భగ్గేశ్వరం
భగ్గేశ్వరం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన గ్రామం.. ఈ గ్రామంపాలకొల్లు, భీమవరం ప్రధాన రహదారిపై పాలకొల్లుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పంజాబీలు ఉపయోగించే పగడీ అనబడే సిల్కు తలరుమాళ్ళూ నేయు నేతగాళ్ళు కలరు. మఠము అని పిలువబడే ప్రాంగణములో శివాలయము, విష్ణాలయం, అమ్మవార్ల ఆలయాలు ఉన్నాయి. పాలకొల్లు సమీపముగా నుండుటచే అధికంగా అవసరాలకు రాకపోకలు సాగిస్తారు. ఊరిలో మంచినీటీకి తగిన వనరులు లేని కారణంగా పాలకొల్లు నుండి కేన్లతో ప్రతి రోజూ నీటిని తెచ్చుకొంటారు.
భగ్గేశ్వరం | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°31′25″N 81°41′39″E / 16.523626°N 81.694028°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | పాలకొల్లు |
ప్రభుత్వం | |
- కొయ్యే చినమాణిక్యం | |
పిన్ కోడ్ | 534250 |
ఎస్.టి.డి కోడ్ | 08814 |
గ్రామ చరిత్ర
మార్చుభగ్గేశ్వరం గ్రామం పూర్వము పొడూరు తాలూక వున్నప్పుడు పూలపల్లి పంచాయితీలో ఉండేది
గ్రామం పేరు వెనుక చరిత్ర
మార్చుభాగీరధీ నది యొక్క పాయ ఈ ఊరి గుండా ప్రవహించడం వలన భగ్గేశ్వరం అనే పేరు వచ్చినట్టుగా పెద్దలు చెపుతారు.
గ్రామ భౌగోళికం
మార్చుసమీప గ్రామాలు
మార్చుభగ్గేశ్వరం సరిహాద్దు గ్రామాలు చింతపర్రు, లంకలకోడేరు, పూలపల్లి.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుభగ్గేశ్వరం గ్రామంలో రెండు పాఠశాలలు ఉన్నాయి.
- ప్రభుత్వ పాఠశాల
- ప్రాథమిక పాఠశాల
- ప్రవేట్ పాఠశాల
- చేతన్ మోడల్ స్కూల్
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుభగ్గేశ్వరం గ్రామానికి ప్రధాన మార్గం రోడ్డు మార్గం. ఈ రోడ్డు పాలకొల్లు-భీమవరంకి ప్రధానమార్గం. ఈ రోడ్డు భారతీయ ప్రధాన రహాదారి. ప్రధాన రహాదారి నెంబరు:214 ఈ రహాదారి కత్తిపూడి నుండి పామర్రుకు కలిపే ప్రధాన రహాదారి. భగ్గేశ్వరానికి రైలు మార్గం లేదు. రైలు ప్రయాణం చేసేవారు పాలకొల్లు రైల్వేస్టేషన్ లేదా చింతపర్రు రైల్వేస్టేషను ద్వారా ప్రయాణం చేస్తారు. చింతపర్రు రైల్వేస్టేషన్లో ఎక్స్ ప్రెస్ రైలు అగకపొవడం వల్ల పాలకొల్లు రైల్వేస్టేషన్ ద్వారా ప్రయాణం సాగిస్తారు.
గ్రామంలో మౌలిక వసతులు
మార్చు- నీటి వసతి: ఈ గ్రామంలో మంచి నీటి ట్యాంక్ ఉంది. ఇక్కడి నీరు వాడుకకు బాగానే ఉంటాయి, కాని త్రాగడానికి మాత్రం వీలులేదు. ఎందుకంటే ఇక్కడీ నీరు ఫీల్టర్ కావు. ఒక్కోక్కసారి బోరు నీటిని సరఫరా చేస్తారు. కావున గ్రామప్రజలు సమీప పట్టణమైన పాలకొల్లు వెళ్ళి టిన్నులలో త్రాగడాని ప్రతి రోజు తెచ్చుకుంటారు. వేసవికాలంలో మాత్రం కొంచెం కష్టతరమైంది. పాలకొల్లు నీటికి చుట్టుప్రక్కల గ్రామాలు ప్రజలు కూడా తీసుకువెలుతుంట్టారు కాబట్టి నీటి కోసం గంటల తరబది వేచివుండాలి. ఈ గ్రామంలో వాడుకకు మాత్రం వేసవికాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
- వైద్యవసతి: గ్రామంలో వైద్యవసతి లేదు. కాకపొతే పొలియో చుక్కలు, చిన్నపిల్లలకు టీకాలు పంచాయితీ కార్యాలయంలో వేస్తుంటారు.
గ్రామంలో రాజకీయాలు
మార్చుభగ్గేశ్వరం గ్రామంలో 2014 లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కొయ్యే చినమాణిక్యం గారు పోటీ చేసి విజయం సాధించారు.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
మార్చు- ఈ గ్రామంన 300 ఏండ్ల క్రిందట పరదేశియ్య అనే సాధువు జీవించాడు. ఆయన జీవ సమాధి ఈ గ్రామంలో మఠం అనే శివాలయం, వీరభద్రాలయం సహా పలు దేవాలయాలు కలిగిన ప్రదేశాన ఉంది. ఈయన అనేక మహిమలు చేసినాడని 300 ఏండ్లకు పైబడి జీవించినాడని పెద్దలు చెపుతారు. కొద్దిమంది పెద్దలు ఈయన రూపమును వివరించగా ప్రముఖ సినీ కళాకారుడైన గంగాధర్ గీసిన చిత్రపటము ఇక్కడ ఉంది.
- ఈ గ్రామంలో 2013 సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల దగ్గర కొత్తగా శ్రీ వీరభధ్రస్వామివారి ఆలయం నిర్మించారు. భగ్గేశ్వరం గ్రామంలో గత 30 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కార్తీకమాసం చివరి రోజు శ్రీ వీరభధ్రస్వామివారి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ ఉత్సవాలో మధ్యహ్నాం మూడు గంటలకి విచిత్ర వేషదారణలతో ఊరు మొత్తం ఊరేగిస్తారు. రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి ప్రాగణంలో భక్తులు రోజంతా ఉపవాసం ఉండి నిప్పులగుండం తొక్కుతారు. ఈ ఉత్సవాల్లో నిప్పులగుండం ప్రత్యేకమైంది.
- ఈ గ్రామంలో ప్రత్యేకమైన ఆలయం శ్రీశ్రీశ్రీ పెద పరదేశయ్య స్వామివారి ఆలయం. ఈయన ఒక మహర్షి. ఈయన సహాజీవ సమాధి అయ్యారు. ఈ ఆలయం మఠము అని పిలువబడే శివాలయం దగ్గర్లో ఉంది. ఈయని శివుని పరమభక్తుడు కావడంతో శివాలయం దగ్గర్లోనే జీవసమాధి అయ్యారు. ప్రతి సంవత్సరం శ్రీశ్రీశ్రీ పెద పరదేశయ్య స్వామివారి ఉత్సావాలు ఘనంగా జరుపుతారు. తరువాత రోజు అన్నసమారాధన ఘనంగా పెడతారు.
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చుభగ్గేశ్వరం గ్రామంలో ప్రధాన పంట వరి. సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. ఈ మధ్య కాలంలో వర్షాలు సమయానికి కురవకపోవడం చేత ఒక పంటనే పండిస్తున్నారు.
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చుభగ్గేశ్వరం గ్రామంలో ప్రప్రథమంగా చేప్పుకోతగ్గా వృత్తి చేనేత. ఈ గ్రామంలో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారు. అంతేకాక వ్యవసాయం, వడ్రంగి, తాపి వృత్తులు అధికంగా ఉన్నాయి.
గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)
మార్చు- అందే ముసలికోటయ్య
- తాళ్ళ కోటివీరయ్య
- తాళ్ళ వీరభధ్రరావు
- అందే కోటమల్లయ్య
- శిద్దాని కోటి వీరభధ్రం
- అందే బసవమల్లయ్య
- అందే కోటి వీరభధ్రం గారు
- కుక్కల శ్రీరామమూర్తి