కె.ఆర్.కె.మోహన్

కె.ఆర్.కె.మోహన్ (కంచి రామకృష్ణ మోహన్) సైన్స్ ఫిక్షన్ రచయితగా సుప్రసిద్ధుడు. ఇతడు కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో 1933, నవంబర్ 18న జన్మించాడు[1].

రచనలుసవరించు

ఇతని రచనలు అనామిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆకాశిక్, ఆదివారం, ఆనందజ్యోతి, ఇండియా టుడే, ఈవారం, ఉదయం, కథాకేళి, చతుర, చుక్కాని, జనసుధ, జయశ్రీ, జలధి, జాగృతి, జ్యోతి, తెలుగు, తెలుగు విద్యార్థి, నివేదిత, పల్లకి, పుస్తకం, ప్రగతి, ప్రభవ, భారతమిత్రం, భారతి, మయూరి, మూసీ, యువ, యోజన, రచన, విజయ, విశ్వరచన, వీచిక, సెల్యూట్, సౌమ్య, స్వాతి, హాస్యప్రభ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

ఇతని ముద్రిత గ్రంథాలు:

  1. ఊరగాయ నవ్వింది (కథాసంపుటం)
  2. కె.ఆర్.కె.మోహన్ కథలు (కథాసంపుటం)
  3. జారుడు మెట్లు జారని కాళ్లు (కథాసంపుటం)
  4. తుషార బిందువులు (కథాసంపుటం)
  5. పిల్లల కథలు (కథాసంపుటం)
  6. మణి మంజీరాలు (కథాసంపుటం)
  7. రాగ రేఖలు (కథాసంపుటం)
  8. రామాయణం తిరగబడింది (కథాసంపుటం)
  9. సుమసౌరభాలు (కథాసంపుటం)
  10. సైన్స్ ఫిక్షన్ కథలు (కథాసంపుటం)
  11. బాబాసాహెబ్ అంబేద్కర్ (అనువాదం)
  12. ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము
  13. శతాబ్దాలుగా తెలుగు భాషాస్వరూపం
  14. అద్దాల మేడ (రెండు నాటకాలు - రెండు ఏకపాత్రాభినయములు)
  15. పాశ్చాత్య విద్వాంసులు - తెలుగు భాషాసంస్కృతులు
  16. వైకుంఠపాళీ
  17. చిత్రరంగ (వి)చిత్రాలు
  18. వక్రించిన సరళరేఖలు (నవల)
  19. తేజోలింగ రహస్యం (సైన్స్ నవల)
  20. అంతరిక్షంలో అంతర్ధానం (సైన్స్ నవల)
  21. పిల్లల కోసం తెలుగు సాహిత్య చరిత్ర
  22. కనకపు సింహాసనమున
  23. కనువిప్పు

పురస్కారాలుసవరించు

  • నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్(NCSTC) జాతీయ పురస్కారం 1993లో[2].

మూలాలుసవరించు