గ్యాంగ్ లీడర్
1991 సినిమా
(గాంగ్ లీడర్ నుండి దారిమార్పు చెందింది)
గ్యాంగ్ లీడర్, విజయ బాపినీడు దర్శకత్వంలో 1991లో మే 9న విడుదలైన తెలుగు సినిమా. చిరంజీవి, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రధారులు. చిరంజీవికి మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి ఈ చిత్రం విజయం చాలా దోహదం చేసింది.[1]
గ్యాంగ్‌లీడర్ | |
---|---|
దర్శకత్వం | విజయ బాపినీడు |
రచన | విజయ బాపినీడు (కథ, చిత్రానువాదం), పరుచూరి సోదరులు (సంభాషణలు) |
నిర్మాత | మాగంటి రవీంద్రనాధ్ చౌదరి |
తారాగణం | చిరంజీవి, విజయశాంతి, మాగంటి మురళీమోహన్, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య |
సంగీతం | బప్పీలహరి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | మే 9, 1991 |
భాష | తెలుగు |
కథ
మార్చురఘుపతి (మురళీ మోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారాం (చిరంజీవి) ముగ్గురూ అన్నదమ్ములు. కుటుంబంలో రఘుపతి ఒక్కడే ఉద్యోగస్తుడు. కుటుంబాన్నంతా పోషిస్తుంటాడు. రాఘవ ఐ. ఎ. ఎస్ అవడానికి ప్రయత్నిస్తుంటాడు. రాజారాం మాత్రం స్నేహితులతో కలిసి సరదాగా కాలం గడిపేస్తుంటాడు.
తారాగణం
మార్చు- చిరంజీవి .... రాజారాం
- విజయశాంతి .... కన్యాకుమారి
- రావు గోపాలరావు .... ఏకాంబరం
- కైకాల సత్యనారాయణ .... జైలర్
- అల్లు రామలింగయ్య... సిద్ధాంతి
- నిర్మలమ్మ...శబరి (రాజారాం నానమ్మ)
- ఆనందరాజ్ .... కనకాంబరం
- మాగంటి మురళీమోహన్ .... రఘుపతి
- శరత్ కుమార్ .... రాఘవ
- సుమలత .... రాఘవ భార్య
- సుధ...లక్ష్మి (రఘుపతి భార్య)
- నారాయణ రావు
- హరి ప్రసాద్
- జయలలిత .......చుక్క
- మహర్షి రాఘవ
- దేవదాస్ కనకాల
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు, కథ, చిత్రానువాదం: విజయ బాపినీడు
- డైలాగులు పరుచూరి సోదరులు
- సినిమాయోగ్రఫీ: లోక్ సింగ్
- పాటలు: వేటూరి, భువన చంద్ర
- నేపథ్య గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం & చిత్ర
- నృత్యాలు: ప్రభుదేవా
విశేషాలు
మార్చు- ఈ సినిమా 100 రోజుల ఉత్సవం చిరజీవి పుట్టినరోజునాడు పెద్దయెత్తున జరిపారు. తిరుపతి, హైదరాబాదు, ఏలూరు, విజయవాడలలో ఒకేరోజు ఈ శతదినోత్సవం జరిపారు. ప్రత్యేక విమానాన్ని వాడారు.[2]
- ఈ సినిమా 100 రోజుల ఉత్సవాన్ని అప్పుల అప్పారావు సినిమాలో చూపారు.
- ఆజ్ కా గూండారాజ్ అనే పేరుతో ఈ సినిమాను హిందీలో పునర్నిర్మాణం చేపట్టారు.
- చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తాను అన్న డైలాగు ఈ చిత్రంలోనిదే
పాటలు
మార్చు- పాప రీటా .. .. - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: భువన చంద్ర
- పాలబుగ్గ - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: వేటూరి సుందర రామమూర్తి
- భద్రాచలం కొండ - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: భువన చంద్ర
- వానా.. వానా.. .. - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: భువన చంద్ర
- వయసు వయసు - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: వేటూరి
- పనిసా ససా - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: భువన చంద్ర
బయటి లింకులు
మార్చు- ↑ HMTV (9 May 2021). "చిరంజీవికి మాస్ ఇమేజ్ తెచ్చిన గ్యాంగ్ లీడర్." Archived from the original on 1 June 2022. Retrieved 1 June 2022.
- ↑ "సిఫీ వార్త". Archived from the original on 2007-09-30. Retrieved 2008-09-09.