బిత్తిరి సత్తి (చేవెళ్ళ రవి)

విలేఖరి, నటుడు
(చేవెళ్ళ రవి నుండి దారిమార్పు చెందింది)

బిత్తిరి సత్తి (జననం 1979 ఏప్రిల్ 5) టెలివిజన్ వ్యాఖ్యాత, సినిమా నటుడు.[1]

బిత్తిరి సత్తి
బిత్తిరి సత్తి
జననం
కావలి రవి కుమార్

ఏప్రిల్ 5, 1979
ఇతర పేర్లురవి చేవెళ్ల;
వృత్తిటెలివిజన్ వ్యాఖ్యాత, నటుడు
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం
తల్లిదండ్రులుకావలి నరసింహ, యాదమ్మ

జననం - చదువు

మార్చు

బిత్తిరి సత్తి అసలు పేరు కావలి రవికుమార్ (చేవెళ్ల రవి). కావలి నరసింహ, యాదమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలంలో పామెన గ్రామంలో 1979, ఏప్రిల్ 5న జన్మించాడు. పాఠశాల విద్యను పామెనలో చదివిన రవి, మాధ్యమిక విద్యను చేవెళ్లలో పూర్తిచేశాడు.[2]

రంగస్థల ప్రస్థానం

మార్చు

చిన్నప్పటినుండి సినిమాలపై ఇష్టం పెంచుకున్న రవి, తాను కూడా సినిమాలలో నటించాలనుకున్నాడు. అందుకోసం పక్క ఊరిలో ఉన్న నాటక కళాకారుల వద్ద రంగస్థల నటనలో శిక్షణ తీసుకొని నాటకాలలో నటించాడు.

టీవి రంగం

మార్చు

2012లో జీ తెలుగులో ప్రసారమైన "కామెడీ క్లబ్" అనే రియాలిటీ షోలో పాల్గొన్నాడు. అనంతరం జర్నలిజం మీద ఉన్న ఆసక్తితో జర్నలిజం కోచింగ్ లో చేరాడు. కోర్స్ అయిపోయాక వ్యాఖ్యాతగా వివిధ ఛానల్స్ లో పనిచేశాడు. 2015లో వి6 ఛానల్ లో చేరాడు. తీన్మార్ సావిత్రి తో కలిసి ప్రతిరోజు రాత్రి 9.30కి వచ్చే తీన్మార్ వార్తలలో సమాచారాన్ని అందించాడు. తీన్మార్ అనే కార్యక్రమంతో రవికి పాపులారిటీ రావడమేకాకుండా, రవి రాకతో ఆ కార్యక్రమం విజయవంతమైయింది.[3][4] తీన్మార్ వార్తల కార్యక్రమంతో వి6 రేటింగ్ పెరిగింది. వివిధ ఛానళ్లలోని కార్యక్రమాలు ఈ తీన్మార్ వార్తల కార్యక్రమం పోటీని తట్టుకోలేకపోతున్నాయి.[5]

ప్రస్తుతం టీవీ9 వార్తా ఛానల్ లో ఇస్మార్ట్ న్యూస్ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా చేస్తున్నాడు.

సినిమా రంగం

మార్చు

సినిమాలో అవకాశం కోసం 2003లో హైదరాబాద్ వచ్చి, కృష్ణానగర్ లోని డైరెక్టర్లను కలిసేవాడు. తరువాత తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర అసిస్టెంట్ మేనేజర్‌ గా చేరాడు. కొన్నిరోజుల తరువాత ఒక వ్యక్తి ఇచ్చిన సలహాతో 2005లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా యూనియన్ మెంబర్‌ షిఫ్ తీసుకున్నాడు. 15 సంవత్సరాలుగా డబ్బింగ్ కళాకారుడిగా పనిచేస్తూ, 150 సినిమాల వరకు డబ్బింగ్ చెప్పాడు. అలా, సీమ శాస్త్రి చిత్రంలోని చిన్న పాత్రతో తెలుగు సినిమారంగంలోకి అరంగేట్రం చేశాడు. ఆ తరువాత ప్రతిష్టాకరమైన రుద్రమదేవి చిత్రంలో సామంత రాజు పాత్రలో నటించాడు.[2] 2019లో తుపాకి రాముడు సినిమాలో హీరోగా నటించాడు.[6]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు ఇతర వివరాలు
2007 సీమ శాస్త్రి నటుడిగా తొలిచిత్రం
2015 రుద్రమదేవి సామంతరాజు
2017 గల్ఫ్
2018 నా నువ్వే
2019 తుపాకి రాముడు రాముడు హీరోగా తొలిచిత్రం
2022 కోతల రాయుడు
2023 దోచేవారెవరురా
2023 ఇంటింటి రామాయణం
2023 అన్‌స్టాపబుల్
2024 రాఘవరెడ్డి
2024 తిరగబడర సామి
2024 భవనమ్

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు
  1. ఈనాడు, హాయ్. "ఫొటోలు ముఖాన కొట్టారు". www.eenadu.net. ప్రమీల పుట్టిగారి. Archived from the original on 19 January 2020. Retrieved 8 February 2020.
  2. 2.0 2.1 నమస్తే తెలంగాణ, జిందగీ (14 January 2017). "ఇదిగో..మీ సత్తి". www.ntnews.com. అజహర్ షేక్ ,కంది సన్నీ. Archived from the original on 31 October 2019. Retrieved 31 October 2019.
  3. తెలుగు వన్ ఇండియా. "సత్తి.. బిత్తిరి సత్తి.. : ఎందుకింత పాపులారిటీ?". telugu.oneindia.com. Retrieved 3 October 2016.
  4. ముచ్చట.కాం. "బుల్లితెర పాపులర్ స్టార్ 'బిత్తిరి సత్తి'". www.muchata.com. Archived from the original on 4 October 2016. Retrieved 3 October 2016.
  5. తెలుగు ఏపిటూటిజి.కాం. "జబర్దస్త్ ను భయపెడుతున్న బిత్తిరి సత్తి". telugu.ap2tg.com. Archived from the original on 24 నవంబరు 2020. Retrieved 3 October 2016.
  6. నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (25 October 2019). "రివ్యూ: తుపాకి రాముడు". www.ntnews.com. Archived from the original on 25 October 2019. Retrieved 31 October 2019.
  7. ప్రజాశక్తి, తెలంగాణ (31 May 2017). "తెలంగాణ అవార్డు గ్రహీతలు వీరే!". www.prajasakti.com. Archived from the original on 31 May 2017. Retrieved 31 October 2019.
  8. నమస్తే తెలంగాణ, ప్రధాన వార్తలు (3 June 2017). "ప్రతిభామూర్తులకు పురస్కారాలు". www.ntnews.com. Archived from the original on 31 October 2019. Retrieved 31 October 2019.

ఇతర లంకెలు

మార్చు