గృహలక్ష్మి పథకం
గృహలక్ష్మి పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్ళు కట్టుకునేందుకు ఆర్థికసాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పథకం. ఈ పథకం కింద ఒక్కో నియోజకవర్గంలో 3 వేల మందికి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలమందికి ఇళ్ళు మంజూరు చేయనున్నారు.[1] గృహలక్ష్మి పథకం అనేది నిరంతర ప్రక్రియని, దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.[2]
గృహలక్ష్మి పథకం | |
---|---|
పథకం రకం | గృహ నిర్మాణం |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
ముఖ్యమంత్రి | కల్వకుంట్ల చంద్రశేఖరరావు |
ప్రారంభం | తెలంగాణ |
స్థితి | ప్రణాళికలోవున్నది |
రూపకల్పన
మార్చు2023 మార్చి 9న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశం జరిగింది.[3] ఆ సమావేశంలో సొంత స్థలం ఉన్నవారు ఇళ్ళు కట్టుకునేందుకు గృహలక్మి పథకాన్ని ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించిన వివరాలను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి టి. హరీశ్ రావ్ వెల్లడించాడు.[4]
ప్రారంభం
మార్చు2023, జూన్ 9న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని మంచిర్యాలలో ప్రారంభించి, లబ్దిదారులలో కొందరికి ఆర్థికసహాయ చెక్కులను అందజేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బీసి సంక్షేమ శాఖామంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆదిలాబాదు ఎమ్మెల్యే జోగు రామన్న, ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖా నాయక్‌తోపాటు జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5][6]
రాష్ట్రవ్యాప్తంగా 2023, ఆగస్టు 8 నుండి ఈ పథకానికి దరఖాస్తులను ప్రారంభించారు.
వివరాలు
మార్చు2023 జూన్ 21న గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలతో కూడాన జీవో ఎంఎస్25ని విడుదల చేసింది.[7]
- ఆహార భద్రత కార్డు వారందరూ ఈ పథకానికి అర్హులు
- తెల్లకాగితంపై రాసి ఆహార భద్రత కార్డు(రేషన్ కార్డు), ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డును జతపరిచిన దరఖాస్తులను గ్రామీణ ప్రాంతాల వారు తహసీల్దార్‌కు, పట్టణ ప్రాంతాల ప్రజలు మునిసిపల్ కార్యాలయాల్లో అందించాలి
- 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3 వేల ఇళ్ళ చొప్పున 4 లక్షల ఇళ్ళ నిర్మాణం
- ఇవే కాకుండా రాష్ట్ర కోటాలో 43 వేల ఇళ్ళు
- ఒక్కొక్క ఇంటికి గ్రాంటుగా 3 లక్షల రూపాయలు, ఒక్కొక్క దఫా 1 లక్ష రూపాయల చొప్పున మూడు దఫాలుగా (బెస్ మెంట్ పూర్తికాగానే మొదటి విడత, రూఫ్ పూర్తి కాగానే 2వ విడత, నిర్మాణం పూర్తి అయిన తర్వాత 3వ విడత) 3 లక్షల రూపాయలను గ్రాంటుగా వారి వారి ఖాతాల్లో జమ
- ఈ పథకానికి 2023 బడ్జెట్ లో 12 వేల కోట్ల రూపాయలు కేటాయింపు
- మహిళ పేరు మీదనే ఇళ్ళ మంజూరు[8]
పరిశీలన-మంజూరు
మార్చుగృహలక్ష్మి పథకం అమలుపై సమగ్ర పర్యవేక్షణ బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించబడింది. ఈ పథకం కోసం వచ్చే దరఖాస్తులను తహసీల్దార్లు, మున్సిపాలిటీల పరిధిలో పట్టణ ప్రణాళికాశాఖ అధికారులకు అప్పగిస్తారు. దరఖాస్తుదారులైన మహిళల పేరు మీద వాస్తవంగా స్థలం ఉందా? ఎంత విస్తీర్ణంలో ఉంది? అది చట్టబద్ధమైందేనా, రిజిస్ట్రేషన్ సంబంధిత పత్రాలు ఉన్నాయా? దరఖాస్తుదారు సామాజిక, ఆర్ధిక పరిస్థితులు, ఇది వరకే సొంత ఇల్లు ఉందా..? లేదా అనే విషయాలపై అధికారులు పరిశీలన జరిపి కలెక్టర్లకు నివేదికను అందచేయాల్సివుంటుంది.[9] ఆ నివేదికలను కలెక్టర్లు పరిశీలించిన తరువాత స్థానికి ఎమ్మెల్యే ఆమోదంతో పథకాన్ని మంజూరు చేస్తారు. లబ్ధిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10 శాతం, బీసీలు 50 శాతం, దివ్యాంగులకు 5 శాతం వరకు అందించనున్నారు.
పథకం అమలు
మార్చు- యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని చుక్కా పావని అనే చేనేత కార్మికురాలికి గృహాలక్ష్మి పథకాన్ని మంజూరు చేయాలని మంత్రి రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాలమేరకు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలు పథకానికి సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాన్ని పావని కుటుంబానికి అందజేశారు. దీంతో రాష్ట్రంలో మొట్టమొదటి గృహాలక్ష్మి పథకంలో తొలి లబ్ధిదారురాలిగా పావని రికార్డులకు ఎక్కింది.[10]
- 2023, సెప్టెంబరు 20, 26 తేదీలలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి మల్లారెడ్డి 2000మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం కింద మంజూరైన ప్రొసిడింగ్ (ఉత్తర్వులు) పత్రాలను అందజేశాడు.
మూలాలు
మార్చు- ↑ "గృహలక్ష్మి పథకం కింద మూడు విడతల్లో రూ3 లక్షలు మంత్రి హరీశ్‌రావు". ETV Bharat News. 2023-03-09. Archived from the original on 2023-03-11. Retrieved 2023-03-16.
- ↑ ABN (2023-08-10). "గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-08-14. Retrieved 2023-08-14.
- ↑ "Telangana State Portal రెండవ విడత దళితబంధు అమలు, పోడు భూముల పంపిణీకై కేబినెట్ నిర్ణయం". telangana.gov.in. 2023-03-16. Archived from the original on 2023-03-11. Retrieved 2023-03-16.
- ↑ Tech, Patashala. "గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు?". Tech Patashala (in Telugu). Archived from the original on 2024-02-29. Retrieved 2023-03-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: unrecognized language (link) - ↑ telugu, NT News (2023-06-09). "CM KCR | కులవృత్తులకు ఆర్థిక సాయం పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-06-10. Retrieved 2023-06-10.
- ↑ Velugu, V6 (2023-06-10). "ధరణి పోతే దళారీ రాజ్యం వస్తది". V6 Velugu. Archived from the original on 2023-06-10. Retrieved 2023-06-10.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ telugu, NT News (2023-06-21). "Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం..!". www.ntnews.com. Archived from the original on 2023-06-22. Retrieved 2023-09-02.
- ↑ "'గృహలక్ష్మి' పేరుతో కొత్త పథకం.. ఆ రుణాలన్ని మాఫీ.. తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు". Samayam Telugu. 2023-03-09. Archived from the original on 2023-03-10. Retrieved 2023-03-16.
- ↑ ABN (2023-03-13). "నిరుపేదలకు 'గృహలక్ష్మి'". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-03-16. Retrieved 2023-03-16.
- ↑ Telugu, TV9 (2023-08-14). "Telangana: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న గృహలక్ష్మి పథకం తొలి లబ్ధిదారులు ఎవరో తెలుసా.. ?". TV9 Telugu. Archived from the original on 2023-08-15. Retrieved 2023-09-28.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)