బభ్రువాహన (1964 సినిమా)

బభ్రువాహన 1964, అక్టోబర్ 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. సముద్రాల రాఘవాచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, కాంతారావు, రేలంగి, చలం, బాలయ్య, పేకేటి, ముక్కామల, ఎస్.వరలక్ష్మి, రాజసులోచన, ఎల్.విజయలక్ష్మి, గీతాంజలి, విజయమాల, నారీమణి, సి.ఎస్.ఆర్., నాగరాజ్, వంగర, సీతారాం, వేళంగి, మల్లాది, విజయరావు, కాశీనాథ్, వెంకటేశ్వరరావు, మిక్కిలినేని (గెస్టు ఆర్టిస్టు), మాస్టర్ సముద్రాల లు నటించారు.[1]

బభృవాహన
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం సముద్రాల రాఘవాచార్య
నిర్మాణం సి. జగన్మోహనరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
ఎస్.వరలక్ష్మి,
కాంతారావు,
చలం,
ఎల్. విజయలక్ష్మి
సంగీతం పామర్తి
నిర్మాణ సంస్థ శ్రీ నేషనల్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

వివరాలు సవరించు

పాటలు సవరించు

  1. ఏమని తానాడునో నే నేమని బదులాడనౌనో - ఎస్. వరలక్ష్మి
  2. ఏలరా మనోహరా త్రిలోక మోహనా ఏలరా మనోహరా - పి. లీల
  3. కావి పుట్టింబు జడలు అలంకారములుగ నీమనోహర (పద్యం) - ఘంటసాల - రచన: వెంకట కవి
  4. కోమలీ ఈ గతిన్ మది దిగుల్ పడి పల్కెదవేలా (పద్యం) - ఘంటసాల - రచన: వెంకట కవి
  5. కదనమ్ములోన శంకరుని (సంవాద పద్యాలు) - ఘంటసాల, మాధవపెద్ది సత్యం - రచన: సముద్రాల
  6. కాముకుడగాక వ్రతినై భూమిప్రదిక్షణము (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
  7. నా ఆశ విరబూసె మనసే మురిసే మధువానినా మైకాలతో - పి.సుశీల
  8. నీ సరి మనోహరి జగాన కానరాదుగా - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి - రచన: సముద్రాల
  9. నిన్నే నిన్నే చెలి నిలునిలుమా నిను విడి నిలువగలేను - ఘంటసాల, పి.సుశీల - రచన: వెంకట కవి
  10. మనసేమో వయారాల విలాసాల మహారాజా - పి.లీల, ఘంటసాల - రచన: సముద్రాల
  11. మాసాటి వారు ఏ చోటలేరు ఆటపాటలనైన - ఎస్. వరలక్ష్మి బృందం
  12. మాసాటి వారు ఏ చోటలేరనిడంబాలు పోనేలా ఇపుడిలా - బృంద గీతం
  13. వర్ధిల్లు మాపాప వర్ధిల్లవయ్యా కురువంశ మణిదీపా - ఎస్. వరలక్ష్మి
  14. సవనాధీశుడు పాండవాగ్రజుడు సత్యారిత్రుడౌనే (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల

ఇవి కూడా చూడండి సవరించు

కథాంశం సవరించు

అర్జునుడి కొడుకు బభ్రువాహనుని కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. కృష్ణుడు అర్జునుడు చేస్తున్న తీర్థయాత్రలను తన భార్యకు , సుభద్రకు చెప్పటంతో కథ మొదలవుతుంది. తరువాత అర్జునుడు, అతని స్నేహితుడు రాత్రి నిద్ర పొయ్యే ముందు మాట్లాడుకోవటం కనిపిస్తుంది. వెంటనే దృశ్యం నాగలోకం కి వెళ్లి అక్కడ అర్జునుడిని వలచిన నాగ కన్య ఉలూచి పాట పాడుకుంటుంది - అర్జునుని చిత్ర పటం ముందు ఉంచుకోని. చెలి కత్తెలు నవ్వుతారు, కాని ఉలూచి వారిని వెలుపలికి పంపి, ప్రధాన చెలికత్తెతో కలిసి అర్జునుడు నిద్రిస్తున్న చోటుకు వెళ్లి అర్జునుడిని మెడలో మాలగా చేసుకోని, అర్జునుడి స్నేహితున్ని చిలుకగా చేసుకోని నాగలోకం తీసుకెళ్తారు.

మూలాలు సవరించు

  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (25 October 1966). "బభ్రువాహన చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 13 October 2017.[permanent dead link]