రాయుడుగారు-నాయుడుగారు

రాయుడుగారు నాయుడుగారు 1996 లో విడుదలైన తెలుగు సినిమా. దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ పతాకంపై దాసరి నారాయణరావు నిర్మించి దర్శకత్వం వహించాడు.[1] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, రోజా ప్రధాన పాత్రల్లో నటించరు. ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.[2]

రాయుడుగారు-నాయుడుగారు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం దాసరి నారాయణరావు
కథ సాఅరంగ రమేష్
చిత్రానువాదం దాసరి నారాయణరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
సుజాత,
దాసరి నారాయణరావు,
బాబుమోహన్
సంగీతం ఎం.ఎం.కీరవాణి
సంభాషణలు తోటపల్లి మధు
ఛాయాగ్రహణం సిహెచ్. రమణ రాజు
కూర్పు బి.కృష్ణం రాజు
నిర్మాణ సంస్థ దాసరి ఫిల్మ్ యూనివర్శిటి
భాష తెలుగు

ఈ చిత్రం గోదావరికి అటూ ఇటూ ఉన్న రాయుడుపాలెం, నాయుడుపాలెం అనే రెండు గ్రామాల చుట్టూ తిరుగుతుంది. ప్రేమ, ఆనందం, ఆప్యాయతలతో కూడుకున్న గ్రామాలివి. రాయుడు (అక్కినేని నాగేశ్వరరావు), నాయుడు (దాసరి నారాయణరావు) ఎంతో స్నేహంగా ఉంటారు. దుష్టుడైన వీరాస్వామి (సత్యనారాయణ) 14 సంవత్సరాల సంఘబహిష్కారం నుండి తిరిగివస్తాడు. తనను బహిష్కరించిన రాయుడు, నాయుడులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. గతంలో, వీరాస్వామి ఒక భారీ భూస్వామి. అతని కుమార్తె తక్కువ కులపు వ్యక్తిని ప్రేమించి, పెళ్ళి చేసుకుంటుంది. దీనికి రాయుడు భార్య పార్వతి (జయ సుధ) మద్దతు ఇస్తుంది. ఫలితంగా, వీర స్వామి పార్వతిని చంపుతాడు. అతనికి శిక్ష పడుతుంది. ఇప్పుడు వీరాస్వామి, ఎయిడ్స్ బారిన పడిన నాయుడు కుమారుడు సత్యం నాయుడు (శ్రీహరి) తో రాయుడు కుమార్తె మల్లి (రోజా) ని కలపడానికి కుట్ర పన్నుతాడు. మల్లి కూడా ఇప్పటికే ఆ గ్రామానికే చెందిన రాముడు (వినోద్ కుమార్) తో ప్రేమలో ఉంది. వారు ఇరు గ్రామాల సంక్షేమం కోసం తమ ప్రేమను త్యాగం చేస్తారు. పెళ్ళికి కొద్దిగా ముందు నాయుడు భార్య లక్ష్మి (సుజాత)కి నిజం తెలుస్తుంది. ఆమె రాయుడును పెళ్ళి ఆపి విషయాన్ని రహస్యంగా ఉంచమని చెబుతుంది.

ప్రస్తుతం, రాయుడు ఆమె చెప్పినట్లే చేస్తాడు. వీరాస్వామి రాయుడు, నాయుడుల మధ్య వివాదాలను సృష్టించడానికి ఈ పరిస్థితిని వాడుకుంటాడు. ఈ శతృత్వం రెండు గ్రామాల మధ్య కూడా వ్యాపిస్తుంది. కాబట్టి, హింసను ఆపడానికి రాయుడు మల్లిని సత్యంతో జతచేయాలని నిర్ణయించుకుంటాడు. చివరకు, లక్ష్మి నిజం వెల్లడించాలని నిర్ణయించుకున్నపుడు వీరాస్వామి ఆమెను అడ్డుకుంటాడు . ఆ తర్వాత, రాయుడు వచ్చి వీరాస్వామిని చంపేస్తాడు. ఇంతలో నాయుడు సత్యం క్లాస్మేట్ (రవళి) ద్వారా అసలు విషయం తెలుసుకుంటాడు. చివరగా, ఈ చిత్రం రాముడు, మల్లిల పెళ్ళితో ముగుస్తుంది.

నటవర్గం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు

ఎంఎం కీరవాణి సంగీతం కూర్చిన పాటలను సుప్రీం మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది.

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."నా కంటికి చూపువు"భువనచంద్రమనో, కీరవాణి, స్వర్ణలత4:57
2."ఈ మందారాల తోటలో"సుద్దాల అశోక్ తేజఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:43
3."సిగ్గా నీ ఇల్లెక్కడా"భువనచంద్రకీరవాణి, సింధు4:52
4."ఆకుపచ్చ చందమామ"సుద్దాల అశోక్ తేజకె.ఎస్.చిత్ర4:52
5."గడపలో కుడిపాదమెట్టి"సుద్దాల అశోక్ తేజఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత3:55
6."మొన్న చూపు కలిసింది"భువనచంద్రమనో, సింధు5:09
మొత్తం నిడివి:28:28

మూలాలు

మార్చు
  1. "Rayudugaru Nayudugaru (Banner)". Cineradham.
  2. "Rayudugaru Nayudugaru (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-18. Retrieved 2020-08-10.