కొడాలి

భారతదేశంలోని గ్రామం

కొడాలి, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 132., ఎస్.టి.డి.కోడ్ = 08671.

కొడాలి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,925
 - పురుషులు 1,445
 - స్త్రీలు 1,480
 - గృహాల సంఖ్య 947
పిన్ కోడ్ 521132
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

ఘంటసాల మండలంసవరించు

ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె, శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

కొడాలి గ్రామానికి సమీపంలో తెలుగురావుపాలెం, కొత్తపల్లి, పెనుమత్చ, చిట్టూర్పు, ఘంటసాల గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

చల్లపల్లి, ఘంటసాల, కొల్లూరు, పమిడిముక్కల

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కొడాలి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 50 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

రాష్ట్రస్థాయి గణితబోధనోపకరణాల ప్రదర్శన పోటీలలో, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టి.ఫణిరాజామోహన్ కు ద్వితీయస్థానం లభించింది. ప్రత్యేక గణిత శాస్త్రవేత్త శ్రీనివాసరామానుజన్ జయంతి సందర్భంగా, 2014,డిసెంబరు-22వ తేదీనాడు, గుంటూరులో ఏ.పి.ఎస్.ఇ.ఆర్.టి. ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి గణిత ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వీరు ఈ ప్రదర్శనలో, "గణితంలో సృజనాత్మకత" అను అంశంపై, 1 నుండి 10వ తరగతి వారకు, గణితం సులువుగా అర్ధం అయ్యేటట్లుగా, ప్రాథమిక సూత్రాలతోపాటు, గణిత బోధనోపకరణాలను రూపొందించి ప్రదర్శించారు. వీరికి ఇంతకుమునుపే, 2014,డిసెంబరు-16వ తేదీనాడు, గుడ్లవల్లేరు మండలంలోని అంగలూరులో జరిగిన జిల్లాస్థాయి గణితబోధనోపకరణాల ప్రదర్శనా పోటీలలో ప్రథమస్థానం లభించింది. [14] ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఫణిరాజమోహన్, దక్షిణభారతదేశ స్థాయి వైఙానిక ప్రదర్శనలో ఉపాధ్యాయ విభాగంలో ప్రథమస్థానాన్ని పొంది, తన పాఠశాల కీర్తిప్రతిష్ఠలను జాతీయస్థాయిలో ఇనుమడింపజేసినారు. పుదుచ్చేరిలో 2017,జనవరి-4 నుండి 9 వరకు నిర్వహించిన దక్షిణభారతదేశస్థాయి వైఙానిక ప్రదర్శన-2017 లో, ఆయన ప్రదర్శించిన సృజనాత్మక గణితంలో ప్రథమ బహుమతి, నగదు బహుమతి లభించినవి. పుదుచ్చేరి రాష్ట్ర విద్యామంత్రి శ్రీ కమలకన్నన్ నుండి వీరు ఆ బహుమతి అందుకున్నారు. ఈ ప్రదర్శనలో ఆరు రాష్ట్రాలకు చెందిన 439 మంది పాల్గొన్నారు. [20] పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని చిన అమిరం గ్రామంలోని విశ్వకవి అంగ్ల మాధ్యమ పాఠశాలలో 2015,డిసెంబరు-28 నుండి 30 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యా, వైఙనిక ప్రదర్శనలో, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఫణిరాజమోహన్ రూపొందించిన గణిత ప్రదర్శన ప్రథమస్థానం పొంది, జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది. 2016,జనవరి-19 నుండి 23 వరకు బెంగుళూరులోని సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియంలో నిర్వహించు జాతీయస్థాయి ప్రదర్శనలో దీనిని ప్రదర్శించెదరు. [18] ఈ పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ప్రతి సంవత్సరం, 100% ఉత్తీర్ణతను సాధించుచున్నారు. కొంతమంది విద్యార్థులు ఐ.ఐ.ఐ.టి.లో ప్రవేశాలు పొందుచున్నారు. ఈ పాఠశాల 51వ వార్షికోత్సవాన్ని, 2016,ఫిబ్రవరి-16వ తేదీనాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాదులో ఇక్రిశాట్ సంస్థ శాస్త్రవేత్త శ్రీ రూపవరం శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, పాఠశాలలో రెండు రోజులపాటు వైద్యా, వైఙానిక ప్రదర్శన నిర్వహించారు. [19]

శ్రీనివాసా ప్రాథమికోన్నత పాఠశాలసవరించు

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాలసవరించు

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

శ్రీ ప్రసన్నాంజనేయ కళ్యాణమండపం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ గుమ్మడి విజయకుమార్, సర్పంచిగా ఎన్నికైనారు. [8]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి దేవాలయంసవరించు

కొడాలి గ్రామంలోని ఈ దేవాలయంలో, 2014,మార్చ్-9 ఆదివారం ఉదయం 11-07 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికై 41 అడుగుల బలార్షా టేకును మేఘనాలు, ఇత్తడి తొడుగులతో, రు. 7 లక్షల నిధులతో గ్రామస్థులు, దాతల సహకారంతో తయారు చేయించారు. ఈ సందర్భంగా మద్యాహ్నం, 5వేల మందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహించారు. ఆదివారం రాత్రికి ఆలయంలో హోమగుండాల వద్ద, విశేషపూజలు జరిగినవి. మూడురోజులనుండి ఆలయం వద్ద జరుగుచున్న ప్రత్యేక పూజలు ఆదివారంతో ముగిసినవి.ఈ కార్యక్రమానికి దివిసీమ నుండి భక్తులు పెద్ద యెత్తున తరలి వచ్చారు. [5]&[6]

ఈ ఆలయంలో, 2016,జనవరి-30వతేదీ శనివారం రాత్రి, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్రనామ, కుంకుమార్చనలు నిర్వహించారు. [19]

శ్రీ గంగా పార్వతీ సమేత జగధీశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో 2014,నవంబర్-8, శనివారం నాడు, కార్తీకమాసం సందర్భంగా స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన నిర్వహించారు. అభిషేకపూజలు, సహస్రనామ, కుంకుమపూజలు నిర్వహించారు. [11]

శ్రీ కోదండరామాలయంసవరించు

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంసవరించు

గంగానమ్మ తల్లిసవరించు

కొడాలి పరిసర ప్రాంతవాసుల ఇలవేలుపు అయిన గంగానమ్మ తల్లి వార్షిక జాతరను పురస్కరించుకొని, 2014,నవంబర్-9 ఆదివారం నాడు, కొడాలి గ్రామంలో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గంగానమ్మ తల్లి పోతురాజుల ఉత్సవ విగ్రహాలతో, డప్పుల విన్యాసాల మధ్య గ్రామోత్సవాన్ని నిర్వహించారు. [10]

శ్రీ రామకృష్ణ సేవాశ్రమంసవరించు

ఈ ఆశ్రమంలో శారదాదేవి 162వ జయంతి మహోత్సవాలను 2014,డిసెంబరు-11 నుండి 13వ తేదీ వరకు నిర్వహించారు. 11వ తేదీన మంగళహారతి, గురువుల సుప్రభాతం, గీతాపారాయణం, 12వ తేదీన ప్రముఖులు శ్రీ ద్రోణ పూర్ణచంద్రరావు గారిచే ధ్యానం, 13వ తేదీన డాక్టర్ హరీష్, కృష్ణభార్గవ్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేదసేవలందించారు. శారదాదేవి జయంతిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో, మూడు హోమగుండాలవద్ద, భక్తులచే గాయత్రీ యఙాన్ని శాస్త్రోక్తంగా, మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. శారదాదేవి జయంతిని నిర్వహించారు. [12]&[13]

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంసవరించు

ఈ ఆలయంలో 23 సంవత్సరాల క్రితం, దివంగత సంఘసేవకులు శ్రీ గుత్తికొండ గోపాలరావు సహకారంతో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ ఆలయ 23వ వ్య్వస్థాపక ప్రతిష్ఠా మహోత్సవం, 2015,మార్చ్-14వ తేదీ శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, సాయిబాబా వారి విగ్రహానికి అభిషేకాలు, దీపారాధన నిర్వహించారు. [15]

కొడాలి గ్రామంలో, శ్రీ లక్ష్మీ హయగ్రీవస్వామి జయంతి వేడుకలను, 2015,ఆగష్టు-29వ తేదీనాడు, వైభవంగా నిర్వహించారు. [17]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, చెరుకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

శ్రీ కొడాలి ఆంజనేయులు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులుసవరించు

కొడాలి గ్రామానికి చెందిన వీరు, ఆ రోజులలో, తను చేయుచున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, గాంధీజీ నడిచిన మార్గంలో నడిచారు. బ్రిటిష్ సామ్రాజాన్ని ఎదిరించి అనేక ఉద్యమాలలో పాలు పంచుకున్నారు. 1924, ఏప్రిల్-20న గాంధీజీ ఘంటసాల గ్రామానికి వచ్చినపుడు, ఆయనను కొడాలి గ్రామానికి తీసికొనివచ్చి, స్వాతంత్ర్యపోరాటానికి గ్రామస్థుల నుండి విరాళాలు సేకరించి అందించారు. అంతేగాక తన 40 ఎకరాల భూమితోపాటు, ఇంటిని సైతం ఉద్యమానికి పణంగా పెట్టిన నిస్వార్ధపరుడు. పోరాటంలో లాఠీదెబ్బలు, జైలు జీవితానికి వెరవలేదు. అనేక పుస్తకాలు గూడా వ్రాసిన వీరు, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు వ్రాసిన దేశభక్తిని ప్రదర్శించే అవతార పరివర్తనం నాటకం, బ్రిటిష్ ప్రభుత్వ నిషేధానికి గురైనది. భారత ప్రభుత్వం ఇచ్చిన బంగారు పతకాన్ని, 1962లో చైనా యుద్ధం సమయంలో, విరాళంగా ఇచ్చి, మరోమారు తన దేశభక్తిని చాటుకున్నారు. 1982 లో వీరు అనారోగ్యంతో కన్నుమూసినారు. వీరి విగ్రహాన్ని ఇటీవల కొడాలి గ్రామంలో ఏర్పాటు చేసారు. [9]

గ్రామ విశేషాలుసవరించు

  1. ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థిని కొడాలి సృజన, పెడనలో 2013,డిసెంబరు 2 నుండి 4 వరకూ జరిగిన Inspire Sceince Fair లో, ప్రదర్శించిన Concept of Fundamental Operations in Number Systems అనే ప్రదర్శన పలువురిని ఆకట్టుకొనుటయేగాక, రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎన్నికైనది. అనంతపురంలో, 2013,డిసెంబరు 7నుండి జరిగే, రాష్ట్రస్థాయి Sceince Fair లో, ఈ ప్రదర్శన కృష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం వహించబోవుచున్నది. [2]
  2. ఈ గ్రామంలోని శ్రీ రామకృష్ణాశ్రమంలో, శారదాదేవి జయంతి మహోత్సవం సందర్భంగా, 27వ వార్షికోత్సవం 2013,డిసెంబరు,24న జరుగును. [3]
  3. ఉయ్యూరుకి చెందిన శ్రీ తాడినాడ ఫణిరాజమోహన్, కొడాలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరు గణితబోధనలో దిట్ట. వీరు పలు ప్రయోగాలద్వారా విద్యార్థులకు తేలికగా అర్ధమయ్యేలాగా గణితబోధన చేస్తున్నారు. కేవలం సైన్సు పాఠ్యాంశాలకే పరిమితమైన ప్రయోగాత్మక పద్ధతిని, వీరు గణితంలో గూడా చేసి చూపించుచున్నారు. వీరు 30కి పైగా గణిత అష్టావధానాలను నిర్వహించారు. గణితంలో పలు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పురస్కారాలు పొందినారు. [4]
  4. కొడాలి గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో, హైదరాబాదు వాస్తవ్యులైన శ్రీ సూర్యదేవర విజయభాస్కర్, రు.ఆరు లక్షల వితరణతో, నీటిశుద్ధి యంత్ర భవనాన్ని నిర్మించారు. దీనిద్వారా కొడాలి, తాడేపల్లి, చిట్టూర్పు, వేములపల్లి, చినకళ్ళేపల్లి గ్రామాలవారికి శుద్ధినీరు లభించగలదు. ఈ యంత్రాన్ని, 2014, జూన్-22, ఆదివారం రాత్రి ప్రారంభించారు. [7]
  5. ఈ గ్రామానికి చెందిన శ్రీ గుమ్మడి రత్నాకరరావు, గంగాభవాని దంపతుల కుమారుడైన శ్రీ శైలేంద్రకృష్ణ, ఒక ఎన్.ఆర్.ఐ. వీరు తన గ్రామాభివృద్ధికై రు. 1.34 లక్షల విరాళాన్ని అందజేసినారు. [16]

గణాంకాలుసవరించు

1.2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3407.[3] ఇందులో పురుషుల సంఖ్య 1695, స్త్రీల సంఖ్య 1712, గ్రామంలో నివాసగృహాలు 959 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 814 హెక్టారులు.

2.జనాభా (2011) - మొత్తం 2,925 - పురుషుల సంఖ్య 1,445 - స్త్రీల సంఖ్య 1,480 - గృహాల సంఖ్య 947

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/Kodali". Archived from the original on 7 ఏప్రిల్ 2017. Retrieved 25 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)CS1 maint: discouraged parameter (link)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,డిసెంబరు-6; 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2013,డిసెంబరు-21; 1వపేజీ. [4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,డిసెంబరు-23; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మార్చ్-10, 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మార్చ్-11; 1వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-24; 2వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-26; 3వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-15; 1వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,నవంబర్-10; 1వపేజీ. [11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,నవంబర్-9; 3వపేజీ. [12] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,డిసెంబరు=11; 2వపేజీ. [13] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,డిసెంబరు-14; 2వపేజీ. [14] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-24; 6వపేజీ. [15] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చ్-15; 3వపేజీ. [16] ఈనాడు కృష్ణా; 2015,మే-1; 16వపేజీ. [17] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగష్టు-30; 1వపేజీ. [18] ఈనాడు అమరావతి; 2016,జనవరి-1; 42వపేజీ. [19] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-1; 40వపేజీ. [20] ఈనాడు అమరావతి; 2017,జనవరి-11; 4వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కొడాలి&oldid=2959301" నుండి వెలికితీశారు