పిల్లా నువ్వు లేని జీవితం
పిల్లా నువ్వు లేని జీవితం 2014 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి ఎ. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించగా బన్నీవాస్, హరిషిత్ లు సంయుక్తంగా గీతాఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రెజీనా కసాండ్రా, జగపతి బాబు నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అనూప్ రూబెన్స్ అందించారు. ఈ చిత్రం సాయి ధరమ్ తేజ్ కథానాయకునిగా నటించిన మొదటి చిత్రం. ఈ చిత్రం యొక్క పేరును గబ్బర్ సింగ్ సినిమా లోని ఒక పాట నుండి తీసుకున్నారు. ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది.[1] ఈ చిత్రం విజయవంతం అయిన తరువాత ఈ చిత్రం యొక్క ఉపగ్రహ హక్కులను మా టీవీకి అమ్మడమైనది. ఈ చిత్ర కథానాయకుడైన సాయి ధరమ్ తేజ్ యొక్క మొదటి సినిమా వై.వి.ఎస్.చౌదరి దర్శక, నిర్మాణ సారథ్యంలోని రేయ్ . ఆ చిత్రం 2010 అక్టోబరు 17 న రామానాయుదు స్టుడియోస్ లో విజయదశమి నాడు ప్రారంభమైనది.[2] ఈ చిత్రం 2013 ఆగస్టు 6 న పూర్తి అయినది.[3] ఈ చిత్రం ఆర్థిక వ్యవహారాల కారణంగా ఆలస్యంగా 2015 మార్చి 27 న విడుదలైనది. అందువలన సాయి ధరమ్ తేజ్ యొక్క మొదటి విడుదలైన చిత్రంగా "పిల్లా నువ్వు లేని జీవితం" చెప్పబడింది.
పిల్లా నువ్వు లేని జీవితం | |
---|---|
దర్శకత్వం | ఎ.ఎస్.రవికుమార్ చౌదరి |
రచన | డైమండ్ రత్నం ఎ.ఎస్.రవికుమార్ చౌదరి |
నిర్మాత | బన్నీ వాసు హర్షిత్ |
తారాగణం | సాయి ధరం తేజ్ రెజీనా కసాండ్రా జగపతిబాబు |
ఛాయాగ్రహణం | దాసరథి శివేంద్ర |
కూర్పు | గౌతం రాజు |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థలు | |
విడుదల తేదీ | 14 నవంబరు 2014 |
సినిమా నిడివి | 132 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఈ కథ సంచలనాత్మక రాజకీయవేత్త గంగా ప్రసాద్ (సాయాజీ షిండే), మంచి రాజకీయ వేత్త (ప్రకాష్ రాజ్) ల మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీతో మొదలవుతుంది. అయితే అదే సమయంలో షయాజీ షిండే చేసిన స్కామ్ లను ఓ ఛానెల్ లోని ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ షఫీ బయటపెట్టడంతో అతని చేతుల్లోకి రావలసి సీ.ఎం. పదవి చేజారిపోతుంది. రిపోర్టర్ షఫీని చంపేయమని జగపతిబాబుకు సుపారీ ఇస్తాడు ఓ పోలీస్ అధికారి. ఇదిలా ఉంటే... సాయిధరమ్ తేజ తన తోటి స్టూడెంట్ శైలజను ప్రేమిస్తాడు. అనాథ అయిన ఆమె తన గతం గురించి షఫీకి తెలియడంతో అతన్ని వెతుకులాడే పనిలో పడుతుంది. ఆమెకు తనవంతు సాయం అందించడానికి సాయిధరమ్ సహాయం చేసినా... శైలూ అపార్థం చేసుకుంటుంది. పైగా శైలుకు జగపతిబాబు ద్వారా ప్రాణాపాయం ఉందని తెలిసి...అతనితో ఢీ కొట్టడానికీ సాయిధరమ్ సిద్ధపడతాడు. ఆ అమ్మాయి లేకపోతే జీవితమే లేదు అనుకునే ఈ కుర్రాడు ఆమెను ఎలా రక్షించాడు. అసలు ఆమెను చంపాలనుకోవటానికి కారణం ఏమిటి...చివరకు ఆమె ప్రేమను ఎలా సాధించాడు అనేది మిగతా కథ.[4]
తారాగణం
మార్చు- సాయి ధరం తేజ్ - శ్రీను
- రెజీనా కస్సాంద్ర - శైలజ
- జగపతిబాబు - మైసమ్మ
- ప్రకాష్ రాజ్ - ప్రభాకర్
- సాయాజీ షిండే - గంగా ప్రసాద్
- చంద్రమోహన్ - చంద్రమోహన్
- రఘుబాబు - యాదగిరి
- ఆహుతి ప్రసాద్ - ఎస్.పి
- జయప్రకాష్ రెడ్డి - జె.పి
- సూర్య -అనాథాశ్రమ మేనేజర్
- వైజాగ్ ప్రసాద్ - ఎం.ఎల్.ఎ
- షాఫీ - షాఫీ
- పృధ్వీరాజ్ - ఎం.ఎల్.ఎ
సిబ్బంది
మార్చు- దర్శకుడు: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
- సంగీతం: అనూప్ రూబెన్స్
- ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
- ఎడిటర్: గౌతం రాజు
- పాటలు: శ్రీ మణి, భాస్కరభట్ల, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ.
పాటలు
మార్చుUntitled | |
---|---|
సంగీతాన్ని అనూప్ రూబెన్స్ సమకూర్చారు. ఈ చిత్రం యొక్క సౌండ్ ట్రాక్ ప్రపంచవ్యాప్తంగా 2014 అక్టోబరు 25 న ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేయబడింది.[5]
క్రమసంఖ్య | పేరు | గీత రచన | గాయకులు | నిడివి | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "దిల్ సే" | శ్రీమణి | రాహుల్ నంబియార్, మేఘా రాజ్ | 3:43 | |||||
2. | "పిల్లా నువ్వులేని జీవితం" | బహస్కర భట్ల | అనూప్ దేవ్, రాహుల్ నంబియార్ | 3:54 | |||||
3. | "ఆ రోజే తొలిసారి" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | శ్రీరామచంద్ర | 4:00 | |||||
4. | "నీలి నీలి కళ్ళదానా" | భాస్కర భట్ల | రూపం ఇస్లామ్ | 3:04 | |||||
5. | "అటో ఇటో ఎటో" | సుద్దాల అశోక్ తేజ | ఎం.ఎల్.ఆర్ కార్తికేయన్ | 2:41 | |||||
17:42 |
బాక్స్ ఆఫీస్
మార్చుఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున ₹2.32 crore (US$2,90,000) వసూలు చేసింది.[6] ఈ చిత్రం మొదటి వారంలో ₹5.18 crore (US$6,50,000) కోట్లను వసూలు చేసింది.[7] ఈ చిత్రం మొదటి వారంలో ₹8.85 crore (US$1.1 million) ను వసూలు చేసింది.[8] చిత్రం చివరికి ప్రపంచవ్యాప్తంగా ₹25.75 crore (US$3.2 million)ను వసూలు చేసింది.[9]
పురస్కారాలు
మార్చుఉత్తమ స్క్రీన్ ప్లే రచయత, ఏ. ఎస్ . రవికుమార్ చౌదరి, నంది పురస్కారం
సైమా అవార్డులు
మార్చు2014 సైమా అవార్డులు
- సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు (సాయి ధరమ్ తేజ్)
మూలాలు
మార్చు- ↑ http://www.filmibeat.com/telugu/news/2014/pilla-nuvvu-leni-jeevitham-three-days-box-office-collection-164637.html
- ↑ "Rey film launch". idlebrain.com. 17 October 2010. Archived from the original on 30 జూన్ 2014. Retrieved 19 March 2014.
- ↑ "Rey on Oct 11th as Dusserra gift". raagalahari.com. 6 August 2013. Retrieved 19 March 2014.
- ↑ "Official Title". greatandhra.
- ↑ Sai Dharam Tej's PNLJ audio unveiled- Times of India 26 October 2014 Retrieved 29 October 2014
- ↑ Pilla Nuvvu Leni Jeevitham 1st Day Total Collections. AndhraBoxOffice.com (15 November 2014). Retrieved on 2015-10-04.
- ↑ Pilla Nuvvu Leni Jeevitham Total 3 Days Collections. AndhraBoxOffice.com (17 November 2014). Retrieved on 2015-10-04.
- ↑ Pilla Nuvvu Leni Jeevitham 1st Week Total WW Collections. AndhraBoxOffice.com (21 November 2014). Retrieved on 2015-10-04.
- ↑ Pilla Nuvvu Leni Jeevitham Final Total WW Collections. AndhraBoxOffice.com (8 December 2014). Retrieved on 2015-10-04.
ఇతర లింకులు
మార్చు- పిల్లా నువ్వు లేని జీవితం రివ్యూ! Archived 2015-07-27 at the Wayback Machine