సుప్రభాతం (1998 సినిమా)
భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 1998లో విడుదలైన తెలుగు చలనచిత్రం
సుప్రభాతం 1998, సెప్టెంబరు 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎన్.వి.ఎస్. క్రియేషన్స్ పతాకంపై[2] కెప్టెన్ ఎన్.ఎ. చౌదరి నిర్మాణ సారథ్యంలో భీమినేని శ్రీనివాసరావు[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, రాశి, చంద్రమోహన్, బేతా సుధాకర్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[4][5] 1996లో తమిళంలో వచ్చిన గోపాల గోపాల చిత్రానికి రిమేక్ చిత్రమిది.
సుప్రభాతం | |
---|---|
దర్శకత్వం | భీమినేని శ్రీనివాసరావు |
రచన | చింతపల్లి రమణ (మాటలు) |
స్క్రీన్ ప్లే | భీమినేని శ్రీనివాసరావు |
కథ | ఎన్.వి.ఎస్. యూనిట్, పండియరాజన్ |
నిర్మాత | కెప్టెన్ ఎన్.ఎ. చౌదరి |
తారాగణం | శ్రీకాంత్, రాశి, చంద్రమోహన్, బేతా సుధాకర్, తనికెళ్ళ భరణి |
ఛాయాగ్రహణం | వై. మహేంద్ర |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | ఎన్.వి.ఎస్. క్రియేషన్స్[1] |
విడుదల తేదీ | 18 సెప్టెంబరు 1998 |
సినిమా నిడివి | 143 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శ్రీకాంత్ (గోపాలకృష్ణ)
- రాశి (వసుంధర)
- చంద్రమోహన్ (కుటుంబరావు)
- బేతా సుధాకర్ (తాతాబ్బాయి)
- తనికెళ్ళ భరణి
- మన్నవ బాలయ్య (వసుంధర తండ్రి)
- మల్లికార్జునరావు (కోదండం)
- గిరిబాబు (దీక్షితులు)
- ఏవీఎస్ (గోపాలకృష్ణ బాస్)
- కాస్ట్యూమ్స్ కృష్ణ (మంత్రి)
- ఆలీ
- ఎం. ఎస్. నారాయణ
- వేణుమాధవ్
- సుబ్బరాయ శర్మ
- అనంత్
- కళ్ళు చిదంబరం
- తిరుపతి ప్రకాష్
- బండ్ల గణేష్
- రాజా రవీంద్ర
- కోవై సరళ (చుక్కమ్మ)
- మామిళ్ళ శైలజ ప్రియ (వసుంధర స్నేహితురాలు)
- అల్ఫోన్సా (చిలకమ్మ)
- రమ్యశ్రీ (మీనాక్షి)
- రజిత (సంతాన లక్ష్మీ)
- వర్ష
- భావన
- శివపార్వతి
- రాధాకుమారి
- కల్పనా రాయ్
సాంకేతికవర్గం
మార్చు- చిత్రానువాదం, దర్శకత్వం: భీమినేని శ్రీనివాసరావు
- నిర్మాత: కెప్టెన్ ఎన్.ఎ. చౌదరి
- మాటలు: చింతపల్లి రమణ
- కథ: ఎన్.వి.ఎస్. యూనిట్, పండియరాజన్
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: వై. మహేంద్ర
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాణ సంస్థ: ఎన్.వి.ఎస్. క్రియేషన్స్
పాటలు
మార్చుసుప్రభాతం | ||||
---|---|---|---|---|
సినిమా by | ||||
Released | 1998 | |||
Genre | పాటలు | |||
Length | 28:20 | |||
Label | ఆదిత్యా మ్యూజిక్ | |||
Producer | వందేమాతరం శ్రీనివాస్ | |||
వందేమాతరం శ్రీనివాస్ chronology | ||||
|
ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[6]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ప్రేమ మొదలైతే" | సిరివెన్నెల | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 5:06 |
2. | "కన్నా నీ కనులకు పెట్టిన" | చంద్రబోస్ | కె.ఎస్. చిత్ర, హరిణి | 4:50 |
3. | "చందమామ రావే జాబిల్లి రావే" | సిరివెన్నెల | అశోక్ ఖోస్లా | 4:21 |
4. | "ఓ ప్రియ వసుంధర" | షణ్ముఖశర్మ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:52 |
5. | "తాడై పామై" | సిరివెన్నెల | అశోక్ ఖోస్లా | 4:12 |
6. | "సింగరాయ కొండ" | చంద్రబోస్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | 4:59 |
మొత్తం నిడివి: | 28:20 |
మూలాలు
మార్చు- ↑ "Suprabhatam (Overview)". IMDb.
- ↑ "Suprabhatam (Banner)". Filmiclub.
- ↑ "Suprabhatam (Direction)". Know Your Films.
- ↑ "Suprabhatam (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-24. Retrieved 2020-08-26.
- ↑ "Suprabhatam (Review)". Spicy Onion.
- ↑ "Suprabhatam (Songs)". Raaga.