గోపనపల్లి (శేరిలింగంపల్లి)

గోపనపల్లి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం.[1][2] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 104వ వార్డు నంబరులో ఉంది.[3]

గోపనపల్లి
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 046
Vehicle registrationటిఎస్ 07
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[4]

సమీప ప్రాంతాలు మార్చు

తారానగర్

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్

చందానగర్

కొండాపూర్

ఇందిరానగర్

ప్రజా రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గోపనపల్లి నుండి గచ్చిబౌలి, సికింద్రాబాద్, లింగంపల్లి, మెహదీపట్నం, హైదరాబాదు విశ్వవిద్యాలయం, కోఠి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5] ఇక్కడికి సమీపంలోని లింగంపల్లి, చందానగర్ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు మార్చు

  1. కనకదుర్గ దేవాలయం
  2. షిర్డీ సాయిబాబా దేవాలయం
  3. మసీదు-ఈ-అమీనా కలీమి
  4. మసీదు ఇ హఫీజియా

బ్రాహ్మణ సదన భవనం మార్చు

గోపన్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల 10 గుంటల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని 2023, మే 31న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించాడు. బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ భవనంలో 12 నిర్మాణాలను చేపట్టారు. మూడంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సదనం, గ్రంథాలయం (ఆధ్యాత్మిక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల వంటి సాహిత్య పుస్తకాలు) ఏర్పాటుచేశారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్రమంలో విద్యాశాఖామంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, చేవెళ్ళ ఎంపీ జి. రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సుర‌భి వాణిదేవీ, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కె.వి. ర‌మ‌ణాచారి, ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి, పీఠాధిప‌తులు, పండితులు పాల్గొన్నారు. ఈ బ్రాహ్మణ సదనం భవనానికి 2017, జూన్‌ 5న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు.[6][7]

మూలాలు మార్చు

  1. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 13 September 2021.
  2. "Gopanapalli Locality". www.onefivenine.com. Retrieved 2021-09-13.
  3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 13 September 2021.
  4. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  5. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 12 September 2021.
  6. "CM KCR: విప్రహిత బ్రాహ్మణ సదన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". EENADU. 2023-05-31. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.
  7. telugu, NT News (2023-05-31). "Brahmana Samkshema Sadan | విప్ర‌హిత బ్రాహ్మ‌ణ సంక్షేమ స‌ద‌నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.

ఇతర లింకులు మార్చు