కంచర్ల లక్ష్మారెడ్డి

కంచర్ల లక్ష్మారెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, నేటి నిజం, సాయంకాలం, మహానగర్ వంటి పలు పత్రికల్లో పనిచేశాడు. తెలంగాణ ప్రభ పేరుతో వారపత్రికను, కాలేజీ విద్యార్థి పేరుతో మంత్లీని స్వయంగా నడిపాడు.[1]

కంచర్ల లక్ష్మారెడ్డి
కంచర్ల లక్ష్మారెడ్డి
జననం
కంచర్ల లక్ష్మారెడ్డి

మరణం2022, నవంబరు 3
వృత్తిజర్నలిజం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు

జననం, విద్య

మార్చు

లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, పరసాయపల్లె గ్రామంలో జన్మించాడు. 1950లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేశాడు.

జర్నలిస్టుగా

మార్చు

సూర్యదేవర రాజ్యలక్ష్మి నిర్వహించిన తెలుగుదేశం రాజకీయ వారపత్రికతో జర్నలిస్టుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. దేవులపల్లి ప్రభాకరరావు సారథ్యంలో వెలువడిన ‘జనత’ పత్రికలో 150 రూపాయల నెల జీతంతో ఉపసంపాదకుడిగా పనిచేశాడు. తరువాత ఈనాడు పత్రికలో చేరాడు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్తలు ప్రచురిస్తోందన్న ఆరోపణతో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇతర తెలుగు పత్రికలలో, ఇండియన్ హెరాల్డ్ (ఠాకూర్ హరిప్రసాద్), వారంవారం (జి. రామారావు), నిజం (దేవదాసు), మహానగర్ (పాంచజన్య), తెలంగాణప్రభ (మర్రి చెన్నారెడ్డి)లలో కూడా పనిచేశాడు.

తెలంగాణ ఉద్యమం

మార్చు

1969 నాటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా మూడునెలలపాటు తెలంగాణ ఉద్యమ వార్తలతో “నేడు” అనే పేరుతో ఒక కరపత్రాన్ని వెలువరించాడు. మొదటి కరపత్రంలో ‘తెలంగాణ సింహకిశోరం చెన్నారెడ్డి’ అంటూ ప్రధాన శీర్షిక ప్రచురించిన లక్ష్మారెడ్డి తన చివరి కరపత్రంలో ‘‘తెలంగాణ ద్రోహి చెన్నా’’ అనే ప్రధాన శీర్షికతో ప్రచురించాడు. వార్తాపత్రికల రిజిస్ట్రార్ అనుమతి లేకుండా పత్రికస్థాయిలో “నేడు”ను వెలువరించడం నేరంగా పరిగణించడంతో లక్ష్మారెడ్డి నెలరోజులపాటు కఠిన కారగార శిక్షను అనుభవించాడు.[2]

ఆర్థిక సహాయం

మార్చు

తెలంగాణ అక్షర యోధుడు పేరిట లక్ష్మారెడ్డి గురించి ఆంధ్రభూమిలో వచ్చిన ప్రత్యేక కథనాన్ని చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 జూన్ 13న తన క్యాంపు కార్యాలయానికి లక్ష్మారెడ్డిని పిలుపించుకొని సీఎం సహాయనిధి నుంచి 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశాడు.[3]

వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల కారణంగా ఒంటరిగానే జీవించిన లక్ష్మారెడ్డి, పార్కిన్సన్ వ్యాధి సమస్యలతో 2022 నవంబరు 3న తెల్లవారుజామున వరంగల్లులో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. telugu, NT News (2022-11-03). "సీనియర్ జర్నలిస్టు కె.ఎల్. రెడ్డి మృతి .. పలువురు సంతాపం". www.ntnews.com. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.
  2. "అసాధారణ జర్నలిస్టు కెఎల్ రెడ్డికి అక్షరాంజలి". Sakalam. 2022-11-03. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.
  3. telugu, NT News (2022-11-03). "కంచర్ల లక్ష్మారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం". www.ntnews.com. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.