తిరువనంతపురం జిల్లా

కేరళ లోని జిల్లా

తిరువనంతపురం జిల్లా, భారతదేశం, కేరళ రాష్ట్రంలోని దక్షిణాన ఉన్న జిల్లా.[3] ఈ జిల్లా 1949లో ఏర్పడింది. తిరువనంతపురం దీని ప్రధాన కార్యాలయం . ఇది కేరళ రాష్ట రాజధాని నగరం. ప్రస్తుత జిల్లా 1956లో కన్యాకుమారి జిల్లాను ఏర్పాటుచేయడానికి పూర్వ జిల్లా నుండి నాలుగు దక్షిణ తాలూకాలు వేరుచేయడం ద్వారా సృష్టించబడింది. తిరువనంతపురం నగరాన్ని రాష్ట్ర సమాచార సాంకేతిక రాజధాని అని కూడా అంటారు. ఈ నగరంలో 1990లో భారతదేశం లోని మొట్టమొదటి అతిపెద్ద ఐటి పార్క్, టెక్నోపార్క్ స్థాపించబడ్డాయి. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 9% కంటే ఎక్కువ మంది ఈ జిల్లాలో ఉన్నారు.[4] జిల్లా వైశాల్యం 2,192 చదరపు కిలోమీటర్లు (541,655 ఎకరం) లో విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కలప్రకారం, ఇది 33,01,427 జనాభాను కలిగి ఉంది.[5][6] ఇది మలప్పురం జిల్లా తర్వాత కేరళలో రెండవ అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలిచింది.[7] ఇది కేరళ రాష్ట్రంలో జనసాంద్రత అత్యధికంగా ఉన్న నగరం.ప్రతి చ.కి.మీ విస్తీర్ణంలో 1509 మంది జనసాంద్రత కలిగి ఉంది.[8] జిల్లాను తిరువనంతపురం, చిరాయింకీజు, నెయ్యట్టింకర, నెడుమంగడు, వర్కల, కట్టకడ అనే ఆరు ఉపజిల్లాలుగా విభజించబడింది. జిల్లాలోని పట్టణ సంస్థలు తిరువనంతపురం నగరపాలక సంస్థ, వర్కాల, నెయ్యట్టింకర, అట్టింగల్, నెడుమంగడ్ అనే పురపాలకసంఘాలు ఉన్నాయి.[9] నగరంలో చుట్టుపక్కల యాభైకి పైగా గుర్తింపు పొందిన ఆయుర్వేద కేంద్రాలు ఉన్నాయి. నగరం ప్రపంచ స్థాయి ఆధునిక ఆసుపత్రులను అందిస్తుంది.

తిరువనంతపురం జిల్లా
Trivandrum district
Clockwise from top:
Niyamasabha Mandiram, Kovalam Beach, Attingal, Poovar beach, Varkala underpass, and Anchuthengu Fort.
పటం
Thiruvananthapuram district
Location in Kerala
Coordinates: 8°29′N 76°56′E / 8.48°N 76.94°E / 8.48; 76.94
CountryIndia
రాష్ట్రంKerala
ముఖ్యపట్టణంThiruvananthapuram
Subdistricts
Government
 • Lok Sabha constituencies2
 • Vidhan Sabha constituencies14
విస్తీర్ణం
 • Total2,192 కి.మీ2 (846 చ. మై)
జనాభా
 (2011)
 • Total33,01,427 (male: 15,81,678; female: 15,69,917)
 • Urban
55.75%
Demographics
 • Literacy93.02%[1]
Vehicle registrationKL-01 Thiruvanthapuram,
KL-16 Attingal,
KL-19 Parassala,
KL-20 Neyyattinkara,
KL-21 Nedumangad,
KL-22 Kazhakoottam,
KL-74 Kattakkada,
KL-81 Varkala
Major highwaysNH 66
HDI (2005)Increase 0.773[2] ( High)
Average annual precipitation1,700 mm

భౌగోళికం

మార్చు
 
 
భారతదేశ పటంలో తిరువనంతపురం జిల్లా స్థానం

తిరువనంతపురం జిల్లా 8°10′N 76°25′E / 8.17°N 76.41°E / 8.17; 76.41, 8°32′N 77°10′E / 8.54°N 77.17°E / 8.54; 77.17 అక్షాంశ, రేఖాంశాల మధ్య ఉంది. నగర దక్షిణ భాగం, పరస్సల, కేవలం 54 కిలోమీటర్లు (34 మై.) దూరంలో, భారతదేశ దక్షిణ ద్వీపకల్ప కొన, కేప్ కొమోరిన్ (కన్యాకుమారి) నుండి దూరంగా ఉంది. జిల్లా మొత్తం 78 కిలోమీటర్లు (48 మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. పశ్చిమాన అరేబియా సముద్రం ఒడ్డు, కొల్లాం జిల్లా ఉత్తరాన ఉంది. తూర్పున తమిళనాడులోని తిరునెల్వేలి, దక్షిణాన కన్యాకుమారి జిల్లాలు ఉన్నాయి.[10]

జిల్లా దక్షిణ చివరలో కన్యాకుమారి నుండి కలియిక్కవిలా 54 కిలోమీటర్లు (34 మై.) దూరంలో ఉంది. భారత ద్వీపకల్పంలో అత్యంత దక్షిణ బిందువుగా ఉంది.[11] జిల్లా లోని మొత్తం జనాభాలో 33.75% జనాభా పట్టణప్రాంతాల్లో నివసిస్తున్నారు.[12]

జిల్లాలో మూడు ప్రధాన నదులు, అనేక మంచినీటి సరస్సులు,300 చెరువులు ఉన్నాయి. దీని తూర్పు ప్రాంతం అటవీప్రాంతం, ఉత్తరప్రాంతాలు ఎక్కువగా రబ్బరు సాగులో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలలో కొబ్బరి, అరటి, టాపియోకా వంటి మిశ్రమ మెట్టభూమి పంటలను పండిస్తారు.[13] జిల్లా వైశాల్యం 2,192 చదరపు కిలోమీటర్లు (541,655 ఎకరం) లో విస్తరించి ఉంది.

పేరు వెనుక చరిత్ర

మార్చు

తిరువనంతపురం అనే పేరు జిల్లా, దాని ప్రధాన నగరంగా పంచుకుంది. ఇది తమిళ పదం "తిరు", సంస్కృత పదం "అనంత-పురా" నుండి వచ్చింది. దీని అర్థం "అనంత భగవానుని నివాసం" అనే భావనను సూచిస్తుంది.[14] తిరువనంతపురం నగర మధ్యలోఉన్న హిందూ దేవాలయం దేవత నుండి ఈ పేరు వచ్చింది. అనంత అనేది శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి చెందిన విష్ణువు మరొక పేరు. 1991 వరకు ఆంగ్లంలో జిల్లా అధికారిక పేరు త్రివేండ్రం. నగరం అసలు పేరును ప్రభుత్వం తిరువనంతపురం అని అన్ని భాషలలో పునరుద్ధరించింది.

చరిత్ర

మార్చు
 
తిరువనంతపురంలోని కనకక్కున్ను ప్యాలెస్
 
1871లో ప్రచురించబడిన బ్రిటిష్ రాచరిక రాష్ట్రం స్టేట్ ఆఫ్ ట్రావెన్‌కోర్ పటం

తిరువనంతపురం నగరం పురాతన సంప్రదాయాలకు, జానపద సాహిత్యానికి సంబంధించి అనేక మైలురాళ్లను కలిగి ఉంది. ఇలాంటి వాటికి ఆనవాళ్లుగా జిల్లాలో అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. చేరా రాజవంశం దక్షిణాన కన్యాకుమారి నుండి ఉత్తరాన కాసర్‌గోడ్ జిల్లా వరకు ఉన్న మలబార్ తీర ప్రాంతాన్నిపరిపాలించింది. ఇందులో పాలక్కాడ్ గ్యాప్, కోయంబత్తూర్, సేలం, కొల్లి హిల్స్ ఉన్నాయి. కోయంబత్తూరు చుట్టుపక్కల ప్రాంతం మలబార్ తీరం, తమిళనాడు మధ్య ప్రధాన వాణిజ్యమార్గం పాలక్కాడ్ గ్యాప్‌కు తూర్పు ప్రవేశ ద్వారంలాగా పనిచేస్తుంది [15] ప్రస్తుత మలబార్ తీరంలోని దక్షిణ ప్రాంతం (కన్యాకుమారి, కొల్లం మధ్య తీరప్రాంతం) ఆయ్ రాజవంశం క్రింద ఉండేది. వీరు చేరాలకు సంబంధించిన అధికారిక సామంతులుగా ఉండేవారు.[16] ఆయ్ రాజవంశం (తరువాత వేనాడ్ రాజవంశం, చివరకు తిరువితంకూర్ రాజవంశం అని పిలుస్తారు), తర్వాత నన్నన్ రాజవంశం (తరువాత మూషిక రాజవంశం, చివరకు కోలాతిరు రాజవంశం అని పిలుస్తారు), వేలిర్ వంశానికి చెందిన రెండు పురాతన, అతిముఖ్యమైన వంశాలు. చేరులు, చోళులు, పాండ్యులతో చాలా తరచుగా వివాహాలు చేసుకున్నారు.[17][17][18][19][20]

ప్రస్తుత తిరువనంతపురం జిల్లా, కన్యాకుమారి జిల్లా, ప్రాచీన, మధ్య యుగాలలో ఆయ్ రాజవంశంచే పాలించబడింది. ఇది భారత ఉపఖండం లోని దక్షిణ భాగంలో ఉన్నతమిళ రాజ్యం.[21] అయ్ రాజ్యం వివిధకాలాలలో చోళులు, పాండ్యుల దాడులను, విజయాలను చవిచూసింది.[21] తరువాత ఇది మధ్యయుగాలలో వేనాడ్‌లో భాగమైంది.చివరికి సా.శ.18వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్ శక్తివంతమైన రాజ్యంగా విస్తరించబడింది.[21] పద్మనాభస్వామి ఆలయంలో తమిళ-ద్రావిడ నిర్మాణ శైలి కనిపిస్తుంది.ఈ దేవాలయాల నిర్మాణ శైలి సాధారణంగా కేరళలోని దేవాలయాల నిర్మాణశైలికి భిన్నంగా ఉంటుంది.[21]

 
1733లో హోమన్ వారసులు గీసిన మలబార్ తీరప్రాంత పటం. ఆ సమయంలో, ట్రావెన్‌కోర్ పటంలో చూపిన విధంగా కొల్లాం, కన్యాకుమారి మధ్య ఒక చిన్న భూభాగం మాత్రమే ఉంది (ప్రస్తుత జిల్లాలు త్రివేండ్రం, కన్యాకుమారి మాత్రమే).[22][23] [24] [25][26]

1684లో ఉమాయమ్మ రాణి పాలనా కాలంలో, ఆంగ్లేయ ఈస్టిండియా కంపెనీ సముద్ర తీరంలో దాదాపు 32 కిలోమీటర్లు (20 మై.) దూరంలో ఉన్న అంచుతెంగు వద్ద ఇసుకతో కూడిన భూమిని స్వాధీనం చేసుకుంది. తిరువనంతపురం నగరానికి ఉత్తరాన, ఒక కర్మాగారాన్ని నెలకొల్పి, పటిష్టం చేసారు. ఈ ప్రదేశానికి అంతకుముందు డచ్ వారు, ఆ తర్వాత బ్రిటిష్ వారు తరచూ వచ్చేవారు. ఇక్కడి నుంచే ఆంగ్లేయులు క్రమంగా తమ దౌత్యాన్ని ట్రావెన్‌కోర్‌లోని ఇతర ప్రాంతాలకు విస్తరించారు.[27] ఆధునిక చరిత్ర మార్తాండ వర్మ (సా.శ.1729 - సా.శ.1758) తో ప్రారంభమైంది. మార్తాండ వర్మను సాధారణంగా ఆధునిక ట్రావెన్‌కోర్ పితామహుడిగా పరిగణిస్తారు. సా.శ. 18వ శతాబ్దపు ఆరంభంలో ట్రావెన్‌కోర్ రాజకుటుంబం కొలతునాడు రాజకుటుంబం నుండి కొంతమంది సభ్యులను దత్తత తీసుకుంది.(ఆయ్/వేనాడ్/తిరువితంకూర్‌కు చెందిన చాలా కాలంగా విడిపోయిన చెల్లెలు రాజవంశం వారితో శతాబ్దాలుగా వారసులను పరస్పరం స్వీకరించే సంప్రదాయం ఉంది) కన్నూర్‌లో ఉంది.[28] తిరువనంతపురం మేధోపరమైన కళాత్మక కార్యకలాపాలకు గొప్పకేంద్రంగా ప్రసిద్ధి చెందింది.[29] పురక్కాడ్ యుద్ధంలో కోజికోడ్‌ లోని శక్తివంతమైన జామోరిన్‌ను ఓడించడం ద్వారా ట్రావెన్‌కోర్ కేరళలో అత్యంత ఆధిపత్య రాష్ట్రంగా అవతరించింది.

పట్టం నుండి తిరువనంతపురం నగర దృశ్య చిత్రం

అనంతపద్మనాభ స్వామి ఆలయం

మార్చు

అనంతపై శయనించిన విష్ణు ఉన్నదేవాలయం శ్రీ పద్మనాభస్వామి ఆలయం తిరువనంతపురం జిల్లాలో అత్యంత గుర్తించదగిన దిగ్గజమైలురాయి. ఈ ఆలయం సా.శ.16వ శతాబ్దానికి చెందింది.పద్మనాభ దేవతతో పాటు, ఈ ఆలయంలో కృష్ణుడు, నరసింహుడు, గణేశుడు, అయ్యప్పకు అంకితం చేయబడిన అనేక మందిరాలు ఉన్నాయి. దీనిని ట్రావెన్‌కోర్ రాజధానిని ప్రస్తుతం తమిళనాడులోని పొరుగునఉన్న కన్యాకుమారి జిల్లాలో ఉన్న పద్మనాభపురం నుండి బదిలీ చేసినప్పుడు, సా.శ. 1745లో ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి చెందిన రాజు మార్తాండ వర్మ దీనిని నిర్మించాడు.పద్మనాభునిదాసుడైన మార్తాండవర్మ, 'శ్రీ పద్మనాభదాసు'గా తన పాలనను ప్రారంభించాడు. విస్తారమైన ఆలయసముదాయం ,దానిఎత్తైన గోపురం, భారీ ఆలయ కోనేరులో ప్రతిబింబించే వివరణాత్మక శిల్పాలతో అలంకరించబడి, నేడుభక్తులు, సందర్శకులకు అత్యంత ఆకర్షణీయంగాఉంది.

రాజధాని నగరం

మార్చు

తిరువనంతపురం నగరం సా.శ 18వ శతాబ్దంనుండి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు ట్రావెన్‌కోర్ రాష్ట్రానికి రాజధానిగాఉంది. తిరువనంతపురం పురపాలక సంఘం 1920లో ట్రావెన్‌కోర్ ప్రాంతంలో మొదటి పురపాలకసంఘంగా ఉనికిలోకి వచ్చింది. రెండు దశాబ్దాల తర్వాత, చితిర తిరునాల్ బలరామ వర్మ హయాంలో, తిరువనంతపురం పురపాలకసంఘం 1940 అక్టోబరు 30న నగరపాలకసంస్థగా మారింది [30] రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘం సూచనలు ప్రకారం, తిరువనంతపురం లోని విలవంకోడ్ ఉపజిల్లా తమిళనాడులో విలీనం చేసారు. ట్రావెన్‌కోర్‌ లోని మరో మూడు దక్షిణ ఉపజిల్లాలతో పాటు, తోవల, అగస్తీవరం, కల్కులం, చివరికి తమిళనాడు కన్యాకుమారి జిల్లాగా ఏర్పడింది. కేరళ రాష్ట్రం 1956నవంబరు 1 న ఆవిర్భవించింది.

కిలిమనూరు ప్యాలెస్

మార్చు
 

1705లో (మళయాళ కాల పట్టిక ప్రకారం 880) పరప్పనాడ్ రాజ గృహానికి చెందిన ఇత్తమ్మర్ రాజా కుమారుడు, ఇద్దరు కుమార్తెలు (వాస్తవానికి ప్రస్తుత మలప్పురం జిల్లాలోని పరప్పనంగడిలో ఉన్నారు) వేనాడ్ రాచరిక గృహంలోకి దత్తత తీసుకున్నారు. ఇత్తమ్మర్ రాజా సోదరి కుమారులు, రామవర్మ, రాఘవ వర్మ కిలిమనూరులో స్థిరపడ్డారు. వారు దత్తత తీసుకున్న సోదరీమణులను వివాహం చేసుకున్నారు. ట్రావెన్‌కోర్ రాజ్య స్థాపకుడు మార్తాండ వర్మ రాఘవ వర్మ కుమారుడు.రాఘవ వర్మ మేనల్లుడు [31] రవివర్మ కోయిల్ తంపురాన్, మార్తాండ వర్మ సోదరిని వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు ధర్మరాజ కార్తీకతిరున్నాళ్ రామవర్మగా ప్రసిద్ధి చెందాడు.

సా.శ. 1740లో దేశింగనాడు రాజుకు మద్దతుగా డచ్‌మాన్ కెప్టెన్ హాకర్ట్ నేతృత్వంలోని మిత్ర దళం వేనాడ్‌పై దాడి చేసినప్పుడు, కిలిమనూరు [32] వచ్చిన సైన్యం ప్రతిఘటించి వారిని ఓడించింది. ఒక చిన్న విజయం అయినప్పటికీ, భారతీయ సైన్యం యూరోపియన్ శక్తిని ఓడించడం అదే మొదటిసారి.1753లో ఈ ఘనతకు గుర్తింపుగా మార్తాండ వర్మ కిలిమనూరు రాజభవనం [33] నియంత్రణలో ఉన్న ప్రాంతాలను పన్నులనుండి మినహాయించి, వాటికి స్వయంప్రతిపత్తి హోదానుకల్పించాడు.[34] ప్రస్తుతం ఉన్న రాజభవన సముదాయం అయ్యప్పఆలయంతో పాటు కుటుంబ దేవత, శాస్తా లేదా అయ్యపన్ కోసం ఆ సమయంలో నిర్మించారు.[35][36]

బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్ల ప్రణాళిక చేస్తున్న సమయంలో వేలు తంపి దలవ కిలిమనూరు రాజ భవనంలో సమావేశాలునిర్వహించాడు. బ్రిటీష్ వారిపై తన చివరి యుద్ధానికి వెళ్లే ముందు అతను తన కత్తిని రాజభవనంలో అప్పగించాడు. భారతదేశ మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఈ ఖడ్గాన్నిరాజభవనం నుండి అందుకున్నాడు. దానిని ఢిల్లీలోని భారత జాతీయ సంగ్రహశాల నందు ఉంచారు. అనంతరం కత్తిని తిరువనంతపురం లోని నేపియర్ సంగ్రహశాలకు తరలించారు.

జిల్లాలోని వర్కాల తీరప్రాంతం

మార్చు

వర్కాల బీచ్, పాపనాశం బీచ్ అని కూడా పిలుస్తారు, ఇది తిరువనంతపురం జిల్లాలోని వర్కాల పట్టణంలో ఉన్న ఒక బీచ్.ఇది హిందూ మహాసముద్రంలో భాగమైన అరేబియా సముద్రాన్ని ఆవరించింది.

వర్కాల తీరప్రాంత విశాల దృశ్య చిత్రం

ఆర్థిక వ్యవస్థ

మార్చు
 
టెక్నోపార్క్ భవనం. 2010 నాటికి టెక్నోపార్క్‌లో 450,000 మీ2 (4,800,000 sq ft) ఉన్నారు అంతర్నిర్మిత స్థలం, దాదాపు 30,000 మంది నిపుణులను కలిగి ఉన్న 200 కంటే ఎక్కువ కంపెనీలకు నిలయం.

తిరువనంతపురం జిల్లా ఆర్థిక వ్యవస్థలో ప్రసార మాధ్యమం,సమాచార సాంకేతికత రంగాలు ప్రధానమైనవి.వాటి తరువాత ఇతర ప్రధానరంగాలు పర్యాటకం,వ్యవసాయం, విద్య ముఖ్యమైనవిగా ఉన్నాయి. భారతదేశం లోని మొట్టమొదటి యానిమేషన్ పార్క్, కిన్‌ఫ్రా యానిమేషన్ పార్క్ జిల్లాలోఉన్నాయి. తిరువనంతపురం జిల్లాలో 2 కేంద్ర-రంగం,14 రాష్ట్రరంగం,1 సహకారంగం 4 ఉమ్మడిరంగ, 60 ప్రైవేట్ రంగ మధ్యస్థ, పెద్దస్థాయి సంస్థలు ఉన్నాయి.నూనె తయారీ కర్మాగారాలు, జీడిపప్పు కర్మాగారాలు, దూది తయారీ కర్మాగారాలు, రంపపు మిల్లులు,ముద్రణా సంస్థలు,రబ్బరు పారిశ్రామిక యూనిట్లు,రసాయనాల తయారీ పరిశ్రమలు, అగ్గిపెట్టె తయారీ పరిశ్రమలు, సాధారణ సాంకేతిక పనిముట్లు తయారీ పరిశ్రమలు, ఆటోమొబైల్ వర్క్‌షాప్‌లతో సహా 901 అధికారకంగా నమోదైన పనిచేసే పరిశ్రమలుఉన్నాయి. తిరువనంతపురం నగరం లోని శ్రీ మూలంతిరునాళ్ షష్టియాబ్దస్పూర్తి మెమోరియల్ ఇన్స్టిట్యూట్, కేరళ హస్తకళ పరిశ్రమల ప్రధానరాష్ట్ర ప్రభుత్వ వ్యాపార భండారం ద్వారా ఉత్పత్తులు అమ్మకాలు ఉన్నాయి.

1959లో ప్రారంభించబడిన నెయ్యర్ నీటిపారుదల ప్రాజెక్ట్ 116.65 కి.మీ2 (45.0 చ. మై.) విస్తీర్ణానికి సాగునీరు అందిస్తోంది. నెయ్యర్ అనకట్టకు నెయ్యర్ నది ప్రధాన నీటి వనరు.ఆనకట్ట 294.13 మీటర్లు (965.0 అ.) పొడవు, 50.6 మీటర్లు (166.0 అ.) ఎత్తు ఉంది.140 కి.మీ2 (54 చ. మై.) విస్తీర్ణంలో ఉన్నపరీవాహక ప్రాంతం, అడవి నుండి నెయ్యర్ అనకట్టలోకి నీరు ప్రవహిస్తుంది. సుమారు రెండు రుతుపవనాల నుండి 2260 మి.మీ.వార్షిక సగటు వర్షపాతం ఉంటుంది. ప్రధానకాలువ, దాని శాఖల మొత్తం పొడవు 266 కి.మీ. (165 మై.) ఉంది.

పరిపాలన

మార్చు
 
తిరువనంతపురం జిల్లా తాలూకాలు

జిల్లా పరిపాలన ప్రధానకార్యాలయం తిరువనంతపురంలోని కుదప్పనకున్నులో ఉంది. జిల్లా పాలనా యంత్రాంగం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఉంటుంది.సాధారణ వ్యవహారాలు, భూసేకరణ, రెవెన్యూపునరుద్ధరణ,భూ సంస్కరణలు,ఎన్నికల బాధ్యతతో ఐదుగురు సహాయ కలెక్టర్లు అతనికి సహాయఅధికారులుగా ఉన్నారు [37]

పురపాలక పట్టణాలు

మార్చు

జిల్లాలో 4 పురపాలకపట్టణాలు ఉన్నాయి. అవి:[38]

తిరువనంతపురం జిల్లాలోని పురపాలక పట్టణాలు (4)
వ.నం. పురపాలక సంఘం జనాభా (2011)
1. నెయ్యట్టింకర 70,850
2. నెడుమంగడ్ 60,161
3. వర్కాల 40,048
4. అట్టింగల్ 37,648

శాసన ప్రాతినిధ్యం

మార్చు
 
తిరువనంతపురంలోని కేరళ ప్రభుత్వ సచివాలయం

తిరువనంతపురంలో అట్టింగల్, తిరువంతపురం అనే రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే తిరువనంతపురం జిల్లాలో 14 కేరళ శాసనసభ స్థానాలు ఉన్నాయి.[39]

తిరువనంతపురం జిల్లాలోని (14) కేరళ శాసనసభ నియోజకవర్గాలు
Sl నం. నియోజకవర్గం సభ్యుడు పార్టీ కూటమి
1 వర్కాల వి. జాయ్ సీపీఐ(ఎం)
2 అట్టింగల్ ఒఎస్ అంబిక సీపీఐ(ఎం)
3 చిరాయింకీజు వి. శశి సి.పి.ఐ
4 నెడుమంగడ్ జిఆర్ అనిల్ సి.పి.ఐ
5 వామనపురం డీకే మురళి సీపీఐ(ఎం)
6 కజకూటం కడకంపల్లి సురేంద్రన్ సీపీఐ(ఎం)
7 వట్టియూర్కావు వీకే ప్రశాంత్ సీపీఐ(ఎం)
8 తిరువనంతపురం ఆంటోని రాజు JKC
9 నెమోమ్ వి. శివన్‌కుట్టి సీపీఐ(ఎం)
10 అరువిక్కర జి. స్టీఫెన్ సీపీఐ(ఎం)
11 పరశల సీకే హరీంద్రన్ సీపీఐ(ఎం)
12 కట్టక్కడ ఐబి సతీష్ సీపీఐ(ఎం)
13 కోవలం ఎం. విన్సెంట్ INC
14 నెయ్యట్టింకర కెఎ. అన్సాలన్ సీపీఐ(ఎం)

తాలూకాలు

మార్చు

జిల్లా రెండు రెవిన్యూ విభాగాలుగా విభజించబడింది. ఇందులో ఆరు తాలూకాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి తహసీల్దార్ నేతృత్వంలో పనిచేస్తాయి.[40]

  • తిరువనంతపురం రెవెన్యూ విభాగంలోని తాలూకాలు:[40]
నెయ్యట్టింకర తిరువనంతపురం చిరాయింకీజు వర్కాల [40]
  • నెడుమంగాడ్ రెవెన్యూ విబాగంలోని తాలూకాలు:[40]

రెవెన్యూ గ్రామాలు

మార్చు

రెవెన్యూ పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసం తిరువనంతపురం జిల్లా 126 రెవెన్యూ గ్రామాలుగా విభజించబడింది.[40] దిగువ వివరించిన విధంగా అవి 6 తాలూకాలలో చేర్చబడ్డాయి.[40]

  • నెయ్యట్టింకర తాలూకా: ఈ తాలూకాలలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
  • కట్టకాడ తాలూకా:ఈ తాలూకాలలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
  • తిరువనంతపురం తాలూకా: ఈ తాలూకాలలో 31 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
  • నెడుమంగడ్ తాలూకా:ఈ తాలూకాలలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
  • చిరాయింకీజు తాలూకా:ఈ తాలూకాలలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
  • వర్కాల తాలూకా:ఈ తాలూకాలలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

రహదారి సౌకర్యాలు

మార్చు

జాతీయ రహదారి 66 (గతంలో ఇది జాతీయ రహదారి 47) కలియిక్కవిలా నుండి దాని దక్షిణ చివర నుండి ఉత్తరాన పరిపల్లి సమీపంలోని నవైకులం వరకు 80 కి.మీ. (50 మై.) దూరం విస్తరించి ఉంది. జిల్లాలో [41] మెయిన్ సెంట్రల్ రోడ్ 55 కి.మీ. (34 మై.) దూరాన్ని కవర్ చేస్తుంది, ఉత్తరాన కేశవదాసపురం, వెంబాయం, వెంజరమూడు, కిలిమనూరు, నీలమేల్ గుండా వెళుతుంది. కేరళ ప్రజా పనుల శాఖ 1,552 కి.మీ. (964 మై.) నిర్వహిస్తోంది.జిల్లాలో రహదార్ల నిడివి 9,500 కి.మీ. (5,900 మై.) నిర్వహణ స్థానిక సంస్థలు నిర్వహించుతాయి. తిరువనంతపురం జిల్లాలో 116 వంతెనలు ఉన్నాయి.

జిల్లాలో రైలు రవాణా భారతీయ రైల్వేలోని దక్షిణ రైల్వే విభాగం నిర్వహిస్తుంది. తిరువనంతపురం బ్రాడ్ గేజ్ రైలు మార్గం ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు కలపబడింది. జిల్లా గుండా 82 కి.మీ. (51 మై.) రైల్వే లైన్ ఉంది.[42] తిరువనంతపురం జిల్లాలో ప్రస్తుతం తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్‌తో సహా 20 స్టేషన్లు ఉన్నాయి.

దేశీయ అంతర్జాతీయ విమానయాన సంస్థలు త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పనిచేస్తాయి. ఇది కువైట్, దుబాయ్, దమ్మామ్, సింగపూర్, మాలే, కొలంబో, షార్జా, మస్కట్, మనామా, దోహా, జెడ్డా, అబుదాబితో సహా అనేక అంతర్జాతీయ నగరాలకు నేరుగా విమానాలు నడుస్తాయి. దేశీయ విమానాలు చెన్నై, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగుళూరు,కోల్‌కతా లతో అనుసంధానించబడి ఉన్నాయి .

జనాభా గణాంకాలు

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19014,84,493—    
19115,69,472+17.5%
19216,66,393+17.0%
19318,56,851+28.6%
194110,15,057+18.5%
195113,27,812+30.8%
196117,44,531+31.4%
197121,98,606+26.0%
198125,96,112+18.1%
199129,46,650+13.5%
200132,34,356+9.8%
201133,01,427+2.1%

2011 జనాభా లెక్కల ప్రకారం తిరువనంతపురం జిల్లా జనాభా 3,30,1,427. ఇది భారతదేశంలోని మొత్తం 640 జిల్లాల్లో 103వ ర్యాంకింగ్‌ను ఇస్తుంది.[7] జిల్లాలో జనసాంద్రత చ.కి.మీ.కు 1,509 మంది జనాభా ఉన్నారు.[7] 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 2.25% శాతానికి పెరిగింది.[7] తిరువనంతపురంలో ప్రతి 1000 మంది పురుషులకు 1088 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది.[7] అక్షరాస్యత రేటు 92.66% ఉంది. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 11.30% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 0.81% మంది ఉన్నారు.[7]

మతాల ప్రకారం తిరువనంతపురం జిల్లాలో జనాభా (2011)[43]
Religion Percent
హిందూ
  
66.46%
క్రైస్తవులు
  
19.10%
ఇస్లాం
  
13.72%
మత వివరం తెలపనివారు
  
0.72%

జిల్లా లోని మొత్తం జనాభాలో హిందువులు (66.46%) మంది ఎక్కువ మందిగా ఉన్నారు, క్రైస్తవులు (19.10%), ముస్లింలు (13.72%) మంది ఉన్నారు.[43] హిందూ సమాజంలో నాయర్లు, నాడార్లు, బ్రాహ్మణులు, ఈజావులు, విశ్వకర్మ మొదలైనవారు ఉన్నారు. క్రైస్తవులు ప్రధానంగా లాటిన్ కాథలిక్ చర్చి, సైరో-మలంకర కాథలిక్ చర్చి, పెంటెకోస్టల్ చర్చిలు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, మలంకర ఆర్థోడాక్స్ చర్చి, మార్తోమా చర్చి, సైరో మలబార్ కాథలిక్ చర్చ్‌లకు చెందినవారు ఉన్నారు.మొత్తం జనాభాలో సున్నీ ముస్లిం సమాజం ఒక ప్రధాన విభాగాన్ని ఏర్పరుస్తుంది.

తిరువనంతపురం జిల్లాలో భాషలు ప్రకారం జనాభా (2011)[44]
భాషలు మాట్లాడేవారు
మళయాళం
  
98.25%
తమిళం
  
1.18%
ఇతర భాషలు
  
0.57%

మలయాళం ప్రధానమైన మాతృభాష. సరిహద్దు ప్రాంతాల్లో తమిళం మాట్లాడతారు. తిరువనంతపురం నగరం కాస్మోపాలిటన్, మలయాళం, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ, తుళు, కొద్ది శాతం మంది మరాఠీ భాష మాట్లాడతారు.[44]

సామాజిక-ఆర్థిక పరిస్థితులు

మార్చు

మొత్తం జనాభాలో 50% కంటే ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మొత్తం కార్మిక వర్గంలో వ్యవసాయ కార్మికులు 42% మంది ఉన్నారు. చాలా మంది శ్రామిక శక్తిపై ఆధారపడి, తక్కువ ఆదాయం,తక్కువ మూలధన తీవ్రత కలిగిన వృత్తులలో నిమగ్నమై ఉన్నారు. రాజకీయ, సామాజిక అవగాహన, సామాజిక, మత, సాంస్కృతిక నాయకుల కృషి సాంప్రదాయ భూస్వామ్య క్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి దోహదపడింది. ఆర్థిక మార్పులు సమాజ సామాజిక జీవిత వైఖరులపై ప్రభావం చూపాయి.

సంస్కృతి

మార్చు
 
తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం .

20వ శతాబ్దంలో తిరువనంతపురం సాంస్కృతిక పునరుజ్జీవనానికి సాక్ష్యంగా నిలిచింది. తిరువనంతపురం జిల్లా చరిత్రలో ఎక్కువ భాగం గడిపిన కేరళ వర్మ వలియాకోయ్ తంపురన్ (1845-1914), కాళిదాసు అభిజ్ఞానశాకుంతలాన్ని మలయాళంలోకి అనువదించాడు.ఇది అతనికి కేరళ కాళిదాసు అనే బిరుదును తెచ్చిపెట్టింది. అతను ఆధునిక మలయాళ గద్యానికి పితామహుడిగా పరిగణించబడ్డాడు.

జిల్లాలో బలమైన సినిమా సంస్కృతి నెలకొని ఉంది. ఈ నగరం టూన్జ్ ఇండియా లిమిటెడ్, టాటా లిమిటెడ్‌తో సహా యానిమేషన్ కంపెనీలకు నిలయంగా ఉంది. కిన్‌ఫ్రా ఫిల్మ్, వీడియో పార్క్,[45] టెక్నోపార్క్ సమీపంలో ఉంది. ఒక అధునాతన చలనచిత్రం యానిమేషన్ నిర్మాణ సౌకర్యాలకు అనువైన ప్రాంతం.[46][47] గతంలో చెన్నై (మద్రాస్)లో ఉన్న మలయాళ చిత్ర పరిశ్రమ 1970ల చివరలో తిరువనంతపురంలో స్థిరపడేందుకు క్రమంగా మార్పును ప్రారంభించింది.

ఇతర ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలలో తిరువనంతపురం నగరంలో వార్షిక పుష్ప ప్రదర్శన, అట్టుకల్ పొంగళ, డిసెంబరులో వర్కాల శివగిరి తీర్థయాత్ర, చిరయిన్‌కీజ్ సమీపం లోని సర్కారాదేవి ఆలయంలో కాళిఒట్టు, శ్రీ పద్మనాభస్వామి ఆలయం సమీపంలోని పూజామండపం వద్ద నవరాత్రి ఉత్సవాలు జరుగతాయి.[48]

పర్యాటక

మార్చు
 
కోవలం

తిరువనంతపురం ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం ప్రధాన రంగం. హిల్ స్టేషన్లు, కేరళ బ్యాక్ వాటర్స్, బీచ్‌లు, మడుగులు, వన్యప్రాణుల అభయారణ్యాలతో సహా జిల్లాలో పూర్తి స్థాయి పర్యాటక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. కోవలం, వర్కాల దాని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన తీరప్రాంతాలు తిరువనంతపురం జిల్లాలో ఉన్నాయి. తిరువనంతపురం మెడికల్ టూరిజం కోసం భారతదేశానికి చార్టర్డ్ విమానాలకు ప్రధాన గమ్యస్థానంగా ఉంది. సమీపంలోని ఫైవ్-స్టార్ బీచ్ రిసార్ట్స్ హిల్ స్టేషన్లలో స్వస్థత సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

చదువు

మార్చు
 
తిరువనంతపురంలోని కేరళ విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం

తిరువనంతపురం జిల్లా ఒక ప్రధాన విద్యా కేంద్రం. కేరళ విశ్వవిద్యాలయం తిరువనంతపురంలో ఉంది.జిల్లాలో 20 ఆర్ట్స్, సైన్సెస్ కళాశాలలు ఉన్నాయి.కేరళ విశ్వవిద్యాలయం దాని పరిశోధన,ఉన్నత-విద్యా కేంద్రాలను కరియావట్టంలో కలిగిఉన్నాయి.[49]

తిరువనంతపురం మెడికల్ కాలేజీ రాష్ట్రంలోని ప్రధాన ఆరోగ్య సంస్థ, దేశంలో అత్యుత్తమమైంది.తిరువనంతపురం మూడు ప్రధాన ఇంజనీరింగ్ కళాశాలలు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, త్రివేండ్రం, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, బార్టన్ హిల్, శ్రీ చిత్ర తిరునాల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నాయి.

తిరువనంతపురం ప్రభుత్వ న్యాయ కళాశాల, కేరళ లా అకాడమీ లా కళాశాల అనే రెండు ప్రధాన న్యాయ కళాశాలలు ఉన్నాయి.ఇంకా యూనివర్శిటీ కాలేజ్ తిరువనంతపురం,మహాత్మా గాంధీ కాలేజ్, మార్ ఇవానియోస్ కాలేజ్, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, తిరువనంతపురం, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ త్రివేండ్రం, శ్రీ నారాయణ కాలేజ్ చెంపజంతి, స్వాతి తిరునాల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనేక ఇతర ప్రసిద్ధ ఆర్ట్స్, సైన్సెస్ కళాశాలలు ఉన్నాయి.

స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్, ఎల్.బి.ఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్,సెంట్రల్ పాలిటెక్నిక్ కాలేజ్,వట్టియూర్‌కావు, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అట్టింగల్ కళాశాలలు ఉన్నాయి

  • జిల్లాలో 1,129 పాఠశాలలు ప్రభుత్వ, ఎయిడెడ్ లేదా అన్ ఎయిడెడ్ పాఠశాలలుగా వర్గీకరించబడ్డాయి.[50]
  • ప్రభుత్వ పాఠశాలలు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పాఠ్య క్రమం/ప్రణాళిక అనుసరిస్తాయి.
  • ఎయిడెడ్ పాఠశాలలు రాష్ట్ర పాఠ్య క్రమం/ప్రణాళిక అనుసరిస్తాయి.అదనంగా, నాలుగు కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు నేరుగా కేంద్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నాయి.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సి.బి.ఎస్.ఇ) పాఠ్య క్రమం/ప్రణాళిక అనుసరిస్తాయి.
  • ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లు లేదా బోర్డులచే నిర్వహించబడే ప్రైవేట్ పాఠశాలలు సి.బి.ఎస్.ఇ, ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసిఎస్ఇ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్ఐఒఎస్) లేదా కేరళ రాష్ట్ర సిలబస్‌లలో ఏదైనా లేదా అన్నింటినీ అనుసరించవచ్చు.కేరళలో మొట్టమొదటి అంతర్జాతీయ పాఠశాల, త్రివేండ్రం అంతర్జాతీయ పాఠశాల,2003 ఆగస్టు [51] లో ప్రారంభించబడింది.

మూలాలు

మార్చు
  1. Directorate of Census Operations, Kerala. District Census Handbook, Thiruvananthapuram (PDF). Directorate of Census Operations, Kerala. p. 22. Retrieved 25 June 2020.
  2. "Kerala | UNDP in India". UNDP.
  3. "List of Districts in Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-10.
  4. "Population profile of Kerala - 2011". State Planning Board, Kerala. Government of Kerala. Archived from the original on 2020-07-18. Retrieved 2020-10-21.
  5. "About District | Website of Thiruvananthapuram District - The city of the Holy Anantha | India". Retrieved 2021-07-10.
  6. "CENSUS OF INDIA 2011" (PDF). PROVISIONAL POPULATION TOTALS INDIA, KERALA STATE AND DISTRICTS. Government of India. Retrieved 24 April 2011.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "District Census Hand Book - Thiruvananthapuram" (PDF). Registrar General and Census Commissioner of India. 2011.
  8. "CENSUS OF INDIA 2011" (PDF). Provisional Population Totals Kerala. Government of India. p. 45. Retrieved 24 April 2011.
  9. "Districts Thiruvananthapuram". indiastudychannel. Archived from the original on 10 సెప్టెంబరు 2010. Retrieved 21 July 2010.
  10. "Geography". Government of Kerala. Archived from the original on 7 February 2009.
  11. "A Brief History" (PDF). District Handbooks of Kerala: Thiruvananthapuram. Government of Kerala. Archived from the original (PDF) on 16 జూన్ 2015. Retrieved 18 March 2015.
  12. "TVM Urbanaisation". censusindia. Archived from the original on 11 January 2010.
  13. "Keralapages.org". keralapages.org. Archived from the original on 19 మార్చి 2018. Retrieved 19 March 2018.
  14. "About Thiruvananthapuram". Thiruvananthapuram Municipal Corporation. Archived from the original on 18 September 2010. Retrieved 29 October 2010.
  15. Subramanian, T. S (28 January 2007). "Roman connection in Tamil Nadu". The Hindu. Archived from the original on 19 September 2013. Retrieved 28 October 2011.
  16. N. Subrahmanian (1993). Social and Cultural History of Tamilnad: To A.D. 1336. Ennes. p. 37.
  17. 17.0 17.1 Indian History Congress (1981). Proceedings Volume 42. Indian History Congress. p. 91.
  18. KA Nilakanta Sastri
  19. Ka. Ta Tirunāvukkaracu (1994). Chieftains of the Sangam Age. International Institute of Tamil Studies.
  20. B. Sheik Ali (1972). The Hoysaḷa Dynasty. Prasaranga, University of Mysore.
  21. 21.0 21.1 21.2 21.3 Sreedhara Menon, A. (2007). A Survey of Kerala History (2007 ed.). Kottayam: DC Books. ISBN 9788126415786.
  22. Karashima, Noburu. 2014.
  23. "Pandya dynasty | Indian dynasty". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2017-09-21.
  24. Keay 2011, p. 215.
  25. Majumdar (contains no mention of Maldives)
  26. "Kerala's Tamil Connection". The New Indian Express. 26 June 2010.
  27. "TVPM History". Government of Kerala. Archived from the original on 7 February 2009.
  28. Travancore State Manual
  29. Shungoony Menon, P. (1878). A History of Travancore from the Earliest Times (pdf). Madras: Higgin Botham & Co. pp. 162–164. Retrieved 5 May 2016.
  30. "Thiruvananthapuram". Archived from the original on 2010-09-18. Retrieved 2010-10-29.
  31. Sister's son.
  32. The forces were from Kochi, Thekkumkoor, Deshinganad (present kollam) and Purakkad who had enmity towards Marthanda Varma
  33. Most of the area under the present Kilimanoor and Pazhayakunnummel panchayats.
  34. Although under his kingdom
  35. The original temple being at Nerumkaithakotta, near Kozhikode
  36. It is also said[by whom?]
  37. Administration Archived 7 ఫిబ్రవరి 2009 at the Wayback Machine
  38. District Administration, Thiruvanthapuram. "Municipalities in Thiruvananthapuram district". National Informatics Centre, Ministry of Electronics and Information Technology, Government of India. Retrieved 21 June 2022.
  39. Niyamsabha official site
  40. 40.0 40.1 40.2 40.3 40.4 40.5 District Administration, Thiruvananthapuram. "Revenue villages, Taluks, and Revenue divisions in Thiruvananthapuram district". National Informatics Centre, Ministry of Electronics and Information Technology, Government of India. Retrieved 21 June 2022.
  41. Infrastructure Roads Archived 16 అక్టోబరు 2009 at the Wayback Machine
  42. Rail Transport Archived 10 ఫిబ్రవరి 2012 at the Wayback Machine
  43. 43.0 43.1 "Religion – Kerala, Districts and Sub-districts". Census of India 2011. Office of the Registrar General.
  44. 44.0 44.1 "Table C-16 Population by Mother Tongue: Kerala". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
  45. "Kinfra Film & Video Park to house animation zone". Kinfra Film Park. Hindu Business Line. 26 December 2003. Retrieved 18 October 2006.
  46. "Theatre opened at Kinfra park". The Hindu. 21 July 2005. Archived from the original on 29 May 2006. Retrieved 18 October 2006.
  47. "Theatre opened at Kinfra park". Kinfra Film Park. Source: IANS. 22 August 2006. Archived from the original on 27 సెప్టెంబరు 2007. Retrieved 18 October 2006.
  48. "Major Religious Festivals in Thiruvananthapuram". Major Festivals. Government of Kerala. Archived from the original on 2 July 2006. Retrieved 24 November 2006.
  49. "Technical Education in Kerala – Department of Technical education". Colleges in Thiruvananthapuram. Kerala Government. Archived from the original on 2 July 2006. Retrieved 28 May 2010.
  50. "Education in Thiruvananthapuram". Schools in Thiruvananthapuram. Kerala Government. Archived from the original on 2 July 2006. Retrieved 28 April 2010.
  51. "Thiruvananthapuram International School opens doors". The Hindu Business Line. 8 October 2003. Retrieved 28 May 2010.

వెలుపలి లంకెలు

మార్చు