దేవుడు

ఆరాధనకు అర్హుడు
(ఖుదా నుండి దారిమార్పు చెందింది)

దేవుడు లేదా దైవం ని ఆస్తికులు విశ్వాన్ని సృష్టించి, నడిపేవాడు అని నమ్ముతారు.[1] ఏకేశ్వరోపాసకులు దేవుడు ఒక్కడే అంటారు. బహుదేవతారాధకులు, ధార్మిక వేత్తలు, దేవుడిని అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో ముఖ్యమైనవి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, కరుణామయుడు, సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త, ఆదిఅంతం లేనివాడు.

వ్యాసాల క్రమం
దేవుడు

సాధారణ నిర్వచనాలు
దేవవాదం · హినోథీయిజం
ఏకేశ్వరవాదం · పానెంథీయిజం
పాంథీయిజం · మోనోలాట్రిజం


నిర్దేశిత భావనలు
పేర్లు · "దేవుడు" · ఉనికి · లింగము
సృష్టికర్త · నిర్మాణకర్త · డెమియుర్జ్ · అనంతజీవి
స్వామి · పిత · మొనాడ్ · ఏకత్వం
ఉన్నతుడు · సర్వం · వ్యక్తిగతం
యూనిటేరియానిజం · డైథీయిజం · త్రిత్వము
సర్వవ్యాప్తి · సర్వవ్యాపితం
సర్వాంతర్యామి · అనంత దయామయి
అయ్యవాజీలలో దేవుడు · ఇబ్రాహీం మతాలలో దేవుడు
బహాయి విశ్వాసంలో · క్రైస్తవంలో
హిందూమతంలో దేవుడు · ఇస్లాంలో దేవుడు · యూదమతంలో
సిక్కు మతంలో · బౌద్ధమతంలో


అనుభవాలు, ఆచరణలు
విశ్వాసం · ప్రార్థన · నమ్మకం · అవతరణలు
ఫిడేయిజం · గ్నోసిస్ · మెటాఫిజిక్స్
మిథ్యావాదం · హెర్మెటిసిజం · ఇసోటెరిసిజం


సంబంధిత విషయాలు
తత్వశాస్త్రం · మతం · ఓంటాలజీ
గాడ్ కాంప్లెక్స్ · న్యూరో థియోలజీ
అయోమయం
చెడుతో సమస్యలు (థియోడైసీ)
ఆస్తికవాదం


దేవుడు అంటే జీవుడు, జీవాన్ని సృష్టించువాడు, సృష్టికర్త. జగమంతటా వ్యాపించియున్నవాడు.[1] ఈ పేర్లన్నీ హిందూమతము, యూదమతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము నకు చెందిన ధార్మికవేత్తలు తత్వవేత్తలు, హిప్పోకు చెందిన ఆగస్టైన్,[2] అల్-ఘజాలి,[3], మైమోనిడ్స్ ఆపాదించారు.[2] మధ్యకాలపు తత్వవేత్తలు, దేవుడున్నాడని వాదించారు.[4] మరికొందరైతే దేవుడు లేడనీ వాదించారు, దేవుని ఉనికిని ప్రశ్నించారు.

"దేవుడు" నిర్వచనం

మార్చు

దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు బమ్మెర పోతన రాసిన ఈ పద్యం చక్కని సమాధానం.అన్ని మతాలవారికీ సరిపోగలదు.

"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాది మధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".[పోతన భాగవతం: గజేంద్ర మోక్షం]

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో దేవుడు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[5] దేవుడు నామవాచకంగా God. A deity, దేవత, వేలుపు అని అర్ధం. దేవ విశేషణంగా ఉపయోగిస్తారు. Of God, దేవుని యొక్క. దేవకాంచనము ఒక రకమైన చెట్టు Bauhinia purpurea. దేవత అనే పదాన్ని దేవుళ్ళలో స్త్రీలకు వాడతారు A deity, generally a goddess; but also a god. గ్రామదేవత అనగా the village goddess. దేవతరువు అనగా కల్పవృక్షము. దేవతాజీవము n. A godlike or harmless creature. ఉదా: "ఆ తెలివి యెరుగనట్టి దేవతాజీవుల, వనరిదెచ్చబిడ్డవలెనుసాకి, పాపమెరుగకంతబట్టి చంపుదురయా." వేమన పద్యం. దేవతాడిచెట్టు n. The tree called గరాగరీ. Andropogon serratus. డావరడంగి చెట్టు. దేవత్వము లేదా దైవత్వము అనగా Divinity, deification, apotheosis. దేవదత్తము అర్జునుని శంఖము పేరు. దేవదత్తుడు, యజ్ఞదత్తుడు are two names in Sanskrit Law or Logic like John Doe and Richard Roe, or Titius and Seius, or Omar and Zeid in Arabic Law. దేవదారు లేదా దేవదారువు n. The Cedar: the Himalayan Cedar. Cedrus deodara. (Watts.) commonly called deodar. The Erythroxylon dreolatum (Linn.) Uvaria longifolia. Rox. సురవృక్షము, అమరద్రుమము. Chittagong wood; usually called cedar. చారల దేవదారువు the Trincomalli wood. Berrya ammonilla (Watts.) దేవదాసి n. A dancing girl employed in a temple. దేవనాగరి n. The name of the character in which Sanskrit is usually printed. దేవభూతము or దేవసాయుజ్యము n. Divinity, దేవత్వము. దేవమణి n. A fortunate curl on a horse's neck. గుర్రముమెడసుడి, అశ్వములకు ఉండే సుడి విశేషము. చింతామణి, మహామేద అనే చెట్టు. కాస్తుభము. (q. v.) దేవమాతృకము అనగా A country or land which is dependent on providence, i.e., watered by rain only, not by streams. వాననీళ్ల చేత పండే పైరులుగల దేశము. దేవయజ్ఞము n. The body sacrifice called వైశ్యదేవము. A sacrifice, హోమము, వేలిమి. దేవయానము n. The car or vehicle of a god, దేవతా విమానము. దేవర అనగా God. దేవుడు కాకుండా A lord or master స్వామి అని కూడా వాడతారు. My lord, Sir. A title of respect used in addressing superiors. దేవరవారు your honour. ఇంటి దేవరలు household deities. కులదేవతలు applied particularly to the manes of married women, ముత్తైదువలు. జంగములకు శ్రేష్ఠనామము. దేవలుడు దేవాజీవి or దేవాజీవుడు అనగా గుడిలో దేవుణ్ని పూజచేసేవాడు, తంబళవాడు, నంబివాడు. దేవళము n. A temple, గుడి, దేవాలయము. దేవవర్ధకి n. The "artist of the gods," a title of Visvakarma. దేవసరులు n. A sort of grain. దేవాంబరము n. A sort of cloth. దేవాదాయము n. The income of a temple. An endowment to a temple, land given for the unkeep of a temple, land given for the unkeep of a temple free of all rent. గుడిమాన్యము. దేవానాంప్రియము అనగా The beloved of the gods, i.e., a goat. మేక. దేవానాం ప్రియుడు n. A foolish or ignorant man. మూర్ఖుడు. దేవాయుధములు n. Stones and cudgels. రాళ్లు దుడ్డుకర్రలు. దేవి n. A goddess, particularly Parvati పార్వతి. A queen. Cf. పుట్టపుదేవి. Madam. Lady. దేవేరి or దేవెరి n. A queen, a lady. దొరసాని, రాజపత్ని.

దేవుని రూపం

మార్చు

మూడు వాదాలున్నాయి:

  • 1. రూపరహితుడు - నిర్గుణ నిరాకారుడు
  • 2. రూపరహితుడు - సాగుణ నిరాకారుడు
  • 3. సరూపుడు - సాగుణ సాకారుడు

వివిధ సందర్భాలలో "దేవుడు" పదం వినియోగం

మార్చు
  • రాయైతేనేమిరా దేవుడు - హాయిగా ఉంటాడు జీవుడు - ఉన్నచోటే గోపురం ఉసురు లేని కాపురం - అన్నీఉన్న మహానుభావుడు - వేటూరి
  • మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు - ఆత్రేయ
  • దేవుడికేం హాయిగ ఉన్నాడు - ఈ మానవుడే బాధలుపడుతున్నాడు - శ్రీశ్రీ
  • పిల్లలూ దేవుడూ చల్లనివారే
  • రాయిరా దేవుడు - తాగితే ఊగడు - మైలవరపు గోపి
  • ఎంతో రసికుడు దేవుడు
  • మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు - దాశరథి

వివిధ మతాలలో నమ్మకాలు

మార్చు

యూదులు, క్రైస్తవులు, ముస్లింలు ఏకేశ్వరుణ్ణి నమ్ముతారు. దేవుడిని యెహోవా, అల్లాహ్ అని సంబోధిస్తారు.

క్రైస్తవులు త్రితత్వాన్ని నమ్ముతారు (అనగా దేవుడు, పరిశుద్ధాత్మ, క్రీస్తు). అరబ్ క్రైస్తవులు దేవున్ని అల్లాహ్ అంటారు. "అల్లాహ్ అల్ ఆబా" అనగా "God the Father" అని, "ఐబ్న్ అల్లాహ్" అనగా "దేవుని పుత్రుడు" అని అర్థాలు ఉన్నాయి. క్రీస్తు దేవుని బిడ్డ కనుక అరబ్ క్రైస్తవులు క్రీస్తుని ఇబ్న్ అల్లాహ్ అంటారు. యూదులు ముస్లింల లాగ ఏకైక దేవున్ని నమ్ముతారు (దేవుని విషయములో యూదులు, ముస్లింల మధ్య కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి).

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Swinburne, R.G. "God" in Honderich, Ted. (ed)The Oxford Companion to Philosophy, Oxford University Press, 1995.
  2. 2.0 2.1 Edwards, Paul. "God and the philosophers" in Honderich, Ted. (ed)The Oxford Companion to Philosophy, Oxford University Press, 1995.
  3. అల్విన్ ప్లాటింగా,
  4. Plantinga, Alvin. "God, Arguments for the Existence of," Routledge Encyclopedia of Philosophy, Routledge, 2000.
  5. బ్రౌన్ నిఘంటువు ప్రకారం దేవుడు పదప్రయోగాలు.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=దేవుడు&oldid=4316289" నుండి వెలికితీశారు