తెలుగు సినిమాలు ఘ
- ఘటోత్కచుడు : ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1995 లో వచ్చిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా.[1]
- ఘరానా మొగుడు : 1992లో విడుదలైన ఒక తెలుగు సినిమా. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి, నగ్మా[2] ముఖ్యపాత్రలు పోషించారు.
- ఘరానా బుల్లోడు : 1995 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, రమ్యకృష్ణ, ఆమని ఇందులో ప్రధాన పాత్రధారులు.
- ఘరానా దొంగ : 1980 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణ, మోహన్ బాబు, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటించారు. విజయ లక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[3][4]
- ఘరానా దొంగలు : 1971, డిసెంబరు 11న విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ సినిమా ఠక్క బిట్రె సిక్క అనే కన్నడ చిత్రానికి అనువాదం.
- ఘరానా కూలి : రజనీకాంత్, రోజా జంటగా నటించిన తెలుగు డబ్బింగ్ సినిమా. పి. వాసు దర్శకత్వంలో బి. వెంకట్రామరెడ్డి చందమామ విజయా కంబైన్స్ పతాకం క్రింద నిర్మించిన ఉళైప్పలి అనే తమిళ సినిమాను తెలుగులో సాయికృప ప్రొడక్షన్స్ బ్యానర్పై దాసరి శ్రీనివాసరావు ఘరానా కూలిగా డబ్ చేశాడు.
- ఘరానా రౌడీ : 1984 అక్టోబరు 20న విడుదలైన తెలుగు సినిమా. విజయభేరి మూవీస్ బ్యానర్ పై టి.విజయభాస్కర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రాజశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు.
- ఘరానా హంతకుడు : ఘరానా హంతకుడు 1965లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమా "ఎన్ కదమై" అనే తమిళ సినిమాకు డబ్బింగ్.
- ఘరానా గంగులు
- ఘర్షణ (1988)
- ఘర్షణ (2004 సినిమా)
మూలాలు
మార్చు- ↑ "Ghatotkachudu songs". naasongs.com. Archived from the original on 16 అక్టోబరు 2016. Retrieved 24 October 2016.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (19 February 2019). "మరోసారి మెగా కాంపౌండ్ లోకి నగ్మా..?". www.andhrajyothy.com. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.
- ↑ "Gharana Donga info".
- ↑ "Gharana Donga (1980)". Indiancine.ma. Retrieved 2020-08-31.