బాటసారి 1961 సంవత్సరంలో విడుదలైన సాంఘిక చిత్రం. దీనిని భరణీ పిక్చర్స్ బానర్ మీద పి.ఎస్.రామకృష్ణారావు దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ చిత్రకథకు శరత్ చంద్ర రచించిన 'బడా దీది' నవల ఆధారం. తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన ఈ సినిమా తెలుగులో 1961 జూన్ 30న విడుదలకాగా తమిళంలో "కాణల్ నీర్" పేరిట 1961 జూలై 21న విడుదలయ్యింది.

బాటసారి
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణం పి.ఎస్.రామకృష్ణారావు,
భానుమతి
కథ శరత్ 'బడా దీది' నవల
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
భానుమతి,
షావుకారు జానకి,
దేవిక,
ముదిగొండ లింగమూర్తి,
రామన్న పంతులు
సూర్యకాంతం
జె.వి. రమణమూర్తి
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఘంటసాల,
భానుమతి,
జిక్కి కృష్ణవేణి,
కె.రాణి
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సంక్షిప్త చిత్రకథ

మార్చు

జమిందారు సురేంద్ర (అక్కినేని) కు ఆస్తి ఉంది. పుస్తక పరిజ్ఞానం ఉంది. పుస్తక పఠనం అతనికి ముఖ్యం. ఆకలి వేస్తుంది, అన్నం తినాలి అనే లోకజ్ఞానం కూడా లేని అమాయకుడు. ఒకసారి యింట్లో చిన్న మాట పట్టింపు రాగా యిల్లు వదలి వేరే చోటుకి వెళతాడు. అక్కడ మాధవి (భానుమతి) యింట్లో ఆశ్రయం దొరుకుతుంది. ఆమె చెల్లెలుకు పాఠాలు చెప్పే ఉద్యోగం. ఆ యింట్లో వున్నంతకాలం అతని వింత ప్రవర్తనకు జాలి పడుతుంది మాధవి. ఆమె పట్ల అతనికి గౌరవభావం ఏర్పడుతుంది.

తరువాత సురేంద్ర తన జమిందారీకి వెళ్ళిపోతాడు. పెళ్ళవుతుంది. భార్య (జానకి) కు అహంకారం ఎక్కువ. అక్కడ పనిచేసే గుమస్తా వల్ల మాధవి ఆస్తులకు అన్యాయం జరుగుతుంది. అది తెలుసుకున్న మాధవి సురేంద్రను ప్రశ్నించడానికి వస్తే గుమస్తా కలుసుకోనివ్వడు. ఆమె తిరిగి వెళుతూ త్రోవలో తన పేరిట సురేంద్ర "మాధవీపురం" గ్రామాన్ని కట్టించాడని తెలుసుకొని ఆనందపడుతుంది. సురేంద్ర రికార్డులు తిరగేస్తూ తను అభిమానించిన మాధవికి తన పేరిట అన్యాయం జరిగిందని తెలుసుకొని, తన అనారోగ్యం కూడా లెక్కచేయ్యకుండా గుర్రంమీద వెళ్ళి, ఆమెను కలుసుకొని, క్షమాపణకోరి ఆమె చేతుల్లో తుదిశ్వాస విడుస్తాడు.

నటవర్గం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలో సీనియర్ సముద్రాల నాలుగు పాటలు వ్రాయగా మిగిలిన 3 పాటలు ఆయన కుమారుడు జూనియర్ సముద్రాల రచించాడు.

  1. ఒహో మహారాజా సొగసు నెలరాజా - జిక్కి రచన: సముద్రాల జూనియర్
  2. ఓ బాటసారి నను మరువకోయి, మది నీదె అయినా మనుమా నిజానా - భానుమతి రచన: సముద్రాల సీనియర్
  3. కనులను దోచి చేతికందని ఎండమావులున్నాయి - మాస్టర్ వేణు, భానుమతి, జిక్కి రచన: సముద్రాల సీనియర్
  4. లోక మెరుగనీ బాలా - భానుమతి రచన: సముద్రాల సీనియర్
  5. కనేరా కామాంధులై/ మనేరా ఉన్మాదులై - భానుమతి రచన: సముద్రాల సీనియర్
  6. మౌనములు చాలురా మది - పి సుశీల, రచన: సముద్రాల జూనియర్
  7. శరణము నీవే దేవీ కరుణా నాపై చూపవే - పి సుశీల రచన: సముద్రాల జూనియర్

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బాటసారి&oldid=4210742" నుండి వెలికితీశారు