భీమనేని శ్రీనివాసరావు

సినీ దర్శకుడు మరియు నిర్మాత

భీమనేని శ్రీనివాసరావు ఒక తెలుగు సినిమా దర్శకుడు. పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఇతర భాషలలో విడుదలై విజయవంతమైన పలు చిత్రాలను తెలుగులో కూడా విజయవంతం చేయడంలో తనదైన శైలి చూపించాడు. దర్శకత్వంతో పాటు పలు తెలుగు సినిమాలలో నటించాడు, నీతోడు కావాలి అనే సినిమాను నిర్మించాడు.

భీమనేని శ్రీనివాసరావు
తెలుగు సినీ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు
జననం
భీమనేని శ్రీనివాసరావు

వృత్తితెలుగు సినిమా దర్శకుడు
ఉద్యోగంతెలుగు సినిమా
జీవిత భాగస్వామిసునీత
తల్లిదండ్రులు
  • భీమనేని రాఘవయ్య (తండ్రి)
  • భీమనేని తిరుపతమ్మ (తల్లి)

తన దర్శకత్వంలోని మొట్టమొదటి సినిమా శుభమస్తు తోనే విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకుని తర్వాత ఆరు సినిమాలని సూపర్ హిట్ చెయ్యడమే కాకుండా అనతికాలంలోనే నిర్మాతగా కూడా మారి అందులోనూ విజయంసాధించిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు.

బాల్యము

మార్చు

వీరిది గుంటూరు జిల్లాలో తాటపూడి అనే చిన్న పల్లెటూరు. అమ్మ తిరుపతమ్మ, నాన్న రాఘవయ్య, అన్నయ్య వెంకట్రావు. వీళ్ళది మధ్యతరగతి రైతు కుటుంబం. తాతలు సంపాదించిన ఆస్తిపాసులేం లేవు. అమ్మ, నాన్నలు ఇద్దరూ చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించి వీరిని పెంచి పెద్దవాళ్ళని చేశారు. వీళ్ళు చదువుకోవటానికి కష్టపడాల్సివచ్చింది. ఎందుకంటే ప్రాథమిక పాఠశాల వరకూ ఊళ్ళోనే ఉన్నా, ఉన్నత పాఠశాల చదువు కోసం పక్కనే ఉన్న మురికిపూడి వెళ్ళాల్సివచ్చింది. కొంతకాలం కాలినడక, మరికొంతకాలం సైకిల్ ప్రయాణం. ఉదయం క్యారేజీ తీసుకెళ్లే, మళ్ళీ ఇంటికి తిరిగొచ్చేది మరుసటి రోజు ఉదయమే. సాయంత్రం వరకూ స్కూలు, రాత్రి ట్యూషన్ - మధ్యలో ఖాళీ దొరికితే లైబ్రరీ. హెస్కూల్ వరకూ చదువు బాగానే సాగింది. టీనేజ్ లో మనల్ని ప్రభావితం చేసే అంశాలే మన జీవితగమనాన్ని నిర్దేశిస్తాయంటారు. ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ జీవరత్నం గారబ్బాయి బుల్లిబాబు ఇతని క్లాస్ మేట్. తెలిసీతెలియని వయసులో సినిమా అనే బీజాక్షరాలు నాలో నాటుకోవడానికి మొదటి కారకుడిగా అతన్నే చెప్పుకోవాలి. వాళ్ళ మేనమామ రాజారెడ్డి హెదరాబాద్ లో సినీపరిశ్రమ వేళ్ళూనకముందునుంచే ప్రయత్నాలు చేస్తుండేవాడని చెబుతుండేవాడు. అలా ప్రారంభమైన ఇంటరెస్టు తప్పటడుగులేసుకుంటూ కథల్లోకి, కవితల్లోకి, నవలల్లోకి ఎంటరై నాటకాల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. చదువు తడబడి అత్తెసరు మార్కులతో స్కూల్ ఫైనల్ అయిందనిపించాడు. అసలు ప్రస్థానం ఇప్పుడే అప్పుడే రెక్కలొచ్చిన పక్షులు ఎగరడంలో ఉన్న ఆనందాన్ని స్వేచ్ఛలో ఉన్న అనుభూతిని ఫీలయినట్టే అనిపించింది కాలేజ్ కి వెళ్ళిన కొత్తలో, ఇతడు డాక్టర్నవుదామనుకొని దర్శకుడయ్యాడు. దానికి నిదర్శనం ఇంటర్ లో బైపీసీ తీసుకోవడమే. ఇంకా అసలు విషయానికొస్తే ఇక్కడినుంచీ చదువేమో బ్యాక్ బెంచీకి సినిమా ఫ్రంట్ సీటుకీ షిఫ్టయ్యాయి. ఇంట్లో వాళ్ళకి ఇతడి పరిస్థితి అర్థమయింది. చాలా తర్జన భర్జనల తర్వాత ఇతడి మకాం మద్రాసుకి మారి ప్రస్థానం సినిమాల్లోకి మారింది. దీనివెనక సోదరతుల్యులు శ్రేయోభిలాషి కందిమల్ల నారాయణమూర్తి ప్రోత్సాహం అన్నయ్య వెంకట్రావు పెదనాన్న కొడుకు స్వాములు అన్నయ్య సహకారం ఉంది.[1]

మొదటి సినిమా

మార్చు

ఆరోజు మార్చి 25,1984 మద్రాసు ప్రయాణమయ్యాడు. ఆ నగర జీవనం అలవాటు లేకపోవడంతో ముందు జాగ్రత్తగా ఇతని గ్రామ వాత్సవ్యుడు, సీనియర్ ఇంటూరి రామారావు గదిలో దిగాడు. అక్కడ పరిస్థితులు తాను అనుకున్నట్టు లేవు. అభిమాన దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్వాగతం పలుకుతారనుకుంటే అక్కడ ఖాళీ లేదు. తనకు బాగా తెలిసిన, ఓ ఫైనాన్షియర్ దగ్గర పనిచేసే సూర్యనారాయణ వల్ల కూడా పని దొరకలేదు. అప్పుడు కలల్లోంచి వాస్తవంలోకొచ్చి మనం కావాలనుకున్నది మనకు దొరకనప్పుడు దొరికినదాన్ని మనకనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు.

టి.కృష్ణ గారు నేటిభారతంతో వెలుగులోకొచ్చిన కొత్త కే నారాయణమూర్తి గారితో ఆయన పరిచయం పరిషత్తుల కాలం నాటిది. దేశంలో దొంగలు పడ్డారు టైంలో కలిస్తే తర్వాత చిత్రానికి అవకాశం ఇస్తానని వాగ్దానం చేశారు. అలా వందేమాతరం అసిస్టెంట్ డైరక్టర్ గా ఇతడి మొదటి సినిమా అదే సమయంలో గా దేవాలయం కు కూడా పనిచేశాడు. అప్పుడక్కడ ముత్యాల సుబ్బయ్యగారు కోడైరక్టర్ పని నేర్చుకోవడానికి ఆయన సహకారం ఇతడికి బాగా హెల్స్ అయింది. రేపటి పౌరులు ఇతడి మూడో చిత్రం. అపెంటిస్ అసిస్టెంట్ నుంచి అసోసియేట్గా ప్రమోషనూ వచ్చింది.

అంతా సవ్యంగా వుందనుకునేలోపు అపశృతి టి.కృష్ణ గారి మరణం. ఇతడికే కాదు తెలుగుసినిమా పరిశ్రమకే అది తీరనిలోటు. డిప్రెషను, ఏమిచేయాలో పాలుపోని స్థితి. అదే పరిస్థితి ఆయన మిత్రుడు, వ్యాపార భాగస్వామిపోకూరి బాబూరావు గారిదికూడా. కష్టాల్లో ఉన్న ఇద్దరం ఒకరికొకరు తోడు. అప్పుడే ఈతరం ఫిలింస్ లో పరచూరి బ్రదర్స్ దర్శకత్వంలో 'ప్రజాస్వామ్యం ' చిత్రం ఆరంభం. అక్కడినుంచి ఈతరం ఫిలింస్లో కోడైరక్టర్ ఇతడే . కొన్నిచిత్రాలకి ముప్పలనేని శివ తో కలిసి పని చేశాడు . సమయం చిక్కినప్పుడల్లా బయటి దర్శకుల దగ్గర కొన్నిచిత్రాలకు పనిచేశాడు.

బి. గోపాల్ దగ్గర అశ్వత్థామ, స్టేట్ రౌడీ, చినరాయుడు, ఐవీ శశి దగ్గర మాఆయన బంగారం, ఎ. మోహనగాంధీ దగ్గర కర్తవ్యం అలాచేసినవే. అప్పట్లోనే బాబూరావు గారు తన మేనకోడలు సునీతతో పెళ్ళిగురించిన ప్రపోజల్ చెప్పడం, చూడ్డం, నచ్చటం వెంటనే పెళ్ళి జరిగిపోయాయి. ముత్యాల సుబ్బయ్య గారితో కలసి మామగారు అనే చిత్రానికి పనిచేస్తున్నప్పుడే ఎడిటర్ మోహన్ గారితో పరిచయం. ఆసినిమాలో ఒక రాత్రి పాట చిత్రీకరణ చేస్తున్నప్పుడు ఆయన ఇతడిని పిలిచి ' 'ఫుల్ మూన్ చాలా బాగుంది మాష్ణారుతో చెప్పి మూన్ కూడా ఫ్రేం లోవచ్చేలా కంపోజ్ చెయ్య మని ' చెప్పాడు . ఇతడు అదేంటిసార్ ఇది అమావాస్య రోజు వచ్చే దీపావళి పాట కదా దీనిలో మూన్ ఎలా కంపోజ్ చేస్తాం' ' అన్నాడు. ఆయన నవ్వేసి " నీకో చిన్న టెస్ట్ పెట్టానయ్యా’ అన్నారు. అలా ఆ చిత్రం జరిగేటప్పుడు ఇతడి ప్రవర్తన, పనితీరు గమనించి 'నిన్ను నాబ్యానర్ లో డైరక్టర్ని చేస్తానయ్యా ' అని ప్రామిస్ చేశారు.

మళ్ళీ బి.గోపాల్ గారిదగ్గర పని చేయడానికెళ్ళాడు. అప్పుడే దగ్గుబాటి వెంకటేష్ తో పరిచయం. ఆయన ఇతని పని చూసి సంతృప్తి చెంచి రామానాయుడి గారితో చెప్పడంతో ఆయన ఇతడికి కబురుచేశారు. నీగురించి చాలా విన్నానయ్యా, మనిద్దరికీ అవగాహన రావడానికి నా బ్యానర్ లో ఓ చిత్రానికి కోడైరక్టర్ గా పనిచెయ్యి తర్వాత చిత్రానికి నిన్ను దర్శకుడిని చేస్తాన’ని చెప్పారు. అలా పరువు ప్రతిష్టకి పనిచేశాడు. గుహనాధన్ గారు దానికి దర్శాకుడు. అలాగే ఆసినిమా హిట్టవడం, ఇతని వర్క్ నాయుడుగారికి నచ్చడం, ఆయన సబ్జెక్ట్ చూసుకోవయ్యా’ అని చెప్పడం జరిగిపోయూయి.

ఇతడు ఆప్రయత్నాల్లో ఉండగానే ఎడిటర్ మోహన్ గారి దగ్గర్నుండి కబురు. ముత్యాల సుబ్బయ్యగారి దర్శకత్వంలో 'పల్నాటి పౌరుషం ' అనే సినిమాకి పనిచెయ్యమని. ఆయన తర్వాత చిత్రానికి ప్రామిస్ చేశారు. చేశాడు కానీ ఆసినిమా దెబ్బతినటంతో ఆయన నిరాశ చెందాడు. ఇతడు కొంతకాలం ఆయన్ని ఎదుర్కోలేక పోయాడు. అసలే ఇప్పుడు సినిమా దెబ్బతింది దానికి తగ్గటు కొత్త డైరక్టర్ తో సినిమా అంటే కష్టం గదాని. కాని ఆయన ఇచ్చిన మాట మీద నిలబడి నాకు కబురుచేసి సబ్జెక్ట్ చూడమన్నారు. ఈవిషయంలో వాళ్ళ పెద్దబ్బాయి రాజా ఇతడికి చాలా సపోర్ట్ చేశాడు. . అలా వెతికి పట్టుకున్నదే శుభమస్తు చిత్ర కథ.

రెండు పెద్ద బ్యానర్లు ఇద్దరు మంచి నిర్మాతల మధ్య ఇతడి మొదటి సినిమా అలా దోబూచులాడింది. మోహన్ గారి సబ్జెక్ట్ ఒకే అవ్వడంతో విషయం నాయుడిగారికి చెప్పాడు. ఆయన ఏంటయ్యా నాబ్యానర్ లో దర్శకుడిని చేస్తానంటే ఇంతవరకూ ఎదురు చెప్పినవాళ్ళు లేరు నువ్వేమో వేరే ప్రపోజల్ గురించి చెబుతున్నావు నీయిష్టం ఆలోచించుకో అన్నారు. సబ్జెక్ట్ నచ్చడంతో ఆయనకు సారీ చెప్పి శుభమస్తు మొదలు పెట్టాడు. జగపతిబాబుగారు హీరో, ఆమని, ఇంద్రజ హీరోయిన్స్ దాసరిగారు, సత్యనారాయణ గారుకీ రోల్స్ అలా ప్రారంభమైన ఇతడి మొదటి సినిమా ప్రస్థానం విజయవంతమై తర్వాత శుభాకాంక్షలు (సినిమా), సుస్వాగతం, సూర్యవంశం లాంటి చిత్రాలతో కొనసాగింది. ఆతర్వాత కెరీర్ లో ఒడిదుడుకులు సుప్రభాతం, స్వప్నలోకం అనుకున్న ఫలితాల్నివ్వలేదు. పడిన కెరటం మళ్ళీ లేస్తుంది. అలా పుంజుకుని సొంత బ్యానర్ స్థాపించి నీతోడు కావాలి అనే చిత్రం చేశాడు.[1]

దర్శకత్వం వహించిన సినిమాలు

మార్చు

తెలుగు

మార్చు
  1. శుభమస్తు (1995)
  2. శుభాకాంక్షలు (1997)
  3. సూర్యవంశం (1998)
  4. సుస్వాగతం (1998)
  5. సుప్రభాతం (1998)
  6. స్వప్నలోకం (1999)

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 శ్రీనివాసరావు, భీమినేని. "మొదటి సినిమా-భీమినేని శ్రీనివాసరావు" (PDF). కౌముది.నెట్. కౌముది.నెట్. Retrieved 1 September 2015.
  2. ఈనాడు, సినిమా (23 August 2019). "రివ్యూ: కౌస‌ల్య కృష్ణమూర్తి". www.eenadu.net. Archived from the original on 23 ఆగస్టు 2019. Retrieved 10 January 2020.

బయటి లంకెలు

మార్చు