చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం
చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం తిరుపతి జిల్లాలో గలదు. ఇది చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది. 1952లో మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం, 1955లో రద్దై, తిరిగి 1978లో ఆంధ్రప్రదే రాష్ట్ర శాసనసభా నియోజకవర్గంగా ఏర్పడింది.
చంద్రగిరి | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
ఇందులోని మండలాలు
మార్చు- చిన్నగొట్టిగల్లు
- చంద్రగిరి
- తిరుపతి గ్రామీణ
- తిరుపతి (పట్టణ) (పాక్షికం) కొంకచెన్నయ్యగుంట, మంగళం, చెన్నయ్యగుంట గ్రామాలు.
- పాకాల
- యెర్రావారిపాలెం
- రామచంద్రాపురం (చిత్తూరు)
ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు
మార్చుతిరుపతి నగరానికి చంద్రగిరి రెండవ శాసనసభ నియోజక వర్గంగా పరిగణింపవచ్చును. 2004 ఎన్నికలలో ఈ నియోజక వర్గంలో 2,11,956 రిజిస్టర్ అయిన వోటర్లు ఉన్నారు.
ఎన్నికైన సభ్యులు:[1]
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 1952 ఎ.ఆదికేశవులనాయుడు కాంగ్రెస్ పార్టీ 1978 నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ 1983 మేడసాని వెంకట్రామనాయుడు తెలుగుదేశం 1985 ఎన్.ఆర్.జయదేవనాయుడు తెలుగుదేశం 1989 గల్లా అరుణకుమారి కాంగ్రెస్ 1994 నారా రామూర్తి నాయుడు తెలుగుదేశం 1999 [[గల్లా అరుణకుమారి]] కాంగ్రెస్ 2004 [[గల్లా అరుణకుమారి]] కాంగ్రెస్ 2009 [[గల్లా అరుణకుమారి]] కాంగ్రెస్ పార్టీ రోజా తెలుగుదేశం పార్టీ 2014 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ 2019 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ
2004 ఎన్నికలు
మార్చు2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి గల్లా అరుణకుమారి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఇ.రామనాథం నాయుడుపై 14392 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. అరుణకుమారికి 46838 ఓట్లు రాగా, రామనాథం నాయుడుకు 32446 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గల్లా అరుణకుమారి, తెలుగుదేశం పార్టీ తరఫున సినీ నటి రోజా[2] భారతీయ జనతా పార్టీ తరఫున గాలి పుష్పలత[3] ప్రజారాజ్యం టికెట్టుపై సాయి రమణిరెడ్డి, లోక్‌సత్తా నుండి జగన్నాథం నాయుడు పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గల్లా అరుణకుమారి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోజాపై 10980 ఓట్ల మెజారిటీతో [4] విజయం సాధించింది. గల్లా అరుణకుమారి 71942 ఓట్లు పొందగా, రోజాకు 60962 ఓట్లు లభించాయి. మూడవ స్థానంలో నిలిచిన సాయి రమణిరెడ్డికి 29833 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థులు నాలుగవ, ఐదవ స్థానాలలో నిలిచారు.
- 2009 ఎన్నికలలో అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు
అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు గల్లా అరుణకుమారి కాంగ్రెస్ పార్టీ 71,942 ఆర్.కె.రోజా తెలుగుదేశం పార్టీ 60,962 సాయి రమణిరెడ్డి ప్రజారాజ్యం పార్టీ 29,833 జి.పుష్పలత భారతీయ జనతా పార్టీ 2,212 జగన్నాథం నాయుడు లోక్‌సత్తా పార్టీ 1,412
నియోజకవర్గ ప్రముఖులు
మార్చు- నారా చంద్రబాబు నాయుడు
- తొమ్మిదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నారా చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు 1951, ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె గ్రామంలో జన్మించాడు. కళాశాల దశలోనే రాజకీయాలపై ఆసక్తి చూపి అనతికాలంలోనే శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ఎదిగాడు. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన చంద్రబాబు 1983 ఎన్నికలలో పరాజయం అనంతరం మామ ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీలోనే తనదైన స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ఎన్టీరామారావు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన పిదప లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో రాజకీయ చాకచక్యంతో శాసనసభ్యులను తనవైపు తిప్పుకొని పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీరామారావునే ముఖ్యమంత్రి పీఠంపై నుంచి దింపి తను ఆ స్థానాన్ని పొందిన సంఘటన దేశ రాజకీయాలనే ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత తొమ్మిదేళ్ళ అతని పాలన "హైటెక్" పాలనగా పలువురు ప్రశంసించిననూ 2004 ఎన్నికలలో పార్టీ పరాజయం పొందినది. అప్పటినుంచి శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నాడు.
- గల్లా అరుణకుమారి
- గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గం నుండి వరుసగా మూడవసారి మొత్తంపై నాలుగవసారి విజయం సాధించింది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు, భవనాల శాఖామంత్రిగా కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గల్లా రామచంద్రనాయుడు ఈమె భర్త. తొలిసారిగా 1989లో ఈ నియోజకవర్గం నుండి గెలుపొంది శాసనసభలో ప్రవేశించగా మళ్ళీ 1999లో రెండవసారి విజయం సాధించింది. ఆ తరువాత 2004, 2009లలో కూడా వరుస విజయాలు నమోదుచేసింది. 2009లో హోరాహోరీ పోటీలో తెలుగుదేశం పార్టీకి చెందిన సినీ నటి రోజాపై దాదాపు 11వేల ఓట్ల తేడాతో విజయం సాధించింది.
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- ఈక్రింద కనబరచిన పట్టికలో 1952 వ సంవత్సరం నుండి, చంద్రగిరి శాసన సభ నియోజిక వర్గంలో గెలిచిన/ఓడిన అభ్యర్థుల పేర్లు, వారు సాధించిన ఓట్లు ఆయా పార్టీల వారిగా ఇవ్వబడినాయి.
సంవత్సరం శాసన సభ నియోజిక వర్గము సంఖ్య శాసన సభ నియోజిక వర్గము పేరు వర్గం/జనరల్/ఎస్.సి./ఎస్.టి /గెలుపొందిన అభ్యర్థి /స్త్రీ/పు పార్టీ పేరు ఓట్లు సమీప అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు 2014 285 చంద్రగిరి జనరల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి M YSRC 100924 [[గల్లా అరుణకుమారి]] M తె.దే.పా 96406 2009 285 చంద్రగిరి జనరల్ [[గల్లా అరుణకుమారి]] స్త్రీ కాంగ్రెస్ 71942 ఆర్.కె.రోజా. స్త్రీ తెలుగుదేశం 60962 2004 148 చంద్రగిరి జనరల్ [[గల్లా అరుణకుమారి]] స్త్రీ కాంగ్రెస్ 46838 ఇ.రామనాథ నాయుడు పు తెలుగుదేశం 32446 1999 148 చంద్రగిరి జనరల్ [[గల్లా అరుణకుమారి]] స్త్రీ కాంగ్రెస్ 57915 నారా రామమూర్థి నాయుడు పు తెలుగుదేశం 55644 1994 148 చంద్రగిరి జనరల్ నారా రామ్మూర్తి నాయుడు పు తెలుగుదేశం 60311 అరుణకూమారి గళ్ళా స్త్రీ కాంగ్రెస్ 43959 1989 148 చంద్రగిరి జనరల్ [[గల్లా అరుణకుమారి]] స్త్రీ కాంగ్రెస్ 54270 జయదేవనాయుడు.ఎన్.ఆర్ పు తెలుగుదేశం 54005 1985 148 చంద్రగిరి జనరల్ జయదేవనాయుడు.ఎన్.ఆర్ పు తెలుగుదేశం 44155 బాలసుభ్రమణ్యం చౌదరి పు కాంగ్రెస్ 42475 1983 148 చంద్రగిరి జనరల్ వెంకట్రామానాయుడు మేడసాని పు స్వతంత్ర 50010 చంద్రబాబు నాయుడు పు కాంగ్రెస్ 32581 1978 148 చంద్రగిరి జనరల్ నారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ (ఐ) 35092 కొంగర పట్టాభి రామ చౌదరి పు జనతా పార్టీ 32598 1952 148 చంద్రగిరి జనరల్ ఎ.ఆదికేశవులనాయుడు పు కాంగ్రెస్ 23988 వి.రాజారెడ్ది పు స్వతంత్ర అభ్యర్ధి 18021
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Election Commission of India.APAssembly results.1978-2004". Archived from the original on 2008-06-21. Retrieved 2008-10-17.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ సాక్షి దినపత్రిక, తేది 17-05-2009