తెలంగాణ బౌద్ధ క్షేత్రాలు

బౌద్ధమతం ఆరంభ దశనుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో విశేషమైన ఆదరణ పొందింది.[1] అశోకునికి ముందే, అనగా బుద్ధుని కాలం నుండే ఈ ప్రాంతాలలో బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉన్నదనడానికి అనేక ఆధారాలున్నాయి. సుప్రసిద్ధ దార్శనికులు అయిన నాగార్జునుడు, ఆర్యదేవుడు, భావవివేకుడు, దిజ్ఞాగుడు వంటి వారికు ఈ ప్రాంతం నివాసభూమి అయ్యింది. థేరవాదులకు మగధవలె మహాయాన బౌద్ధులకు ఆంధ్రదేశం పవిత్ర యాత్రాస్థలం అయ్యింది.[2]

శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం నుండి విజయనగరం జిల్లాలోని రామతీర్థం వరకు, పడమర కరీంనగర్ జిల్లా ధూళికట్ట నుండి వైఎస్ఆర్ జిల్లా ఆదాపూర్ వరకు ఆంధ్రదేశం నలుమూలలలో అనేక బౌద్ధ క్షేత్రాలు వెలిశాయి.

చరిత్ర

మార్చు
 
నేలకొండపల్లిలోని స్థూపం

తెలంగాణలోని కొండాపూర్, ధూళికట్ట, తిరుమలగిరి, గాజులబండ, ఫణిగిరి, నేలకొండపల్లి, లింగాలమెట్ట, పెద్దబంకూరు, కోటిలింగాల, బోధన్ తదితర ప్రాంతాలలో బౌద్ధ శిథిలాలు బయటపడ్డాయి. ఫణిగిరిలోని శిథిలాల్లో బుద్ధుడి పాదాలు, ధర్మచక్రం బయటపడటంతో ప్రాచీనకాలం నుంచే ఇక్కడ బౌద్ధమతం ఉన్నదని తెలుస్తోంది. బుద్ధుడి సమకాలికుడైన కరీంనగర్ జిల్లా ములక ప్రాంతానికి చెందిన భావరి అనే బ్రాహ్మణుడు, గౌతమ బుద్ధుని గురించి తెలుసుకొని తన 16 మంది శిష్యులను బుద్ధుని వద్దకు పంపించాడు. ఈ 16 మంది శిష్యులు శ్రావస్తిలో నివసిస్తున్న బుద్ధుడిని కలిసి, బుద్ధుని సిద్ధాంతాలకు ప్రభావితులై బౌద్ధ మతాన్ని స్వీకరించారు. కొంతకాలం తర్వాత పింగియా లేదా కౌండిన్య అస్మక రాజ్యానికి తిరిగివచ్చి బుద్ధుని సిద్ధాంతాలను భావరికి వివరించాడు. దీంతో బౌద్ధం పట్ల ప్రభావితుడైన భావరి బౌద్ధ మతాన్ని స్వీకరించి అస్మక రాజ్యంలో బౌద్ధమతం వ్యాప్తి చేశాడు.[3]

ముఖ్యమైన క్షేత్రాల జాబితా

మార్చు

తెలంగాణలో ఈ క్రింది బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి.[4]

ఖమ్మం జిల్లా
  • నేలకొండపల్లి: ఇక్కడ దక్షిణ భారతదేశంలో అతి పెద్ద స్తూపం ఉంది. బుద్ధ విగ్రహాల తయారీ శిల్పకళ క్షేత్రం ఇక్కడ బయటపడింది. ఇక్కడ బౌద్ధ సంఘారామం తొలుత హీనయాన శాఖ ప్రారంభమై అనంతరం మహాయానం బౌద్ధ శాఖ కేంద్రంగా అభివృద్ధి చెందింది.
  • వైరా:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
నల్గొండ జిల్లా
  • యేలేశ్వరం:
  • వధమనకోట:
  • నాగార్జునకొండ: గుంటూరు, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని ఆనాటి శ్రీపర్వతం విజయపురిగా పిలిచేవారు. ఇక్కడ బుద్ధుని ధాతుగర్భ స్తూపం ఏర్పాటు చేశారు. నాగార్జునకొండ లోయలో బౌద్ధ మహా చైత్యం, ఆరామాలు, విశ్వవిద్యాలయం, క్రీడారంగ స్థలాలు, యజ్ఞశాల నిర్మాణాలు బయటపడ్డాయి.
సూర్యాపేట జిల్లా
  • తిరుమలగిరి:
  • ఫణిగిరి: ఇక్కడ ఉత్తర దిశల్లో నాగుపాము పడగను పోలిన కొండ ఉంది. బౌద్ధ భిక్షుల నీటి అవసరాల కోసం రెండు చెరువులను తవ్వించారు. ఫణిగిరిలో ఒకే శిలపై బౌద్ధుడి జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలు చెక్కబడ్డాయి. బుద్ధుని పాదాలు, ధర్మచక్రం శిల్పాలు లభించాయి.[5]
జగిత్యాల జిల్లా
  • కోటిలింగాల: ఇక్కడ దొరికిన రాతి స్తంభంపై బ్రాహ్మిలిపిలో నాగగోపినికయ అని ఉంది. కోటిలింగాలకు 3కి.మీ. దూరంలో హుస్సేన్​వాగు సమీపంలో పాసిగాం అనే గ్రామం ఉంది. దాని పక్కన పర్వతంపై స్తూపం చైత్యం, చైత్యగృహం ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా
  • పశిగం:
  • వడ్డమణి:
మెదక్ జిల్లా
రంగారెడ్డి జిల్లా
  • గాజులభండ:
పెద్దపల్లి జిల్లా
  • పెద్దబొంకూర్:
  • ధూళికట్ట: తెలంగాణలోని అతి ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటైన ధూళికట్టలో బార్హుత్​ శిల్పాల ప్రభావంతో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. బౌద్ధ స్తూప అవశేషాలు, శాతవాహనుల కాలం నాటి నాణేలు లభించాయి. నాగుపాము చుట్టపై బుద్ధుడు ఆశీనుడు కాగా ఐదు పడగలు విప్పి రక్షణ ఇస్తున్న శిల్పం బయట పడింది.
నిజామాబాదు జిల్లా
  • బోధన్: షోడశ మహాజన పదాల్లో ఒకటైన అశ్మక రాజధాని బోధన్​. బోధన్​లో చాలా ప్రాచీనమైన జైన ప్రతిమలు, ప్రతిమ ఖండాలు లభించాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "తెలంగాణలో మత వైవిధ్యం". EENADU PRATIBHA. Archived from the original on 2023-10-12. Retrieved 2023-10-12.
  2. ఆంధ్రుల చరిత్ర - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్)
  3. telugu, NT News (2022-04-13). "తెలంగాణలో బౌద్ధం వ్యాప్తి ఎలా జరిగింది?". www.ntnews.com. Archived from the original on 2023-10-12. Retrieved 2023-10-12.
  4. Velugu, V6 (2022-10-30). "తెలంగాణలో బౌద్ధ జైన కట్టడాలు". V6 Velugu. Archived from the original on 2022-10-30. Retrieved 2023-10-12.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "ఫణిగిరికి వెలుగులెప్పుడు?". Sakshi. 2019-08-06. Archived from the original on 2019-08-06. Retrieved 2023-10-12.