తోడుదొంగలు (1954 సినిమా)
1954 తెలుగు సినిమా
తోడుదొంగలు ఎన్.టి.రామారావు స్వీయ నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్ పతాకంపై, ఎన్.టి.రామారావు, గుమ్మడి, పి.హేమలత ప్రధాన పాత్రధారులుగా నటించిన 1954 నాటి సాంఘిక చలనచిత్రం.
తోడుదొంగలు (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.యోగానంద్ |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, పి.హేమలత |
సంగీతం | టి.వి.రాజు |
నిర్మాణ సంస్థ | నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఆటలలో ఆట సాటిలేనిది ఆట పేకాట - పిఠాపురం
- ఉన్నతీరునే ఉన్నది ఉంది ఉన్నదినీకేముంది నీదన్నది నీకేముంది - ఘంటసాల
- కరువు కాటకములని నిధులు జమచేయు (పద్యం) - పుండరీకాక్షయ్య
- రాయే నా వయారం రాయేనా వలపు దుమారం - ఎ.పి. కోమల,జిక్కి
పురస్కారాలు
మార్చుభారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- 2వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1954) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా - ప్రశంసా పత్రం[1]
నిర్మాణం
మార్చుఅభివృద్ధి
మార్చుఎన్.టి.రామారావు 1953లో చలనచిత్ర నిర్మాణంలో అడుగుపెడుతూ నేషనల్ ఆర్ట్స్ పతాకంపై పిచ్చి పుల్లయ్య సినిమా నిర్మించారు. అది పరాజయం పాలైంది, రెండవ సినిమాగా ఈ సినిమాని నిర్మాణ సంస్థ పేరు నేషనల్ ఆర్ట్ థియేటర్గా మారుస్తూ తీశారు.[2]
విడుదల, స్పందన
మార్చుసినిమా 1954లో విడుదలై పరాజయం పాలైంది.[2]
మూలాలు
మార్చు- ↑ "2nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 23 August 2011.
- ↑ 2.0 2.1 "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015.
"నిర్మాతగా ఎన్టీఆర్ కి వజ్రోత్సవం" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన