ప్రధాన మెనూను తెరువు

తెలుగు సినిమా పాటల రచయిత్రులు

తొలిరోజుల్లో బాగా ప్రాచుర్యం పొందిన పౌరాణిక నాటకాలను, ఆ నాటక ఫక్కీ చెడకుండా అలాగే యధాతథంగా చలనచిత్రాలుగా తీయడంతో, రంగస్థలం మీద బాగా పాడగలిగినవాళ్ళే నటీనటులుగా తెరమీద కూడా కనిపించి, తమ పద్యాల్నీ పాటల్నీ తామే పాడుకునేవారు. ఏది ఏమైనప్పటికీ ఆనాటి పాటల్లో నాటకాల బాణీ మాత్రం బాగా ఉండేది. రంగస్థలంతో సంబంధమున్నకవులే సినిమాలకూ పాటలు వ్రాసేవాళ్ళు. ఆ విధంగా ఆనాడు నాటకకవులుగా ఉన్న చందాల కేశవదాసు, పాపట్ల కాంతయ్య, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దైతా గోపాలం వంటి కవులు తొలినాటి సినిమాపాటలకు సృష్టికల్పన చేశారు. ఆ తరువాత ఎంతోమంది తెలుగు సినిమా పాటల రచయితలు పాటలు రాశారు.

సినిమాలకు పాటల రచన చేసే రచయిత్రుల సంఖ్య మనకు చాలా తక్కువ. 1932లో తెలుగు సినిమా పుడితే 1966 వరకూ ఒక్క మహిళా రచయిత్రి కూడా రాలేదు.[1] అయితే కొంతమంది రచయిత్రులు కూడా తెలుగు సినిమాలకు పాటలు రాశారు.[2]

పాటల రచయిత్రుల జాబితాసవరించు

 1. కె.జి. వసంతాదేవి - 'దారి కాచి వేచినానురా...రేయిబవలు చూచినానురా' (విజయశంఖం (1966)). లభించిన ఆధారాల ప్రకారం వసంతాదేవినే మన తొలి తెలుగు పాటల రచయిత్రని తెలుస్తుంది.[1] [3][4]
 2. వీరమాచనేని సరోజిని - 'ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఊగాలి ఊగాలి' (చిన్నారి పాపలు - 1968) సుప్రసిద్ధ సినీనటి సావిత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వీరమాచనేని సరోజిని నిర్మించారు. నిర్మాత, దర్శకులు, నటీనటులు, నేపథ్యగాయకులు, సాంకేతిక సిబ్బంది అంతా మహిళలే నిర్వహించడం ఈ సినిమా గొప్పతనం. ఈ సినిమా గిన్నిస్ రికార్డ్స్ లోకి చేరింది. సరోజిని, సుప్రసిద్ధ దర్శకుడు వి. మధుసూదనరావు భార్య. మంచి గాయకురాలు.[5]
 3. కామ్రెడ్ విజయలక్ష్మీ - 'కులం కులమని కుచ్చితాలు పెంచుకోకు' విప్లవ శంఖం (1982)
 4. జ్యోతిర్మయి - 'చేతికి గాజుల్లా...' (రాధాకళ్యాణం (1981)). 'లేత చలిగాలులు దోచుకోరాదురా' (మూడు ముళ్ళు (1987))
 5. డా. సీతాదేవి - మా తెలుగుతల్లి (1988)
 6. రాణి పులోమజాదేవి - బుల్లెబ్బాయ్ (2007), ఐస్ క్రీం, జెంటిల్ మేన్[6]
 7. రమాదేవి - 'పోకిరి రాజా...' మాయ (సినిమా) (2014)[7]
 8. కిరణ్మయి - మిస్సింగ్ (2013)
 9. కొండముది అనురాధ - నాచూపు (పవన్ సుబ్బలక్ష్మీ ప్రేమించుకున్నారట)
 10. పి. సూర్యకుమారి -
 11. డా. చల్లా భాగ్యలక్ష్మి - ఒక్కడొచ్చాడు (2016),[8][9] అమ‌రావ‌తి అమ్మాయి (2017),[10] పెళ్లి రోజు (2017),[11]
 12. శ్రేష్ట - ఒక రొమాంటిక్ క్రైమ్ కథ (2013), 'ఓ మధురిమవై', 'బంగారు కొండ' (కో అంటే కోటి),[12] పెళ్లిచూపులు 2016, అర్జున్‌రెడ్డి (2017), యుద్ధం శరణం (2017)[13][14]
 13. పింగళి చైతన్య - 'ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు' (ఫిదా 2017)

మూలాలుసవరించు

 1. 1.0 1.1 ఆర్కైవ్. "స్త్రీమూర్తులకు శతకోటి వందనాలు". archive.is. Retrieved 30 September 2017.
 2. ఈమాట. "తెలుగు సినిమా పాట". eemaata.com. Retrieved 29 September 2017.
 3. ఘంటసాల గళామృతం. "విజయ శంఖం - 1966". ghantasalagalamrutamu.blogspot.in. Retrieved 29 September 2017.
 4. గూగుల్. "కె.జి. వసంతాదేవి". www.google.co.in. Retrieved 29 September 2017.
 5. ఘంటసాల గళామృతం. "చిన్నారి పాపలు - 1968". ghantasalagalamrutamu.blogspot.in. Retrieved 29 September 2017.
 6. గేయ రచయిత్రి రాణి పులోమజాదేవి మృతి Updated: 30-Sep-2017
 7. గోతెలుగు.కాం. "టాలీవుడ్‌లో లేడీ లిరిక్‌ రైటర్‌". www.gotelugu.com. Retrieved 30 September 2017.
 8. ఆంధ్రజ్యోతి. "ఒక్క‌డొచ్చాడు". Retrieved 30 September 2017. Cite news requires |newspaper= (help)
 9. నవతెలంగాణ. "బర్త్‌డే గిఫ్ట్‌.. ఒక్కడొచ్చాడు". Retrieved 30 September 2017. Cite news requires |newspaper= (help)
 10. తెలుగు నమస్తే ఆంధ్ర. "అచ్చ‌మైన తెలుగింటి ప్రేమక‌థ `అమ‌రావ‌తి అమ్మాయి`". telugu.namasteandhra.com. Retrieved 30 September 2017.
 11. సాక్షి. "పెళ్లి కాని యువతుల కథ". Retrieved 30 September 2017. Cite news requires |newspaper= (help)
 12. 123తెలుగు. "ఆడియో సమీక్ష : కో అంటే కోటి – ఫ్రెష్ ఫీల్ తో సాగే సరికొత్త ఆల్బమ్". www.123telugu.com. Retrieved 30 September 2017.
 13. ఈనాడు. "ఆమె పాటల వెనక... ఎన్ని పాట్లున్నాయో!". Retrieved 30 September 2017. Cite news requires |newspaper= (help)
 14. నమస్తే తెలంగాణ. "శ్రేష్టమైన పాటల పూదోట." Retrieved 30 September 2017. Cite news requires |newspaper= (help)