తెలుగు సాహితీకారుల జాబితాలు
ఈ వ్యాసం పునర్వవ్యవస్థీకరణ జరుగుతున్నది. ఈ వ్యాసంలో విభజనను పటిష్ఠంగా రూపొందించేందుకు సహకరించండి.
తెలుగు సాహిత్యం దేశభాషలందు తెలుగు లెస్స | |
---|---|
తెలుగు సాహిత్యం యుగ విభజన | |
నన్నయకు ముందు | సా.శ. 1000 వరకు |
నన్నయ యుగం | 1000 - 1100 |
శివకవి యుగం | 1100 - 1225 |
తిక్కన యుగం | 1225 - 1320 |
ఎఱ్ఱన యుగం | 1320 – 1400 |
శ్రీనాధ యుగం | 1400 - 1500 |
రాయల యుగం | 1500 - 1600 |
దాక్షిణాత్య యుగం | 1600 - 1775 |
క్షీణ యుగం | 1775 - 1875 |
ఆధునిక యుగం | 1875 – 2000 |
21వ శతాబ్ది | 2000 తరువాత |
తెలుగు భాష తెలుగు లిపి ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా తెలుగు సాహితీకారుల జాబితాలు | |
- సూచనలు
ఎందరో మహాను భావులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. వారి గురించి తెలుసుకొనడానికి ఇది ఒక వేదికగా, ఒక సూచికగా ఉపయుక్తమయ్యే జాబితా.
ఒక్కొక్క కాలానికి చెందిన రచయితలను ఒక్కో వ్యాసం (జాబితా)లో ఉంచాలి. జాబితాల పేర్లు దిగువన ఇవ్వబడ్డాయి. ఆధునిక యుగంలో వివిధ సాహితీ ప్రక్రియలు పరిఢవిల్లినందున ఆధునిక యుగంలో ఒక్కో విభాగానికి ఒక్కో జాబితా ఏర్పరచబడింది. కొందరు (ఉదాహరణ: గురజాడ, విశ్వనాధ) చాలా జాబితాలలోకి వస్తారు. అన్ని జాబితాలలోనూ వారి పేర్లు వ్రాయవచ్చును.
రచయితలతో బాటు వారి రచనలను కూడా వ్రాయాలి. ఒక్కో రచయితకూ ఒక్కో వ్యాసం, ఒక్కో (ముఖ్య)రచనకూ ఒక్కో వ్యాసం వికీలో ఉండాలని ఆకాంక్ష. విశ్వనాధ వంటివారి రచనలు పెద్ద జాబితా అవ్వవచ్చును. అటువంటి చోట వారి రచనల జాబితాకు (లేదా వారి గురించిన వ్యాసానికి) లింకు ఇవ్వవచ్చును.
ప్రాఙ్నన్నయ యుగము : సా.శ. 1000 వరకుసవరించు
నన్నయ యుగము : 1000 - 1100సవరించు
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:నన్నయ యుగం కవులు]] లేదా [[వర్గం:నన్నయ యుగం రచనలు]], వ్యాసాలకు సంబంధించిన మూస {{నన్నయ యుగం}}
- నన్నయ్య లేదా నన్నయభట్టు - ఆదికవి, వాగనుశాసనుడు
- శ్రీ మదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము, సభా పర్వము, అరణ్య పర్వములో కొంత
- ఆంధ్రశబ్ద చింతామణి - అలభ్యం
- లక్షణ సారము - అలభ్యం
- ఇంద్ర విజయము - అలభ్యం
- చాముండీ విలాసము - అలభ్యం
- నారాయణ భట్టు - నన్నయ భట్టుకు సహకరించాడు
శివకవి యుగము : 1100 - 1225సవరించు
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:శివకవి యుగం కవులు]] లేదా [[వర్గం:శివకవి యుగం రచనలు]]
మూస {{శివకవి యుగం}}
- పండితారాధ్య చరిత్రము
- బసవ పురాణము
- అనుభవ సారము
- వృషాధిప శతకము - తెలుగులో మొదటి శతకం కావచ్చును.
- ఇతని గ్రంథాలేవీ అందుబాటులో లేవు. కాలం కూడా స్పష్టంగా తెలియదు. కాని ఇతని చాటువులను ఇతరులు ఉట్టంకించారు.
తిక్కన యుగము : 1225 - 1320సవరించు
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:తిక్కన యుగం కవులు]] లేదా [[వర్గం:తిక్కన యుగం రచనలు]]
ఈ యుగానికి సంబంధించిన మూస {{తిక్కన యుగం}}
- తిక్కన్న - కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు
- శ్రీ మదాంధ్ర మహాభారతము - 15 పర్వములు
- నిర్వచనోత్తర రామాయణము
- విజయసేనము
- కవి వాగ్బంధనము
- గణిత సార సంగ్రహము - గణిత విజ్ఞానానికి సంబంధించిన రచన
- ప్రకీర్ణ గణితము - గణిత విజ్ఞానానికి సంబంధించిన రచన
- రంగనాధ రామాయణము ఉత్తరకాండము
- నీతిసార ముక్తావళి
- సుమతీ శతకము (ఇది బద్దెన రచించాడని ఒక అభిప్రాయము మాత్రమే)
- శివదేవయ్య - ఈ క్రింది మూడు రచనలు చేసినాడని ఒక అభిప్రాయమున్నది.
- పురుషార్ధ సారము
- సకలనీతి సమ్మతము
- "శివదేవ ధీమణీ" శతకము
- చారుచర్య
- అధర్వణాచార్యుడు (ఇతను నన్నెచోడుడు, తిక్కన మధ్యకాలమువాడై యుండవచ్చును)
- ఇతడు భారతమును కొంతభాగము రచించియుండవచ్చునని అభిప్రాయము.
- వికృతి వివేకము, త్రిలింగ శబ్దానుశాసనము, అధర్వణ ఛందస్సు అనే లక్షణ గ్రంథాలు కూడా వ్రాశాడని కొన్నిచోట్ల ఉంది.
ఎఱ్ఱన యుగము : 1320 - 1400సవరించు
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:ఎఱ్ఱన యుగం కవులు]] లేదా [[వర్గం:ఎఱ్ఱన యుగం రచనలు]]
ఈ యుగానికి సంబంధించిన మూస {{ఎఱ్ఱన యుగం}}
- ఎఱ్ఱన - ప్రబంధ పరమేశ్వరుడు, శంభూమిత్రుడు
- శ్రీ మదాంధ్ర మహాభారతము - అరణ్య పర్వము సంపూర్తి
- హరివంశము
- లక్ష్మీనృసింహ పురాణము
- "సంక్షేప రామాయణము" అనే కావ్యాన్ని కూడా రచించాడంటారు.
- హుళక్కి భాస్కరుడు, అతని పుత్రుడు మల్లికార్జున భట్టు, అతని మిత్రుడు అయ్యలార్యుడు
- రావిపాటి త్రిపురాంతకుడు (రావిపాటి తిప్పన)
- త్రిపురాంతకోదాహరణము
- ప్రేమాభిరామము, అంబికా శతకము, చంద్ర తారావళి - అనే గ్రంథాలు కూడా వ్రాశాడు కాని అవి అలభ్యం.
- విక్రమ సేనము (అలభ్యం)
శ్రీనాధ యుగము : 1400 - 1500సవరించు
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:శ్రీనాధ యుగం కవులు]] లేదా [[వర్గం:శ్రీనాధ యుగం రచనలు]]
ఈ యుగానికి సంబంధించిన మూస {{శ్రీనాధ యుగం}}
- శ్రీనాథుడు - కవిసార్వభౌముడు
- మరుత్తరాట్చరిత్రము
- శృంగార నైషధము
- పల్నాటి వీరచరిత్రము
- హరవిలాసము
- కాశీ ఖండము
- భీమ ఖండము
- క్రీడాభిరామము
- శివరాత్రి మహాత్మ్యము
- శాలివాహన సప్తశతి
- శృంగార దీపిక (ఇది వ్రాసినది కుమారగిరి రెడ్డి అని కూడా ఒక అభిప్రాయం ఉంది.)
- పోతన - సహజకవి, అతని శిష్యులు బొప్పరాజు గంగయ, వెలిగందల నారయ, ఏర్చూరి సింగన
- శ్రీ మదాంధ్ర మహాభాగవతము
- వీరభద్ర విజయము
- భోగినీ దండకము (ఇది పోతన రచనయేనని అభిప్రాయం)
- వాసిష్ఠ రామాయణము
- భాగవతం దశమ స్కంధం ద్విపద
- సకల నీతి సమ్మతము - తెలుగులో మొట్టమొదటి సంకలన గ్రంథం
- పద్మపురాణం ఉత్తర ఖండం
- జైమిని భారతము
- శృంగార శాకుంతలము
- అవసార దర్పణము, నారదీయము, మాఘ మహాత్మ్యము, పురుషార్ధ సుధానిధి, మానసోల్లాస సారము - అవే గ్రంథాలు రచించాడు కాని అవి లభించలేదు.
- నీతిసారము (రాజనీతి గురించి)
- రత్నసారము - (విలువైన మణుల గురించి)
- హయలక్షణ సారము (గుర్రాల గురించి విజ్ఞాన గ్రంథము)
- పార్వతీపరిణయము
- వేమభూపాల చరితము
- హంస సందేశము
- నవనాధ చరిత్రము
- హరిశ్చంద్ర కథ ద్విపద కావ్యము
- పంచతంత్రము (బైచరాజు)
- పిడుపర్తి సోమన (పిడుపర్తి సోమనాధ కవి)
- నంది మల్లయ - ఘంట సింగన (జంట కవులు)
- షోడశ కుమార చరిత్ర
- కొక్కోకము ("రతి విలాసం" అనే సంస్కృత కామశాస్త్ర గ్రంథానికి తెలుగు)
- మడికి అనంతయ్య (మడికి సింగన తమ్ముడు)
- విష్ణుమాయా విలాసము (అయితే ఇది చింతలపూడి ఎల్లన వ్రాశాడనే అభిప్రాయం కూడా ఉంది)
- వెన్నెలకంటి జన్నమంత్రి
- దేవకీనందన శతకము
- కొలని గణపతి దేవుడు
- శివయోగ సారము
- మనోబోధన
- అయ్యలరాజు తిప్పయ్య
- ఒంటిమెట్ట రఘువీర శతకము
- ఆంధ్రకవి రామయ్య
- విష్ణుకాంచీ మాహాత్మ్యము
- చెందలూరు చిక్కయ్య
- వాచికేతూపాఖ్యానము
- విష్ణు పురాణము
- దోనయామాత్యుడు
- సస్యానందము (శాస్త్ర గ్రంథము - వర్షముల ఆగమ సూచనలు, జ్యోతిశ్సాస్త్రానుసారం)
రాయల యుగము : 1500 - 1600సవరించు
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:రాయల యుగం కవులు]] లేదా [[వర్గం:రాయల యుగం రచనలు]]
ఈ యుగానికి సంబంధించిన మూస {{రాయల యుగం}}
- కృష్ణదేవరాయలు - ఆంధ్రభోజుడు
అష్టదిగ్గజాలు
- మను చరిత్రము
- హరికథా సారము
- రాఘవ పాండవీయము - మొట్టమొదటి ద్వ్యర్ధి కావ్యము
- కళాపూర్ణోదయము - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు. ఇది తెఉగు సాహిత్యంలో చాలా విశిష్టమైన కావ్యంగా మన్ననలు పొందింది.
- ప్రభావతీ ప్రద్యుమ్నము
- గిరిజా కళ్యాణం
- గరుడ పురాణం (తెనుగించాడు)
- వసు చరిత్రము
- హరిశ్చంద్ర నలోపాఖ్యానము
- నరసభూపాలీయము
- పాండురంగ మాహాత్మ్యము
- ఘటికాచల మాహాత్మ్యము
- ఉద్భటారాధ్య చరిత్రము
- కందర్పకేతు విలాసము - అలభ్యం. జగ్గన ప్రబంధ రత్నాకరము లోని కొన్ని పద్యాల వల్ల ఈ గ్రంథ వివరాలు తెలుస్తున్నాయి.
- హరిలీలా విలాసము - అలభ్యం. జగ్గన ప్రబంధ రత్నాకరము లోని కొన్ని పద్యాల వల్ల ఈ గ్రంథ వివరాలు తెలుస్తున్నాయి.
- నిరంకుశోపాఖ్యానము
- జనార్దనాష్టకము
- సుగ్రీవ విజయము (యక్షగానము)
- కవికర్ణ రసాయనము (మాంధాతృ చరిత్రము)
- యాదవ రాఘవ పాండవీయము
- మల్లభూపాలీయము (భర్తృహరి సుభాషితం)
- రంగ కౌముది (అలభ్యం)
- రాధామాధవము
- విష్ణుమాయా నాటకము
- తారక బ్రహ్మ రాజీయము (వేదాంత గ్రంథము)
- బాల భాగవతము (ద్విపద)
- తపతీ సంవరణము
- రామరాజీయము (అళియ రామరాజు చరిత్ర)
దక్షిణాంధ్ర యుగము: 1600 - 1775సవరించు
లేదా నాయకరాజుల యుగము ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:దక్షిణాంధ్ర యుగం కవులు]] లేదా [[వర్గం:దక్షిణాంధ్ర యుగం రచనలు]]
మూస {{దక్షిణాంధ్ర యుగం}}
- మన్నారుదాస విలాసము (యక్షగానము)
- ఉషా పరిణయము (ప్రబంధము)
- మధురవాణి (సంస్కృత కవయిత్రి.)
- రఘునాధుని రమాయణ సంగ్రహమునకు సంస్కృతీకరణ
- ఉషా పరిణయం (యక్షగానం)
- సత్యభామా సాంత్వనము
- ధేను మాహాత్మ్యము (వచన గ్రంథము)
శృంగార నైషధ పారిజాతము
- రఘునాధ నాయకుడు (1614 - 1633)
- శృంగార సావిత్రి
- వాల్మీకి చరిత్రము
- పారిజాతాపహరణము
- భారత సంగ్రహము
- రామాయణ సంగ్రహము
- విజయ రాఘవుడు (1633-73)
- రఘునాధాభ్యుదయము
- ప్రహ్లాద చరిత్రము
- విప్ర నారాయణ చరిత్రము
- పార్వతీ పరిణయము
- తిరుమలాధ్వరి
- చిత్రకూట మహాత్మ్యము (యక్షగానము)
- విజయ రాఘవ కళ్యాణము (యక్షగానము)
- వివేక విజయము (ప్రబోధ చంద్రోదయానికి యక్షగాన స్వరూపం)
- కూచిపూడి నాటకములు
- ప్రహ్లాద నాటకము
- రామ నాటకము
- ఉషా పరిణయము
- మట్ల అనంత భూపాలుడు
- కకుత్స్థ విజయము
- సవరము చిననారాయణ నాయక్
- కువలయాశ్వ చరిత్ర
- దామెళ వెంగ నాయక్
- బహుళాశ్వ చరిత్ర
- జైమిని భారతము (వచన రూపం)
- సారంగధర చరిత్ర (వచన రూపం)
- రాధికా సాంత్వనము
- అహల్యా సంక్రందనము
- రఘునాధ తొండమానుడు
- పార్వతీ పరిణయము
- కుందుర్తి వేంకటాచల కవి
- మిత్రవిందా పరిణయము
- వెలగపూడి కృష్ణయ్య
- మాలతీ మాధవము
- నుదురుపాటి వెంకయ్య
- మల్లపురాణము
- నుదురుపాటి సాంబయ్య
- ఆంధ్ర భాషార్ణవము
- సాంబ నిఘంటువు
- కట్టా వరదరాజు
- ద్విపద రామాయణము
- కళువ వీర్రాజు
- భారతము (వచన రూపం)
- నంజయ్య
- హాలాస్య మహాత్మ్యము
క్షీణ యుగము : 1775 - 1875సవరించు
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:క్షీణ యుగం కవులు]] లేదా [[వర్గం:క్షీణ యుగం రచనలు]]
మూస {{క్షీణ యుగం}}
- త్యాగరాజు కీర్తనలు
- నౌకా భంగము (నాటకం)
- ప్రహ్లాద చరిత్రము (నాటకం)
- కుక్కుటేశ్వర శతకము
- అచ్చతెనుగు రామాయణము
- నీలాసుందరీ పరిణయము
- రుక్మిణీ కళ్యాణము
- చంద్రమతీ పరిణయము
- రామలింగేశ్వర శతకము
- ఇతని చాటువులు బహు ప్రసిద్ధములు
- రాధాకృష్ణ విలాసము (గీత గోవిందం ఆధారంగా)
- వేంకటాచల మాహాత్మ్యము
- రాజయోగసారము
- విష్ణు పారిజాతము
- వశిష్ఠ రామాయణము
- జలక్రీడా విలాసము
- ద్విపద భాగవతము (ద్వాదశ స్కంధము)
- కృష్ణ మంజరి.
- శివలీలా విలాసము
- యక్షగానాలు, నాటకములు, శతకాలు
- యామినీపూర్ణతిలకా విలాసము
- వేంకటేశ్వర విలాసము
- మండపాక పార్వతీశ్వరశాస్త్రి శతకములు - ఈ కవి 60 పైగా శతకములు వ్రాసెను.
- రాధాకృష్ణ సంవాదము
- ధరాత్మజా పరిణయము (ద్వ్యర్ధి కావ్యము)
- అచలాత్మజా పరిణయము (ద్వ్యర్ధి కావ్యము)
- రావణ దమ్మీయము (లంకా విజయము) (ద్వ్యర్ధి కావ్యము)
- యాదవ రాఘవ పాండవీయము (త్ర్యర్ధి కావ్యము) - ఇంతకు పూర్వము ఎలకూచి బాల సరస్వతి వ్రాసినది.
- రామకృష్ణార్జునరూప నారాయణీయము త్ర్యర్ధి కావ్యము) - యాదవ రాఘవ పాండవీయము - మరొక విధముగా
ఆధునిక యుగము : 1875 నుండిసవరించు
1875 నుండి 2000 వరకు వెలువడిన రచనలు, రచయితలు, రచయిత్రుల జాబితా ఈ భాగంలో చేర్చాలి. ఇక్కడినుండి సాహిత్య ప్రక్రియలు అనేక రంగాలలో వికసించాయి. కనుక ఒకో ప్రక్రియానుసారం విభజించాలి. కనుక ఈ భాగం ప్రత్యేక జాబితా వ్యాసంగా చేయబడుతున్నది.
ఈ కాలంలో వివిధ సాహితీ ప్రక్రియలు విస్తరించాయి. అచ్చు యంత్రాలు రావడం వల్లా, విద్య అందరికీ అందుబాటులోకి రావడం వల్లా ఎన్నో రచనలు మనకు లభ్యమౌతున్నాయి. కనుక ఈ యుగంలోని రచయితలనూ, రచనలనూ మరిన్ని జాబితాలుగా విభజిస్తున్నాము. సౌలభ్యం కోసం ఈ భాగంలో "ఆధునిక యుగం" అనే పదాలను వాడడం లేదు. చూడండి - ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
21వ శతాబ్దంసవరించు
చూడండి - 21వ శతాబ్దం సాహితీకారుల జాబితా
వనరులుసవరించు
- పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
- కందుకూరి వీరేశలింగం - ఆంధ్ర కవుల చరితము 2వ భాగం ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం