నాయుడుగారి కుటుంబం

నాయుడుగారి కుటుంబం 1996లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణంరాజు, సుమన్, సంఘవి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు.[1] ఈ సినిమాకు గాను పరుచూరి సోదరులు ఉత్తమ సంభాషణల రచయితగా నంది పురస్కారం అందుకున్నారు. వీరికి ఇదే తొలి నంది పురస్కారం.

నాయుడుగారి కుటుంబం
దర్శకత్వంబోయిన సుబ్బారావు
రచనవి.సి. గుహనాథన్ (కథ), పరుచూరి సోదరులు (చిత్రానువాదం/మాటలు)
తారాగణంసుమన్,
సంఘవి
ఛాయాగ్రహణంపెమ్మసాని సురేష్
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1996 మే 30 (1996-05-30)
భాషతెలుగు

కథ మార్చు

కృష్ణమనాయుడికి ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు. కామేశ్వరరావు కృష్ణమనాయుడు తండ్రి పెదరాయుడికి తాను అక్రమ సంతానమని చెప్పుకుంటూ ఉంటాడు. కృష్ణమనాయుడు ప్రోత్సాహంతో, ఆర్థిక అండదండలతో వ్యాపారం ప్రారంభించి, ఉన్నత స్థాయికి ఎదిగిన భక్తవత్సలం, కామేశ్వరరావు తో కలిసి వారి కుటుంబంలో కలతలు రేపాలని ప్రయత్నిస్తాడు. చిన్న తమ్ముడు చంద్రం వీరి ఆట ఎలా కట్టించాడన్నది మిగతా కథ.

తారాగణం మార్చు

 
రామానాయుడు ఫిలిం స్టూడియో - విశాఖపట్నం

నిర్మాణం మార్చు

సురేష్ ప్రొడక్షన్స్

ఫలితం మార్చు

ఈ సినిమా 18 కేంద్రాల్లో శత దినోత్సవం పూర్తి చేసుకుంది. సికింద్రాబాదులోని హరిహర కళాభవన్ లో ఈ ఉత్సవం జరిగింది. రామానాయుడు తన సిబ్బందికి ఒక నెల జీతం విరాళంగా ఇచ్చాడు. పోలీస్ సంక్షేమ సహాయనిధికి 25 వేలు విరాళంగా ఇచ్చాడు.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 యు, వినాయకరావు (2014). మూవీ మొఘల్. హైదరాబాదు: జయశ్రీ పబ్లికేషన్స్. pp. 224–225.[permanent dead link]