సుస్వాగతం (సినిమా)
సుస్వాగతం 1998లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం.[1] ఇందులో పవన్ కల్యాణ్, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రఘువరన్, సుధ తదితరులు నటించారు.[2] ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతాన్నందించాడు. ఈ సినిమా లవ్ టుడే అనే తమిళ చిత్రానికి పునర్నిర్మాణం. తమిళంలో విజయ్, సువలక్ష్మి జంటగా నటించారు.
సుస్వాగతం | |
---|---|
దర్శకత్వం | భీమినేని శ్రీనివాసరావు |
రచన |
|
నిర్మాత | ఆర్. బి. చౌదరి |
తారాగణం | పవన్ కళ్యాణ్, దేవయాని |
ఛాయాగ్రహణం | మహీందర్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జనవరి 1, 1998 |
సినిమా నిడివి | 150 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుగణేష్ కాలేజీలో చదివే ఓ విద్యార్థి. అతని తండ్రి డాక్టర్ చంద్రశేఖర్ తల్లి లేని పిల్లవాడని గారాబం చేస్తూనే అతని జీవితం చక్కదిద్దడానికి సున్నితంగా నచ్చజెపుతుంటాడు. గణేష్ తన కాలేజీలోనే చదివే సంధ్య అనే అమ్మాయిని నాలుగేళ్ళగా ప్రేమిస్తుంటాడు. కానీ సంధ్యకు మాత్రం చదువు తప్ప మరో లోకం ఉండదు. ఆమెకు ప్రేమలంటే నచ్చదు. గణేష్ ఎంతగా ఆమె వెంటపడినా ఆమె నుంచి స్పందన ఉండదు. దాంతో గణేష్ ప్రేమ జంటలని కలపడంలో పేరున్న కళ ను కలిసి తన ప్రేమను ఆమెకు తెలిసేలా చేయమంటాడు. ఆమె కూడా సంధ్యకు గణేష్ ఆమెను ప్రేమిస్తున్న సంగతి చెబుతుంది. కానే ఆమె ప్రేమ రాహిత్యాన్ని గురించి తెలుసుకుని, ఆమెను ఒప్పించడం తనవల్ల కాదని గణేష్ కు చెబుతుంది. కానీ గణేష్ కు ఆమె మీదున్న ప్రేమను చూసి ఎలాగైనా ఒప్పించాలని అనుకుని అందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటుంది. సంధ్య తండ్రి ఇన్స్పెక్టర్ వాసుదేవరావు ఒక శాడిస్టు. తన భార్య కృష్ణవేణి ను ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటాడు. ఆమె తన కూతురు కోసం అవన్నీ మౌనంగా భరిస్తుంటుంది.
తారాగణం
మార్చు- గణేష్ గా పవన్ కల్యాణ్
- సంధ్యగా దేవయాని
- డాక్టర్ చంద్రశేఖర్ గా రఘువరన్
- ఇన్ స్పెక్టర్ వాసుదేవరావుగా ప్రకాష్ రాజ్
- కృష్ణవేణిగా సుధ
- పీటర్ గా కరణ్
- షణ్ముఖ శర్మగా సుధాకర్
- తిరుపతి ప్రకాష్
- బండ్ల గణేష్
- కళగా సాధిక
- కళ తల్లిగా వై. విజయ
- పావలా శ్యామల
- వర్ష (ఫాతిమా)
పాటలు
మార్చుUntitled | |
---|---|
ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | బాలు | 4:46 |
2. | "హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు" | సామవేదం షణ్ముఖశర్మ | మణికిరణ్ | 4:50 |
3. | "సుస్వాగతం నవరాగమా" | సామవేదం షణ్ముఖశర్మ | హరిహరన్, కె. ఎస్. చిత్ర | 4:16 |
4. | "ఫిగర్ మాట" | భువనచంద్ర | మనో, ఎస్. ఎ. రాజ్ కుమార్ | 5:06 |
5. | "కం కం వెల్కమ్ పలికెను" | సామవేదం షణ్ముఖ శర్మ | ఎస్. ఎ. రాజ్ కుమార్, అనురాధ శ్రీరామ్ | 4:54 |
6. | "ఆలయాన హారతిలో" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | బాలు | 4:26 |
మొత్తం నిడివి: | 28:29 |
మూలాలు
మార్చు- ↑ "తెలుగు వన్. కాం లో సుస్వాగతం సినిమా పేజీ". teluguone.com. తెలుగు వన్. Retrieved 5 December 2016.
- ↑ "ఫిల్మీ బీట్ లో సుస్వాగతం నటీ నటుల జాబితా". filmibeat.com. ఫిల్మీ బీట్. Retrieved 5 December 2016.