గణేష్ (2009 సినిమా)
గణేష్ 2009, సెప్టెంబరు 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మాణ సారథ్యంలో ఎం. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.[2] ఈ సినిమా చిత్రీకరణ 2008, డిసెంబరులో ప్రారంభమయింది. 2009, సెప్టెంబరు 10న పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం 2011లో హిందీలోకి క్షత్రియ: ఏక్ యోధ అనే పేరుతో అనువాదమయింది.
గణేష్ | |
---|---|
దర్శకత్వం | ఎం. శరవణన్ |
రచన | శ్రీ స్రవంతి మూవీస్ టీం |
స్క్రీన్ ప్లే | ఎం. శరవణన్ |
నిర్మాత | స్రవంతి రవికిషోర్ |
తారాగణం | రామ్, కాజల్ అగర్వాల్ |
ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ స్రవంతి మూవీస్ |
విడుదల తేదీ | 24 సెప్టెంబరు 2009 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹15 కోట్లు |
బాక్సాఫీసు | ₹ 5 కోట్లు |
కథా నేపథ్యం
మార్చుగణేష్ (రామ్) ఒక అనాథ, అతను నిరుపేదలకు సహాయం చేస్తుంటాడు. అలాంటి పరిస్థితిలో, దివ్య (కాజల్ అగర్వాల్) ను ప్రేమిస్తున్నట్లు తనతో నటించవలసివస్తుంది. తరువాత, అతను కొన్ని ఆశయాలను నెరవేర్చడంకోసం ఆమెను ప్రేమిస్తున్నాడని, అతనిది నిజమైన ప్రేమ కాదని తెలుసుకుంటుంది. కానీ అప్పటికే, గణేష్ ఆమెతో ప్రేమలో పడతాడు. తన నిజమైన ప్రేమ గురించి ఆమెకు చెప్పి, అమెను ఎలా ఒప్పించాడనేది మిగతా కథ.
నటవర్గం
మార్చు- రామ్ (గణేష్)
- కాజల్ అగర్వాల్ (దివ్య)
- పూనమ్ కౌర్ (దీప)
- ఆశిష్ విద్యార్థి (మహదేవ్)
- అనంత్
- బ్రహ్మానందం (యాదదిరి)
- రష్మి గౌతమ్ (అర్చన)
- సుధ (దివ్య తల్లి)
- రోహిణి హట్టంగడి (దివ్య అత్త)
- యనమదల కాశీ విశ్వనాథ్ (దివ్య మామ)
- సమీర్ (దివ్య అన్న)
- సురేఖా వాణి (దివ్య వదిన)
- ఫిష్ వెంకట్ (మహదేవ్ అనుచరుడు)
- సప్తగిరి (అప్పారావు)
- రవిప్రకాష్
- సుహాని కలిత
సాంకేతికవర్గం
మార్చు- చిత్రానువాదం, దర్శకత్వం: ఎం. శరవణన్
- నిర్మాత: స్రవంతి రవికిషోర్
- రచన: శ్రీ స్రవంతి మూవీస్ టీం
- సంగీతం: మిక్కీ జె. మేయర్
- ఛాయాగ్రహణం: హరి అనుమోలు
- కూర్పు: అక్కినేని శ్రీకర్ ప్రసాద్
- నిర్మాణ సంస్థ: శ్రీ స్రవంతి మూవీస్
పాటలు
మార్చుగణేష్ | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 10 సెప్టెంబరు 2009 | |||
Recorded | 2009 | |||
Genre | సినిమా పాటలు | |||
Length | 28:00 | |||
Label | ఆదిత్యా మ్యూజిక్ | |||
Producer | మిక్కీ జె. మేయర్ | |||
మిక్కీ జె. మేయర్ chronology | ||||
|
దీనికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.[3] 2009, సెప్టెంబరు 10వ తేది రాత్రి రామానాయుడు స్టూడియోలో జూనియర్ ఎన్.టి.ఆర్ పాటలను విడుదల చేశాడు.[1]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "తనేమందో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | జావేద్ ఆలీ | 4:15 |
2. | "లల్ల లాయి (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | కృష్ణచైతన్య, శ్వేత పండిట్ | 4:42 |
3. | "ఏలే ఏలే (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | శ్రీమథుమిత | 4:43 |
4. | "రాజకుమారి (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | కునాల్ గంజావాలా, శ్రీమథుమిత | 4:36 |
5. | "ఛలో ఛలోరే (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | కార్తీక్ & కిడ్స్ కోరస్ | 4:53 |
6. | "రాజా మహరాజా (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | రంజిత్ | 4:51 |
మొత్తం నిడివి: | 28:00 |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Ganesh (just Ganesh...) music launch". idlebrain.com. Retrieved 5 August 2020.
- ↑ "Muhurat of Ram's film with Kajal Agarwal". idlebrain.com. Retrieved 5 August 2020.
- ↑ "Ganesh (just Ganesh...) press meet". idlebrain.com. Retrieved 5 August 2020.