మార్కండేయ ఎత్తిపోతల పథకం

నాగర్‌కర్నూల్ జిల్లాకు సాగునీరందించే పథకం

మార్కండేయ ఎత్తిపోతల పథకం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, బిజినేపల్లి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం. సుమారు 77 కోట్ల‌ రూపాయలతో నిర్మించనున్న ఈ ఎత్తిపోత‌ల‌ పథకం ద్వారా 5 గ్రామాలు (మామ్మయిపల్లి, పోలేపల్లి, షాయిన్‌పల్లి, లాట్‌పల్లి, గంగారం), 17 గిరిజన తండాల పరిధిలోని 7,200 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి కాలువ ద్వారా 40 మీటర్ల ఎత్తున అర టీఎంసీ నీటితో ఈ పథకం చేపట్టబడింది.[1]

మార్కండేయ ఎత్తిపోతల పథకం
మార్కండేయ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
ప్రదేశంబిజినేపల్లి, బిజినేపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ
ఆవశ్యకతవ్యవసాయానికి నీరు
స్థితినిర్మాణంలో వున్నది
నిర్మాణం ప్రారంభం2022 జూన్ 8 - ప్రస్తుతం
నిర్మాణ వ్యయం76 కోట్ల 95 లక్షల రూపాయలు
యజమానితెలంగాణ ప్రభుత్వం
నిర్వాహకులుతెలంగాణ నీటిపారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
Spillway typeChute spillway
Website
నీటిపారుదల శాఖ వెబ్సైటు

రూపకల్పన

మార్చు

2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో నాగర్‌కర్నూల్‌కు వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బిజినేపల్లి మండలంలోని కొన్ని గ్రామాలు, తండాలకు సాగునీరు అందించడానికి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తానని మాట ఇచ్చాడు. ఈ పథకం ద్వారా 7,320 ఎకరాలకు సాగునీరందడంతోపాటు, భూగర్భ జలాలు పెరిగి చెరువులు, కుంటల్లోకి నీళ్ళు వస్తాయి.[2] దాంతో 2021 జూన్ 5న ఈ పథకానికి 76 కోట్ల 95 లక్షలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి 100 ఎకరాల నుంచి 120 ఎకరాల భూమిని అవసరముంటుంది. మార్కండేయ చెరువును జలాశయంగా మార్చి 0.97 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు.[3]

శంకుస్థాపన

మార్చు

2022 జూన్ 18న తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్‌ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూల్‌ ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు శ్రీమతి సురభి వాణీదేవి, గోరటి వెంకన్న, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.[4]

మూలాలు

మార్చు
  1. "మార్కండేయ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి అనుమతి". ETV Bharat News. 2020-02-13. Archived from the original on 2022-07-16. Retrieved 2022-07-16.
  2. telugu, NT News (2022-06-17). "రూ.60 కోట్లతో మార్కండేయ లిఫ్ట్‌". Namasthe Telangana. Archived from the original on 2022-06-26. Retrieved 2022-07-16.
  3. "మార్కండేయ ఎత్తిపోతల ఏర్పాటుకు సన్నాహాలు". EENADU. 2022-06-10. Archived from the original on 2022-07-16. Retrieved 2022-07-16.
  4. telugu, NT News (2022-06-17). "అభివృద్ధికి అంకురార్పణ". Namasthe Telangana. Archived from the original on 2022-06-18. Retrieved 2022-07-16.