చింతపర్రు

ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా గ్రామం

చింతపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పాలకొల్లు నుండి 4 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 977 ఇళ్లతో, 3440 జనాభాతో 238 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1775, ఆడవారి సంఖ్య 1665. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 899 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 44. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588776.[1] పాలకొల్లు, భీమవరం ప్రధాన రహదారిపై భగ్గేశ్వరం గ్రామం. నుండి రెండు కిలోమీటర్ల లోనికి కల చిన్న గ్రామం.

చింతపర్రు
—  రెవెన్యూ గ్రామం  —
చింతపర్రు is located in Andhra Pradesh
చింతపర్రు
చింతపర్రు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°31′41″N 81°41′51″E / 16.528180°N 81.697468°E / 16.528180; 81.697468
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పాలకొల్లు
ప్రభుత్వం
 - సర్పంచి వీరమల్లు రాజేశ్వర రావు
జనాభా (2011)
 - మొత్తం 3,440
 - పురుషులు 1,775
 - స్త్రీలు 1,665
 - గృహాల సంఖ్య 977
పిన్ కోడ్ 534250
ఎస్.టి.డి కోడ్

గ్రామ విశేషాలు

మార్చు
 
పంచాయితీ కార్యాలయం

గ్రామ జనాభాలో పాల ఉత్పత్తి దారులు, వ్యవసాయ దారులు, కులిలు, చేనేతకారులు అధికం. ఊరి ముఖ ద్వారం వద్ద గణెష్ మందిరము ఉంది. ప్రతి రోజూ గణెష్ భగవాన్ పుజలు జరిపెదెరు. వేడంగి పాలెం పోవు దారిలో శివాలయము ఉంది. చిన్న వీధిలో వీరభద్రస్వామి వారి ఆలయము కలదు ప్రతి సంవత్సరము కార్తీక మాసమున ఇక్కడ ప్రభల సంబరము, నిప్పుల గుండము, తిరునాళ్ళు జరుగును. ఊరిలో పంట పొలాలతో పకృతి చూడ ముచ్చటగా ఉంటుంది. పాలకొల్లు నుండి భీమవరము పోవు రైల్వేలైను ఈ గ్రామం మీదుగా పోవును కాని ఇక్కడ కేవలం పాసింజరు బళ్ళు మాత్రమే ఆగును. పాలకొల్లు సమీపము నుండుటచే అవసరాలకు అధికంగా రాకపోకలు సాగిస్తారు. చింతపర్రులో గణెష్ భగవన్, శ్రీ రామ్, దుర్గా మాతా, వీరభద్రస్వామి,సాయి బాబా, శివ భగవన్, యెసు క్రిస్తు, మందిరములు, చర్చ్ లు ఉన్నాయి.

సమీప గ్రామాలు

మార్చు

చింతపర్రు గ్రామానికి ఉన్న సమీప గ్రామాలు భగ్గేశ్వరం, చింతలపాలెం, లంకలకోడేరు, పూలపల్లి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

చింతపర్రు గ్రామంలో రెండు పాఠశాలలున్నాయి.

  • మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల: ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగరతి వరకు మాత్రమే భోధిస్తారు. మిగిలిన తరగతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతారు.
  • జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 5వ తరగతి వరకు చదివినవారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యనభ్యసిస్తారు. ఉన్నత చదువు కోసం (ఇంటర్, డీగ్రీ, పి.జి) పాలకొల్లు లేదా భీమవరం పట్టణాలలో విద్యనభ్యసిస్తారు.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

రైలు వసతి

మార్చు

చింతపర్రు గ్రామానికి రైల్వేస్టేషన్ ఉంది. ఇక్కడ పాసింజర్ రైల్లు మాత్రమే ఆగుతాయి. ఈ స్టేషన్లో ప్రతి రోజు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు

మార్చు

చింతపర్రు గ్రామంలో శివాలయం ఉంది. ఈ ఆలయం ఊరి మధ్యలో ఉంటుంది. అలాగే శివాలయం దగ్గరిలో విఘ్నేశ్వరుని ఆలయం కూడా ఉంది. మరో విఘ్నేశ్వరుని ఆలయం భగ్గేశ్వరాని దగ్గరిలో ఉంటుంది. ఈ ఆలయం ఈమధ్యకాలంలో నిర్మించారు. ఈ గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయం ఊరి శివారులో ఉంది. ఈ ఆలయం ప్రక్కనే శ్రీ సాయిబాబా మందిరం ఉంది. చింతపర్రు గ్రామదేవత అంకాలమ్మ దేవత ఎంతో ప్రత్యేకమైంది. ప్రతి సంవత్సరం జాతర ఘనంగా జరుపుతారు. ఈ గ్రామంలో విశేషమైన ఆలయం బుద్దదేవుని ఆలయం ఉంది. మొత్తం రాష్ట్రంలోనే వెలసిన బుద్ధ దేవుని విగ్రహం ఈ ఊరిలో ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

భగ్గేశ్వరం గ్రామంలో ప్రధాన పంట వరి. సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. ఈ మధ్య కాలంలో వర్షాలు సమయానికి కురవకపోవడం చేత ఒక పంటనే పండిస్తున్నారు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

చింతపర్రు గ్రామంలో చేనేత ప్రధనమైన వృత్తి. అలాగే తాపి, వడ్రంగి, వృత్తులవారు ఎక్కువ. వ్యవసాయ వృత్తి కూడా ప్రధానమైంది. ఈ గ్రామంలో మరొక చేప్పుకోతగ్గా వృత్తి కొబ్బరి వలుపు. ఈ గ్రామం నుండి ప్రతి రోజు వేలది కొబ్బరి వలుపు వలుస్తారు. అలాగే వేలది కొబ్బరి ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)

మార్చు

ఒకప్పటి ప్రముఖ నటుడు అయిన నల్ల రామమూర్తి యొక్క స్వగ్రామం.

నీటి వసతులు

మార్చు

చింతపర్రు గ్రామంలో నీటి వసతులు రెండు విధాలుగా ఉన్నాయి.

  • గ్రామ పంచాయితీ నీటి సరఫరా:

గ్రామ పంచాయితీ నీటి సరఫరా రోజుకు ఒక్క సారి మాత్రమే సరఫరా చేస్తారు. ఈ గ్రామంలో నీరు పరిశుభ్రముగా ఉండవు. పూర్వము భగ్గేశ్వరం గ్రామ ప్రజలు చింతపర్రు వెళ్ళి త్రాగడనికి నీరు తెచ్చుకునేవారు. అప్పుడు అంత పరిశుభ్రముగా ఉండేవి. చింతపర్రు గ్రామ ప్రజలు త్రాగడాని పాలకొల్లు లేదా గ్రామంలో నాంది, డాక్టర్ వాటర్ వారు స్ఠాపించిన వాటర్ ఫౌండేషన్ వద్ద తెచ్చుకుంటారు.

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3288. ఇందులో పురుషుల సంఖ్య 1675, మహిళల సంఖ్య 1613, గ్రామంలో నివాసగృహాలు 802 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 977 ఇళ్లతో, 3440 జనాభాతో 238 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1775, ఆడవారి సంఖ్య 1665. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 899 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 44. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588776[1].పిన్ కోడ్: 534250.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి భాగేశ్వరంలో ఉంది.సమీప జూనియర్ కళాశాల లంకలకోడేరు లోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, అనియత విద్యా కేంద్రం, పాలకొల్లు లోనూ ఉన్నాయి. పాలీటెక్నిక్‌ పోడూరు లోను, మేనేజిమెంటు కళాశాల భీమవరం లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఎస్.చిక్కాల లోను,దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల,సమీప వైద్య కళాశాల, ఏలూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

చింతపర్రులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

చింతపర్రులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

చింతపర్రులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 74 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 163 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 163 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

చింతపర్రులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 163 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

చింతపర్రులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, కొబ్బరి, నిమ్మ

చేతివృత్తులవారి ఉత్పత్తులు

మార్చు

వస్త్రాలు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".