కొత్తపేట (బాలాపూర్ మండలం)

రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం

కొత్తపేట, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలంలోని గ్రామం. దిల్‍సుఖ్‍నగర్ నుండి ఎల్.బి.నగర్ కి వెళ్ళేదారిలో ఈ కొత్తపేట ఉంది. ఇది జనగణన పట్టణం.

కొత్తపేట
—  సమీపప్రాంతం  —
కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోం
కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోం
కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోం
కొత్తపేట is located in తెలంగాణ
కొత్తపేట
కొత్తపేట
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°22′34″N 78°32′46″E / 17.376197°N 78.546053°E / 17.376197; 78.546053
దేశం  భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హైదరాబాదు
మెట్రో హైదరాబాదు
జోన్ తూర్పు
పరిధి ఎల్.బి.నగర్/గడ్డి అన్నారం
వార్డు 8
జనాభా (2011)
 - మొత్తం 33,864
పిన్‌కోడ్ 500 060

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్‌ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన బాలాపూర్ మండలంలోకి చేర్చారు.[1]

చరిత్ర

మార్చు

బ్రిటీషుకాలంలో నిర్మించిన విక్టోరియా మెమోరియల్ హోం భవనం కొత్తపేటలోనే ఉంది. ఇక్కడ ప్రధాన జిల్లా కోర్టు కూడా ఉంది.

కమర్షియల్స్ ప్రాంతం

మార్చు

ప్రధాన రహదారి వెంట షాపులు, బ్యాంకులు, అన్ని రకాల షాపింగ్ కాంప్లెక్సులు ఉన్నాయి. ఇక్కడ కొత్తపేట పండ్ల మార్కెట్ ఉంది.[2][3] ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్.[4] రైతు బజార్, స్వర్ణ కంచి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్, రిలయన్స్ డిజిటల్ వంటివి ఉన్నాయి. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, విక్టోరియా మొమోరియల్ హోం ప్లే గ్రౌండ్ ప్లే ఉన్నాయి.

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొత్తపేట నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడపబడుతున్నాయి. కొత్తపేటకు సమీపంలోని చైతన్యపురిలో మెట్రో స్టేషను కూడా ఉంది.[5]

ప్రసిద్ధ ప్రదేశాలు

మార్చు
 
రాత్రి వేళలో సరూర్‌నగర్‌ చెరువు

కొత్తపేట సమీపకాలనీలు

మార్చు

లక్ష్మీ నగర్ కాలనీ, గాయత్రీపురం కాలనీ, శ్రీ రామలింగేశ్వర కాలనీ, విజయపురి కాలనీ, కమలా నగర్, చైత్యన్యపురి, నేతాజీ నగర్, మారుతి నగర్, కృష్ణవేణి నగర్,ఉదయనగర్ కాలనీ, సరస్వతి నగర్, మాతాలక్ష్మీ నగర్, న్యూ మారుతి నగర్, గ్రీన్ హిల్స్ కాలనీ, వాసవి కాలనీ, వివేకానంద నగర్, విద్యుత్ నగర్,హనుమాన్ నగర్, అల్కానగర్, టెలిఫోన్ కాలనీ, ఇందిరా నగర్ కాలనీ, సౌభాగ్యపురం కాలనీ, సిండికేట్ బ్యాంక్ కాలనీ, ఎస్బిఐ కాలనీ, హుడా కాంప్లెక్స్, క్రాంతి నగర్ కాలనీ, వైద్యులు కాలనీ, హరిపురి కాలనీ, ఆర్బిఐ కాలనీ, మారుతీ నగర్, న్యూ మారుతీ నగర్ ఈస్ట్ శ్రీ సాయి బాబా కాలనీ, (పాత మద్దతు కాలనీ), న్యూ ఆర్బిఐ కాలనీ, రత్నానగర్, మొయ్యానగర్, సత్యానగర్

టిమ్స్ ఆసుపత్రి

మార్చు

కొత్తపేట పరిధిలోని గడ్డి‌అన్నారం (కొత్తపేట) పండ్ల మార్కె‌ట్‌లో 21.36 ఎక‌రాల్లో జీ ప్ల‌స్ 14 అంత‌స్తుల్లో వెయ్యి ప‌డ‌క‌ల మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణానికి 2022 ఏప్రిల్ 26న ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు భూమిపూజ చేశాడు. 900 కోట్లు రూపాయలతో నిర్మించనున్న ఈ మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌లో వెయ్యి ప‌డ‌క‌లను (300 ఐసీయూ బెడ్స్), 16 ఆప‌రేష‌న్ థియేట‌ర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు టి. హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి, జైపాల్ యాద‌వ్, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, ఇతర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6][7]

మూలాలు

మార్చు
  1. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-04.
  2. "Fruits flood Hyderabad Markets".
  3. "Kothapet - Realty Compass". Archived from the original on 2018-06-18.
  4. "Gaddiannaram market to be shifted to Koheda to ease traffic snarls".
  5. "Victoria Memorial - Kothapet Metro Station L&T metro". Retrieved 2020-09-27.
  6. telugu, NT News (2022-04-26). "ఎల్బీన‌గ‌ర్ టిమ్స్‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమిపూజ‌". Namasthe Telangana. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.
  7. "CM KCR: హైదరాబాద్‌లో టిమ్స్‌ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్‌ భూమి పూజ". EENADU. 2022-04-26. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.

వెలుపలి లంకెలు

మార్చు