మణికొండ (హైదరాబాదు)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఒక వాణిజ్య, నివాస ప్రాంతం.

మణికొండ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఒక వాణిజ్య, నివాస ప్రాంతం. గత కొన్ని సంవత్సరాలలో ఈ శివారు ప్రాంతం సాఫ్ట్‌వేర్ కంపెనీల ప్రధాన కార్యాలయాలతోపాటు ల్యాంకో హిల్స్, విలాసవంతమైన హై-రైస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, తెలుగు సినిమా కార్మికుల కోసం చిత్రపురి కాలనీ రెసిడెన్షియల్ లేఅవుట్ కారణంగా అభివృద్ధి చెందింది.[2][3] 2011 జనగణన సమాచారం ప్రకారం మణికొండ లొకేషన్ కోడ్ (గ్రామం కోడ్) 574248.[4]

మణికొండ
సమీప ప్రాంతం
మణికొండ is located in Telangana
మణికొండ
మణికొండ
తెలంగాణలో ప్రాంతం ఉనికి
మణికొండ is located in India
మణికొండ
మణికొండ
మణికొండ (India)
Coordinates: 17°24′25″N 78°22′12″E / 17.406994°N 78.370085°E / 17.406994; 78.370085
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
మెట్రోహైదరాబాదు
Government
 • Bodyపురపాలక సంఘం
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 089
Vehicle registrationటిఎస్ 13
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ
శాసనసభ నియోజకవర్గంరాజేంద్రనగర్
పట్టణ ప్రణాళిక సంస్థమణికొండ[1]

అభివృద్ధి మార్చు

మణికొండ ముఖ్యమైన వాణిజ్య, నివాస ప్రదేశం. గచ్చిబౌలి, హైటెక్ సిటీలో పనిచేసే అనేకమంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఈ ప్రాంతంలో ఫ్లాట్లు, భూమిని కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు వేగంగా పెరుగుతున్నాయి. మణికొండకు వెళ్ళే దారిలో ఒకటి దర్గా నుండి ఓయూ కాలనీ మీదుగా మరొకటి షేక్ పేట నుండి స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫిల్టర్ బెడ్స్ మీదుగా ఉన్నాయి. ఇక్కడ మణికొండ, పుప్పాలగూడ అనే రెండు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

నిర్మాణంలో ఉన్న మణికొండ, ల్యాంకో హిల్స్‌

రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి నుండి నగరంలోని పుప్పాలగూడ, సికింద్రాబాద్ జంక్షన్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, కోఠి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5] రాయదుర్గంలో సమీప మెట్రో రైలు స్టేషన్ ఉంది.

పర్యాటకం మార్చు

ఖాజాగూడ సరస్సు, ఖాజాగూడ కొండలు హైకింగ్ - బౌల్డరింగ్ వంటి కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇవి ఖాజాగూడ ప్రాంతంలో ఉన్నాయి.[6][7] లాంకో హిల్స్, గోల్కొండ, కుతుబ్ షాహీ టూంబ్స్, గండిపేట్ సమీపంలోని ఉస్మాన్ సాగర్, ఔటర్ రింగ్ రోడ్, గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియం, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హైటెక్ సిటీ, ఖాజాగూడ హిస్టారిక్ రాక్ ఫార్మేషన్ వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు మార్చు

  • శ్రీ జగన్నాథ దేవాలయం
  • సాయిబాబా దేవాలయం
  • గోల్డెన్ టెంపుల్
  • మస్జిద్ -ఇ- హఫ్సా
  • మస్జిద్-ఇ-తక్వా అహ్లే హదీస్

మూలాలు మార్చు

  1. "మణికొండ పురపాలకసంఘం". Archived from the original on 2023-01-22. Retrieved 2021-11-10.
  2. Microsoft CEO to open new campus at Manikonda
  3. Hyatt Hyderabad in early 2011
  4. "Manikonda Village in Rajendranagar (Rangareddy) Telangana | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-11-10.
  5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-11-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. Mohammed Hasib: Khajaguda Hills – relishing SUNSET at the summit, In: Adventures in Hyderabad, Travel Stories, AtomicCircle.com, 8 October 2018, (Link Archived 2021-01-13 at the Wayback Machine).
  7. hyderabadclimbers.com - Khajaguda Routes, (Link)