ్యం పండితులను, విద్యావేత్తలను పెద్ద ఎత్తున పోషించింది. కొన్ని అనువాదాల కోసం అనువాద ఉద్యమంపై ఖర్చుచేసిన సొమ్ము యునైటెడ్ కింగ్‌డమ్ మెడికల్ 1రీసెర్చ్ కౌన్సిల్ సంవత్సరపు పరిశోధన బడ్జెట్‌కు రెట్టింపు ఉండేదని అంచనా.[19] హునయ్‌న్ ఇబ్న్ ఇషక్ వంటి అత్యుత్తమ పండితులు, ప్రఖ్యాత అనువాదకులు ఇప్పటి ప్రొఫెషనల్ అథ్లెట్లతో సమానమైన జీతాలు అందుకున్నారని అంచనా.[19]

పూర్వపు సాంస్కృతిక ప్రభావం

మార్చు

ఈ కాలంలో ముస్లిములు తాము జయించిన నాగరికతల శాస్త్రసాంకేతిక విజ్ఞానాన్ని క్రోడీకరించడంపై గట్టి ఆసక్తి, అభినివేశం కనబరిచారు. ఈ ప్రయత్నం లేకుంటే నాశనమయ్యే ప్రమాదం కలిగిన గ్రీకు, పర్షియన్, భారతీయ, చైనీస్, ఈజిప్షియన్, ఫొనీషియన్ నాగరికతల విలువైన ప్రాచీన గ్రంథాలను అరబిక్, పర్షియన్ భాషల్లోకి, ఆ తర్వాతి దశలో టర్కిష్, హిబ్రూ, లాటిన్ భాషల్లోకీ అనువదాలు చేశారు.[7] ఉమ్మయద్, అబ్బాసీయ పాలనా కాలంలో గ్రీకు తత్త్వవేత్లు, ప్రాచీన శాస్త్రసాంకేతిక విజ్ఞానాలను సిరియాక్, తర్వాత అరబిక్ భాషల్లోకి అనువదించడం ద్వారా క్రైస్తవులు, అందునా ప్రత్యేకించి తూర్పు చర్చి (నెస్టోరియన్లు) కి చెందినవారు ఇస్లామిక్ సంస్కృతికి తోడ్పడ్డారు.[20][21] వారు తత్త్వశాస్త్రం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం (ఉదాహరణకు హునయ్‌న్ ఇబ్న్ ఇషక్, [22][23] తబిత్ ఇబ్న్ ఖుర్రా,[24] యూసుఫ్ అల్-ఖురి,[25] అల్ హిమ్సి,[26] ఖుస్తా ఇబ్న్ లుఖా, [27] మసవియ్, [28][29] పత్రియార్క్ యుటిచియస్, [30] జబ్రిల్ ఇబ్న్ బుఖ్తిషు[31] తదితరులు) మతశాస్త్రం వంటివి సహా అనేక శాస్త్రాల్లో లోతైన పాండిత్యం సంపాదించారు. సుదీర్ఘ కాలం పాటు అబ్బాసీయ ఖలీఫాల వ్యక్తిగత వైద్యులుగానూ అసిరియన్ క్రైస్తవులు ఉండేవారు.[32][33] ఖలీఫాలకు వైద్యులుగా సేవలందించిన అత్యంత ప్రముఖ క్రైస్తవ వంశీకులు బుఖ్తిషు వంశీకులు.[34][35]

4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకూ, గ్రీకు, సిరియాక్ భాషల్లో క్రైస్తవ విద్వత్ సాహిత్య కొత్తగా అనువదించింది కానీ, హెలెనిస్టిక్ కాలం నుంచి కాపాడుకుంటూ వచ్చింది కానీ అయివుండేది. నిసిబీల పాఠశాల, ఎడెసా పాఠశాల, హరాన్ పాగన్ విశ్వవిద్యాలయం మొదలైన క్రైస్తవ విద్యాసంస్థలు ప్రముఖమైన విద్యాసంస్థలు, సంప్రదాయిక విజ్ఞానాన్ని అందించే విద్యాలయాల్లో ముఖ్యమైనవిగా ఉండేవి.[36][37][38][39] తూర్పు చర్చికి మేధోపరమైన, మతసిద్ధాంత పరమైన, విజ్ఞానపరమైన కేంద్రంగా ప్రఖ్యాత జుండిషాపూర్‌లోని వైద్యశాల, వైద్యవిద్యా సంస్థ విలసిల్లేవి.[40][41][42] అకాడమీ ఆఫ్ గోండిషాపూర్‌ తరహాలో, క్రైస్తవ వైద్యుడు హునయ్‌న్ ఇబ్న్ ఇషక్ నేతృత్వంలో బైజాంటిన్ వైద్యశాస్త్రం మద్దతుతో బాగ్దాద్‌లోని హౌస్ ఆఫ్ విజ్డమ్ 825లో ఏర్పడింది. గాలెన్, హిప్పోక్రేట్స్, ప్లేటో, అరిస్టాటిల్, టాలెమీ, ఆర్కిమెడిస్, తదితరుల రచనలు సహా అత్యంత ముఖ్యమైన తత్త్వశాస్త్ర, శాస్త్రసాంకేతిక రచనలన్నీ అనువాదం అయ్యాయి. హౌస్ ఆఫ్ ద విజ్డమ్‌లో ఎక్కువమంది పండితులు క్రైస్తవులే.[43]

కొత్త సాంకేతికత

మార్చు
 
అబ్బాసీయ యుగం నాటి కాగితం

తేలికైన, సరికొత్త రాత పద్ధతులు, కాగితం ప్రవేశపెట్టడం జరగడంతో సమాచారం ప్రజాస్వామీకరణ జరిగింది, చరిత్రలో దాదాపు తొలిసారి రాయడం, పుస్తకాలు అమ్ముకోవడం ద్వారా ప్రజలు జీవించే అవకాశం ఏర్పడింది.[44] కాగితం, దాని ఉపయోగాలు ఎనిమిదవ శతాబ్దంలో చైనా నుంచి ముస్లిం ప్రాంతాలకు, పదో శతాబ్దిలో ప్రస్తుత స్పెయిన్, ఇబేరియన్ ద్వీపకల్పం - అంటే ప్రస్తుత స్పెయిన్ ప్రాంతానికి తీసుకువెళ్ళారు. కాగితం తయారీ తోలు కాగితం కన్నా తేలిక, పాపరస్ అనే పురాతన పత్రంలాగా తేలికగా విరిగిపోదు, ఇంకును పీల్చుకోవడం ద్వారా చెరపడానికి కష్టం, రికార్డులు నిర్వహించడానికి అత్యుత్తమమైనది. ఇస్లామీయ పేపర్ తయారీదారులు చేతిరాతతో ప్రతులను కాపీచేసి ఎడిషన్లుగా రూపొందించడానికి శతాబ్దాల పాటు యూరోపులోని ఏ ఇతర పద్ధతులకన్నా పెద్దదైన అసెంబ్లీ లైన్ పద్ధతులు అభివృద్ధి చేశారు.[45] లెనిన్ నుంచి కాగితం తయారుచేసే విద్యను ఈ దేశాల నుంచే మిగతా ప్రపంచం నేర్చుకుంది.[46]

ముఖ్యమైన సహాయకారులు

మార్చు

వరుస ఇస్లామీయ దండయాత్రల ద్వారా విలీనం చేసుకున్న వివిధ దేశాలు, సంస్కృతుల్లో చూస్తే ఇస్లామీయ స్వర్ణయుగం విలసిల్లేందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున పర్షియా నుంచి వచ్చారు. బెర్నార్డ్ లూయీస్ ప్రకారం:

"సాంస్కృతికంగా, రాజకీయంగా, మరింత ప్రత్యేకించి మతపరంగా పర్షియన్లు ఈ కొత్త ఇస్లామీయ నాగరికతకు చేసిన కృషి అత్యంత ప్రాముఖ్యత కలిగివున్నది. ఇరానియన్ల కృషి అరబిక్ కవిత్వంతో సహా (పర్షియన్లు అరబిక్‌లో అల్లుకున్న కవిత్వం అరబిక్ సాహిత్యాన్ని ఎంతగానో సుసంపన్నం చేసింది) అన్ని సాంస్కృతిక రంగాల్లోనూ కనిపిస్తుంది."

సస్సానియన్ సామ్రాజ్యంలో ఇస్లామ్ రావడానికి ముందున్న ఇరానియన్ విశ్వవిద్యాలయాల్లోని శాస్త్ర సాంకేతిక విజ్ఞాన నమూనా ప్రభావంతో, దాని ఆధారంగా కొత్తగా ఇస్లామీకరింపబడ్డ ఇరానియన్ సమాజంలోని శాస్త్ర సాంకేతిక, వైద్య, తత్త్వశాస్త్రం మొదలైన విద్యలు అభివృద్ధి చెందాయి. ఈ కాలంలో వందలాదిమంది పండితులు, శాస్త్రవేత్తలు సాంకేతికత, విజ్ఞాన శాస్త్రం, వైద్యశాస్త్రాలపై విస్తారంగా కృషిచేశారు, ఈ కృషి పునరుజ్జీవన కాలం నాటి ఐరోపియన్ విజ్ఞాన శాస్త్రాన్ని ప్రభావితం చేసింది.[47]

విద్య

మార్చు

ఇస్లామీయ సంప్రదాయంలో పవిత్ర గ్రంథం, దాని అధ్యయనం కేంద్ర స్థానంలో ఉండడం వల్ల ఇస్లాం చరిత్రలో విద్య అన్నది మతానికి మూలస్తంభంగా ఉండడానికి సహాయకారి అయింది.[48] మహమ్మద్ చెప్పాడని పేర్కొనే హదీతుల్లో విజ్ఞానార్జన ప్రధాన్యత నొక్కివక్కాణించే అనేక హదీతులు విజ్ఞానార్జనకు ఇస్లామీయ సంప్రదాయంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. ఒక హదీతు అయితే "చైనా నుంచి అయినా సరే, విజ్ఞానాన్ని అపేక్షించు" అంటుంది.[48] ఈ ఆజ్ఞ ప్రత్యేకించి పండితులకు వర్తించేదిగా కనిపించినా, కొంతవరకూ మొత్తం ముస్లిం జనసామాన్యాన్ని ఉద్దేశిస్తోంది. అల్-జర్నుజీ నియమం "నేర్చుకోవడం అన్నది మనందరికీ నిర్దేశించబడ్డ విధి" అన్నది వివరిస్తోంది.[48] ప్రాచీన కాలపు ఇస్లామీయ సమాజాల్లో అక్షరాస్యతా శాతాన్ని లెక్కించడం అసాధ్యమే అయినా సాపేక్షంగా అది చాలా ఎక్కువే అని చెప్పవచ్చు, కనీసం అప్పటి ఐరోపా సమాజాలతో పోల్చుకుంటే.[48]

 
978 నుంచి కైరోలోని అల్-అజహర్ మసీదులో వ్యవస్థీకృత బోధన సాగేది.

ఇంటివద్ద కానీ, చాలావరకూ మసీదులకు అనుబంధంగా ఉండే ప్రాథమిక పాఠశాల వద్ద కానీ చిన్నవయసులోనే అరబిక్ భాష, ఖురాన్ చదవడంతో విద్యాభ్యాసం ప్రారంభం అయ్యేది.[48] కొంతమంది విద్యార్థులు ఆపైన ఖురాన్ వ్యాఖ్యానమైన తఫ్‌సిర్, ఇస్లామీయ న్యాయశాస్త్రమైన ఫిఖ్‌హ్‌లు చదువుకునేవారు, ఇవి బాగా ముఖ్యమైనవిగా భావించేవారు.[49] విద్యాభ్యాసంలో బట్టీపట్టడం, గుర్తుపెట్టుకోవడంపై ఎక్కువగా దృష్టిపెట్టినా, మరింత ముందుకుసాగిన ఉన్నత విద్యార్థులు అధ్యయనం చేసిన పాఠ్యాలపై వ్యాఖ్యానాలను చదవడం, స్వయంగా వ్యాఖ్యానించడంలో శిక్షణ ఇచ్చేవారు.[49] ఉలేమాలనే పండితులతో దాదాపు అన్ని సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో విద్వాంసులుగా ఎదగాలనే అభిలషించేవారితో పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేసేవారు.[49]

ఇస్లాం మతం ప్రారంభమైన కొద్ది సంవత్సరాల పాటు విద్యా బోధన ఏ వ్యవస్థలూ లేకుండా సాగేది, కానీ 11, 12 శతాబ్దాల ప్రారంభంలో ఉలేమాల మద్దతు సాధించడానికి పరిపాలన వర్గం వారు మదరసాలు అనే ఉన్నత మత విద్యా సంస్థలు స్థాపించారు.[50] వేగంగా ఇస్లామీయ ప్రపంచం అంతటా మదరసాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇది వైవిధ్యభరితమైన ఇస్లామీయ సమాజాలు ఉమ్మడి సాంస్కృతిక ప్రాజెక్టుగా ఇస్లామీయ విద్యను కొద్ది పట్టణ కేంద్రాలకు ఆవల ఇస్లామీయ విద్యను విస్తరించడానికి ఉపకరించింది.[50] ఏ మార్పులు వచ్చినా బోధన పద్ధతిలో శిష్యులకు, వారి గురువుతో ఉండే వ్యక్తిగత సంబంధం ముఖ్య కేంద్రంగానే ఉండసాగింది.[50] విద్య సాధించినట్టుగా ధ్రువీకరణ "ఇజాజా" అన్నది ఇచ్చే అధికారం విద్యాసంస్థ కాక విద్యను బోధించిన పండితుడికే ఉండేది. విద్యా వ్యవస్థలో గుర్తింపు పొందిన ఏకైక స్థాయి పరంపర (హయరార్కీ) గురుశిష్య పరంపర మాత్రమే.[50] మదరసాల్లో విద్యాభ్యాసం కేవలం మగవారికే అందుబాటులో ఉన్నా, పట్టణాలు, నగరాల్లో ప్రాముఖ్యత కలిగిన కుటుంబాల స్త్రీలకు ఇళ్ళు, ఆంతరంగిక ప్రదేశాల్లో విద్య నేర్పేవారు, అలా చదువుకుని హదీత్ అధ్యయనం, కాలిగ్రఫీ అనే అందమైన చేతిరాత విద్య, కవిత్వ పఠనం వంటివాటిలో ఇజాజాలు పొందిన మహిళలు ఎందరో ఉండేవారు.[51][52] శ్రామికులైన మహిళలు మత గ్రంథాలను, వ్యవహారికంగా పనికివచ్చే నైపుణ్యాలు పెద్దల నుంచి, ఒకరి నుంచి ఒకరూ నేర్చుకునేవారు. అయితే వారికీ పురుషులతో పాటుగా మసీదులు, స్వగృహాల్లో కొంత విద్యాబోధన సాగేది.[51]

ముస్లిములు ఇస్లామీయ మతశాస్త్రాలను ఇస్లాంకు పూర్వపు నాగరికతల నుంచి పొందిన తత్త్వశాస్త్రం, వైద్యం వంటి శాస్త్రాలను విభజిస్తూ వీటికి "ప్రాచీనుల శాస్త్రాలు" లేక "హేతుబద్ధమైన శాస్త్రాలు" అని పేరు పెట్టారు.[53] ప్రాచీనుల శాస్త్రాలని పిలిచే ఈ శాస్త్రాలు పలు శతాబ్దాలుగా అభివృద్ధి చెందినవి, వాటిని ఇస్లామీయ ప్రపంచం స్వీకరించడం, తర్వాతి తరాలకు అందించడం అన్నది ప్రాచీన, మధ్యయుగ ఇస్లాం విద్యావ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం అయింది.[53] ఈ ప్రయత్నాలు బాగ్దాద్‌లో నెలకొన్న హౌస్ ఆఫ్ విజ్డమ్ వంటి సంస్థల మద్దతుతో సాగినా, చాలావరకూ గురువు నుంచి శిష్యుడు అభ్యసించడంతోనే ఈ శాస్త్రాలు తర్వాతి తరాలకు అందేవి.[53]

సా.శ 859 సంవత్సరంలో స్థాపించిన అల్ ఖురోయిన్ విశ్వవిద్యాలయం పట్టా ప్రదానం చేసే విశ్వవిద్యాలయాల్లో అత్యంత ప్రాచీనమైనదని ఒక వాదన.[54] అల్-అజహర్ విశ్వవిద్యాలయం అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో మరొకటి. మధ్యయుగాల నాటి ఇస్లామీయ విశ్వవిద్యాలు నిజానికి మత గ్రంథాలను, న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్రాలైన - మదరసాలు. ఇస్లామీయ దండయాత్రల్లో భాగంగా క్రైస్తవ గ్రీకు రోమన్ సామ్రాజ్యాన్ని పరిశీలించే అవకాశం రావడంతో మదరసాల్లో ఇతర విషయాలను కూడా బోధించడం ప్రారంభించారు, కానీ మత న్యాయశాస్త్రంలో నిష్ణాతులకే పట్టా లభించేది: మదరసా ఫాతిమాయిద్ ఖలీఫత్ జ్ఞాపకంగా నిలిచింది. ఫాతిమాయిద్లు వారి వంశమూలాన్ని మహమ్మద్ ప్రవక్త కుమార్తె ఫాతిమాతో ముడిపెడుతూండేవారు, కాబట్టి ఈ సంస్థకు ఆమె గౌరవ నామమైన అల్-జహ్రా (అద్భుతమైన తెలివి కలది) అన్నపేరు పెట్టారు.[55] అల్-అజహర్ మసీదులో వ్యవస్థీకృతమైన బోధన 978లో ప్రారంభమైంది.[56]

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 George Saliba (1994), A History of Arabic Astronomy: Planetary Theories During the Golden Age of Islam, pp. 245, 250, 256–7. New York University Press, ISBN 0-8147-8023-7.
  2. 2.0 2.1 King, David A. (1983). "The Astronomy of the Mamluks". Isis. 74 (4): 531–555. doi:10.1086/353360.
  3. 3.0 3.1 Hassan, Ahmad Y (1996). "Factors Behind the Decline of Islamic Science After the Sixteenth Century". In Sharifah Shifa Al-Attas (ed.). Islam and the Challenge of Modernity, Proceedings of the Inaugural Symposium on Islam and the Challenge of Modernity: Historical and Contemporary Contexts, Kuala Lumpur, August 1–5, 1994. International Institute of Islamic Thought and Civilization (ISTAC). pp. 351–399. Archived from the original on 2 April 2015.
  4. Joel L. Kraemer (1992), Humanism in the Renaissance of Islam, p. 1 & 148, Brill Publishers, ISBN 90-04-07259-4.
  5. Howard R. Turner, Science in Medieval Islam, University of Texas Press, November 1, 1997, ISBN 0-292-78149-0, pg. 270 (book cover, last page)
  6. Medieval India, NCERT, ISBN 81-7450-395-1
  7. 7.0 7.1 Vartan Gregorian, "Islam: A Mosaic, Not a Monolith", Brookings Institution Press, 2003, pg 26–38 ISBN 0-8157-3283-X
  8. Islamic Radicalism and Multicultural Politics. Taylor & Francis. 2011-03-01. p. 9. ISBN 978-1-136-95960-8.
  9. Josias Leslie Porter, A Handbook for Travelers in Syria and Palestine, 1868, p. 49.
  10. "ఆరున్నర శతాబ్దాల పాటు, ఇస్లాం స్వర్ణయుగం పాటు, ఈ ఖలీఫత్ సాగింది, ఒస్మానలీ సుల్తానుల ద్వారా, మహొమత్ కుటుంబపు ఆఖరి రక్త వారసుని మరణంతో ముగిసేవరకూ సాగింది. అసలైన ఖలీఫత్ బాగ్దాద్ పతనంతో ముగిసింది.". న్యూ అవుట్‌లుక్, వాల్యూం 45, 1892, p. 370.
  11. "గిల్మన్ ప్రస్తావించినట్టు ఇస్లాం స్వర్ణయుగం రెండవ ఖలీఫా ఒమర్‌తో అంతమైంది." ద లిటరరీ వరల్డ్, వాల్యూం 36, 1887, పు. 308.
  12. "The Ninth, Tenth and Eleventh centuries were the golden age of Islam" LIFE magazine, 9 May 1955, p.74.
  13. so Linda S. George, The Golden Age of Islam, 1998: "from the last years of the eighth century to the thirteenth century."
  14. Arshad Khan, Islam, Muslims, and America: Understanding the Basis of Their Conflict, 2003, p. 19.
  15. Groth, Hans, ed. (2012). Population Dynamics in Muslim Countries: Assembling the Jigsaw. Springer Science & Business Media. p. 45. ISBN 9783642278815.
  16. Rafiabadi, Hamid Naseem, ed. (2007). Challenges to Religions and Islam: A Study of Muslim Movements, Personalities, Issues and Trends, Part 1. Sarup & Sons. p. 1141. ISBN 9788176257329.
  17. Salam, Abdus (1994). Renaissance of Sciences in Islamic Countries. p. 9. ISBN 9789971509460.
  18. Brentjes, Sonja; Robert G. Morrison (2010). "The Sciences in Islamic societies". The New Cambridge History of Islam. Vol. 4. Cambridge: Cambridge University Press. p. 569.
  19. 19.0 19.1 "In Our Time - Al-Kindi,James Montgomery". bbcnews.com. 28 June 2012. Retrieved May 18, 2013.
  20. Hill, Donald. Islamic Science and Engineering. 1993. Edinburgh Univ. Press. ISBN 0-7486-0455-3, p.4
  21. "Nestorian - Christian sect".
  22. Rashed, Roshdi (2015). Classical Mathematics from Al-Khwarizmi to Descartes. Routledge. p. 33. ISBN 0-415-83388-4.
  23. "Hunayn ibn Ishaq - Arab scholar".
  24. Hussein, Askary. "Baghdad 767-1258 A.D.:Melting Pot for a Universal Renaissance". Executive Intelligence Review.
  25. O'Leary, Delacy. "How Greek Science Passed On To The Arabs".
  26. Sarton, George. "History of Islamic Science". Archived from the original on 2016-08-12.
  27. Nancy G. Siraisi, Medicine and the Italian Universities, 1250–1600 (Brill Academic Publishers, 2001), p 134.
  28. Beeston, Alfred Felix Landon (1983). Arabic literature to the end of the Umayyad period. Cambridge University Press. p. 501. ISBN 978-0-521-24015-4.
  29. "Compendium of Medical Texts by Mesue, with Additional Writings by Various Authors". World Digital Library. Retrieved 2014-03-01.
  30. Griffith, Sidney H. (15 December 1998). "Eutychius of Alexandria". Encyclopædia Iranica. Retrieved 2011-02-07.
  31. Anna Contadini, 'A Bestiary Tale: Text and Image of the Unicorn in the Kitāb naʿt al-hayawān (British Library, or. 2784)', Muqarnas, 20 (2003), 17-33 (p. 17), మూస:Jstor.
  32. Bonner, Bonner; Ener, Mine; Singer, Amy (2003). Poverty and charity in Middle Eastern contexts. SUNY Press. p. 97. ISBN 978-0-7914-5737-5.
  33. Ruano, Eloy Benito; Burgos, Manuel Espadas (1992). 17e Congrès international des sciences historiques: Madrid, du 26 août au 2 septembre 1990. Comité international des sciences historiques. p. 527. ISBN 978-84-600-8154-8.
  34. Rémi Brague, Assyrians contributions to the Islamic civilization Archived 2013-09-27 at the Wayback Machine
  35. Britannica, Nestorian
  36. Foster, John (1939). The Church of the T'ang Dynasty. Great Britain: Society for Promoting Christian Knowledge. p. 31. The school was twice closed, in 431 and 489
  37. The School of Edessa, Nestorian.org.
  38. Frew, Donald. "Harran: Last Refuge of Classical Paganism".
  39. "Harran University". Archived from the original on 2018-01-27.
  40. University of Tehran Overview/Historical Events Archived 2011-02-03 at the Wayback Machine
  41. Kaser, Karl The Balkans and the Near East: Introduction to a Shared History p. 135.
  42. Yazberdiyev, Dr. Almaz Libraries of Ancient Merv Archived 2016-03-04 at the Wayback Machine Dr. Yazberdiyev is Director of the Library of the Academy of Sciences of Turkmenistan, Ashgabat.
  43. Hyman and Walsh Philosophy in the Middle Ages Indianapolis, 1973, p. 204' Meri, Josef W. and Jere L. Bacharach, Editors, Medieval Islamic Civilization Vol.1, A-K, Index, 2006, p. 304.
  44. "In Our Time - Al-Kindi,Hugh Kennedy". bbcnews.com. 28 June 2012. Retrieved May 18, 2013.
  45. "Islam's Gift of Paper to the West". Web.utk.edu. 2001-12-29. Archived from the original on 2015-05-03. Retrieved 2018-04-16.
  46. Kevin M. Dunn, ''Caveman chemistry : 28 projects, from the creation of fire to the production of plastics''. Universal-Publishers. 2003. p. 166. ISBN 9781581125665.
  47. Kühnel E., in Zeitschrift der deutschen morgenländischen Gesell, Vol. CVI (1956)
  48. 48.0 48.1 48.2 48.3 48.4 Jonathan Berkey (2004). "Education". In Richard C. Martin (ed.). Encyclopedia of Islam and the Muslim World. MacMillan Reference USA.
  49. 49.0 49.1 49.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; berkey-ed2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  50. 50.0 50.1 50.2 50.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; berkey-ed3 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  51. 51.0 51.1 Lapidus, Ira M. (2014). A History of Islamic Societies. Cambridge University Press (Kindle edition). p. 210. ISBN 978-0-521-51430-9.
  52. Berkey, Jonathan Porter (2003). The Formation of Islam: Religion and Society in the Near East, 600-1800. Cambridge University Press. p. 227.
  53. 53.0 53.1 53.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; berkey-ed4 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  54. The Guinness Book Of Records, Published 1998, ISBN 0-553-57895-2, P.242
  55. Halm, Heinz. The Fatimids and their Traditions of Learning. London: The Institute of Ismaili Studies and I.B. Tauris. 1997.
  56. Donald Malcolm Reid (2009). "Al-Azhar". In John L. Esposito (ed.). The Oxford Encyclopedia of the Islamic World. Oxford: Oxford University Press. doi:10.1093/acref/9780195305135.001.0001/acref-9780195305135-e-0091 (inactive 2017-11-01).{{cite encyclopedia}}: CS1 maint: DOI inactive as of నవంబరు 2017 (link)