రాజాం (శ్రీకాకుళం జిల్లా)

ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా, రాజాం మండలం లోని నగర పంచాయితీ

రాజాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నగర పంచాయితీ. ఇది పురపాలక సంఘంగా గుర్తించబడింది. దీని అక్షాంశ రేఖాంశాలు 18.28N 83.40E.[1]. సముద్రమట్టం నుండి ఎత్తు 41 మీటర్లు. (137 అడుగులు)

[[బొబ్బిలి యుద్ధం]] గాథకు చెందిన వీరుడు [[తాండ్ర పాపారాయుడు]] ఈ ప్రాంతానికి చెందినవాడు]]
బొబ్బిలి యుద్ధం గాథకు చెందిన వీరుడు తాండ్ర పాపారాయుడు ఈ ప్రాంతానికి చెందినవాడు

పట్టణం గురించిసవరించు

బొబ్బిలి యుద్ధం గాథకు చెందిన వీరుడు తాండ్ర పాపారాయుడు ఈ ప్రాంతానికి చెందినవాడు. ఇటీవల తాండ్ర పాపారాయుడుకి చెందిన ఒక ఆభరణం ఇక్కడ బయట పడింది. పూర్వ కాలంలో తాండ్ర పాపారాయుడు ఉపయోగించిన భవనాన్ని నేడు తహసీల్దారు కార్యాలయంగా వాడుతున్నారు.

వాణిజ్యం

రాజాం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ప్రధానమైన వాణిజ్య కేంద్రం. జిల్లాలో వాణిజ్యపరంగా అత్యంత పురోరతి సాధించిన పట్టణం రాజాం. ఇక్కడ వ్యాపారం చేసి నష్టపోయిన వాళ్ళు చాలా తక్కువ. అమాయక పల్లె ప్రజలని కొందరు వ్యాపారులు మోసం చేస్తుంటారు. రాజాం పట్టణం జనపనార మిల్లులకు, ఇనుప కర్మాగారాలకు ప్రసిద్ధి. రాష్ట్రంలో అత్యధికంగా జనప నార ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. మాధవ బజార్ ప్రధాన వ్యాపార కేంద్రం. ప్రతి గురువారం జరిగే సంతలో చుట్టుపక్కల చాలా మండలాల నుండి ప్రజలు వస్తారు. ఈ సంత మన గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. వ్యాపారవేత్త గ్రంధి మల్లికార్జున రావు స్వస్థలం ఈ వూరు.

విద్య

పట్టణంలో పలు విద్యాలయాలున్నాయి. రాజాంలో సాంకేతిక కళాశాల జియంఆర్ఐటి ఉంది. దీనిలో చదివిన చాలా మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాలలో ఉద్యోగాలు పొందారు. రాజాంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో ఇటీవల ప్రారంభించిన భాష్యం విద్యా సంస్థ, 15 సంవత్సరాలు నాణ్యమైన విద్యను అందించిన శ్రీ బాబా విద్యానికేతన్ ఉన్నాయి.

వైద్యం

ఒక సామాజిక ఆరోగ్యకేంద్రం ఉంది. ఈ 60 పడకల ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు ద్వారా నడుపబడుతుంది.[2] ఇక్కడ ఇటీవల ప్రారంభించిన జియమ్ఆర్-కేర్ హాస్పిటల్ అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు వుపయోగకరంగా ఉంది. త్వరలో ఈ ఆసుపత్రికి అనుసంధానంగా రాజాంలో జియమ్ఆర్ వైద్య కళాశాల నెలకొల్పుతున్నారు.

పౌర సదుపాయాలు

ఒకప్పుడు వైజాగ్, బొబ్బిలి వైపుగా కేంద్రీక్రుతమైన పట్టణం ఇప్పుడు పాలకొండ, శ్రీకాకుళం వైపుగా అభివృద్ధి చెంది ఆ ప్రాంతం పట్టణ కేంద్రంగా మారిపోయింది. విస్తరణ కారణంగా చుట్టుపక్కల గ్రామాలు పట్టణంలో పూర్తిగా కలిసిపోయాయి. రాజాం నగర పంచాయితీలో, అతి నివాసయోగ్యమైన ప్రాంతం ఈశ్వరి నారాయణ కాలనీ, బాబా నగర్ కాలనీల సముదాయము. నగర పంచాయితీ పరిధిలో ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించి ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలిచింది. పురపాలికగా మారిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ప్రజల ఆహ్లాదం కోసం పార్కు, మెరుగైన సేవలు అందించడానికి ఇ-సేవ త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని విధాల అభివృద్ధి చెందిన రాజాంలో ట్రాఫిక్ సమస్య, పారిశుధ్య సమస్య ఇంకా తీరవలసి ఉంది. దగ్గరలోని రైల్వే స్టేషన్లు - గంగువారిసిగడాం, చీపురుపల్లి

ఆలయాలు

ఇక్కడ వున్న నవ దుర్గ ఆలయం దేశంలో అత్యంత అరుదైన ఆలయం. ఇదే కాకుండా అనేక దేవతల ఆలయాలతో రాజాం అలరారుతున్నది. ఇక్కడ ప్రతీ ఏడాది పోలిపల్లి పైడితల్లి అమ్మవారి వార్షిక యాత్రా మహొత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇక్కడ చీపురుపల్లి రోడ్డులో గల శ్రీ హనుమాన్ దేవాలయం ప్రసిద్దమైంది. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, రాజాం ప్రజానీకం మంగళ, శనివారాల్లో ఎక్కువగా ఇక్కడకు వస్తారు.

ప్రముఖులుసవరించు

మూలాలుసవరించు

  1. Falling Rain Genomics.Razam
  2. "APVVP.Hospitals". Archived from the original on 2008-01-08. Retrieved 2008-04-28.

వెలుపలి లంకెలుసవరించు