గార్లపాడు (కాకుమాను మండలం)
గార్లపాడు, గుంటూరు జిల్లా, కాకుమాను మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
- ఇది గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దున గల ఒక కుగ్రామం.
గార్లపాడు (కాకుమాను మండలం) | |
— గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°02′25″N 80°21′04″E / 16.040256°N 80.351244°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | కాకుమాను |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 235 |
ఎస్.టి.డి కోడ్ | 0863 |
భౌగోళికం
మార్చుపెదనందిపాడు, కొమ్మూరు, కొండపాటూరు, ప్రకాశం జిల్లా లోని గొల్లపూడి, ఈ ఊరికి సరిహద్దు గ్రామాలు. ఈ ఊరు వర్తులాకారం లో, ఒక పెద్ద చెరువును చుట్టి వుంటుంది. పెద్ద చెరువు, దాని గట్లపై పాతకాలపు మర్రి చెట్లు, చెరువుని ఆనుకొని వుండే గుళ్ళు, ఊరిలోని బడి ఈ ఊరి ప్రధాన ఆకర్షణ. ఇళ్ళకి ఆనుకొని వుండే పచ్చటి పొలాలు, నీటి కాల్వలు, భూమిని నమ్ముకొని బతికే అన్నదాతలు, కష్టాన్ని నమ్మే ఆడ పడుచులు, బోసి నవ్వుల పిల్లలతో ఈ ఊరు అచ్చ తెలుగుదనంతో వుట్టి పడుతూ వుంటుంది. వేసవిలో ఊరి చుట్టూ వుండే మిరప కల్లాలతో ఈ ఊరు ఎర్ర చీర కట్టుకున్నట్టు వుంటుంది.
ప్రముఖులు
మార్చుప్రజల జీవన పరిస్థితులు
మార్చుఈ ఊరి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఇంకా కుల వృత్తులు ఈ ఊరిలో కొనసాగుతూనే ఉన్నాయి. వరి, ప్రత్తి, మిరప, మొక్కజొన్న, శనగ ప్రధాన పంటలు. చుట్టు పక్కల గ్రామాలలోకెల్లా అత్యధిక సాగు భూమి గల ఊరిగా ఈ ఊరు ప్రసిద్ధి చెందింది. ఊరిని చుట్టినట్టు వుండే నల్లమడ వాగు వ్యవసాయానికి ప్రధాన నీటి ఆధారం. నల్లమడను ఈ ఊరి వరప్రదాయిని గానూ, దుంఖఃదాయిని గానూ కూడా చెప్పవచ్చు. ఫ్రతియేటా అక్టోబరు, నవంబరు నెలల్లో బంగాళాఖాతంలో సంభవించే తుఫానుల మూలంగా, నల్లమడ వాగు ఈ గ్రామాన్ని వరదతో ముంచెత్తుతూ వుంటుంది. ఈ వరదల కారణంగా గతంలో చాల మంది ఊరినుండి వలస పోయారు.
ఇక్కడి బడి రామినేని వెంకయ్య ప్రధానోపాధ్యాయుడుగా ఉన్న రోజులలో చాల ప్రసిద్ధి కెక్కింది. దాదాపు 30 పైచిలుకు సంవత్సరాల నిస్వార్ధ సేవతో గ్రామం చదువుల తల్లికి నెలవయింది. చుట్టు పక్కల గ్రామాలనుండి విద్యార్థులు కాలినడకన ఈ ఊరికి చదువుకోవటానికి వచ్చేవారు. ఆయన హయాంలో జిల్లా పరిషత్ స్థాయికి ఎదిగిన పాఠశాల, నేడు 50 లోపు విద్యార్థులతో ప్రాథమిక స్థాయికి చేరడానికి సిద్ధంగా ఉంది. గ్రామంలో మంచి విద్యా సదుపాయాలు లేకపోవటంతో మధ్యలో బడి మానేసే వారి సంఖ్య ఎక్కువైంది. పక్క ఊళ్ళలోని ప్రైవేటు పాఠశాలలకు పంపించడం గ్రామ ప్రజానీకానికి భారంగా మారుతోంది.
ఊరి నడిబొడ్డున కలిసి కట్టుగా వుండే శివాలయం, రామాలయం, పోలేరమ్మ గుళ్ళు ఎప్పుడూ పూజలతో అలరారుతూ వుంటాయి. పండగ రోజుల్లో అభిషేకాలు, భజనలు, దేవుని విగ్రహాల ఊరేగింపు జరుగుతాయి.
అభివృద్ధి
మార్చుగత పది సంవత్సరాలలో ఈ ఊరు చాలా అభివృధ్ధికి నోచుకుంది. ఊరికి, కొమ్మూరుకు మధ్యలో 2000-01లో వంతెన నిర్మించిన తరువాత, ఊరి రూపు రేఖలు చాలా మారి పోయాయి. ఒకప్పుడు ఇక్కడకు రావటానికి దాదాపు ఏడు కి.మీ. వాగు వొడ్డు వెంబడి నడవవలిసి వచ్చేది. వాగు దాటి చుట్టు పక్కల గ్రామాలకు, పొలాలకు వెళ్ళటానికి 'పడవ' ఎక్కవలిసి వచ్చేది. వంతెన నిర్మాణంతో పక్క వూర్లకు ఈ ఊరికి మధ్య రాకపోకలు పెరిగాయి. ఊరిలో సిమెంటు రోడ్లు వెలిసాయి. తాగు నీటి సమస్య తీరింది.. అంతకు ముందు వేసవి వచ్చిందంటే చాలు మంచినీటి కోసం కావిళ్ళు, సైకిళ్ళు పట్టుకొని పక్క ఊరికి బయలు రావలసి వచ్చేది. గ్రామంలో తాగు నీటి సరఫరా వ్యవస్థ బాగుపడడంతో నీళ్ళ మోత తప్పింది. ఐతే రవాణా సౌకర్యం విషయంలో గ్రామం ఇంకా వెనకబడే ఉంది. ఇంతవరకు ఊరికి ఏనాడు పట్టుమని పది రోజులు బస్సు వచ్చింది లేదు. ఇప్పటికి ఈ ఊరు రావాలంటే పెదనందిపాడు నుండి గానీ, కొమ్మూరు నుండి గానీ ఆటో ఎక్కాల్సిందే. సరిహద్దు గ్రామం కావటం, ఇతర గ్రామాలతో సంబంధం లేకుండా ఓ పక్కన విసిరేసినట్టు వుండటం ఈ దుస్థితికి కారణాలు.
ఇతర విశేషాలు
మార్చు- తెనాలి రామలింగడు పుట్టింది కృష్ణా జిల్లా గార్లపాడులో కాదనీ, ఈ ఊరిలోనేనని ఒకప్పుడు పరిశోధనలు కూడా జరిగాయి [ఆధారం చూపాలి].
- శాసన సభా నియోజకవర్గం: పొన్నూరు
- లోక్సభ నియోజకవర్గం: బాపట్ల