ఉప్పరపల్లి (రాజేంద్రనగర్)
ఉప్పరపల్లి తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని గ్రామం.[1]
ఉప్పరపల్లి | |
— గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°21′27″N 78°25′02″E / 17.3575419°N 78.4173129°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం రాజేంద్రనగర్ | |
ప్రభుత్వం | |
- కార్పొరేటర్ - జి.ఏచ్.ఎం.సి, రాజెంద్రనగర్ | |
జనాభా (2001) | |
- మొత్తం | ---- |
- పురుషుల సంఖ్య | ---- |
- స్త్రీల సంఖ్య | ---- |
- గృహాల సంఖ్య | ---- |
పిన్ కోడ్ | 500077 |
ఎస్.టి.డి కోడ్ |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో అత్తాపూర్, గగన్‌పహడ్, హైదర్‌గూడ, శివరాంపల్లి జాగీర్, కాటేధాన్, మధుబన్ కాలనీ, పద్మశాలిపురం, ప్రగతి కాలనీ, మైలార్‌దేవ్‌పల్లి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]
ప్రార్థనా మందిరాలు
మార్చు- కనకదుర్గా దేవాలయం
- మసీదు ఇ మొయిన్
- మసీదు ప్రిన్స్ షహమత్ జా
విద్యాసంస్థలు
మార్చు- ఫ్రోబెల్ ఒకేషనల్ జూనియర్ కళాశాల
- తపస్య డిగ్రీ కళాశాల
- విద్యా వినయాలయ పాఠశాల
- సెయింట్ ఆన్స్ గర్ల్స్ హైస్కూల్
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉప్పరపల్లి నుండి లక్డీకపూల్, టోలిచౌకి, మెహదీపట్నం, బాపు ఘాట్, సికింద్రాబాద్ జంక్షన్, కోఠి, శంషాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4]
అభివృద్ధి పనులు
మార్చు2021, మే 29న ఈ ఉప్పర్‌పల్లి ప్రాంతంలో పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేకు కనెక్టివిటీగా నిర్మించిన రెండు ర్యాంపులను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్రమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్‌గౌడ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీలు పి. మహేందర్‌రెడ్డి, యెగ్గె మల్లేశం, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ప్రారంభించారు.[5][6]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.
- ↑ "Upperpally , Hyderabad". www.onefivenine.com. Retrieved 2021-10-20.
- ↑ "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-10-20.
- ↑ సాక్షి, తెలంగాణ (29 May 2021). "ఉప్పర్‌పల్లి ర్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Sakshi. Archived from the original on 2021-05-29. Retrieved 20 October 2021.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (29 May 2021). "ఉప్పర్‌పల్లి ర్యాంప్‌లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 29 May 2021. Retrieved 20 October 2021.