భీమవరపు నరసింహారావు
(భీమవరపు నరసింహరావు నుండి దారిమార్పు చెందింది)
భీమవరపు నరసింహరావు (జనవరి 24, 1905 - సెప్టెంబర్ 7, 1976) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఈయన బి.ఎన్.ఆర్.గా అందరికి సుపరిచితుడు. ఈయన 8 సంత్సరాల వయసులోనే సంగీత కళ మొగ్గ తొడగడం మొదలైంది. ఈయనకు నాటకాల్లో నటించడం అన్నా, పాటలు పాడటం అన్నా చాలా మక్కువ. ఇతను ఏ గురుశుశ్రూష చేయలేదు. హార్మోనియం కూడా తనే స్వయంగా నేర్చుకొని అందులో ప్రావీణ్యం సంపాదించగలిగాడు. తెనాలిలోని శ్రీరామ విలాస సభ నాటకసంస్థలోసంగీత దర్శకుడిగా పనిచేశాడు.[1]ఈయన ధూమపాన ప్రియుడు. కేవలం సిగరెట్ల సంపాదన కోసం హార్మోనిస్ట్ గా థియేటర్ లో పనిచేయడం మొదలుపెట్టాడు.[ఆధారం చూపాలి]
భీమవరపు నరసింహారావు | |
---|---|
జననం | జనవరి 24, 1905 కొలకలూరు, గుంటూరు జిల్లా |
మరణం | సెప్టెంబర్ 7, 1976 |
వృత్తి | సంగీత దర్శకుడు |
పిల్లలు | ఇద్దరు; కొడుకు, కూతురు |
తండ్రి | పుండరీకాక్ష శర్మ |
తల్లి | కోటమ్మ |
జీవనసరాగాలు
మార్చు- పుట్టిన తేది : 1905 జనవరి 24
- జన్మస్థలం : గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో కొలకలూరు.
- తల్లిదండ్రులు : కోటమ్మ, పుండారీకాక్ష శర్మ
- విద్యార్హత : ఎస్.ఎస్.ఎల్.సి
- తోబుట్టువులు :
- అన్నయ్యలు - పూర్ణయ్య, రామచంద్రరావు
- నలుగురు సోదరులు
- సంతానం :
- కొడుకు - బి.వెంకటేశ్వరరావు
- కూతురు - డాక్టర్ లీలావతి
- మొదటి సినిమా : సతీ తులసి (1936)
- ఆఖరి చిత్రం : అర్ధాంగి (1955)
- మరణం : 7 సెప్టంబర్ 1976.
చిత్రసమాహారం
మార్చు- సతీ తులసి (1936)
- ద్రౌపదీ వస్త్రాపహరణం (1936)
- కనకతార (1937)
- మోహినీ రుక్మాంగద (1937)
- మాలపిల్ల (1938)
- భక్త తుకారమ్ (1938)
- రైతుబిడ్డ (1939)
- మీరాబాయి (1940)
- అపవాదు (1941)
- భాగ్యలక్ష్మి (1943)
- మాయా మచ్చీంద్ర (1945)
- భక్త తులసీదాస్ (1946)
- భక్త జన (1948)
- తిరుగుబాటు (1950)
- వీట్టుక్కారి ( తమిళం) (1950)
- ధర్మదేవత ( నేపథ్య సంగీతం మాత్రమే ) (1952)
- పెణ్ణిన్ పెరుమై (తమిళం) (1955)
- అర్ధాంగి (1955)
మూలాలు
మార్చు- ↑ నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14