టి.శ్రీరంగస్వామి

తిరుకోవలూరు శ్రీరంగస్వామి తెలంగాణా ప్రాంతంలో విశేషమైన కృషి చేస్తున్న సాహితీవేత్త.

టి.శ్రీరంగస్వామి
జననంటి.శ్రీరంగస్వామి
25 జులై 1949 అధికారిక తేది 16-07-1950
India పర్లపల్లి గ్రామం,తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణా రాష్ట్రం
మతంహిందూ (శ్రీవైష్ణవ)
భార్య / భర్తశ్రీలక్ష్మి
పిల్లలుసంధ్య, ఉషాకాంత్
తండ్రిటి.రామానుజస్వామి
తల్లితాయమ్మ

జీవిత విశేషాలుiam s] సవరించు

sa

డా. టి.శ్రీరంగస్వామి (T.Sriranga Swamy),[1] [2] విరోధి నామ సంవత్సర శ్రావణ శుద్ధ పాడ్యమి తిథికి సరియైన 1949, జులై 25 వ తేదీన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామంలో టి.రామానుజస్వామి తాయమ్మ దంపతులకు జన్మించాడు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన ఇతడు శ్రీవత్సస గోత్రజుడు. బి.కామ్‌ చదివాడు. తెలుగులో ఎం.ఎ చేశాడు. విశ్వనాథవారి కృష్ణకావ్యాలు అనే అంశంపై కోవెల సంపత్కుమారాచార్య పర్యవేక్షణలో పరిశోధన చేసి కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి.పట్టాపొందాడు. ఇతడు హైదరాబాదులో ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా 1974-77ల మధ్య పనిచేశాడు. తర్వాత ప్రభుత్వంలో ఉద్యోగం రావడంతో వరంగల్ చేరి పోలీసు, ప్రజారోగ్య శాఖలలో పనిచేసి 2008లో పదవీ విరమణ చేశాడు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీలలో కౌన్సిలర్‌గాను, అరోరా డిగ్రీ కాలేజి వరంగల్‌లో పార్ట్‌ టైం లెక్చరర్‌గాను సేవలనందించాడు.

సాహితీరంగం సవరించు

రచయితగా సవరించు

ఇతడు అన్ని ప్రక్రియలలో రచనలు చేశాడు. ఇతని రచనలు జనధర్మ,ఎక్స్‌రే,భావవీణ,ప్రజామిత్ర,అగ్రగామి,వరంగల్ వాణి, భారతి, సమాలోచన, శ్రీవాణి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, పత్రిక, మూసీ,సప్తగిరి, తెలుగు, వాజ్మయి, నేటి నిజం మొదలైన అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని రచనలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, సంస్కృత, క్రొయేషియా భాషలలోనికి అనువాదమయ్యాయి. పుస్తకరూపంలో వచ్చిన ఇతని రచనలు

 1. మధుర (కవిత్వం)
 2. శిఖరం (కవిత్వం)
 3. మానస సంచరరే...[3] (కవిత్వం)
 4. నిరంతరం (కవిత్వం)
 5. సరయేవో నుండి ఏకశిలకు (అనువాద కవిత్వం)
 6. నీలమోహనాష్టకం
 7. సమజ్ఞ (కవిత్వం)
 8. వరంగల్లు జిల్లా రచయితల వాజ్మయ జీవిత సూచిక[4] (పరిశోధన)
 9. విశ్వనాథ వారి కృష్ణకావ్యాలు (పరిశోధన)
 10. విపంచి (వ్యాససంపుటం)
 11. దేవులపల్లి రామానుజారావు - ఒక రేఖాచిత్రం
 12. కోవెల సుప్రసన్నాచార్య వాజ్మయ జీవిత సూచిక[5]
 13. సాహితీ గవాక్షం (వ్యాససంపుటం)
 14. శ్రీవ్యాసం (వ్యాససంపుటం)
 15. సమూహ
 16. మంచి మాట
 17. విశ్వనాథ రామ కృష్ణ
 18. పొనుక
 19. సజీవచిత్రాలు (కథలు)
 20. షుగర్‌లెస్ కాఫీ (కథలు)

21. విష్ణుపద (వ్యాససంపుటి)

22. డిసెంబర్ 11 (కవితలు)

అనువాదకుడిగా సవరించు

ఇతడు బోస్నియా కవితలను ఆంగ్లం నుండి తెలుగులోనికి, సింగపూర్ కవితలను ఆంగ్లం నుండి తెలుగులోనికి, ఆంగ్ల కవితలను తెలుగులోనికి, హిందీకవితలను తెలుగులోనికి అనువాదం చేశాడు. ఇంగ్లీషులో స్వంతంగా కవితలల్లాడు.

సంపాదకుడిగా సవరించు

వరంగల్లు నుండి వెలువడే ప్రసారిక అనే సాహిత్య పత్రికకు గౌరవసంపాదకుడిగా ఉన్నాడు. శ్రీలేఖ సాహితి వెలువరించిన అనేక పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. ఇతడి సంపాదకత్వంలో వెలుగు చూసిన గ్రంథాలు

 1. నమిలికొండ బాలకిషన్‌రావు కవితా దర్పణం
 2. ఏకశిల వైతాళికులు
 3. కాలం వెంట నడచివస్తున్న... (బాలకిషన్‌రావు అభినందన సంచిక)
 4. వరంగల్లు సాహితీ తరంగాలు
 5. వరంగల్లు సాహితీ మూర్తులు
 6. తెలంగాణ సాహిత్య స్వరూపాలు
 7. నిగమాంత సార సంగ్రహము (తాళపత్ర గ్రంథ పరిష్కరణ)
 8. భాగవత దర్శనం
 9. అన్నమయ్య పదవైభవం
 10. స్వయంభావుకుడు (పల్లేరు వీరాస్వామి అభినందన సంచిక)
 11. రామాయణ వైభవం
 12. సాహిత్యంలో మధురభక్తి
 13. వంశీమోహనం
 14. సంపత్కుమార సాహిత్య దర్శనం
 15. రామాయణ దర్శనం
 16. చైతన్య (కవితా సంకలనం)
 17. దివిటి (కవితా సంకలనం)
 18. స్వరమాలిక (కవితా సంకలనం)
 19. ప్రభవ (కవితా సంకలనం)
 20. శుక్ల (కవితా సంకలనం)
 21. ప్రమోదూత (కవితా సంకలనం)
 22. ప్రజోత్పత్తి (కవితా సంకలనం)
 23. ఈశ్వర[6] (కవితా సంకలనం)
 24. ప్రమాది (కవితా సంకలనం)
 25. విక్రమ (కవితా సంకలనం)
 26. వృష (కవితా సంకలనం)
 27. చిత్రభాను (కవితా సంకలనం)
 28. స్వభాను (కవితా సంకలనం)
 29. తారణ (కవితా సంకలనం)
 30. పార్థివ (కవితా సంకలనం)
 31. వ్యయ (కవితా సంకలనం)
 32. సర్వజిత్ (కవితా సంకలనం)
 33. మానవీయం (కవితా సంకలనం)
 34. సర్వధారి (కవితా సంకలనం)
 35. ఒకరికొకరం (కవితా సంకలనం)
 36. శ్రీలేఖ (కథాసంకలనం)
 37. తెమ్మెర (కథాసంకలనం)
 38. తరంగం (కథాసంకలనం)
 39. సౌరభం (కథాసంకలనం)
 40. సంగడి (కథాసంకలనం)
 41. శ్రీహంస (కథాసంకలనం)
 42. శ్రీకంజము (కథాసంకలనం)

కార్యకర్తగా, కార్యనిర్వాహకుడిగా సవరించు

ఇతడు కార్యకర్తగా, కార్యనిర్వాహకుడిగా పలు సాహిత్యసభలు, గోష్టులు, సదస్సులలో చురుకుగా పాల్గొన్నాడు. వరంగల్లులో శ్రీలేఖ సాహితి అనే సాహిత్య సంస్థను 1977లో స్థాపించి దాని ద్వారా ఎందరో ఔత్సాహిక రచయితలకు తోడుగా నిలిచాడు. ఆ సంస్థద్వారా సుమారు 200కు పైగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేశాడు. రాష్ట్రస్థాయి యువరచయితల మహాసభలు మూడు పర్యాయాలు, అష్టావధాన సప్తాహాలు రెండుమార్లు, శతాధిక కవిసమ్మేళనము, సుప్రసన్న సాహితీ వైజయంతి, జాతీయ సదస్సులు ఈ సంస్థ పక్షాన నిర్వహించాడు. ప్రస్తుతం ఈ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థ కాకుండా అనేక సాహిత్య సంస్థలతో ఇతనికి అనుబంధం ఉంది. చైతన్యసాహితి, సాంస్కృతిక సమాఖ్య, సాహితీసమితి, జాతీయ సాహిత్య పరిషత్ (రాష్ట్రశాఖ),సి.వి.సుబ్బన్న శతావధాని కళాపీఠం మొదలైన సంస్థలకు కార్యదర్శిగా, సహాయ కార్యదర్శిగా సేవలనందించాడు. పలు సంస్థలలో జీవిత సభ్యునిగా, గౌరవ సలహాదారుగా, కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఆథర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర్స్ మొదలైన వాటిలో సభ్యుడిగా ఉన్నాడు. లండన్‌లో జరిగిన నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొని ప్రసంగించాడు.

పురస్కారాలు సవరించు

 • విజయభావన, విజయనగరం వారి సాహిత్య పురస్కారం
 • సోమనాథ కళాపీఠం, పాలకుర్తి వారి స్వచ్ఛందభాషాసేవా పురస్కారం
 • కళాజ్యోతి, ధర్మవరం వారి శీరిపి ఆంజనేయులు సాహిత్య పురస్కారం
 • జాతీయ సాహిత్య పరిషత్, సిద్ధిపేట వారిచే యాంసాల బాలయ్య ధార్మిక సాహిత్య పురస్కారం
 • తేజ సాహిత్య పురస్కారం
 • తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావోత్సవం సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం వారిచే సన్మానం
 • భారతి సాహితీ సమితి, కోరుట్ల వారిచే డా.వానమామలై వరదాచార్య సాహిత్య పురస్కారం
 • కళాజ్యోతి, గోదావరిఖని వారిచే దశాబ్ది ఉత్తమ విమర్శకుడిగా గుర్తింపు

బిరుదులు సవరించు

 1. సాహిత్యరత్న
 2. నవభారత సాహిత్యరత్న
 3. సాహితీ వశిష్ట

మూలాలు సవరించు

 1. వి., వీరాచారి (2010). డా. టి.శ్రీరంగస్వామి జీవితం-సాహిత్యం. వరంగల్లు: జనజీవన ప్రచురణలు.
 2. వి., వీరాచారి. సుధావర్షి (అభినందన సంచిక). వరంగల్లు: శ్రీలేఖసాహితి.
 3. టి., శ్రీరంగస్వామి. మానససంచరరే... (1 ed.). వరంగల్లు: విశ్వసాహితి. Retrieved 26 December 2014.
 4. టి., శ్రీరంగస్వామి. వరంగల్లు జిల్లా రచయితల వాజ్మయ జీవిత సూచిక (1 ed.). వరంగల్లు: శ్రీలేఖ సాహితి. Retrieved 27 December 2014.
 5. టి., శ్రీరంగస్వామి. కోవెల సుప్రసన్నాచార్యులు వాజ్మయ జీవిత సూచిక (1 ed.). వరంగల్లు: శ్రీలేఖ సాహితి. Retrieved 29 December 2014.
 6. టి., శ్రీరంగస్వామి (1997). ఈశ్వర (కవితా సంకలనము) (1 ed.). వరంగల్: శ్రీలేఖసాహితి. Retrieved 26 December 2014.